Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts

సినిమాగా కెసిఆర్ జీవిత చరిత్ర



తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాలా కాలంగా ఈ సినిమా చర్చల దశల్లోనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

కేసీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు, తెలంగాణ ఉద్యమ పోరు వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వాటిని తెరపై ఆసక్తికర కథనంతో తెర్కకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ పేరు వినిపించింది. అయితే తాజాగా నవజూద్ధీన్ సిద్ధిఖీను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవజూద్ధీన్ కేసీఆర్ పాత్రలో బాగా సెట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పాత్ర అవసరాన్ని బట్టి ఎలాంటి రూపం కావాలన్నా ఆ విధంగా రెడీ అవ్వడం నవజూద్ధీన్ స్టయిల్. సో.. కేసీఆర్ పాత్రలో సులభంగా ఇమిడిపోతాడని అంటున్నారు. ఇప్పటికే నవాజుద్దీన్ కేసీఆర్‌కు సంబంధించిన కొన్ని స్పీచ్‌లు చూస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.




ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఏపీ ప్రభుత్వం షాక్!




జడ్పీ, ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇది వరకే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి నివేదించగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే సిపార్సే చేసింది! మరి ఇదే జరిగితే ఒకేసారి ఏకంగా పది వేల మందికిపైగా ఎంపీటీసీలు, 660 మంది జడ్పీటీసీలు వీరిలోనే భాగమైన ఎంపీటీసీ చైర్మన్ లు, జడ్పీటీసీ చైర్మన్ లు రాజకీయ నిరుద్యోగులైపోతారు! ప్రస్తుతం ఎంపీటీసీ పదవి అనేది కూడా పెద్ద హోదానే! అది కూడా అధికార పార్టీ తరపున ఈ హోదాల్లో ఉన్న వారి పైరవీలు,పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో గ్రామాల్లోకి వెళ్లి చూస్తే అర్థం అవుతుంది. మండల కేంద్రాల్లో రౌడీ షీటర్లలో చాలా మందికి ఎంపీటీసీ హోదా నో, మండల  పరిషత్ చైర్మన్ హోదానో ఉంటుంది! ఇక జడ్పీ మెంబర్లు, జడ్పీటీసీ చైర్మన్లు కూడా ఎమ్మెల్యే లకు కింది స్థాయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.

అయితే ఎంపీటీసీ మెంబర్ల కన్నా సర్పంచ్ ల చేతిలోనే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అనేది కూడా అందరూ ఎరిగిన వ్యవహారమే. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీలు అనేవి హోదాగా, పైరవీలకు పనికొచ్చేవిగా, కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి,అధికార పార్టీ నేతగా చెలామణి కావడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదే సమయంలో జడ్పీ, ఎంటీటీసీ ఎన్నికలను మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలూ అదే స్థాయిలో తాపత్రయపడుతూ ఉంటాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికల సందర్బాల్లో అయితే రాజకీయం వేడెక్కుతూ ఉంటుంది. జడ్పీ సభ్యులు పార్టీలు ఫిరాయించడం,ఫలితాలను తారుమారు చేయడం అధికారంలో ఉన్నది ఎవరైనా ఈ జడ్పీ చైర్మన్ పదవులను తమ పార్టీ కే దక్కేలా చేయడానికి రసవత్తర రాజకీయం చేయడం ఐదేళ్లకొకసారి జరుగుతున్న వ్యవహారమే.

ఇలాంటి రాజకీయానికి పుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైనట్టుంది. ఇదే జరిగితే రాజకీయ నిరుద్యోగులు ఎక్కువవుతారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ లు  ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చాయి. ప్రతిపక్ష పార్టీల గుర్తులపై ఆ హోదాలకు గెలిచిన వారికి తమ కండువాలు వేయడంలో ఈ పార్టీలు పోటీపడ్డాయి. వారి చేరికలను పండగలా సెలబ్రేట్ చేశాయి. ఇదంతా జరిగి రెండేళ్లు అయినా కాకముందే ఇప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు  సిఫార్సు చేయడం ఆసక్తికరమైన అంశం. ఈ వ్యవస్థలు రద్దు కావడం అటు రాజకీయ పార్టీలకూ, ఇటు ప్రభుత్వానికి కొంచెం భారం తగ్గడమే. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వంతో పాటు పార్టీలు కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ పదవులు రద్దు అయితే  పార్టీలకు కొంత భారం తగ్గుతుంది కాని ప్రస్తుతం  పదవుల్లో ఉన్న వారిని ఎలా ఎలా సంతృప్తి పరుస్తాయోవేచి చూడాలి

