ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కు తాజాగా నయనతార హాజరవుతుందని సమాచారం. ఈ సినిమాలో నయన్ ఓ వినూత్నమైన పాత్ర పోషించబోతుందని నయన్ - బాలయ్య మధ్య నడిచే సన్నివేశాలు సింహాని తలపిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూకుడు మీదున్న బాలయ్య నుంచి ప్రస్తుతం పైసా వసూల్ రాబోతుంది. ఆ తరువాత సంకాంత్రికి ఈ 102వ సినిమా వస్తుందని సినీ జనాలు అంటున్నారు. మరి బాలయ్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన నయన్ - ఎలా కనిపించబోతుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ వరకు ఆగాల్సిందే.
Showing posts with label Balayya. Show all posts
Showing posts with label Balayya. Show all posts
బాలయ్య 102వ సినిమా హీరోయిన్ గా నయనతార సంక్రాంతికి రిలీజ్
ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కు తాజాగా నయనతార హాజరవుతుందని సమాచారం. ఈ సినిమాలో నయన్ ఓ వినూత్నమైన పాత్ర పోషించబోతుందని నయన్ - బాలయ్య మధ్య నడిచే సన్నివేశాలు సింహాని తలపిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూకుడు మీదున్న బాలయ్య నుంచి ప్రస్తుతం పైసా వసూల్ రాబోతుంది. ఆ తరువాత సంకాంత్రికి ఈ 102వ సినిమా వస్తుందని సినీ జనాలు అంటున్నారు. మరి బాలయ్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన నయన్ - ఎలా కనిపించబోతుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ వరకు ఆగాల్సిందే.
నందమూరి నట సింహం బర్త్ డే స్పెషల్
‘‘ఇండస్ట్రీలో ఇలాంటి పాత్ర పోషించగల నటుణ్ని నేనొక్కడినే’’ అని చెప్పుకోవడం నందమూరి బాలకృష్టకు మాత్రమే చెల్లింది. ఆయన అన్న మాటలు అతిశయోక్తులమీ కావు. ఈ తరంలో ఆయనలా పౌరాణిక పాత్రలు పోషించే నటుడు మరెవరూ కనిపించరు. అందరూ మరిచిపోయిన పౌరాణికాల్ని గుర్తు చేస్తూ ‘శ్రీరామరాజ్యం’ సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుని.. ఈ తరంలో తన లాంటి ఆల్ రౌండర్ మరెవరరూ లేరని చాటుకున్నాడు. సవాలు కూడా విసిరాడు. ఇక అంతకుముందు బాలయ్య చేసిన ఆదిత్య 369.. భైరవ ద్వీపం లాంటి సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి కూడా బాలయ్య మాత్రమే చేయగల సినిమాలే.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు కొడుగ్గా పుట్టడం.. ఆయన వారసుడిగా సినీ పరిశ్రమలోకి రావడం వరమే. గుర్తింపు కోసం ఆరాట పడనవసరం లేదు. అవకాశాల కోసం వెంపర్లాడనవసరం లేదు. స్టార్ ఇమేజ్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయనక్కర్లేదు. ఐతే ఎన్టీఆర్ కొడుగ్గా ఇండస్ట్రీలోకి రావడం వరమే కాదు శాపం కూడా. ఎన్టీఆర్ కొడుకంటే జనాలు ఎంతగా అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిదీ అత్యుత్తమంగా ఆశిస్తారు. ఎలా నటించినా.. ఏ పాత్ర ఎంచుకున్నా.. ఏ సినిమా చేసినా.. ఎన్టీఆర్తో పోల్చి చూస్తారు. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గినా పెదవి విరుస్తారు.
ఐతే బాలయ్య వరాన్ని వరంగానే మార్చుకున్నాడు. ఎన్టీఆర్ కొడుగ్గా తనకు వచ్చిన సానుకూలతన్నింటికీ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. తన ప్రతిభతో ప్రతికూలతల్ని దిగ్విజయంగా అధిగమించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే.. ఎన్టీఆర్ నీడ నుంచి బయటికి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. 43 ఏళ్లుగా నిర్విరామంగా నటిస్తూ ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటూ తన 'శత' చిత్ర సంబరానికి ఉత్సాహంగా అడుగులేస్తున్నాడు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా 'తుపాకి' పాఠకుల కోసం ఈ ప్రత్యేక కథనం..
కేవలం వారసత్వం ఉంది కాబట్టే.. ఎన్టీఆర్ కడుపున పుట్టాడు కాబట్టే ఆయన ఈ స్థాయికి వచ్చేశాడని.. అనుకుంటే పొరబాటే. పేర్లు చెప్పి ఇంకొకరిని నొప్పించడం ఎందుకు కానీ.. ఒక్కసారి తెలుగు సినీ పరిశ్రమలో వారసులుగా వచ్చినవాళ్లందరూ విజయవంతం అయ్యారా.. అందరూ పెద్ద స్టార్లు అయిపోయారా.. అన్నది సమీక్షించుకుంటే బాలయ్య గొప్పదనం ఏంటి అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. వారసత్వం అన్నది అరంగేట్రం సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడుతుంది కానీ.. ఆ తర్వాత మాత్రం స్వీయ ప్రతిభతోనే నిలదొక్కుకోవాలి. మంచి పాత్రలు ఎంచుకోవాలి. మంచి సినిమాలు ఎంచుకోవాలి. నటనలో ప్రతిభ చాటాలి. తన ప్రత్యేకత చాటుకోవాలి. విజయాలకు పొంగిపోకూడదు. పరాజయాలకు కుంగిపోకూడదు. బాలయ్య ఇవన్నీ చేశాడు.
