Showing posts with label KCR. Show all posts
Showing posts with label KCR. Show all posts

సినిమాగా కెసిఆర్ జీవిత చరిత్ర



తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాలా కాలంగా ఈ సినిమా చర్చల దశల్లోనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

కేసీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు, తెలంగాణ ఉద్యమ పోరు వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వాటిని తెరపై ఆసక్తికర కథనంతో తెర్కకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ పేరు వినిపించింది. అయితే తాజాగా నవజూద్ధీన్ సిద్ధిఖీను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవజూద్ధీన్ కేసీఆర్ పాత్రలో బాగా సెట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పాత్ర అవసరాన్ని బట్టి ఎలాంటి రూపం కావాలన్నా ఆ విధంగా రెడీ అవ్వడం నవజూద్ధీన్ స్టయిల్. సో.. కేసీఆర్ పాత్రలో సులభంగా ఇమిడిపోతాడని అంటున్నారు. ఇప్పటికే నవాజుద్దీన్ కేసీఆర్‌కు సంబంధించిన కొన్ని స్పీచ్‌లు చూస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.




సింధుకు కేసీఆర్ నజరానా 5కోట్లు



అనుకున్నదే జరిగింది. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ‘సిల్వర్’ స్టార్ సింధుకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమెకిచ్చేనజరానా గురించి ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనకు కొద్ది గంటల ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింధుకు రూ.3కోట్ల నగదు.. అమరావతిలో 1000 గజాల స్థలంతో పాటు.. గ్రూపు 1 ఉద్యోగాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ప్రతి విషయంలోనూ  ఏపీతో పోటీ పడే తీరుకు తగ్గట్లే.. సింధు విషయంలోనూ కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆమెకు భారీ నజరానా ప్రకటించారు.

గతంలోనూ సింధుకు సాయం అందిస్తామని.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోటి రూపాయిలు నజరానా ప్రకటించటంతో పాటు.. ఆమెకు మెరుగైన శిక్షణకు అవసరమైన నిధులు ఇవ్వటం ద్వారా ఆమె మరిన్ని టైటిళ్లు సొంతం చేసుకోవటానికి అవకాశం కలిగించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. బాబు కంటే భారీగా కేసీఆర్ నజరానా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలకు తగ్గట్లే కేసీఆర్ ప్యాకేజీ ఉండటం గమనార్హం. రూ.5కోట్ల నగదు పురస్కారం.. భూమితో పాటు.. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. చంద్రబాబు మాదిరే ఆమెతో పాటు ఆమె గురువు గోపీకి నజరానా ప్రకటించారు.

సింధుకు రూ.5కోట్లు నజరానా ప్రకటిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం వెనుక మంత్రి కేటీఆర్ ప్రముఖ భూమిక పోషించారని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.కోటి మాత్రమే ప్రకటించే వీలుంది. అయితే.. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నజరానా భారీగా ఉండాలని.. పక్కనున్న ఏపీకంటే ఎక్కువ ఉండాలన్న తపన సింధుకు మెరుగైన కానుకల్ని కేసీఆర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రీడల అభివృద్ధికి ఈ మాత్రం మొత్తం ఇవ్వాలని.. సంబంధం లేని రాష్ట్రాలు సైతం సింధుకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ అందుకు తగ్గట్లుగా నజరానా ప్రకటించకపోతే బాగోదన్న వాదనకు కేసీఆర్ కన్విన్స్ అయ్యారని చెబుతున్నారు. అందుకే భారీ ప్యాకేజీకి ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. తెర వెనుక ఏం జరిగినా.. సింధుకు ప్రకటించిన నజరానాలలో తెలంగాణ ప్రభుత్వం తిరుగులేనిదిగా నిలిచిందనటంలో సందేహం లేదు.