పోలీస్ ఎన్ కౌంటర్ లో నయీం హతం - ఆపరేషన్ కెసిఆర్




తెలంగాణ సిఎం కేసీఆర్ తాను నమ్మిన సిద్దాంతం కోసం ఎంతకైనా తెగించే రకం. ఆయన ఎంతటి మొండి మనిషే అందరికి తెలుసు. ఆయన తనను నమ్ముకున్న వాళ్లను కూడా ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి. తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కూడా తన వాళ్లను రక్షించుకునేందుకే చేయించారు అనే ఓ వాదన బలంగా వినిపిస్తోంది. నయీం ఏకంగా కేసీఆర్ తో ఎంతో సఖ్యతతో మెలిగే ఓ వ్యాపార వేత్తను బెదిరించారని.. ఆయన నేరుగా వచ్చి కేసీఆర్ తో చెప్పుకున్నారని.. దాంతో కేసీఆర్ వెంటనే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
తన టీంలో మెంబర్ అయిన భువనగిరి ఎమ్మెల్యేను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా నయీంను బెదిరించారని.. ఏకంగా తన అనుమతి లేకుండా నియోజక వర్గంలోకి అడుగుపెట్టవదు అని వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. దీంతో తమ రాజీనామా పత్రాలతో కేసీఆర్ ను కలిశారని.. అందుకు కేసీఆర్ వారికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఇచ్చారని తెలిసింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లతో ఎన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తామని కేసీఆర్ తో అన్నారట. దాంతో పోలీసులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎంసెట్ - 2 పేపర్ లీక్ కు 10 లక్షలు




ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్ లో వేలల్లో ర్యాంకులు సంపాదించుకున్న కొంతమంది విద్యార్థులకు తెలంగాణ నిర్వహించిన ఎంసెట్ లో మాత్రం వందల్లోనే ర్యాంకులు రావడంతో ఒక అనుమానం మొదలైంది. ఈ క్రమంలో తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆశ్రయించారు. దాంతో ఆయన ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించగా... షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణ ఎంసెట్ - 2 పేపర్ లీకయ్యిందని తెలిసింది.

అవును తెలంగాణ ఎంసెట్ - 2 పేపర్ లీకయ్యిందని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు బెంగళూరు - ముంబై నగరాలతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ పోలీసులు దర్యాప్తుచేసి రమేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ లీకేజీ వ్యవహారం సుమారు రూ. 15కోట్లకు కుదుర్చుకున్న డీల్ అని తెలుస్తోంది. ఈ లీక్ ద్వారా 30 మంది వరకూ విద్యార్థులు లబ్ది పొందినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు.

ఎంసెట్ పరీక్షకు రెండు రోజుల ముందు ఈ పేపర్ లీక్ అయ్యిందని - దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ. 10 లక్షలు వసూలు చేశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇలా లీకైన పేపర్ తో బెంగళూరులో ప్రాక్టీస్ చేయించారని అదే యధాతథంగా పరీక్షల్లో రాయడంతో అద్భుతమైన ర్యాంకులు వచ్చాయని పోలీసులు తేల్చారు. వైద్యవిద్య పీజీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ చేసినవాళ్లే... ఈ పేపర్ ను కూడా లీక్ చేశారని అధికారులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ టాప్



కొత్తగా ఏర్పడిన రాష్ట్రo అయినా వృద్ధిలోనూ.. ఇతర అoశాల విషయoలోనూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ దూసుకెళుతున్న తెలoగాణ రాష్ట్రం మరో ఘనతను సాధిoచిoది. సరళతర వ్యాపార నిర్వహణ అదేనoడి.. ‘‘ఈజ్ ఆఫ్ డూయిoగ్ బిజినెస్’’  (ఈ అంశం విషయoలో తమ అంశాల్ని ఏపీ సర్కారు కాపీ కొట్టిoదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపిoచటమే కాదు.. ఈ ఉదంతంపై కేoద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతo ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉoడటo గమనార్హం) ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రo ఫస్ట్ ప్లేస్ లో నిలిచిoది.

తాజాగా కేoద్ర పారిశ్రామిక విధానo.. ప్రోత్సాహక శాఖ వెబ్ సైట్ దేశoలోని రాష్ట్రాలకు ర్యా0కుల్ని కట్టబెట్టిoది. ఈ ర్యాoకుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లోనిలవగా.. ఉత్తరాఖండ్ రెoడో స్థానంలో నిలిచిoది. ఇక.. ఏపీ మూడో స్థానoలో నిలవటం గమనార్హo. అయితే.. ఈ ర్యాoక్ ఫైనల్ అని చెప్పలేని పరిస్థితి. ఎoదుకoటే.. రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు.. సoస్కరణలు.. ఇతర అoశాలకు సంబంధించి రాష్ట్రాలను 340 ప్రశ్నలకు సమాధానాల్ని కోరిoది. ఇoదులో ప్రస్తుతానికి 190 ప్రశ్నల్ని పరిశీలిoచి ర్యాంకుల్ని ఖరారు చేశారు. మిగిలిన ర్యాoకుల్ని పరిశీలిస్తూ.. ఆయా ప్రశ్నలకు వారిచ్చే సమాధానాల ఆధారoగా ర్యాoకుల్ని సర్దుతుంటారు.

ఇప్పటికైతే మొదటిస్థానoలో తెలంగాణ రాష్ట్రo నిలిచింది. మిగిలిన ప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు ర్యాoకుల్ని సరి చేస్తూ ఉoటారు. మిగిలిన అన్నిప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిoచిన తర్వాత సెప్టెంబరులో తుది ర్యాoకును ప్రకటిస్తారు. కొత్త రాష్ట్రo.. పాలనకు కొత్త అయినా తెలoగాణ రాష్ట్రం.. తెలoగాణ సర్కారు.. దేశoలోని మిగిలిన రాష్ట్రాలన్ని తలదన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలవటo చూసినప్పుడు ఈ క్రెడిట్ అoతా ముఖ్యమoత్రి కేసీఆర్ ఖాతాలో వేయాల్సిoదే.

