హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి గారు




మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అయినా, చిరంజీవిగానే ఆయన సుపరిచితుడు. కేంద్ర మంత్రి కాకముందే చిరంజీవికి దేశవ్యాప్తంగా పాపులారిటీ వుండది. ఎందుకంటే, తన డాన్సులతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఓ ఊపు ఊపేశారు చిరంజీవి. బాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, అక్కడా తన ఉనికిని చాటుకున్నారాయన. 
తెలుగు తెరపై రెండు దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యం చిరంజీవిదే. నెంబర్‌ వన్‌ అన్న పొజిషన్‌ జోలికి ఇంకొకర్ని రానివ్వలేదాయన. తెలుగు సినీ బాక్సాఫీస్‌కి చిరంజీవి కొత్త అర్థం చెప్పారు. రికార్డులంటే చిరంజీవి మాత్రమే.. అనేంతలా తెలుగు సినీ పరిశ్రమని శాసించారు చిరంజీవి. ఈ విషయంలో ఎవరూ విభేదించే అవకాశాలే లేవు. ఫ్లాప్‌ సినిమా అంటే ఐదు నుంచి ఏడు వారాలు థియేటర్లలో ప్రదర్శితమయ్యేది. చిరంజీవితో సినిమా తీసి నష్టపోయినవారు లేరు, ఆయనకి స్టార్‌డమ్‌ వచ్చాక. ఫ్లాపయినా నిర్మాత సేఫ్‌.. హిట్టయితే, నిర్మాతకి పండగే పండగ.. ఇదీ తెలుగు సినీ రంగంలో చిరంజీవికి మాత్రమే చెల్లిన 'లెక్క'. 
రోజులు మారాయి. 'ఇంద్ర', 'ఠాగూర్‌' తర్వాత తెలుగు సినిమా లెక్కలూ మారిపోయాయి. సరిగ్గా ఆ టైమ్‌లోనే చిరంజీవి సినిమాల్ని తగ్గించేశారు. 'శంకర్‌దాదా జిందాబాద్‌' తర్వాత చిరంజీవి హీరోగా సినిమా ఇప్పటిదాకా రాలేదు. దాదాపు పదేళ్ళపాటు చిరంజీవి వెండితెరకు దూరమయ్యారు. 'మగధీర', 'బ్రూస్‌లీ' సినిమాల్లో కనిపించినా, చిరంజీవి హీరోగా సినిమా అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. కాలం తెచ్చిన మార్పులెన్నో వున్నాయి. బాక్సాఫీస్‌ లెక్కలు బాగా మారిపోయాయి. 
ఏడాది పాటు సినిమా ప్రదర్శితమవడం, 175 రోజుల ప్రదర్శితమవడం, హండ్రెడ్‌ డేస్‌.. 50 డేస్‌.. అనే ప్రశ్నే లేదిప్పుడు. తొలి రోజు ఎంత.? తొలి వారం ఎంత.? ఇదే లెక్క చుట్టూ నిర్మాతలు నానా తంటాలూ పడ్తున్నారు. ఆ లెక్కలు పట్టుకునే, స్టార్‌డమ్‌ అంటూ కొందరు హీరోలు, వారి అభిమానులు విర్రవీగుతున్నారు. కానీ, 'వన్‌ టూ టెన్‌ చిరంజీవిగారే.. ఆ తర్వాతే మేం ఎవరమైనా..' అని ఓ సందర్భంలో మహేష్‌ వ్యాఖ్యానించాడు. అది చిరంజీవి మీద గౌరవంతో అన్నాడో, నిజంగానే అన్నాడోగానీ, అది నిజం. 
పెద్ద హీరోల సినిమాలు హిట్టయితే ఓకే.. లేదంటే, నష్టాలు దారుణంగా వుంటున్నాయి. హిట్టయినా, నిర్మాతలకు డబ్బులు రాని పరిస్థితి. హైప్‌ పెంచడం కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసేయడం, ఆ తర్వాత చతికిలపడ్డం.. ఇది తెలుగు సినిమాకి, అందునా పెద్ద సినిమాలకు పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. ఈ లెక్కల నడుమ, చిరంజీవి హీరోగా కొత్త సినిమా రానుంది. అందుకే, ఈ ఏడాది పుట్టినరోజు చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్‌. 
బాలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్‌ని శాసించిన అమితాబ్‌ బచ్చన్‌, ఇప్పుడు తనకు సూటయిన సినిమాలే చేసుకుంటున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ తీరు వేరు. తన సినిమాలతో ప్రేక్షకుల్ని, డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లనీ, నిర్మాతల్నీ నిలువునా ముంచేస్తున్నారు. ఆకాశాన్నంటే అంచనాల నడుమ రజనీకాంత్‌ అన్న పేరు, సినిమా పబ్లిసిటీకి పనికొస్తుంది తప్ప, ఆ సినిమా నిర్మాతని కాపాడలేకపోతోంది. మరి, చిరంజీవి పరిస్థితేంటి.? 
తమిళ సినిమా 'కత్తి'ని చిరంజీవి రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. మరి, ఈ సినిమాతో చిరంజీవి, తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త అర్థం చెబుతారా.? చెప్పగలిగితే మాత్రం.. మహేష్‌ మాట నూటికి నూరుపాళ్ళూ నిజం. వన్‌ టూ టెన్‌ చిరంజీవే. ఓవర్సీస్‌ లెక్కలు, భారీ అంచనాలు, తొలి రోజు వసూళ్ళు.. వీటన్నిటి నడుమ, మెగాస్టార్‌ ఇమడలేకపోతే మాత్రం.. కష్టమే.! 
ఏదిఏమైనా, సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తెరపై సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందించేద్దాం. హ్యాపీ బర్త్‌ డే టూ మెగాస్టార్‌ చిరంజీవి.

‘పునాది రాళ్లు’ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా పునాది వేసుకొని ఆ తరువాత వరుస సూపర్ డూపర్ హిట్స్ తో విజేత గా మారి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ గా ముద్ర వేసుకొని గ్యాంగ్ లీడర్ బిరుదు తో ముఠా మేస్త్రి అనిపించుకోవడం ఒక్క చిరంజీవి కే సొంతం.. టాలీవుడ్ సినిమాకు తన డాన్సులతో నటనతో చిరు మరింత కళ తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో విలన్ గా అలరించిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మెగా స్టార్ అని పిలిపించుకున్నాడు. ఇక తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకొని సంచలనం సృష్టించాడు మెగా స్టార్. ఎనలేని అభిమానులతో పాటు తిరుగులేని రికార్డులు కూడా చిరు సొంతం. చిరు చిత్రం వస్తుందంటే చాలు ఆ రోజు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులకూ పండగే. 

నైజాం థియేటర్ లపై కార్పొరేట్ కన్ను



టాలీవుడ్ బాక్సాఫీస్ లో నైజాం ఏరియాకి మకుటం లేని మహారాజుల్లా ఉన్న కొందరు అగ్ర నిర్మాతలకు - పంపిణీదారులకి చెక్ పెట్టేందుకు సన్నాహాలు మొదలైయ్యాయి. ఇందుకోసం కొందరు సినీ పెద్దలు సైలెంట్ ఓ పక్కా ప్లాన్ గీసినట్లు సమాచారం. మల్లూవుడ్ ని శాసిస్తున్న ఓ సినిమా కార్పొరేట్ గ్రూప్ గత కొన్నాళ్లుగా నైజాం ఏరియాల్లో ఉన్న బి - సి సెంటర్స్ ని లీజ్ తీసుకునే పనిలో ఉంది. హైదరాబాద్ తో పాటు వరంగల్ - నిజమాబాద్ - అదిలాబాద్ - కరీంనగర్ తదితరల ఏరియాల్లో ఉన్న సింగిల్ థియేటర్లను ఆ కార్పొరేట్ వారు మిగతా వారికంటే ఎక్కువ కోట్ చేసి లీజ్ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే జరిగితే దాదాపు 50 శాతానికి పైగా నైజాం ఏరియాలో ఉన్న థియేటర్లు ఆ కార్పొరేట్ చేతికి వెళ్లిపోతాయని సినీజనాలు అంటున్నారు. అలానే ఆ కార్పొరేట్ గ్రూప్ పెద్దది కావడంతో థియేటర్స్ ఆపరేషన్ మొత్తం కొచ్చి - ముంబై నుంచి సాగుతోందని దీంతో ప్రస్తుతం నైజాం ఏరియాలో ఉన్న థియేటర్ మాఫియాకి తిప్పలు తప్పవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ లో మల్టీప్లెక్సుల విషయంలో కూడా ఇలానే జరిగిందని - భాగ్యనగరంలో ఉన్న మెయిన్ ఏరియాల్లో ప్రస్తుతం మల్టీప్లెక్సులదే హవా అని - ఇందులో స్క్రీన్లు కావాలంటే నిర్మాతలు మీడియేటర్లతో పనిలేకుండా డైరెక్టుగా మాట్లాడుకొని సినిమా ప్రద్శించుకొనే అవకాశం ఉంటుందని కలెక్షన్ లెక్కలు తారు మారు అయ్సే పరిస్థితే ఉండదనేది ట్రేడ్ వర్గాల టాక్. మరి నైజాంలో సినీ దందాను ఆ కార్పొరేట్ వారు ఎంతమేరకు ఆపుతారో చూడాలి.