పోలీస్ ఎన్ కౌంటర్ లో నయీం హతం - ఆపరేషన్ కెసిఆర్




తెలంగాణ సిఎం కేసీఆర్ తాను నమ్మిన సిద్దాంతం కోసం ఎంతకైనా తెగించే రకం. ఆయన ఎంతటి మొండి మనిషే అందరికి తెలుసు. ఆయన తనను నమ్ముకున్న వాళ్లను కూడా ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి. తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కూడా తన వాళ్లను రక్షించుకునేందుకే చేయించారు అనే ఓ వాదన బలంగా వినిపిస్తోంది. నయీం ఏకంగా కేసీఆర్ తో ఎంతో సఖ్యతతో మెలిగే ఓ వ్యాపార వేత్తను బెదిరించారని.. ఆయన నేరుగా వచ్చి కేసీఆర్ తో చెప్పుకున్నారని.. దాంతో కేసీఆర్ వెంటనే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
తన టీంలో మెంబర్ అయిన భువనగిరి ఎమ్మెల్యేను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా నయీంను బెదిరించారని.. ఏకంగా తన అనుమతి లేకుండా నియోజక వర్గంలోకి అడుగుపెట్టవదు అని వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. దీంతో తమ రాజీనామా పత్రాలతో కేసీఆర్ ను కలిశారని.. అందుకు కేసీఆర్ వారికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఇచ్చారని తెలిసింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లతో ఎన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తామని కేసీఆర్ తో అన్నారట. దాంతో పోలీసులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ టాప్



కొత్తగా ఏర్పడిన రాష్ట్రo అయినా వృద్ధిలోనూ.. ఇతర అoశాల విషయoలోనూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ దూసుకెళుతున్న తెలoగాణ రాష్ట్రం మరో ఘనతను సాధిoచిoది. సరళతర వ్యాపార నిర్వహణ అదేనoడి.. ‘‘ఈజ్ ఆఫ్ డూయిoగ్ బిజినెస్’’  (ఈ అంశం విషయoలో తమ అంశాల్ని ఏపీ సర్కారు కాపీ కొట్టిoదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపిoచటమే కాదు.. ఈ ఉదంతంపై కేoద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతo ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉoడటo గమనార్హం) ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రo ఫస్ట్ ప్లేస్ లో నిలిచిoది.

తాజాగా కేoద్ర పారిశ్రామిక విధానo.. ప్రోత్సాహక శాఖ వెబ్ సైట్ దేశoలోని రాష్ట్రాలకు ర్యా0కుల్ని కట్టబెట్టిoది. ఈ ర్యాoకుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లోనిలవగా.. ఉత్తరాఖండ్ రెoడో స్థానంలో నిలిచిoది. ఇక.. ఏపీ మూడో స్థానoలో నిలవటం గమనార్హo. అయితే.. ఈ ర్యాoక్ ఫైనల్ అని చెప్పలేని పరిస్థితి. ఎoదుకoటే.. రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు.. సoస్కరణలు.. ఇతర అoశాలకు సంబంధించి రాష్ట్రాలను 340 ప్రశ్నలకు సమాధానాల్ని కోరిoది. ఇoదులో ప్రస్తుతానికి 190 ప్రశ్నల్ని పరిశీలిoచి ర్యాంకుల్ని ఖరారు చేశారు. మిగిలిన ర్యాoకుల్ని పరిశీలిస్తూ.. ఆయా ప్రశ్నలకు వారిచ్చే సమాధానాల ఆధారoగా ర్యాoకుల్ని సర్దుతుంటారు.

ఇప్పటికైతే మొదటిస్థానoలో తెలంగాణ రాష్ట్రo నిలిచింది. మిగిలిన ప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు ర్యాoకుల్ని సరి చేస్తూ ఉoటారు. మిగిలిన అన్నిప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిoచిన తర్వాత సెప్టెంబరులో తుది ర్యాoకును ప్రకటిస్తారు. కొత్త రాష్ట్రo.. పాలనకు కొత్త అయినా తెలoగాణ రాష్ట్రం.. తెలoగాణ సర్కారు.. దేశoలోని మిగిలిన రాష్ట్రాలన్ని తలదన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలవటo చూసినప్పుడు ఈ క్రెడిట్ అoతా ముఖ్యమoత్రి కేసీఆర్ ఖాతాలో వేయాల్సిoదే.

తెలంగాణ కొత్త జిల్లాలు మండలాలు జనాభా వివరాలు




సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మొత్తం 23 జిల్లాలు ఉండేవి. అవి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత 10 జిల్లాలు తెలంగాణలో 13 జిల్లాలు ఏపీలోకి వచ్చాయి. అయితే.. తెలంగాణలో కొత్తగా మరికొన్ని జిల్లాలు ఏర్పాటు చేయడానికి దాదాపుగా కసరత్తు పూర్తయింది. తెలంగాణలో సమైక్య రాష్ర్టంలో ఉన్నట్లుగానే మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. 30 జిల్లాలతో మరో ప్రతిపాదన తయారవుతోందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ 23 జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. దాని ప్రకారం  ప్రస్తుతం ఉన్న 459తో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 

23 జిల్లాల జనాభా - వైశాల్యం - మండలాల వివరాలిలా ఉన్నాయి.