ఆంధ్ర తెలంగాణ బ్రాండ్ వార్




ఏపీ, తెలంగాణల రాష్ట్రాల మధ్య రోజురోజుకూ కొత్తకొత్త వివాదాలు తలెత్తుతున్నాయి.  ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై రగడగా మారింది.  తాజాగా ప్రైవేట్ డెయిరీలకు ఎదురొడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రభుత్వ పాల ఉత్పత్తుల సంస్థ ‘ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)’ ఉత్పత్తి చేస్తున్న ‘విజయ’ బ్రాండ్ పాలపై  రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటుచేసుకుంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడివడినా… విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేరిన ఏపీ డెయిరీ మాత్రం ఇంకా ఉమ్మడిగా కొనసాగుతోంది.  ఏపీ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న ఏపీ డెయిరీ ‘విజయ’ బ్రాండ్ పాలను తెలంగాణలోనూ విక్రయిస్తోంది.  అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బ్రాండ్ పేరుతో పాల విక్రయం ప్రారంభించడంతో గొడవ మొదలైంది.

‘తెలంగాణ పాడి సమాఖ్య’ పేరిట ప్రత్యేక సంస్థను నెలకొల్పుకుని ‘విజయా’ బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తోంది తెలంగాణ ప్రభత్వం.  ఆ బ్రాండ్ కు ‘తెలంగాణ’ అనే ట్యాగ్ లైన్ తగిలించింది. మరోవైపు  ఏపీ డెయిరీ… తెలంగాణలోని పాలమూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు తన పాలను పంపి అక్కడే ప్రాసెస్ చేయించి ‘విజయ’ బ్రాండ్ పేరిటే తెలంగాణలో పాలను విక్రయిస్తోంది.  ఈ క్రమంలో సాంబశివ డెయిరీ నుంచి వస్తున్న ‘విజయ’ బ్రాండ్ తమది కాదని మొన్న తెలంగాణ పాడి సమాఖ్య ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు కౌంటర్ గా నిన్న ఏపీ డెయిరీ  మరో ప్రకటన విడుదల చేసింది.  సాంబశివ డెయిరీ నుంచి విడుదలవుతున్న ‘విజయ’ బ్రాండ్ పాలు నకిలీవి కావని, వాటిలో ఎలాంటి కల్తీ లేదని పేర్కొన్నారు.

ఇలా రెండు డెయిరీలు ఒకటే బ్రాండు పేరుతో విక్రయిస్తూ కొనుగోలుదారుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. విజయ డెయిరీ పాలు బాగా పాపులర్ కావడంతో ఆ బ్రాండ్ నేమ్ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇలా చేసిందని తెలుస్తోంది. ఇప్పడు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న బ్రాండ్ నేమ్ వివాదం ముఖ్యమంత్రుల వద్దకు కూడా చేరిందట. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

త్వరలో గ్రూప్ 2 పోస్టులకు నోటిషికేషన్ TSPSC Group 2 Notification





తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కొత్త జిల్లాల ప్రయత్నం కొత్త ఉద్యోగాలకు అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది మొదట్లో గ్రూప్ 2 పోస్టులకు నోటిషికేషన్ జారీ చేయటం తెలిసిందే. 460 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఈ ఉద్యోగాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లుగా గుర్తించి నిలిపివేశారు. తాజాగా కొత్తజిల్లాల ఏర్పాటు తెర మీదకు రావటం.. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో గ్రూప్ 2ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అయిన వెంటనే.. గ్రూప్ 2 నోటిఫికేషన్ మరొకటి జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త జిల్లాలకు అవసరమైన పోస్టులను గుర్తించి.. అందుకు అనుగుణంగా రిక్రూట్ మెంట్ చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 భర్తీకి దాదాపు 3వేల ఉద్యోగాల వరకూ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన పోస్టులను గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారుల్ని ఆదేశించింది. వారి కసరత్తు పూర్తి అయిన తర్వాత ఎన్నిఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ జారీ చేయాలన్న అంశంపై కేసీఆర్ సర్కారు ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. మొత్తంగా చూస్తే.. రానున్న రోజులు తెలంగాణలో కొత్త కొలువుల జోరు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

తెలంగాణ కొత్త జిల్లాలు మండలాలు జనాభా వివరాలు




సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మొత్తం 23 జిల్లాలు ఉండేవి. అవి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత 10 జిల్లాలు తెలంగాణలో 13 జిల్లాలు ఏపీలోకి వచ్చాయి. అయితే.. తెలంగాణలో కొత్తగా మరికొన్ని జిల్లాలు ఏర్పాటు చేయడానికి దాదాపుగా కసరత్తు పూర్తయింది. తెలంగాణలో సమైక్య రాష్ర్టంలో ఉన్నట్లుగానే మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. 30 జిల్లాలతో మరో ప్రతిపాదన తయారవుతోందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ 23 జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. దాని ప్రకారం  ప్రస్తుతం ఉన్న 459తో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 

23 జిల్లాల జనాభా - వైశాల్యం - మండలాల వివరాలిలా ఉన్నాయి.

ఆచార్య జయశంకర్ జిల్లా – 856453 మంది జనాభా ఉండగా - వైశాల్యం 6760 చ.కి.మీటర్లు - 21 మండలాలు - 3 రెవెన్యూ డివిజన్లు.

