కేసీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు, తెలంగాణ ఉద్యమ పోరు వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వాటిని తెరపై ఆసక్తికర కథనంతో తెర్కకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ పేరు వినిపించింది. అయితే తాజాగా నవజూద్ధీన్ సిద్ధిఖీను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవజూద్ధీన్ కేసీఆర్ పాత్రలో బాగా సెట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పాత్ర అవసరాన్ని బట్టి ఎలాంటి రూపం కావాలన్నా ఆ విధంగా రెడీ అవ్వడం నవజూద్ధీన్ స్టయిల్. సో.. కేసీఆర్ పాత్రలో సులభంగా ఇమిడిపోతాడని అంటున్నారు. ఇప్పటికే నవాజుద్దీన్ కేసీఆర్‌కు సంబంధించిన కొన్ని స్పీచ్‌లు చూస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