బాలయ్య 102వ సినిమా హీరోయిన్ గా నయనతార సంక్రాంతికి రిలీజ్



సింహా సినిమాతో బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ గా మారిపోయిన నయనతార - ఆ తరువాత శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో నటించి నందమూరి అభిమానుల్ని మెప్పించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నూరవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ గా నయనతారను తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో నయన్ - కోలీవుడ్ లో బిజీగా ఉండటమే మెయిన్ రీజన్ అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా బాలకృష్ణ 102వ సినిమాలో నయనతార హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సీ.కే.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కే.ఎస్.రవికుమార్ దర్శకుడు.

ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కు తాజాగా నయనతార హాజరవుతుందని సమాచారం. ఈ సినిమాలో నయన్ ఓ వినూత్నమైన పాత్ర పోషించబోతుందని నయన్ - బాలయ్య మధ్య నడిచే సన్నివేశాలు సింహాని తలపిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూకుడు మీదున్న బాలయ్య నుంచి ప్రస్తుతం పైసా వసూల్ రాబోతుంది. ఆ తరువాత సంకాంత్రికి ఈ 102వ సినిమా వస్తుందని సినీ జనాలు అంటున్నారు. మరి బాలయ్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన నయన్ - ఎలా కనిపించబోతుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ లో ముమైత్ కి భలే ఛాన్స్



ఇప్పుడు బిగ్ బాస్ చూడందే అస్సలు తెలుగు ప్రేక్షకులు చాలామంది నిద్రే పట్టట్లేదు. ఏముందిలో అనుకున్న రేంజ్ నుండి ఏమవుతుందో అంటూ ఆతృత క్రియేట్ చేసే రేంజుకు వచ్చేసింది ఈ టివి షో. తొలిసారిగా తెలుగులోకి ఇటువంటి షో రావడం ఒకెత్తయితే.. దీనిని జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేయడం మరో ఎత్తు. దాని కారణంగా మాంచి రెస్పాన్స్ వచ్చేసింది.

అయితే గత వారం.. ఈ బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో మాత్రం జనాలకు సస్పెన్స్ హోరెత్తిపోయింది. అసలు ఈ కార్యక్రమంలో ఎంతో యాక్టివ్ గా ఉండే ముమాయత్ ఖాన్ ఎలిమినేషన్ ఫేస్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. శనివారం నాడు హరితేజ ధనరాజ్ లకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం కలిగించిన జూనియర్ ఎన్టీఆర్.. ఆదివారం హీరోయిన్ అర్చన.. ఐటెం బాంబ్ ముమాయత్ లలో ఎవరికి ఉద్వాసన పలుకుతాడు అంటూ అందరూ షాకవుతున్నవేళ.. ఎన్టీఆర్ ముమాయత్ పేరును చెప్పాడు. పీపుల్స్ పోల్ లో ఆమె పేరే వచ్చిందట. అయితే ఆమెకు మరో అవకాశం కల్పిస్తూ ట్విస్టు ఇచ్చాడు ఎన్టీఆర్.

ఇలా బిగ్ బాస్ నుండి హ్యాపెనింగ్ కంటెస్టంట్లను ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందో అనుకున్నారేమో.. వెంటనే ముమాయత్ కు తిరిగి రావడానికి ఛాన్సిచ్చారు. ఆల్రెడీ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొనడానికి ఆమెకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్.. ఇప్పుడు ఆమెను సీక్రెట్ రూములో ఉండి హౌస్ లో జరిగేదంతా చూడమని.. త్వరలోనే మళ్ళీ హౌసులోకి ఆమెను ప్రవేశపెడతామని తెలిపారు. మొత్తానికి ముమాయత్ భలే లక్కీ గురూ!

సినిమాగా కెసిఆర్ జీవిత చరిత్ర



తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాలా కాలంగా ఈ సినిమా చర్చల దశల్లోనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

కేసీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు, తెలంగాణ ఉద్యమ పోరు వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వాటిని తెరపై ఆసక్తికర కథనంతో తెర్కకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ పేరు వినిపించింది. అయితే తాజాగా నవజూద్ధీన్ సిద్ధిఖీను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవజూద్ధీన్ కేసీఆర్ పాత్రలో బాగా సెట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పాత్ర అవసరాన్ని బట్టి ఎలాంటి రూపం కావాలన్నా ఆ విధంగా రెడీ అవ్వడం నవజూద్ధీన్ స్టయిల్. సో.. కేసీఆర్ పాత్రలో సులభంగా ఇమిడిపోతాడని అంటున్నారు. ఇప్పటికే నవాజుద్దీన్ కేసీఆర్‌కు సంబంధించిన కొన్ని స్పీచ్‌లు చూస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.




చిరు ఉయ్యాలవాడ ఫాస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్న జక్కన్న




‘బాహుబలి’తో రాజమౌళి ఇండియన్ సినిమాను ఎంతగా ఇన్ స్పైర్ చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నా.. అల్లు అరవింద్ రూ.500 కోట్లతో ‘రామాయణం’ అనౌన్స్ చేశాడన్నా.. సుందర్ రూ.250 కోట్లతో ‘సంగమిత్ర’ తీసే ప్రయత్నం చేస్తున్నాడన్నా.. అన్నింటికీ ఆ ధైర్యాన్నిచ్చింది దర్శక ధీరుడు రాజమౌళే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ముందు మామూలుగా తీయాలనుకుని.. ఆ తర్వాత దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా ప్రణాళికలు వేయడానికి కూడా ‘బాహుబలి’తో రాజమౌళి స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు.

మొత్తానికి పది నెలలుగా జరుగుతున్న స్క్రిప్టు పనులు.. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ మామూలుగా ఉండదని.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా చూపిస్తారట. చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమౌళే అని సమాచారం. ‘ఉయ్యాలవాడ..’కు పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రాజమౌళి చేతుల మీదుగానే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. ‘ఉయ్యాలవాడ..’ను పాన్ ఇండియన్ సినిమాగా తీయాలని భావిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని రామ్ చరణ్ ఇలా ప్లాన్ చేశాడంటున్నారు.

YSR పార్టీ లోకి దగ్గుపాటి దంపతులు


ఏపీ సీఎం చంద్రబాబు తోడల్లుడు అన్న నందమూరి తారక రామరావు  పెద్దల్లుడు  దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? విపక్ష నేత జగన్  చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయంటే అవుననే అంటున్నారు  పోలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయాలపై తీవ్ర చర్చకు దారి తీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్త కాదు. గతం లో ఆయన టీడీపీలో, కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగారు.