ఆదిలాబాద్ – 1422034 మంది జనాభా ఉండగా - 7673 చ.కిమీ  వైశాల్యం  27 మండలాలు - 4 రెవెన్యూ డివిజన్లు.

భద్రాద్రి -1193807 మంది జనాభా - 8297 చ.కి.మీ వైశాల్యం - 23 మండలాలు.

యాదాద్రి – 719131 మంది జనాభా - 2956 చ.కి.మీ వైశాల్యం - 17 మండలాలు.

హైదరాబాద్ -3901928 మంది జనాభా - 1914 చ.కి.మీ వైశాల్యం - 20 మండలాలు.

జగిత్యాల – 1043000 మంది జనాభా - 3087 చ.కి.మీ వైశాల్యం - 18 మండలాలు.

కామారెడ్డి – 1068773 మంది జనాభా - 4025 చ.కి.మీ వైశాల్యం - 21 మండలాలు.

కరీంనగర్ – 1802038 మంది జనాభా - 4308 చ.కి.మీ వైశాల్యం - 26 మండలాలు.

ఖమ్మం – 1880137 జనాభా - 4360 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

కొమరంభీమ్ -1319205 మంది జనాభా - 8442 చ .కి.మీ వైశాల్యం - 27 మండలాలు.

మహబూబాబాద్- 804136 మంది జనాభా - 3633 చ.కి.మీ వైశాల్యం - 15 మండలాలు.

మహబూబ్నగర్ – 1867620 మంది జనాభా - 6518 చ.కి.మీ వైశాల్యం - 31 మండలాలు.

మెదక్ – 1444955 మంది జనాభా - 4215 చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

నాగర్ కర్నూలు – 1048425 మంది జనాభా - 7447 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

నల్గొండ – 1555992 మంది జనాభా - 7475 చ.కి.మీ వైశాల్యం - 32 మండలాలు.

నిజామాబాద్ – 1447961 మంది జనాభా - 3772 చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

రంగారెడ్డి – 1086522 మంది జనాభా - 4157 చ.కి.మీ వైశాల్యం - 20 మండలాలు.

సంగారెడ్డి – 1186280 మంది జనాభా - 3116 చ.కి.మీ వైశాల్యం - 18 మండలాలు.

సికింద్రాబాద్ – 4251614 మంది జనాభా - 1608 చ.కి.మీ వైశాల్యం - 23 మండలాలు.

సిద్ధిపేట – 1190209 మంది జనాభా - 4398 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

సూర్యాపేట – 1386883 మంది జనాభా - 4348చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

వనపర్తి – 1136983 మంది జనాభా - 4426 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

వరంగల్ – 2236051 మంది జనాభా - 4883 చ.కి.మీ వైశాల్యం - 31 మండలాలు.

తెలంగాణ సచివాలయాన్ని నిర్మించటానికి అయ్యే ఖర్చు రూ.200 కోట్లు




కడుపు నిండిన మారాజు తనకు నచ్చింది తినాలనుకోవటంలో తప్పు లేదు. సరిగ్గా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని చోట్ల నమ్మకాల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టటం ఆసక్తికరమైన అంశమే. నిజానికి ఇది సాహసంతో కూడుకున్న వ్యవహారం కూడా. ఓపక్క ప్రజాసంక్షేమ కార్యక్రమాలు మరోవైపు ఇలాంటి ఖర్చులన్నీ కలిసి చివరకు భారం పడేది సగటు జీవి మీదనే. ఓపక్క ఆర్టీసీ.. విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోవైపు.. తాను అనుకున్నట్లుగా సరికొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రూ.200 కోట్ల ఖర్చుకు సిద్ధంగా కావటం గమనార్హం.

ఇప్పుడున్న సచివాలయం సౌకర్యవంతంగా లేదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే పైమాట. అయితే.. ఆయన నమ్మే వాస్తుకు తగ్గట్లుగా లేదన్నది లోగుట్టు మాట. మాటల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్ అనుకున్నట్లు కొత్త సచివాలయాన్ని నిర్మించటానికి అయ్యే ఖర్చు రూ.200 కోట్లు అంటే అదంతా ప్రజాధనమన్న సంగతి మర్చిపోకూడదు.

తన భారీ స్వప్నాన్ని ఊహాచిత్రాలుగా మార్చి ఇప్పటికే విడుదల చేసిన ఆయన అందరి నోటా వావ్ అనిపించేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఎవరు ఎలా అనుకున్నా.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేసే పట్టుదల ఉన్న కేసీఆర్.. కొత్త సచివాలయ నిర్మాణాన్ని చకచకా చేపడతారనే చెప్పాలి. ఇక.. కొత్తగా కట్టే సచివాలయానికి సంబంధించిన పనులు ముఖ్యమంత్రి మైండ్ సెట్ కు అనుగుణంగా సాగిపోతున్నాయి.