ఆచార్య జయశంకర్ జిల్లా – 856453 మంది జనాభా ఉండగా - వైశాల్యం 6760 చ.కి.మీటర్లు - 21 మండలాలు - 3 రెవెన్యూ డివిజన్లు.

ఆదిలాబాద్ – 1422034 మంది జనాభా ఉండగా - 7673 చ.కిమీ  వైశాల్యం  27 మండలాలు - 4 రెవెన్యూ డివిజన్లు.

భద్రాద్రి -1193807 మంది జనాభా - 8297 చ.కి.మీ వైశాల్యం - 23 మండలాలు.

యాదాద్రి – 719131 మంది జనాభా - 2956 చ.కి.మీ వైశాల్యం - 17 మండలాలు.

హైదరాబాద్ -3901928 మంది జనాభా - 1914 చ.కి.మీ వైశాల్యం - 20 మండలాలు.

జగిత్యాల – 1043000 మంది జనాభా - 3087 చ.కి.మీ వైశాల్యం - 18 మండలాలు.

కామారెడ్డి – 1068773 మంది జనాభా - 4025 చ.కి.మీ వైశాల్యం - 21 మండలాలు.

కరీంనగర్ – 1802038 మంది జనాభా - 4308 చ.కి.మీ వైశాల్యం - 26 మండలాలు.

ఖమ్మం – 1880137 జనాభా - 4360 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

కొమరంభీమ్ -1319205 మంది జనాభా - 8442 చ .కి.మీ వైశాల్యం - 27 మండలాలు.

మహబూబాబాద్- 804136 మంది జనాభా - 3633 చ.కి.మీ వైశాల్యం - 15 మండలాలు.

మహబూబ్నగర్ – 1867620 మంది జనాభా - 6518 చ.కి.మీ వైశాల్యం - 31 మండలాలు.

మెదక్ – 1444955 మంది జనాభా - 4215 చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

నాగర్ కర్నూలు – 1048425 మంది జనాభా - 7447 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

నల్గొండ – 1555992 మంది జనాభా - 7475 చ.కి.మీ వైశాల్యం - 32 మండలాలు.

నిజామాబాద్ – 1447961 మంది జనాభా - 3772 చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

రంగారెడ్డి – 1086522 మంది జనాభా - 4157 చ.కి.మీ వైశాల్యం - 20 మండలాలు.

సంగారెడ్డి – 1186280 మంది జనాభా - 3116 చ.కి.మీ వైశాల్యం - 18 మండలాలు.

సికింద్రాబాద్ – 4251614 మంది జనాభా - 1608 చ.కి.మీ వైశాల్యం - 23 మండలాలు.

సిద్ధిపేట – 1190209 మంది జనాభా - 4398 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

సూర్యాపేట – 1386883 మంది జనాభా - 4348చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

వనపర్తి – 1136983 మంది జనాభా - 4426 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

వరంగల్ – 2236051 మంది జనాభా - 4883 చ.కి.మీ వైశాల్యం - 31 మండలాలు.

తెలంగాణ సచివాలయాన్ని నిర్మించటానికి అయ్యే ఖర్చు రూ.200 కోట్లు




కడుపు నిండిన మారాజు తనకు నచ్చింది తినాలనుకోవటంలో తప్పు లేదు. సరిగ్గా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని చోట్ల నమ్మకాల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టటం ఆసక్తికరమైన అంశమే. నిజానికి ఇది సాహసంతో కూడుకున్న వ్యవహారం కూడా. ఓపక్క ప్రజాసంక్షేమ కార్యక్రమాలు మరోవైపు ఇలాంటి ఖర్చులన్నీ కలిసి చివరకు భారం పడేది సగటు జీవి మీదనే. ఓపక్క ఆర్టీసీ.. విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోవైపు.. తాను అనుకున్నట్లుగా సరికొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రూ.200 కోట్ల ఖర్చుకు సిద్ధంగా కావటం గమనార్హం.

ఇప్పుడున్న సచివాలయం సౌకర్యవంతంగా లేదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే పైమాట. అయితే.. ఆయన నమ్మే వాస్తుకు తగ్గట్లుగా లేదన్నది లోగుట్టు మాట. మాటల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్ అనుకున్నట్లు కొత్త సచివాలయాన్ని నిర్మించటానికి అయ్యే ఖర్చు రూ.200 కోట్లు అంటే అదంతా ప్రజాధనమన్న సంగతి మర్చిపోకూడదు.