ఆయన సతీమణి అన్నగారి కూతురు పురంధేశ్వరి కూడా కేంద్రం లో మంత్రిగా చక్రం తిప్పారు. అయితే గత కొన్నాళ్లుగా దగ్గుబాటి రాజకీయాలకు  దూరంగా ఉన్నారు. కానీ పురంధేశ్వరి మాత్రం యాక్టివ్ పోలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 2019 ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయింది. ముఖ్యంగా ఏపీలో అటు చంద్రబాబు, ఇటు జగన్ లు 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొందరికి సీట్ల పంపకాలు టికెట్ల  హామీలు ఇచ్చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గుబాటి  పోలిటికల్ గా మరోసారి అరంగేట్రం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంటే 2019 ఎన్నికల్లో ఆయన గానీ ఆయన కుమారుడిని గానీ రంగంలోకి దింపాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట!…

దీనికిగానే  ఇప్పటివరకు ఫ్యామిలీలో చర్చలు పూర్తయ్యాయని  అందుకే దగ్గుబాటి ఇప్పుడు పార్టీల అన్వేషణలో పడ్డారని సమాచారం. అంటే 2019 నాటికి బలమైన పక్షంగా ఉండే పార్టీలో చేరాలని అదే సమయంలో పరుచూరి నియోజక వర్గాన్ని తమ చేతుల్లో పెట్టే పార్టీని ఆయన ఎంచుకుంటున్నారని అంటున్నారు. దగ్గుబాటి పోలవరం ప్రాజెక్టు పరిశీలన కోసం వచ్చారు. ఈ సమయంలో ఆయన మాజీ ఎంపీ ఉండవల్లిని వెంట తీసుకువెళ్లారు. ఇప్పుడు ఇదే అనుమానానికి అవకాశం కల్పించింది. నిజానికి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన పేరుతో దగ్గుబాటి ఉండవల్లిని భేటీ అయ్యారా అన్న చర్చకు వచ్చింది. కేవలం రాజకీయాలను చర్చించేందుకే దగ్గుబాటి పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఉంటారంటున్నారు విశ్లేషకులు.

ఈ సందర్భంగా ఉండవల్లి దగ్గుబాటిల మధ్య రాజకీయంగా చర్చలు బాగా నడిచాయంటున్నారు. తానుగానీ, తన కుమారుడుగానీ పోలిటికల్ గా ఎంట్రీ ఇస్తే ఏపార్టీ అయితే బాగుంటుందని దగ్గుబాటి చర్చించినట్టున్నారు అని అంటున్నారు. ఇప్పటికే తన భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉన్నందున ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఎలా ఉంటుందని చర్చింపుకు వచ్చింది. వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకుంటే పరుచూరు సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించే ఛాన్స్ ఉంటుందని, ఒక వేల ఇరువురి మధ్య పొత్తు లేకపోతే పరిస్థితి ఏంటని చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

ఇక అదే సమయంలో జగన్ పార్టీ వైసీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందన్న విషయం చర్చకు వచ్చింది. ముఖ్యంగా కుమారుడు పోలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీలోకి వెళ్ళడం మంచిదని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో  ఉండవల్లి జగన్ పార్టీ లోకే చేరడమే  మంచిదన్నట్లుగా తెలిసింది. మరి రాబోయే రోజుల్లో దగ్గుబాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక జగన్ పార్టీలోకి చేరితే కేవీపీ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి రెండు సూపర్ ఆఫర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.  పురంధేశ్వరికి కోస్తాలో ఆమె కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎంపీ సీటుతో పాటు ఆమె తనయుడు చెంచురామ్ లేదా భర్త వెంకటేశ్వరరావుకు  పరుచూరు అసెంబ్లీ సీటుపై హామీ వచ్చినట్లు సమాచారం.

ఆనందో బ్రహ్మ: రివ్యూ Anando Brahma Review



చిత్రం : ‘ఆనందో బ్రహ్మ’

నటీనటులు: తాప్సి - శ్రీనివాసరెడ్డి - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ - తాగుబోతు రమేష్ - రాజీవ్ కనకాల - రాజా రవీంద్ర - విజయ్ చందర్ - సుప్రీత్ - తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: కృష్ణకుమార్
ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి
రచన - దర్శకత్వం: మహి కె.రాఘవ్

తెలుగులోనే కథానాయికగా పరిచయమై.. ఇక్కడ వరుసగా గ్లామర్ పాత్రలు చేసిన తాప్సి.. కొన్నేళ్ల కిందట బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ ‘పింక్’ లాంటి సినిమాలతో గొప్ప పేరు సంపాదించింది తాప్సి. చాన్నాళ్లుగా తెలుగు తెరపై కనిపించని తాప్సి.. మళ్లీ ఇప్పుడు ‘ఆనందో బ్రహ్మ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పాఠశాల’ అనే ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన మహి కె.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. డిఫరెంట్ ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ హార్రర్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
హారర్ సినిమాలు అంటే కేవలం ప్రేక్ష‌కుల‌ను భ‌యానికి గురి చేసే కాన్సెప్ట్‌తోనే సాగుతాయి. దీనికి కాస్తా కామెడీని జోడించి హార‌ర్ కామెడీ జోన‌ర్ సినిమాలు టాలీవుడ్‌లో చాలానే వ‌చ్చాయి. చాలా వ‌ర‌కు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అలాంటి హారర్ కామెడీ జోన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో చిత్ర‌మే `ఆనందో బ్ర‌హ్మ‌`. సాధార‌ణంగా హార‌ర్ చిత్రాలైనా, హార‌ర్ కామెడి చిత్రాలైన దెయ్యాలే మ‌నుషుల‌ను భ‌య‌పెడుతూ ఉంటాయి. మ‌రి మ‌నుషులు దెయ్యాల‌ను భ‌య‌పెడితే అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. రివ‌ర్స ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడి చిత్రాల‌కు భిన్నంగా రివర్స్ ఫార్ములాలో వ‌చ్చిన సినిమా కావ‌డంతో పాటు, సినిమాలో తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్ వంటి మంచి క‌మెడియ‌న్స్ న‌టించ‌డం సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. మ‌రి సినిమా అంచ‌నాల‌ను ఏ మేర చేరుకుందో చూద్దాం.
క‌థః
రాజు(రాజీవ్ క‌న‌కాల‌) మ‌లేషియాలోని ఎన్నారై. అత‌ని త‌ల్లిదండ్రులు ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోకి తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ‌తారు. కానీ వ‌ర‌ద‌ల కార‌ణంగా వారి జాడ తెలియ‌కుండా పోతుంది. దాంతో త‌ల్లిదండ్రుల‌ను వెత‌క‌డానికి రాజు ఇండియా వ‌స్తాడు. ఎంత వెతికినా, త‌ల్లిదండ్రుల ఆచూకీ దొర‌క‌దు. దాంతో ఇండియా నుండి వెళ్లిపోవ‌డానికే నిర్ణ‌యించుకుంటాడు. అందుక‌ని హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిని ఎవ‌రికైనా అమ్మేయాల‌నుకుంటాడు. అయితే రాజు స్నేహితుడు(రాజా రవీంద‌ర్‌), యాద‌వ్‌(టార్జాన్‌)లు ఆ ఇంటిపై క‌న్నేసి, ఆ ప్లేస్‌లో ఓ కాంప్లెక్స్ కట్టాల‌నుకుంటారు. అందుకోసం ఆ స్థ‌లాన్ని త‌క్కువ ధ‌ర‌కే కొట్టేయాల‌నుకుంటారు. అందుకోసం ఆ ఇంటిలో దెయ్యాలున్న‌ట్లు ప్ర‌చారం చేస్తారు. రాజు అవ‌స్థ‌ను అర్థం చేసుకున్న ఓ యువ‌కుడు సిద్ధు(శ్రీనివాస‌రెడ్డి) ఆ ఇంట్లో నాలుగు రోజులు ఉండి వ‌స్తే, ఆ న‌మ్మ‌కాలు పోతాయ‌ని, త‌న‌కొక అవ‌కాశం ఇమ్మ‌ని అడుగుతాడు. రాజు కూడా స‌రేనంటాడు. సిద్ధుకు గుండె స‌మ‌స్య ఉంటుంది. ఆప‌రేష‌న్‌కు పాతిక ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని అన‌డంతో రిస్క్ అయినా దెయ్యాలున్న ఇంట్లో ఉండాల‌నుకుంటాడు. సిద్ధుతో పాటు డ‌బ్బు అవ‌స‌ర‌మైన సెక్యూరిటీ గార్డు(వెన్నెల‌కిషోర్‌), కొడుకు గుండె ఆప‌రేష‌న్ కోసం తంటాలు ప‌డే తాగుబోతు తుల‌సి(తాగుబోతు ర‌మేష్‌), న‌టుడు కావాల‌నుకుని మోస‌పోయిన బార్బ‌ర్(ష‌క‌ల‌క శంక‌ర్‌)లు కూడా జ‌త క‌లుస్తారు. అంద‌రూ ఇంట్లోకి వెళతారు? అప్పుడేం జ‌రుగుతుంది? అస‌లు స‌మ‌స్యేంటి? ఇంట్లో నిజంగానే దెయ్యాలుంటాయా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణః
హార‌ర్ కామెడి చిత్రాల‌కు భిన్నంగా ప్లాట్ పాయింట్‌ను ఎంచుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడు కాస్తా భిన్నంగా ఆలోచించాడు. అదే దెయ్యాల‌కు న‌వ్వంటే భ‌యం. దీంతో పాటు మ‌నుషుల్ని చూసి భ‌య‌ప‌డే దెయ్యాలు. ఈ రెండు పాయింట్స్‌ను బేస్ చేసుకుని స‌న్నివేశాల‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి. సీన్‌ను దెయ్యాల కోణంలో ఓపెన్ చేస్తాడు. కానీ ఎక్క‌డా దెయ్యాల‌ని చూపించ‌కుండా అవి దెయ్యాల‌ని చెప్పే తొలి సీన్ చాలా బావుంది. అక్క‌డ నుండి క‌థ ప్రారంభం అవుతుంది. ఓ న‌లుగురు ఎందుకు చ‌నిపోయాం, ఎవ‌రు చంపార‌నే విష‌యాలు తెలియ‌కుండా చనిపోయి ఆత్మ‌లుగా మారుతారు. దెయ్యాల‌ను సెకండ్ సీన్ నుండే చూపిచేస్తారు. అలాగే ఎక్క‌డా దెయ్యాలంటే జుగుప్స క‌లిగించేలా చూపించ‌లేదు. ఇక సినిమాలో కీల‌క పాత్ర‌ధారులు విష‌యానికి వ‌స్తే, గంగ త‌ర్వాత తాప్సీ చేసిన హార‌ర్ కామెడీ ఇది. గంగ చిత్రంతో పోల్చితే తాప్సీ పెర్ఫామెన్స్‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. గుండె స‌మ‌స్య ఉన్న వ్య‌క్తిగా స్వీయ‌ కామెడీ థెర‌ఫీ చేసుకునే వ్య‌క్తిగా శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న ఆక‌ట్టుకుంది. అలాగే తాగుబోతు ర‌మేష్ ష‌క‌ల‌క శంక‌ర్ పాత్రల కామెడి సెకండాఫ్‌లో ప్ర‌థ‌మార్థంలో అల్టిమేట్‌గా ఉంది. రేచీక‌టి, చెవిటివాడుగా ఉంటూ వెన్నెల‌కిషోర్ చేసే కామెడీ ఆక‌ట్టుకుంది. ష‌క‌ల‌క శంక‌ర్ హీరోల‌ను ఇమిటేట్ చేస్తూ చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్విస్తుంది.