కేసీఆర్ ఆలోచన ప్రకారం తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల సచివాలయం ఎంత నిర్మాణ విస్తీర్ణంలో ఉంటుందో అంతే విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయం మొత్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు హెలికాఫ్టర్లు దిగేలా హెలిప్యాడ్స్ ను సిద్ధం చేయటంతో పాటు.. పక్కా వాస్తుకు అనుగుణంగా నిర్మాణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఢిల్లీలి నార్త్ బ్లాక్.. సౌత్ బ్లాక్ తరహాలోనే కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. నార్త్.. సౌత్ బ్లాక్ లలో వివిధ మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేసి.. మధ్యలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక.. ప్రతి బ్లాక్ కు గరిష్ఠంగా ఆరేడు అంతస్తులకు మించి నిర్మించకూడదని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీ సచివాలయం ఈ నెలాఖరు నాటికి వెళ్లిపోనున్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ మొత్తంగా పూర్తి అయిన తర్వాత నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

తెలంగాణ సరికొత్త సచివాలయాన్ని నిర్మించటానికి రూ.వంద కోట్లు అవుతుందని అంచనా వేసినా.. అత్యాధునికంగా నిర్మించాలని.. సమస్త ఏర్పాట్లు ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఖర్చు రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంచనాల్లోనే ఇంత భారీ మొత్తమైతే.. ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి మరో రూ.50 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసుకు నచ్చినట్లుగా తెలంగాణ సచివాలయం ఉండటం కోసం ప్రాధమికంగా రూ.200 కోట్లు ఖర్చు కావటం ఏమిటో..?  ఈ రోజు కేసీఆర్ చూపించినట్లే.. రేపొద్దున మరో బలమైన నేత అధికారంలోకి వచ్చి తన మనసుకు నచ్చినట్లుగా నిర్మాణం చేయాలంటే..?

KCR Telangana CM 1st Interview with Eenadu



తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఈనాడు’ దినపత్రిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి భారీ ఇంటర్వ్యూ పబ్లిష్ కావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రమాణాల హద్దుల్ని దాటకుండా.. తనకు తానే లక్షణ గీతలు గీసుకున్నట్లుగా చెప్పే ఈనాడులో కేసీఆర్ ఇంటర్వ్యూకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పేజీలకు పేజీల చొప్పున ఇంటర్వ్యూను ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. మొదటి పేజీలో ‘‘ఈనాడు’’ మాస్టర్ హెడ్ కు పక్కన కేసీఆర్ ఫోటోను అచ్చేయటం చాలా అరుదైన అంశంగా చెబుతున్నారు.

చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఈనాడు మాస్టర్ హెడ్ పక్కకు వార్తాంశాన్ని తీసుకొస్తారే తప్పించి విడిగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించరు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన రాజకీయ ఇంటర్వ్యూ కోసం అంత భారీ ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక.. ఇంటర్వ్యూ పాఠాన్ని అచ్చేసిన విధానం కూడా రాజకీయ వర్గాల్లోనే కాదు.. మీడియా సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇంత భారీ ఇంటర్వ్యూను ఈనాడు చరిత్రలో ఇంత వరకూ ఇవ్వలేదన్నది కొద్దిమంది చెబుతున్న మాట.

ఇదిలా ఉంటే.. ఈ ఇంటర్వ్యూను ఇంత భారీగా ఎందుకు ఇచ్చారు? ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న ఆసక్తి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని.. తొలి ఇంటర్వ్యూను తన సొంత మీడియా సంస్థకు ఇవ్వకుండా ఈనాడుకు ఇవ్వటం.. రెండేళ్ల ప్రభుత్వాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్న భావన తెలంగాణ ప్రజల్లో భారీగా ఉన్న నేపథ్యంలో.. తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన కేసీఆర్ కు ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం తప్పు లేదన్న అంచనాతో ఇంత భారీగా ఇంటర్వ్యూను పేజీలకు తరబడి అచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈనాడు కాంపౌండ్ లోనే మరో వాదన కూడా వినిపిస్తోందని చెబుతున్నారు. అరుదైన ఇంటర్వ్యూ అని చెబుతున్నప్పటికీ.. మరేమీ వార్తలు లేనట్లు అన్నేసి పేజీల్లో అచ్చేయటం ఏమిటి? మరీ సిత్రం కాకపోతే అంటూ వాపోతున్నోళ్లు కూడా ఉన్నారట.

KCR Starts English Daily News Paper "Telangana Today "





రాజకీయ నేతలు దూరదృష్టితో వ్యవహరిస్తుంటారు. ఇది వారికి చాలా అవసరం. అయితే.. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన వారి కంటే వంద రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు. కాలం కలిసి రాని సమయంలో కామ్ గా ఉంటూ.. తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశంపై కసరత్తు చేసే ఆయన.. ఒక్కసారి పట్టు చిక్కితే ఎంతలా చెలరేగిపోతారన్నది గత రెండేళ్లుగా చూస్తున్నదే.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన.. రాజకీయం అంటే పార్టీ నడపటం.. మరింత బలోపేతం చేయటం లాంటి అంశాల మీదనే కాక.. తన బలాన్ని మిగిలిన రంగాల్లోకి విస్తరించే విషయం మీద ఆయన ప్రత్యేక ఫోకస్ చేస్తుంటారు. ఉద్యమ సమయంలో తన వాణిని వినిపించేందుకు సొంతంగా మీడియా సంస్థను షురూ చేసిన ఆయన..అనుకున్నట్లే తన వాదనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. మొదట టీవీ ఛానల్ తో షురూ అయిన ఆయనకు చెందిన మీడియా సంస్థ తర్వాతి కాలంలో దినపత్రికను స్టార్ట్ చేయటం తెలిసిందే.