తన భారీ స్వప్నాన్ని ఊహాచిత్రాలుగా మార్చి ఇప్పటికే విడుదల చేసిన ఆయన అందరి నోటా వావ్ అనిపించేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఎవరు ఎలా అనుకున్నా.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేసే పట్టుదల ఉన్న కేసీఆర్.. కొత్త సచివాలయ నిర్మాణాన్ని చకచకా చేపడతారనే చెప్పాలి. ఇక.. కొత్తగా కట్టే సచివాలయానికి సంబంధించిన పనులు ముఖ్యమంత్రి మైండ్ సెట్ కు అనుగుణంగా సాగిపోతున్నాయి.

కేసీఆర్ ఆలోచన ప్రకారం తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల సచివాలయం ఎంత నిర్మాణ విస్తీర్ణంలో ఉంటుందో అంతే విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయం మొత్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు హెలికాఫ్టర్లు దిగేలా హెలిప్యాడ్స్ ను సిద్ధం చేయటంతో పాటు.. పక్కా వాస్తుకు అనుగుణంగా నిర్మాణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఢిల్లీలి నార్త్ బ్లాక్.. సౌత్ బ్లాక్ తరహాలోనే కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. నార్త్.. సౌత్ బ్లాక్ లలో వివిధ మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేసి.. మధ్యలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక.. ప్రతి బ్లాక్ కు గరిష్ఠంగా ఆరేడు అంతస్తులకు మించి నిర్మించకూడదని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీ సచివాలయం ఈ నెలాఖరు నాటికి వెళ్లిపోనున్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ మొత్తంగా పూర్తి అయిన తర్వాత నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

తెలంగాణ సరికొత్త సచివాలయాన్ని నిర్మించటానికి రూ.వంద కోట్లు అవుతుందని అంచనా వేసినా.. అత్యాధునికంగా నిర్మించాలని.. సమస్త ఏర్పాట్లు ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఖర్చు రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంచనాల్లోనే ఇంత భారీ మొత్తమైతే.. ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి మరో రూ.50 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసుకు నచ్చినట్లుగా తెలంగాణ సచివాలయం ఉండటం కోసం ప్రాధమికంగా రూ.200 కోట్లు ఖర్చు కావటం ఏమిటో..?  ఈ రోజు కేసీఆర్ చూపించినట్లే.. రేపొద్దున మరో బలమైన నేత అధికారంలోకి వచ్చి తన మనసుకు నచ్చినట్లుగా నిర్మాణం చేయాలంటే..?

KCR Telangana CM 1st Interview with Eenadu



తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఈనాడు’ దినపత్రిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి భారీ ఇంటర్వ్యూ పబ్లిష్ కావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రమాణాల హద్దుల్ని దాటకుండా.. తనకు తానే లక్షణ గీతలు గీసుకున్నట్లుగా చెప్పే ఈనాడులో కేసీఆర్ ఇంటర్వ్యూకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పేజీలకు పేజీల చొప్పున ఇంటర్వ్యూను ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. మొదటి పేజీలో ‘‘ఈనాడు’’ మాస్టర్ హెడ్ కు పక్కన కేసీఆర్ ఫోటోను అచ్చేయటం చాలా అరుదైన అంశంగా చెబుతున్నారు.

చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఈనాడు మాస్టర్ హెడ్ పక్కకు వార్తాంశాన్ని తీసుకొస్తారే తప్పించి విడిగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించరు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన రాజకీయ ఇంటర్వ్యూ కోసం అంత భారీ ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక.. ఇంటర్వ్యూ పాఠాన్ని అచ్చేసిన విధానం కూడా రాజకీయ వర్గాల్లోనే కాదు.. మీడియా సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇంత భారీ ఇంటర్వ్యూను ఈనాడు చరిత్రలో ఇంత వరకూ ఇవ్వలేదన్నది కొద్దిమంది చెబుతున్న మాట.

ఇదిలా ఉంటే.. ఈ ఇంటర్వ్యూను ఇంత భారీగా ఎందుకు ఇచ్చారు? ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న ఆసక్తి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని.. తొలి ఇంటర్వ్యూను తన సొంత మీడియా సంస్థకు ఇవ్వకుండా ఈనాడుకు ఇవ్వటం.. రెండేళ్ల ప్రభుత్వాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్న భావన తెలంగాణ ప్రజల్లో భారీగా ఉన్న నేపథ్యంలో.. తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన కేసీఆర్ కు ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం తప్పు లేదన్న అంచనాతో ఇంత భారీగా ఇంటర్వ్యూను పేజీలకు తరబడి అచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈనాడు కాంపౌండ్ లోనే మరో వాదన కూడా వినిపిస్తోందని చెబుతున్నారు. అరుదైన ఇంటర్వ్యూ అని చెబుతున్నప్పటికీ.. మరేమీ వార్తలు లేనట్లు అన్నేసి పేజీల్లో అచ్చేయటం ఏమిటి? మరీ సిత్రం కాకపోతే అంటూ వాపోతున్నోళ్లు కూడా ఉన్నారట.