ఇక ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్ కామెడి పార్ట్ ఉన్నంతలో బాగానే ఉంది. సినిమా కామెడి పరంగా బాగాఉంది. అయితే సినిమా ఫ‌స్టాఫ్‌లో కామెడి పెద్ద‌గా లేదు. సినిమా చాలా స్లోగా సాగుతుంది. ప్ర‌థమార్థం 58 నిమిషాలే అయినా గంట‌న్న‌ర పైగా కూర్చున్న‌ట్లు అనిపించింది. సినిమాలో మంచి ఎమోష‌న‌ల్ పాయింట్ ఉన్న దాన్ని క‌నెక్ట్ చేయించ‌డంతో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కాలేక‌పోయాడు. ద్వితీయార్థంలో కూడా కామెడి పార్ట్ మిన‌హా మ‌రే అంశాలు మెప్పించ‌వు. అనిష్ సినిమాటోగ్ర‌ఫీ బావున్నా, కె సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. సినిమాలో లాజిక్స్ చాలానే మిస్ అయ్యాయి. సినిమా ఫ‌స్టాఫ్‌లో దెయ్యాలుండే ఇంట్లోవెళ్లే జీవా, సుప్రీత్‌లో సుప్రీత్ ఏమ‌వుతాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే విజ‌య్ చంద్ర్ భార్య శ్రీనివాస‌రెడ్డి ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌స్తుందో, ఎందుకు వ‌స్తుందో తెలియ‌లేదు. సినిమా పార్టులుగా బాగానే ఉన్నా మొత్తంగా చూస్తే సినిమాలో సోల్ మిస్ అయ్యింది.
బోట‌మ్ లైన్ః ఆనందో బ్ర‌హ్మ‌…కాస‌న్ని న‌వ్వులు ఓకే కానీ..మిగ‌తా పార్ట్ బోరింగ్‌

రేటింగ్- 2.75/5

కొత్తగా యాబై రూపాయల నోటు New 50 Rupees Note



నోట్ల రద్దు తర్వాత మరిన్ని సెక్యూరిటీ ఫ్యూచర్స్, మరింత భద్రతతో కొత్త 100, 50 నోట్లు కూడా రాబోతున్నట్లు చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఇన్నాళ్లు వాటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అధికారులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. RBI విడుదల చేయనున్న కొత్త రూ.50 నోటు ఇదే అంటూ వాట్సాప్ లో ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

కొత్త 50 రూపాయల నోటు నీలం రంగులో ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. ముద్రణ సంవత్సరం 2016గా ఉందని దరిపోర్టర్ టైమ్స్ డాట్ కాం అనే వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఏడాది క్రితమే ఈ నోట్ల ముద్రణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. విడుదల చేయటంలో ఆలస్యం అయ్యిందని వివరించింది. మొదటి సారి నీలం రంగులో భారతీయ నోటు రావటం కూడా ఇదే అని స్పష్టం చేసింది.

నీలం రంగులో ఉన్న కొత్త రూ.50 నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ ఉంది. వెనక భాగంలో పార్లమెంట్ చిహ్నం ఉందని చెప్పింది. కట్టల రూపంలో ఈ నోట్లు ఇంకా మార్కెట్ లోకి రాలేదు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇది అసలా.. నకిలీనా అనే డౌట్ సామాన్యుల్లో ఉంది. పెద్ద ఎత్తున ఈ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

బాలయ్య పైసా వసూల్ సాంగ్స్ Paisa Vasool MP3 Songs Download



Movie Name : Paisa Vasool (2017)
Cast & Crew: Nandamuri Balakrishna, Shriya Saran, Muskan Sethi, Kyra Dutt
Music: Anup Rubens
Label: –
.:: Track-list ‘n’ Download Links ::.
Click below to Download Songs in Zip File (128 Kbps)
All SongsSingle File Download
01 – Paisa Vasool
Artist’s: Daler Mehendi, Uma Neha, Anurag Kulkarni
[Direct] or [ZidduShare]
02 – Kannu Kannu Kalisai..
Artist’s: Anup Rubens, Jithin, Sree Kavya Chandana
[Direct] or [ZidduShare]
03 – Mama Ek Peg La…
Artist’s: Balakrishna Nandamuri, Divya Divakar
[Direct] or [ZidduShare]
04 – Padhamari
Artist’s: Mano, Geetha Madhuri
[Direct] or [ZidduShare]
05 – Theda Singh (Theme Song)…
Music: Anup Rubens
[Direct] or [ZidduShare]

ప్రపంచ వ్యాప్తంగా నాగార్జున ర్యాంక్ 260!



సోషల్ మీడియా అంటే దాదాపు తెలియని వారు లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్‌లోనో.. వాట్సాప్‌లోనో.. ట్విట్టర్ ఇలా ఏదో ఒక మాద్యమంలో అకౌంట్ ఉంది. సరే సామాన్యుడి సంగతి వదిలేస్తే.. సెలబ్రిటీస్ మాత్రం అభిమానులకు అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియా ఒక వారధిలా పనిచేస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్‌లో సినీ ప్రముఖులంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు.

ట్విట్టర్ ద్వారానే తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లాంటి వన్నీ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. అలాగే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా నాగ్‌ది 260వ ర్యాంకట. ట్విట్టర్ కౌంటర్ అనే అకౌంట్ ద్వారా ఆయన అభిమాని ఒకరు నాగ్ ట్విట్టర్ వాల్‌పై పోస్ట్ చేశారు. దీనికి నాగ్ కూడా తనపై చూపిస్తున్న అభిమానానికి థాంక్స్ చెప్పారు.