తన టీవీ ఛానల్ ను ప్రమోట్ చేసే విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెబుతారు. తన టీవీ ఛానల్ ను ప్రారంభించిన తర్వాత.. మీడియా సంస్థలకు ప్రాణాధారమైన యాడ్ రెవెన్యూ కోసం వారు లేవనెత్తిన వాదన మిగిలిన వారి నోరు తెరవకుండా చేసిందని వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. తన ఛానల్ షురూ చేసిన వెంటనే.. సీమాంధ్ర మీడియా సంస్థలకు ఇచ్చే ప్రకటనల వాటా ఎంత? తెలంగాణ మీడియా సంస్థలకు ఇస్తున్న ప్రకటనల వాటా ఎంత? అంటూ సంబంధం లేని అంశాల్ని లింకు పెడుతూ తెర మీదకు తీసుకొచ్చిన వాదన పుణ్యమా అని.. ఆర్థికంగా చాలా త్వరగా కుదురుకుందని చెబుతుంటారు.

ఈ కారణంతోనే.. ఇప్పటి రోజుల్లో చాలా కష్టమని చెప్పే దినపత్రికను స్టార్ట్ చేయటమే కాదు.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ.. సంస్థ ఆర్థికంగా నిలదొక్కునేలా చేయగలిగినట్లుగా చెబుతున్నారు. తమకు సంబంధించిన అంశాల్ని.. తమ వాదనను మిగిలిన మీడియా సంస్థలు చెప్పినా.. చెప్పకున్నా తమ గొంతు బలంగా వినిపించేందుకు వీలుగా టీవీ ఛానల్.. తెలుగు న్యూస్ పేపర్ పెట్టిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఇప్పుడు ఇంగ్లిషు దినపత్రికను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణను అభివృద్ధి చేస్తున్న తీరు.. కేసీఆర్ కమిట్ మెంట్ ను జాతీయ స్థాయిలో అందరి నోట నానేలా చేయటంతో పాటు.. తమకు చెందిన మీడియా సంస్థల్ని మరింత బలోపేతం చేయటంలో భాగంగా ఇంగ్లిషులో దినపత్రికను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి అయ్యిందని.. అధికారికంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఇంగ్లిషు దినపత్రికను.. ‘‘తెలంగాణ టుడే’’ అన్న పేరుతో వస్తుందన్న మాట చెబుతున్నారు. ఈ పేరును ఇప్పటికే రిజిష్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ పేరుతో రిజిష్టర్ అయిన దినపత్రిక కేసీఆర్ ఫ్యామిలీదా? కాదా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కేసీఆర్ ఫ్యామిలీదేనని చెబుతున్నారు. తమకు చెందిన మీడియా సంస్థల్లో ఇంగ్లిషులో లేదన్న కొరత కేసీఆర్ త్వరలో తీర్చుకోనున్నట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది.


మోడీ కన్నా సోనియా బెస్టా ?





కత్తితో ఒక పోటు పొడిచినోడు మంచోడా? నమ్మకంతో భుజం మీద చేతులు వేసి.. రక్షకుడిగా ఉంటానని నమ్మబలికి.. తియ్యటి మాటలు చెబుతూ.. ఆ పరవశంతో ఉన్న వేళ వెనుక నుంచి పోటు పొడిచినోడు మంచోడా? ఇద్దరిలో ఎవరు బెటర్ అని అనుకోవాలి..? ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే చాలామంది ఆంధ్రోళ్ల మనసుల్లోకి వస్తున్నాయి.

ఏపీ రాష్ట్ర విభజన మీద 2004లో తమ ఎన్నిక హామీ పత్రం మీద హామీ ఇవ్వటమే కాదు.. ఆ మాటకు కట్టుబడి ఉండే ప్రయత్నంలో భాగంగా ఏపీని దారుణంగా దెబ్బ తీసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దుర్మార్గురాలా? లేక.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టం మీద మొసలి కన్నీరు కారుస్తూ.. తాను సాయం చేస్తానని మాటలు చెప్పి తీరా ఇప్పుడు తూచ్ అనేయటం తెలిసిందే.

నమ్మినోడిని నట్టేట ముంచేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. ఎలాంటి ప్రత్యేక సాయం లేదని తేల్చేయటం చూసినప్పుడు ఒక్క మాట అనిపించక మానదు. ఆంధ్రోళ్లు సోనియమ్మను తిట్టుకున్నారే కానీ.. ఇచ్చిన మాట కోసం సోనియమ్మ నిలబడితే.. కేవలం తన అవసరం తీర్చటం కోసమే మోడీ మాటలు చెప్పినట్లుగా కనిపించక మానదు.
  
2004లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటానికి వీలుగా.. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. తెలంగాణ ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోని హామీని నెరవేరుస్తానని చెప్పి.. వారి చేత ఓట్లు వేయించుకున్న సోనియమ్మ.. తానిచ్చిన మాటను నెరవేర్చుకోవటం కోసం ఏపీలో తమ పార్టీని పణంగా పెట్టేందుకు కూడా సిద్ధం కావటం గమనార్హం. కేవలం ఇచ్చిన మాట మీద నిలబడాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆంధ్రోళ్లు వ్యతిరేకిస్తున్నా.. తెలంగాణ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చిన సోనియా గాంధీనే సో బెటర్ అని ఆంధ్రోళ్లు అనుకునే పరిస్థితి. తప్పుకావొచ్చు.. ఒప్పు కావొచ్చు.. ఇచ్చిన మాట మీద నిలబడటానికి మించింది మరింకేమీ ఉంటుంది..?

ఈ సంవత్సరం ఎండలు , వానలు అధికమే



ఈ యేడాది కుంభవృష్టే... జూన్ నెల నుంచే ఆరంభం.. వేసవి ఎండలూ అంతే స్థాయి
దేశ ప్రజలకు ప్రత్యేకించి రైతులకు ఓ శుభవార్త. ఈ యేడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖతో పాటు.. అనేక వాతావరణ కేంద్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గత యేడాది కంటే ఈ యేడాది మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణ ఎల్‌నినో ప్రభావం తొలిగిపోనుండటమేనట.
అదేసమయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ యేడాది ఈ వేసవి మంటలు పుట్టించనుంది. ఎల్‌నినో ప్రభావం బలహీనపడినట్టేనని భారత వాతావరణ విభాగం సహా పలు వాతావరణ సంస్థలు స్పష్టంచేస్తున్నాయి. దాని ఫలితంగా ఈ వర్షాకాలం పుష్కలంగా వానలు పడతాయని వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది 1.2 శాతంగా ఉన్న వ్యవసాయరంగ వృద్ధి ఏకంగా ఆరు శాతానికి పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా వచ్చే జూన్ నెలలోనే మంచి వర్షపాతం నమోదవుతుందని తెలిపాయి. ఇది సాధారణ స్థాయికంటే సుమారు 25 శాతం అధికంగా ఉంటుందని వెదర్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ (క్లైమేట్ సైన్సెస్) క్రాంతిప్రసాద్ వెల్లడించారు. జూన్‌ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ సాధారణస్థాయి కొనసాగుతుందని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే గరిష్టస్థాయికి చేరుకుందని, బలహీనపడటం మొదలవుతుందని అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావం పూర్తిగా అంతరించిపోతుందని స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ జీపీ శర్మ చెప్పారు. వర్షాలు సాధారణంకంటే ఎక్కువున్నా, తక్కువున్నా, సెప్టెంబర్ తర్వాత లా నినా ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. లా నినా అనేది ఎల్ నినో పరిస్థితికి భిన్నమైనది. ఈ పరిస్థితి భారత్‌ సహా ఆసియా దేశాల్లో చక్కటి వర్షాలకు కారణమవుతుందని తెలిపారు.
రాబోయే వర్షాకాలం ఆశాజనకంగా ఉండనున్నప్పటికీ.. ఇప్పటికే ప్రవేశించిన వేసవి.. రానున్న రోజుల్లో చండ్రనిప్పులు కురిపించే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్-జూన్ నెలల మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. వాయవ్య, మధ్యభారత రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

Telangana Budge 2016 తెలంగాణ బడ్జెట్



తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్. తాజాగా ఆయన 2016-17 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. ముందుగా ప్రకటించిన దానికంటే నిమిషాల వ్యత్యాసంతో తన బడ్జెట్ ప్రసంగాన్ని షురూ చేశారు. గత వారంలో ఏపీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సందర్భంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల తన బడ్జెట్ప్రసంగాన్ని సుదీర్ఘంగా వినిపిస్తే.. ఈటెల మాత్రం సూటిగా విషయాన్ని సింఫుల్ గా చెప్పేశారు.

తమ ప్రాధాన్యతలు ఏమిటి? ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? అన్న విషయాలతో పాటు.. లెక్కల్లో తలెత్తే చిక్కుల గురించి వివరంగా బడ్జెట్ లోనే చెప్పేయటం గమనార్హం. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరధకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈటల తన బడ్జెట్ కేటాయింపులో రూ.25వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత భారీ మొత్తం గ్రామీణాభివృద్ధికే దక్కింది.

ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం తక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. ఎప్పటిమాదిరే రెవెన్యూ మిగులు ఈ ఏడాది రూ.3718కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ద్రవ్యలోటును రూ.23467 కోట్లుగా చెప్పిన ఈటల.. తెలంగాణరాష్ట్ర వృద్ధి రేటు పెరిగిందని.. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే అధికంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది 11.67శాతం వృద్ధి రేటు ఉందని పేర్కొన్నారు. తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి రాష్ట్రంపై విమర్శలుచేసిన ఆయన.. గతంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపుల కోసం ప్రతి రూపాయికి బిచ్చం ఎత్తాల్సి వచ్చేదన్న ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు చూస్తే..

=  మొత్తం బడ్జెట్ వ్యయం రూ.130415 కోట్లు
=  ప్రణాళికా వ్యయం రూ. 67630 కోట్లు
=   ప్రణాళికేతర వ్యయం రూ.62785 కోట్లు
=   రెవిన్యూ మిగులు రూ. 3718 కోట్లు
=   ద్రవ్యలోటు రూ. 23467 కోట్లు
=   ఈ ఏడాది ఆదాయం రూ.72412 కోట్లు (అంచనా)

మిషన్ భగీరథకు రూ.36976 కోట్లు
సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు

ప్రాజెక్టుల వారీగా..
=  పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.7861 కోట్లు
=  కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6286 కోట్లు
=   సీతారామ ఎత్తిపోతలకు రూ.1152 కోట్లు

విధానాలు

=  గోదావరి - కృష్ణానదుల్లో రాష్ట్ర వాటా 1250 టీఎంసీలు
=  మేడిగడ్డ ప్రాణహిత - పెన్ పహాడ్ - తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల నిర్మాణం
=  ప్రాణహిత -  ఇంద్రావతి నీళ్లు ఒడిసిపట్టి పంట పొలాలకు నీళ్లు
=  గోదావరి - ప్రాణహిత - పెన్ గంగాపై నిర్మించే బ్యారేజీలకు మహారాష్ట్ర సహకారం
=  నదీజలాల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి అంతర్ రాష్ట్ర బోర్డు

విద్యకు.