KCR Starts English Daily News Paper "Telangana Today "





రాజకీయ నేతలు దూరదృష్టితో వ్యవహరిస్తుంటారు. ఇది వారికి చాలా అవసరం. అయితే.. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన వారి కంటే వంద రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు. కాలం కలిసి రాని సమయంలో కామ్ గా ఉంటూ.. తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశంపై కసరత్తు చేసే ఆయన.. ఒక్కసారి పట్టు చిక్కితే ఎంతలా చెలరేగిపోతారన్నది గత రెండేళ్లుగా చూస్తున్నదే.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన.. రాజకీయం అంటే పార్టీ నడపటం.. మరింత బలోపేతం చేయటం లాంటి అంశాల మీదనే కాక.. తన బలాన్ని మిగిలిన రంగాల్లోకి విస్తరించే విషయం మీద ఆయన ప్రత్యేక ఫోకస్ చేస్తుంటారు. ఉద్యమ సమయంలో తన వాణిని వినిపించేందుకు సొంతంగా మీడియా సంస్థను షురూ చేసిన ఆయన..అనుకున్నట్లే తన వాదనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. మొదట టీవీ ఛానల్ తో షురూ అయిన ఆయనకు చెందిన మీడియా సంస్థ తర్వాతి కాలంలో దినపత్రికను స్టార్ట్ చేయటం తెలిసిందే.

తన టీవీ ఛానల్ ను ప్రమోట్ చేసే విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెబుతారు. తన టీవీ ఛానల్ ను ప్రారంభించిన తర్వాత.. మీడియా సంస్థలకు ప్రాణాధారమైన యాడ్ రెవెన్యూ కోసం వారు లేవనెత్తిన వాదన మిగిలిన వారి నోరు తెరవకుండా చేసిందని వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. తన ఛానల్ షురూ చేసిన వెంటనే.. సీమాంధ్ర మీడియా సంస్థలకు ఇచ్చే ప్రకటనల వాటా ఎంత? తెలంగాణ మీడియా సంస్థలకు ఇస్తున్న ప్రకటనల వాటా ఎంత? అంటూ సంబంధం లేని అంశాల్ని లింకు పెడుతూ తెర మీదకు తీసుకొచ్చిన వాదన పుణ్యమా అని.. ఆర్థికంగా చాలా త్వరగా కుదురుకుందని చెబుతుంటారు.

ఈ కారణంతోనే.. ఇప్పటి రోజుల్లో చాలా కష్టమని చెప్పే దినపత్రికను స్టార్ట్ చేయటమే కాదు.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ.. సంస్థ ఆర్థికంగా నిలదొక్కునేలా చేయగలిగినట్లుగా చెబుతున్నారు. తమకు సంబంధించిన అంశాల్ని.. తమ వాదనను మిగిలిన మీడియా సంస్థలు చెప్పినా.. చెప్పకున్నా తమ గొంతు బలంగా వినిపించేందుకు వీలుగా టీవీ ఛానల్.. తెలుగు న్యూస్ పేపర్ పెట్టిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఇప్పుడు ఇంగ్లిషు దినపత్రికను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణను అభివృద్ధి చేస్తున్న తీరు.. కేసీఆర్ కమిట్ మెంట్ ను జాతీయ స్థాయిలో అందరి నోట నానేలా చేయటంతో పాటు.. తమకు చెందిన మీడియా సంస్థల్ని మరింత బలోపేతం చేయటంలో భాగంగా ఇంగ్లిషులో దినపత్రికను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి అయ్యిందని.. అధికారికంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఇంగ్లిషు దినపత్రికను.. ‘‘తెలంగాణ టుడే’’ అన్న పేరుతో వస్తుందన్న మాట చెబుతున్నారు. ఈ పేరును ఇప్పటికే రిజిష్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ పేరుతో రిజిష్టర్ అయిన దినపత్రిక కేసీఆర్ ఫ్యామిలీదా? కాదా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కేసీఆర్ ఫ్యామిలీదేనని చెబుతున్నారు. తమకు చెందిన మీడియా సంస్థల్లో ఇంగ్లిషులో లేదన్న కొరత కేసీఆర్ త్వరలో తీర్చుకోనున్నట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది.