ఈ ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ పొందిన లా లా లాండ్ నటి ఎమ్మా స్టోన్ అందరి కంటే ముందుంది. ఫోర్బ్స్ చెబుతున్నా ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ఏడాది ఎమ్మా స్టోన్ సంపాదన 26 మిలియన్ డాలర్స్ గా ఉంది. 2016 నుండి 2017 జూన్ వరకు లా లా లాండ్ హీరోయిన్ చేసిన బ్రాండింగ్ కానీ ఆమె సినిమాలు కానీ విజయం పొందిన తీరునుబట్టి నెంబర్ వన్ గా నిలిచింది అని తెలుపుతున్నారు ఫోర్బ్స్ వాళ్ళు. ఎమ్మా తరువాత స్థానంలో జెనీఫర్ అనిస్టన్ 25.5 మిలియన్ డాలర్స్ తో రెండో స్థానంలో ఉంది. అయితే కొత్త కేరటం హాలీవుడ్ యూత్ స్టార్ జెనీఫర్ లారెన్స్ ఈ ఏడాది కేవలం 24 మిలియన్ డాలర్స్ తో సరిపెట్టుకుంది. కానీ లారెన్స్ కిందట ఏడాది ఆదాయంతో చూస్తే ఇది బాగ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే కిందటి ఏడాది ఏకంగా 46 మిలియన్ డాలర్స్ సంపాదించింది.
ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఫేమస్ హాలీవుడ్ హీరోయిన్లు అయనా చార్లీజ్ తేరోన్.. ఎమ్మా వాట్సన్ - మెలిస్సా మెక్ కార్తి కూడా ఉన్నారు. ఈ ఏడాది లో ఈ టాప్ టెన్ హీరోయిన్లు చేసిన మొత్తం ఆదాయం చూస్తే 172.5 మిలియన్ డాలర్స్ గా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కిందటి ఏడాదితో పోలిచిచూస్తే వీళ్ళ ఆదాయం 16 శాతం తగ్గింది అని చెబుతున్నారు. ఇదే వారంలో హాలీవుడ్ హీరోల లిస్ట్ కూడా వస్తుంది అని తెలుస్తుంది. కిందటి సారి హాలీవుడ్ స్టార్ హీరోలలో ది రాక్ డ్వాయ్నే జాన్సన్ అత్యధికంగా 64.5 మిలియన్ ఆదాయంతో టాప్ లో నిలిచాడు.