=  విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ.1694 కోట్లు
=  విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9044 కోట్లు
గ్రామీణ పట్టణాభివృద్ధికి..
= పంచాయితీ రాజ్ - గ్రామీణాభివృద్ధికి రూ.10731 కోట్లు
= పట్టణాభివృద్ధికి రూ. 4815 కోట్లు
రంగాల వారీగా..
=  వ్యవసాయ - సహకార - మార్కెటింగ్ శాఖకు రూ.6759 కోట్లు
=   ఆరోగ్య రంగానికి రూ.5967 కోట్లు
=   రోడ్లు - భవనాల రంగానికి రూ.3333 కోట్లు
=   పారిశ్రామిక రంగానికి రూ. 967 కోట్లు
=   ఐటీ - కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు
=   సంస్కృతి - పర్యాటక రంగానికి రూ. 50 కోట్లు

సంక్షేమానికి రూ.13412 కోట్లు

=  ఎస్సీ సంక్షేమానికి రూ.7122 కోట్లు
=  ఎస్టీ సంక్షేమానికి రూ.3552 కోట్లు
=   బీసీ సంక్షేమానికి రూ. 2538 కోట్లు
=   మైనార్టీ రూ.1204కోట్లు
=  బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100కోట్లు
=   మహిళ - శిశు సంక్షేమానికి రూ. 1553 కోట్లు

వివిధ పథకాలకు

=   రుణమాఫీకి రూ.3718 కోట్లు
=   ఆసరా పెన్షన్లకు రూ. 4693 కోట్లు
=   కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు

వివిధ శాఖలకు..

=  అగ్నిమాపక శాఖకు 223 కోట్లు
=   సీసీ టీవీల మానిటరింగ్ కు రూ. 225 కోట్లు

ఈ ఏడాది ప్రత్యేకం

ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4675 కోట్లు
(ఏదైనా అత్యవసరమైన ఖర్చు వచ్చి పడితే ఖర్చు చేసేందుకు)

బడ్జెట్ లక్ష్యాలు

=   వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్
=   డిసెంబర్ నాటికి 6 వేల గ్రామాలు 12 మున్సిపాలిటీలకు తాగునీరు
=   హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
=   రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ - డయాగ్నొస్టిక్ సెంటర్లు
=   4 వేల కిలోమీటర్ల కొత్త రహదారులు
=   మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు
=   పండ్లు - కూరగాయల సాగుకు హార్టికల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
=   మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం
=   రాబోయే మూడేళ్లలో 23912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
=   రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా ఏర్పాటుకు శ్రీకారం

KCR 8000 Crores For Hyderabad Projects

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాజకీయాల్లో అసలు మజాను రుచి చూపిస్తున్నాయి. బల్దియా పోరులో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ ఎస్ పార్టీ రెండు రకాల వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఒకవైపు పార్టీపరంగా నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే మరోవైపు ప్రభుత్వ పరంగా వరాలు కురిపిస్తున్నారు. హామీల అమలుకు అవసరం అయిన జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వపరంగా ప్రజలను ఆకట్టుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీ ఒకేరోజు వేలకోట్ల రూపాయలను కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల చేయడం గమనార్హం.

ఒకటి రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉండే రాజ్యాంగపరమైన చిక్కులను ఎదుర్కునేందుకు గాను...వరాల అమలుకు జీవోలు విడుదల చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్తర్వులు ఒకే రోజు జారీ అయ్యాయి. ఇంటి పన్ను మాఫీ - నగరంలో రియల్ ఎస్టేట్ కు అభివృద్ధి - భవనాల నిర్మాణానికి అనుమతుల్లో రాయితీల వంటి పలు అంశాలపై జీవోలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ దాహాన్ని తీర్చే కీలక ప్రాజెక్టుల కోసం 7600 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రధానంగా నీటి సమస్యను తీర్చే ఉస్మాన్ సాగర్ - హిమాయత్ సాగర్ - మంజీరాలపై ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి ఏర్పడడంతో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. శామీర్ పేట మండలంలో 20 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద మరో రిజర్వాయర్ నిర్మిస్తారు.



మరోవైపు 1200 రూపాయల వరకు ఉన్న ఇంటి పన్నును 101 రూపాయలకు పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఉత్తర్వులు జారీ చేశారు. అపార్ట్ మెంట్స్ - ఇళ్లకు పన్నెండు వందల రూపాయల వరకు పన్ను చెల్లిస్తున్న వారు ఇకపై 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆదేశాల వల్ల రూ.70 కోట్ల వరకు భారం పడుతుందని సమాచారం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 151 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ కు ఊతం ఇచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు కమిటీ వేశారు. ఇందులో పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా ఎన్నికల పుణ్యామా అని  గ్రేటర్ ఒకేరోజు వేల కోట్లు కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల అవుతూ వరాల జల్లు కురుస్తోందని గ్రేటర్ ప్రజలు ఖుషీ అవుతున్నారు.