ఇకపై వాహనదారులు టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు



టోల్ గోస తీరింది. వాహనదారులు ఇకపై ప్రతీ టోల్  గేట్ దగ్గర గంటల తరబడి ఆగడం…  టాక్స్ లు చల్లించుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. టాక్స్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రహదారుల ప్రాదికార సంస్థ(NHAI) రెండు యాప్స్ ను ప్రారంభించింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని 371 టోల్ ప్లాజాల దగ్గర దీన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి NHAI గురువారం (ఆగస్టు 17) మైఫాస్ట్‌ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్ పార్ట్నర్‌ పేరుతో ఈ మొబైల్ యాప్ లను ఆవిష్కరించింది.

ఫాస్ట్ ట్యాగ్ లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు టోల్‌గేట్ల దగ్గర కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) ద్వారా వాటిని అమ్మేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. శుక్రవారం (ఆగస్టు18) నుంచి ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. బ్యాంకులు, NHAI, IHMCL వెబ్‌సైట్‌ల ద్వారా ఈ ఫాస్టాగ్‌లను వాహనదారులు కొనుగోలు చేయవచ్చు.

మైఫాస్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చని..లేదంటే రీచార్జి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఫాస్టాగ్‌ పార్ట్నర్‌ యాప్‌ ద్వారా వాహనాలడీలర్లు, బ్యాంకులు,CSC వంటి సంస్థలు ఫాస్టాగ్‌లను అమ్మవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6 లక్షల ఫాస్ట్ ట్యాగ్ ల అమ్మకాలు జరిగాయని… తాజా చర్యలతో ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది ఎన్‌హెచ్‌ఏఐ. ఫాస్ట్ ట్యాగ్ ఎలక్రాటినిక్  టోల్‌ వసూలు కోసం వినియోగించే పరికరం. వాహనదారుడికి సంబంధించిన అకౌంట్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత ఈ పరికరాన్ని వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. వాహనం టోల్‌గేట్‌ దగ్గరకుచేరుకోగానే, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌  టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్‌ అకౌంట్‌ నుంచి టోల్‌ టాక్స్ సంబంధిత సంస్థకు జమ అవుతుంది. దీంతో..వాహనదారుడు టోల్‌గేట్‌ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.

అర్జున్ రెడ్డి కి " ఎ " సర్టిఫికేట్ ఇచ్చారు !



కొన్ని సినిమాలు అంతే.. వచ్చీ రావడంతో రచ్చ చేస్తుంటాయి. ఆ సినిమాల్లో వాడే డైలాగ్స్ నుండి చూపించే కంటెంట్ వరకు చాలా కొత్తగా ఉంటూనే.. చాలా బోల్డ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ గురించి మనకు తెలియదు కాని.. ''అర్జున్ రెడ్డి'' సినిమా తొలి టీజర్ లోని ఆ బూతుల ప్రకంపనలు మాత్రం ఇంకా టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ బూతుల ఇంటెన్సిటీ అలా ఉంది మరి.

ఇకపోతే ఈ బూతుల సినిమాకు ఇప్పుడు సెన్సారోళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు తెలుసా. సినిమాలో బూతులను తొలగించకుండా.. కంటెంట్ సరిగ్గా కన్వే అవ్వాలంటే అలాంటి పదజాలం ఉండాలని దర్శకుడు పట్టుబట్టడంతో.. కొన్ని చోట్ల బీప్ లు వేసి.. సినిమాకు ''ఎ'' సర్టిఫికేట్ చేతిలో పెట్టారట. అసలు ఈ సినిమాకు సర్టిఫికేటే రాదని చాలామంది అనుకుంటున్నవేళ.. ఈ ఎడల్ట్ సర్టిఫికేట్ రావడం కూడా పెద్ద కొసమెరుపే తెలుసా. సినిమాలో లాంగ్వేజ్ ఒక్కటే కాదు.. కొన్ని సీన్లలో డీప్ గా సాగిన పెదాల ముద్దులూ.. అలాగే కొన్ని పడకగది సీన్లు కూడా ఉన్నట్లు టీజర్లో హింట్లు ఇచ్చారు. అందుకే సర్టిఫికేట్ గురించి అందరికీ అన్ని సందేహాలు వచ్చింది.

సందీప్ రెడ్డి డైరక్షన్లో రూపొందిన ''అర్జున్ రెడ్డి'' సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ గా షాలిని నటిస్తున్నారు. ఈ సినిమాను ఒక కొత్తరకం ప్రయోగాత్మక సినిమా అంటున్న డైరక్టర్.. ఇందులో చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే శుక్రవారం సినిమా రిలీజ్ అవుతోంది.

అఖిల్ రెండవ సినిమా పోస్టర్ లీకైంది !



'అఖిల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని.. ఆ సినిమాతో భారీ ఫ్లాపును చవిచూశాడు. కట్ చేస్తే కోలుకోవడానికి ఏకంగా ఒక ఏడాది పట్టింది. ఇప్పుడు సెన్సిబుల్ గా సినిమాలను తీసే దర్శకుడు విక్రమ్.కె.కుమార్ డైరక్షన్ లో మనోడు తన రెండో సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేసింది. అది లీకైన పోస్టరట. అయితే లీకైతే ఏముందిలే అంటూ ఇప్పుడు నాగార్జునే స్వయంగా ఒరిజినల్ సైజ్ పోస్టర్ ను ట్వీట్ చేశారు.

నిజానికి ఆగస్టు 21న పేరుతో సహా రావాల్సిన ఈ పోస్టర్ ను ఇప్పుడు సినిమా పేరు లేకుండా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో తన గాళ్ ఫ్రెండ్ (కొత్తమ్మాయ్ కళ్యాణి ప్రియదర్శన్) కోసం అఖిల్ మాఫియా దుండగులను కొడుతున్నట్లు కాస్త డిఫరెంట్ గానే ప్రయత్నం చేశాడు. కాకపోతే పోస్టర్ చూస్తుంటే ఈ మధ్యన రిలీజైన హిందీ 'ఏ జెంటిల్మన్' సినిమా పోస్టర్ థీమ్ కు దగ్గరగా ఉంది. ఒక క్లాస్ లుక్కింగ్ బాయ్.. తన గాళ్ ఫ్రెండ్ కోసం దుండగులతో ఫైటింగ్.. ఆపై పెద్ద పెద్ద చేజులూ.. ఫైట్లు.. బిల్డింగులూ.. హెలికాప్టర్లూ.. ఇప్పుడు విక్రమ్ కె కుమార్ తీస్తున్న సినిమా కూడా ఆ రేంజులోనే ఉన్నట్లుంది.

ఈ రెండో సినిమాతో టాలీవుడ్ లో తన సత్తా గట్టిగా చాటి బాక్సాఫీస్ దగ్గర స్థిరపడాలని చూస్తున్నాడు అఖిల్. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర పటిష్టంగా ఒక ఫిగర్ రాబడితేనే స్టార్ స్టేటస్ ఇంకా పెరిగేది. చూద్దాం మరి ఆగస్టు 21న ఈ సినిమా గురించి ఏం చెబుతారో. అయితే ఈ సినిమాకు ''రంగుల రాట్నం'' అనే టైటిల్ పెడుతున్నట్లు ఆల్రెడీ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రమోషన్ లేకుండానే వస్తున్న అజిత్ వివేగం మూవి



తమిళ హీరోలకు తెలుగు మార్కెట్ అంటే మహా ప్రీతి. రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి సీనియర్లు వేసిన పునాది మీద.. చాలామంది తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నారు. సూర్య లాంటి హీరోలైతే తెలుగు హీరోల్లాగే చలామణి అవుతారిక్కడ. విజయ్.. ధనుష్ లాంటి స్టార్లు తెలుగు మార్కెట్ కోసం చాలా చాలా కష్టపడి.. చివరికి అంతో ఇంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ తమిళంలో చాలా పెద్ద స్టార్ అయిన అజిత్ మాత్రం తెలుగులో మార్కెట్ విస్తరించుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. నిజానికి సూర్య కంటే ముందే అజిత్ కు తెలుగులో కొంచెం బేస్ ఏర్పడింది.
90ల్లోనే ‘ప్రేమలేఖ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాడు అజిత్. ఆ పేరును ఉపయోగించుకుని తెలుగు మార్కెట్ మీద దృష్టిపెడితే మంచి స్థాయికి చేరేవాడేమో. కానీ ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ.. తమిళంలోనూ తన సినిమాల ప్రచారంలో పాల్గొనని అజిత్ తన సినిమాల తెలుగు వెర్షన్ల మీద ఎప్పుడూ దృష్టిపెట్టలేదు. రజినీ.. కమల్.. విజయ్ లాంటి హీరోలు తెలుగు రాష్ట్రాలకు వచ్చి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుని.. మార్కెట్ విస్తరించుకుంటున్నప్పటికీ అతనా పని చేయలేదు. దీంతో అజిత్ ఇక్కడ పాపులర్ కాలేదు. ఐతే తమిళంలో అతను చేసే సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు బాగానే ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లలో అజిత్ చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయి.. అతడి సినిమాలు సాధించే వసూళ్లు.. రికార్డులు పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ మీద సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
అజిత్ వచ్చి ఇక్కడ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే దీనికి బాగానే కలిసొచ్చే అవకాశముంది. ఇందుకోసం కొందరు టాలీవుడ్ ప్రముఖుల సాయం కూడా తీసుకోవచ్చు. కానీ అలా ఏమీ చేయలేదు. తెలుగు తారలెవ్వరినీ పిలవకుండా ‘వివేగం’ యూనిట్ సభ్యులే తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్ర దర్శకుడు శివ తెలుగులోనే కెరీర్ ఆరంభించాడు. ఇక్కడ శౌర్యం.. శంఖం.. దరువు సినిమాలు చేశాడు. తర్వాత తమిళంలోకి వెళ్లాడు. ఈ ఫ్యాక్టర్ కూడా ఈ చిత్ర ప్రచారానికి కలిసొచ్చేదే. కానీ పూర్ ప్లానింగ్.. ప్రమోషన్ వల్ల ‘వివేగం’ మీద తెలుగులో హైప్ క్రియేటవ్వలేదు. 

హాలీవుడ్ హీరోయిన్ల ఆదాయం



ప్రపంచంలో అధిక ధనవంతులు జాబీతలో వ్యాపారవేత్తలు - పారిశ్రామికవేత్తల తో పాటుగా ఫిల్మ్ స్టార్స్ కూడా ఉంటారు. మన దేశంలో సూపర్ స్టార్లు ఒక ఏడాదికి సంపాదించింది మొత్తం కూడా ఎక్కువగానే ఉంటుంది. మన దేశంలోనే మన స్టార్లు ఇలా సంపాదించుకోగలిగితే హాలీవుడ్ స్టార్ ఇంకా ఎంత సంపాదిస్తారో ఆలోచించండి. అక్కడ హీరోయిన్లు కూడా హీరోల రేంజ్ పేమెంట్  ఇస్తారు. ఈ మధ్య ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ హాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరు ఎంత సంపాదించారు అనేది ఒక లిస్ట్ తయారుచేసి టాప్ టెన్ స్టార్లా ఆదాయ వివరాలును వెల్లడించింది. అయితే ఇది వరల్డ్ వైడ్ ఉన్న హీరోయిన్లు అందరి పై చేసిన ఈ టాప్ టెన్ లో ఒక్క ఆసియా నటి కూడా లేకపోవడం మనం గమనించవచ్చు.

ఈ ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ పొందిన లా లా లాండ్ నటి ఎమ్మా స్టోన్ అందరి కంటే ముందుంది. ఫోర్బ్స్ చెబుతున్నా ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ఏడాది ఎమ్మా స్టోన్ సంపాదన 26 మిలియన్ డాలర్స్ గా ఉంది. 2016 నుండి 2017 జూన్ వరకు లా లా లాండ్ హీరోయిన్ చేసిన బ్రాండింగ్ కానీ ఆమె సినిమాలు కానీ విజయం పొందిన తీరునుబట్టి నెంబర్ వన్ గా నిలిచింది అని తెలుపుతున్నారు ఫోర్బ్స్ వాళ్ళు. ఎమ్మా తరువాత స్థానంలో జెనీఫర్ అనిస్టన్ 25.5 మిలియన్ డాలర్స్ తో రెండో స్థానంలో ఉంది. అయితే కొత్త కేరటం హాలీవుడ్ యూత్ స్టార్ జెనీఫర్ లారెన్స్ ఈ ఏడాది కేవలం 24 మిలియన్ డాలర్స్ తో సరిపెట్టుకుంది. కానీ లారెన్స్ కిందట ఏడాది ఆదాయంతో చూస్తే ఇది బాగ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే కిందటి ఏడాది ఏకంగా 46 మిలియన్ డాలర్స్ సంపాదించింది.

ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఫేమస్  హాలీవుడ్ హీరోయిన్లు అయనా చార్లీజ్ తేరోన్.. ఎమ్మా వాట్సన్ - మెలిస్సా మెక్ కార్తి కూడా ఉన్నారు. ఈ ఏడాది లో ఈ టాప్ టెన్ హీరోయిన్లు చేసిన మొత్తం ఆదాయం చూస్తే 172.5 మిలియన్ డాలర్స్ గా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కిందటి ఏడాదితో పోలిచిచూస్తే వీళ్ళ ఆదాయం 16 శాతం తగ్గింది అని చెబుతున్నారు. ఇదే వారంలో హాలీవుడ్ హీరోల లిస్ట్ కూడా వస్తుంది అని తెలుస్తుంది. కిందటి సారి హాలీవుడ్ స్టార్ హీరోలలో ది రాక్ డ్వాయ్నే జాన్సన్ అత్యధికంగా 64.5 మిలియన్ ఆదాయంతో టాప్ లో నిలిచాడు.

నేనే రాజు నేనే మంత్రి Nene Raju Nene Mantri Movie Review




విడుదల తేదీ : ఆగష్టు 11, 2017
దర్శకత్వం : తేజ
నిర్మాత : సురేష్ బాబు
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : రానా, కాజల్, క్యాతరిన్ థ్రెస
‘లీడర్, కృష్ణ వందే జగద్గురుమ్, ఘాజి’ వంటి సినిమాలతో మిగతా హీరోలకంటే తాను భిన్నమని చెప్పి ‘బాహుబలి’ తో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన నటుడు రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
ఒక ఊళ్ళ్లో రైతులకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ(కాజల్ అగర్వాల్) తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి రాధా జోగేంద్ర (రానా) కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రాధ కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి దిగుతాడు.
అలా స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా అందరికన్నా ఎత్తుకు ఎదదిగే ప్రయత్నంలో తనకు తెలియకుండానే పూర్తిగా మారిపోయి పరిస్థితుల్ని బట్టి తప్పులు చేస్తూ ముందుకెళుతుంటాడు. అలాంటి సమయంలో శత్రువులు అతన్ని అణగదొక్కడానికి అన్ని దారుల నుండి చుట్టుముడతారు. అలా రాజకీయ చదరంగంలో చిక్కుకున్న రాధ జోగేంద్ర ఎలాంటి కష్టాల్ని పడ్డాడు, ఎవరెవర్ని కోల్పోయాడు, అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, చివరికి అతని జీవితం ఏమైంది, అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు తేజ ఈసారి కథను ఆధారంగా చేసుకుని పనిచేయడం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆయన పాలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేగాక కథకి కావాల్సిన పాత్రల్ని కూడా చాలా బలంగా రాసుకున్నారు తేజ. ముఖ్యంగా హీరోయిన్ కాజల్ చేసిన రాధ పాత్ర, ఆమెను అంటుకుని నడిచే జోగేంద్ర పాత్ర అద్భుతంగా పండాయి. రానా, కాజల్ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. వీరి మధ్య నడిచే భార్య భర్తల ట్రాక్ ను తేర మీద చాలా అందంగా ఆవిష్కరించారు తేజ. వీరిద్దరి మీద నడిచే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగానే సాగింది. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశమైతే నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసింది.
ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండే ఏమాత్రం ఆసలస్యం లేకుండా సినిమా కథలోకి ప్రవేశించడం, జోగేంద్ర రాజకీయ రంగప్రవేశం చేసి, ఎదురనేదే లేకుండా ఎదిగిపోవడం వాటికి తోడు బలమైన పాత్రలు, వాటి నటన ప్రేక్షకుడు సినిమాతో పాటే ప్రయాణం చేసేలా చేశాయి. ఇక సెకండాఫ్ కు వచ్చే సరికి జోగేంద్ర పాత్ర కళ్ళ ముందే అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారిపోవడం, సినిమా మొదట్లో కుర్రాడిలా, లేతగా కనబడే రానా క్లైమాక్స్ కు వచ్చేసరికి రాటుదేలిపోయి, గంభీరంగా తయారవడం చూస్తే తేజ ప్రధాన పాత్ర ప్రయాణాన్ని ఎంత పక్కాగా రాసుకున్నారో అర్థమైపోతుంది. ఇక సినిమా చివర్లో జోగేంద్రతో శత్రువులు ఆడే పొలిటికల్ గేమ్ కూడా బాగానే అనిపించింది.
సినిమా ముగింపు కూడా లవ్ ట్రాక్ తో ముడిపడి ఉండి, పర్ఫెక్ట్ గా ఉంది. ఇక అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకి వెయిట్ ను పెంచింది. లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్, పాటలు చాలా బాగున్నాయి. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని తీసుకొచ్చి, కథ మన మధ్యలోనే జరుగుతుందేమో అనిపించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా సెకండాఫ్ చివర్లో హీరో 200 మంది ఎమ్మెల్యేలను చంపడం, అందుకుగాను పడిన ఉరి శిక్ష తప్పే సన్నివేశాలు బలహీనంగా, లాజిక్స్ కు దూరంగా అనిపిస్తాయి. ఆ ఎపిసోడ్లో జనాల ఇన్వాల్మెంట్ కూడా ఓవర్ గా ఉండి మొహమాటపెడుతుంది. ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ అంకంలో వచ్చే అసెంబ్లీ సన్నివేశం పెద్దగా ఉద్వేగం, మాటలు లేకుండానే ముగిసిపోతుంది. అందులో రానా చేత ఇంకాస్త బలమైన పెర్ఫార్మెన్స్ చేయించి ఉంటే రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
అలాగే ముందు నుండి కీలకంగా కనిపించిన క్యాథరిన్ పాత్రకు సరైన జస్టిఫికేషన్ కనబడదు. సినిమా ప్రధాన అంశం ప్రేమ కథే అయినా దాన్ని చెప్పడానికి దర్శకుడు ఎంచుకుంది రాజకీయ నైపథ్యం కాబట్టి వీటి రెండింటి మధ్య ఖచ్చితమైన బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇందులో రెండింటినీ పోల్చి చూస్తే రాజకీయ నైపథ్యానికి కాస్త అన్యాయం జరిగినట్టే అనిపించి కొంచెం నిరుత్సాహాం కలిగింది.
సాంకేతిక విభాగం :
ఒక దర్శకుడిగా, రచయితగా తేజ చాలా వరకు విజయం సాధించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో సాగే మంచి ప్రేమ కథను రాసుకున్న ఆయన అందుకు కావాల్సిన పాత్రల్ని కూడా అంతే బలంగా రాసుకుని, వాటికి తగిన నటీ నటుల్ని ఎంచుకుని, వారి నుండి మంచి నటనను రాబట్టుకున్నారు. లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్, లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
అనూప్ రూబెన్స్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, పాటలకిచ్చిన సంగీతంతో అలరించాడు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాలో సహజత్వాన్ని నింపింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిల నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.
తీర్పు :
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం పాత తేజాను చూపించి నటుడిగా రానాకు మంచి మార్కులు వేయిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కు ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం, కొన్ని లాజిక్స్ ను మిస్సవడం మినహా మంచి కథ, ఆకట్టుకునే నరేషన్, బలమైన పాత్రలు, రాధా – జోగేంద్రల లవ్ ట్రాక్, అద్భుతమైన రానా, కాజల్ ల నటన అన్నీ కలిసి చిత్రం ప్రేక్షకుడ్ని మెప్పించే విధంగా తయారుచేశాయి. మొత్తం మీద పొలిటీషియన్ గా మారిన ప్రేమికుడి కథ ప్రేమ కథల్ని, డ్రామాతో నడిచే సినిమాల్ని ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది.
Rating : 3/5

లై మూవీ రివ్యూ Lie Movie Review




విడుదల తేదీ : ఆగష్టు 11, 2017
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : మణిశర్మ
నటీనటులు : నితిన్, మేఘ ఆకాష్, అర్జున్
‘అ.. ఆ’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడం వలన ‘లై’ పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. అంతేగాక ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ బాగుండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది భారీ పోటీ నడుమ ఈ సినిమా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథ :
ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు.
అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నారో అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్ ను పర్ఫెక్ట్ గా పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది.
‘అ.. ఆ’ తర్వాత స్టైల్ పూర్తిగా మార్చేసిన నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. కొంచెం ఓవర్ గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నటి మేఘా ఆకాష్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో భారీ నిరుత్సాహాన్ని కలిగించే విషయం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. చాలా చోట్ల కామెడీని పెట్టె స్కోప్ ఉన్న కూడా దర్శకుడు ఆ స్పీడ్ ను వాడుకోలేదు. దీంతో వినోదానికి చోటు లేకుండా పోయింది. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. కమెడియన్ మధు కథలోకి ఎంటరవడం, హీరోయిన్ హీరోతో యూఎస్ వెళ్లడం వంటివి అసహజంగా, ఓవర్ గా అనిపిస్తాయి.
సినిమా అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్ – నితిన్ లు ఉన్నంతసేపు సినిమా బాగుంది అనిపించేలోపు హీరోయిన్ ట్రాక్, లేదా ఇతర బలవంతపు సన్నివేశాలు అడ్డం వచ్చి ఆ మూడు ను చెడగొడతాయి. సినిమాలో దర్శకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకొని రాసిన సన్నివేశాలు, ట్రాక్స్ కొంచెం ఇబ్బందిగానే అనిపించాయి.
సాంకేతిక విభాగం :
నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. డైలాగ్స్, ఆర్ట్స్ డైరెక్షన్ బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా ఇంకో పది నిముషాల సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఇక నితిన్ స్టైలిష్ మేకోవర్ చాలా బాగా అనిపించింది.
ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే ప్లేట్ ను బాగానే రాసుకున్న అయన తెరకెక్కించిన విధానమే సరిగా లేదు. అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.
తీర్పు :
ఈ ‘లై’ చిత్రం మంచి ప్లేట్ లైన్ ను, బలమైన స్టార్ నటీనటుల్ని కలిగి ఉన్నాకూడా తీసిన విధానం సరిగా లేకపోవడం వలన దెబ్బతింది. కథనం మధ్యలో అనవసరమైన సన్నివేశాలు వస్తుండటం సినిమా బాగుంది అనే మూడ్ ను చెడగొట్టి నిరుత్సాహాన్ని కలిగించింది. మొత్తం మీద మంచి నిర్మాణ విలువలు కలిగి ఉండటం, నితిన్, అర్జున్ ల పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉండటంతో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ కు ఛాయస్ గా నిలుస్తుంది.
Rating : 3/5

జయ జానకి నాయక రివ్యూ Jaya Janaki Nayaka Movie Review


జయ జానకి నాయక రివ్యూ 


విడుదల తేదీ : ఆగష్టు 11, 2017
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : మిర్యాల రవీంద్రరెడ్డి
సంగీతం : దేవిశ్రీప్రసాద్
నటీనటులు : బెల్లం కొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్
తెలుగులో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్స్ లో బోయపాటి అంటే మాస్. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ దర్శకుడు నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయని ఆడియన్స్ ఫీలవుతారు. అతని చివరి చిత్రం సరైనోడు తర్వాత మరల బోయపాటి నుంచి వచ్చిన తాజా చిత్రం ‘జయ జానకి నాయక’. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం
కథ :
చక్రవర్తి గ్రూప్ అఫ్ కంపెనీస్ ఎండీ చక్రవర్తి (శరత్ కుమార్) అతనికి ఇద్దరు కొడుకులు గగన్(బెల్లంకొండ శ్రీనివాస్), నందు. కొడుకులకి చక్రవర్తి ఒక స్నేహితుడుగా ఉంటాడు. వాళ్ళు చేసే అన్ని పనులకి సపోర్ట్ గా ఉంటాడు. అలాగే కొడుకులకి కూడా తండ్రి అంటే ప్రాణం. వాళ్ళ లైఫ్ హ్యాపీ గా సాగిపోతున్న టైం లో గగన్ లైఫ్ లోకి(జానకి) ఎంటర్ అవుతుంది. ఆమెతో తండ్రి, కొడుకులు ముగ్గురు అనుబంధం పెంచుకుంటారు. ఆమెకి కష్టం రాకుండా చూసుకోవాలని కొడుకు దగ్గర మాట తీసుకుంటారు. అయితే అనుకోని పరిస్థితిలో జానకి, గగన్ కి దూరం అవుతుంది. ఆపై అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటుంది. జానకి కష్టానికి కారణం ఎవరు? అవి గగన్ కి ఎలా తెలిశాయి? జానకిని గగన్ సమస్యల నుంచి ఎలా బయటకి తీసుకొచ్చాడు? ఇక అశ్వద్ నారాయణ్ వర్మ(జగపతి బాబు), అరుణ్ పవార్(తరుణ్ అరోరా)తో గగన్ ని ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే అది ఖచ్చితంగా బోయపాటి మార్క్ మాసిజం. అతని నుంచి ఆడియన్స్ ఏవైతే ఆశించి సినిమాకి వెళ్తారో అలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా ఉంటాయి. సినిమాలో సెకండ్ మేజర్ పాయింట్ అంటే అది హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టొరీ. ప్రేమించే వారి కోసం ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనే అంశాన్ని బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానానికి యూత్, ఫ్యామిలీ ఫుల్ గా ఫిదా అయిపోతారు. అలాగే సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా చాలా ప్రాధ్యానత ఉంటుంది. బోయపాటి మార్క్ లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ఆడియన్స్ బాగా కనెక్టవుతారు. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. అక్కడక్కడ డైలాగ్స్ తో కథలో భాగంగా వచ్చిన వినోదం కూడా ఆకట్టుకుంటుంది.
ఇక సినిమాలో అందరికంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్. ఆమె పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ని ఆమె భాగా ప్రెజెంట్ చేయగలిగింది. ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో జగపతి బాబు పాత్రలో ఎమోషనల్ విలనిజం కనిపిస్తుంది. ఆ పాత్రకి జగపతి బాబు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోగా బెల్లంకొండ పెర్ఫార్మెన్స్ వరకు గత సినిమాలతో పోల్చుకుంటే చాలా మెరుగు పడ్డాడని అనిపిస్తుంది. డైలాగ్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఈ సినిమాలో గగన్ పాత్ర అతనికి భాగా షూట్ అయ్యింది. ఇక సినిమాలో శరత్ బాబు చాలా కీలకమైన పాత్ర చేసి మెప్పించాడు. కొడుకులని ప్రేమించే తండ్రిగా, ప్రేమని గౌరవించే తండ్రిగా అతని పాత్ర చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక మెయిన్ విలన్ గా చేసిన తరుణ్ అరోరా, హీరో అన్నగా చేసిన నందు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా, మినిస్టర్ గా చేసిన సుమన్ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కొత్తదనం లేకపోవడం. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కాస్త కంటెంట్ లో కొత్తదనం కోరుకుంటున్నారు. అయితే అలాంటి కొత్తదనం ఆశించడం అనవసరం. ఇక సినిమాలో అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యే సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లేని కొత్తగా చెప్పాలని ట్రై చేసినా కొన్ని పాత్రలకి సరైన ముగింపు ఉండదు. ఇలాంటి సినిమా చూసే టైం లో లాజిక్స్ ఆశించకుండా ఉండటం బెటర్.
ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా కేవలం అందాల ప్రదర్శన, ఓ రెండు సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యింది, ఇక చాలా ఏళ్ల తర్వాత అలనాటి గ్లామర్ క్వీన్ వాణీ విశ్వనాధ్ పాత్ర ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో అయితే లేదు. ఆ పాత్రకి ఆమె అంత అవసరం కూడా లేదనిపిస్తుంది, నటనకి కూడా అంతగా ఆస్కారం లేకుండా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ని పల్స్ ని పైకి లేపి వదిలినా, ఆ ఈజ్ ని బోయపాటి సెకండ్ హాఫ్ లో కొనసాగించలేకపోయాడు.
సాంకేతిక విభాగం :
దర్శకుడుగా బోయపాటి శ్రీను, తన మార్క్ మాస్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాని ఈ సినిమాతో కూడా కొనసాగించడం విశేషం. అతనికి ఈ విషయంలో ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు. ఇక ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు భాగా రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. సాంగ్స్ అన్నీ కూడా ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గ విధంగా అందించాడు. రిషి పంజాబీ తన సినిమాటోగ్రఫీతో ఆద్యంతం విజువల్ ట్రీట్ అందించారు. హంసలదీవి అందాలని భాగా చూపించాడు. బోయపాటి సినిమా అంటే కచ్చితంగా ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో రామ్- లక్ష్మణ్ లు తమ మార్క్, తెలుగు ఆడియన్స్ గా భాగా కనెక్ట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పించారు. ఎడిటింగ్ లో కోటగిరి వెంకటేశ్వరరావు పరవాలేదనిపిస్తాడు.
తీర్పు :
అతిమంగా ఈ సినిమా బోయపాటి మార్క్ లోనే ఉంటుంది. ఇందులో బోయపాటి హీరో, విలన్ మాసిజానికి, రకుల్ – బెల్లంకొండ కొండ శ్రీనివాస్ లవ్ స్టొరీ కాస్తా ఎమోషనల్ టచ్ ఇవ్వడం జరిగింది. ఇక జగపతి బాబు- తరుణ్ అరోరా విలనిజంతో మాస్ ఆడియన్స్ ని భాగా టార్గెట్ చేశారు. సంగీతంలో దేవీ మాస్ ఆడియన్స్ పల్స్ కి భాగా కనెక్ట్ అయ్యాడు. పెద్దగా కొత్తదనం లేకపోవడం, సికొని లాజిక్స్ మిస్సవదేవం మినహా ఓవరాల్ గా మాస్ అంశాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టొరీ అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీని, మరో వైపు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

Rating : 3.25/5

రానా ట్వీట్ కు రకుల్ , నితిన్ స్పందన



మరో మూడు రోజుల్లో మూడు సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడంతో టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రచారం, హంగామా కనపడుతుంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ మూడు సినిమాల గురించి ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులలో కూడా చర్చలు జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే… మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ కాగా, వేటికవే ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ సాధించాయి. దీంతో ఓ బొమ్మ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొడుతుందోనని ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు. తన సినిమాలతో పాటు విడుదల కాబోతున్న నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు కూడా విజయవంతం కావాలని, అంతిమంగా ‘సినిమా’ గెలవాలని రానా చేసిన ట్వీట్ కు రకుల్ మరియు నితిన్ లు స్పందించారు. రానాకు థాంక్స్ చెప్పిన రకుల్, “నీకు కూడా ఆల్ ది బెస్ట్, నాకు తెలుసు ఇది గేమ్ చేంజర్” అంటూ రిప్లై ఇచ్చింది. మరికాసేపటికి నితిన్ కూడా “రానాకు థాంక్స్ చెప్తూ… మనందరి సినిమాలు విజయవంతం కావాలని” ట్వీట్ చేసారు. ఈ ముగ్గురి సెలబ్రిటీల మధ్య జరిగిన ఈ సరదా ట్వీట్ల సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్న ఈ ముగ్గురు ఆహ్లాదకరమైన అనుభూతులను పంచుకోవడం అనేది సినీ ప్రేక్షకులలో పాజిటివ్ సంకేతాలను పంపించినట్లయ్యింది. రానా అన్నట్లు… ఈ మూడు సినిమాలు హిట్టయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పండగే కదా! సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలు మూడు హిట్ కావడంతో, అదే సీన్ రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.