బాలయ్య కెరీర్లో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసే బ్లాక్ బస్టర్లకు కొదవలేదు. తెలుగు సినిమా నడతనే మార్చేసే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలూ చాలానే ఉన్నాయి. మంగమ్మగారి మనవడు’ మొదలుకుని.. భార్గవరాముడు.. ముద్దులమావయ్య.. రౌడీ ఇన్స్పెక్టర్.. బంగారుబుల్లోడు.. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు.. సింహా.. లెజెండ్.. ఇలా బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను చాటిన బ్లాక్ బస్టర్ హిట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఐతే బాలయ్య అంటే బాక్సాఫీస్ బొనాంజా మాత్రమే కాదు.. వైవిధ్యమైన సినిమాలకూ కేరాఫ్ అడ్రసే. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు చేయడానికి సాహసించని ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్.. భైరవద్వీపం ద్వీపం లాంటి జానపద చిత్రం.. 21వ శతాబ్దంలో మరే కథానాయకుడూ ప్రయత్నించని 'శ్రీరామరాజ్యం' లాంటి పౌరాణికం.. ఇలా బాలయ్య కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన ఇంకెవరికీ సాధ్యం కాని ఎన్నో సినిమాలు చేశాడు బాలయ్య.
బాలయ్య కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ఆయన వందో సినిమా మరో ఎత్తులా కనిపిస్తోంది. తన ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నా.. రెగ్యులర్ మాస్ సినిమాతో సేఫ్గా సెంచరీ మైలురాయిని దాటేసే అవకాశమున్నా బాలయ్య మాత్రం గొప్ప సాహసానికి సిద్ధమయ్యాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి సాహసోపేత చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. తన ముందుకు ఊరించే మాస్ మసాలా ఆప్షన్లు చాలా వచ్చినా.. వాటన్నింటినీ కాదని క్రిష్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ తో 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి సినిమాను ఎంచుకోవడంలోనే బాలయ్య ప్రత్యేకత కనిపిస్తుంది. తెలుగు భాష - సంస్కృతి అంటే బాలయ్యకు ఎంత అభిమానమో చెప్పడానికి ఇది రుజువు. మన చరిత్ర గురించి ఈ తరానికి తెలియజెప్పాలనే తపనతో ఎంతో శ్రమతో ముడిపడ్డ ఈ సినిమాను తెరమీదికి తీసుకొచ్చాడు.
బాలయ్య కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రోజు బాలయ్య జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింతగా అంచనాల్ని పెంచింది. ఈ శత చిత్రం బాలయ్య నట ప్రయాణంలో మరో మైలురాయిలా నిలిచిపోతుందని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.
Balayya 100th Movie Gautamiputra Satakarni Title Song
‘Gautamiputra Satakarni’ Songs Free Download on MaTelugu.Com
Staring: Balakrishna, Nayanatara, Nithya Menon
Directed by: Krrish
Music by: Devi Sri Prasad
Gautamiputra Satakarni Movie Title Song Lyrics
Yodhudu Yodhudu Song is the Title song of Gautamiputra Satakarni Movie . Lyrics for this song are provided by Lyric writer Sira Sri . Music for this movie was composed by RAWI SHANQAR . Yodhudu Yodhudu song was sung by Rohith .
Gautamiputra Satakarni is starring Nandamuri Balakrishna, Anushka Shetty . Gautamiputra Satakarni movie was directed by Krish . Gautamiputra Satakarni movie was produced by First Frame Entertainment . More information can be found at Wiki.
Gautamiputra Satakarni Movie Title Song Lyrics
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Saathavahanulaku Sottu Simha Rajasam
Saatakarni Gunde Ninda Simha Porusham
Saatakarni Gunde Ninda Simha Porusham
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Saathavahanulaku Sottu Simha Rajasam
Saatakarni Gunde Ninda Simha Porusham
Saatakarni Gunde Ninda Simha Porusham
Sathru Rajyamulaku Simha Swapnam
Telugu Charithra Garimakithadu Simha Dwaaram
Gouthamiputra Saatakarni
Darpamu Tho Thala Ettenu Telugu Dharani
Telugu Charithra Garimakithadu Simha Dwaaram
Gouthamiputra Saatakarni
Darpamu Tho Thala Ettenu Telugu Dharani
Saathavahanulaku Sottu Simha Rajasam
Saatakarni Gunde Ninda Simha Porusham
Saatakarni Gunde Ninda Simha Porusham
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Mahendra Vindhyavata Pariyathra Sahya Krishnagiri Chakoraadi Parvathalu
Satakarni Rajyaniki Praakaaraalu
Saka Yavana Hoona Mlechcha Kshaatrapaadi Satakoti
Ripusamooha Raajyaalu
saatakarni Roudraniki Prakampitaalu
Gauthami Putra Shathakarni
Darpamu Tho Thala Ettenu Telugu Dharani
Satakarni Rajyaniki Praakaaraalu
Saka Yavana Hoona Mlechcha Kshaatrapaadi Satakoti
Ripusamooha Raajyaalu
saatakarni Roudraniki Prakampitaalu
Gauthami Putra Shathakarni
Darpamu Tho Thala Ettenu Telugu Dharani
Saathavahanulaku Sottu Simha Rajasam
Saatakarni Gunde Ninda Simha Porusham
Saatakarni Gunde Ninda Simha Porusham
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Kadana Kuthoohalamaina Bhereelu Dhundubhilu
Aribheekara Bhayaanka Parjanyaalu
Saatakarni Sainyaniki Uttejalu
Padadalam Aswabalam Gajaganam Aayudhamulu
Andhra Keerthi Kethana Visphaaritaalu
Shathakarni Khyathike Avi Manjeeraalu
Aribheekara Bhayaanka Parjanyaalu
Saatakarni Sainyaniki Uttejalu
Padadalam Aswabalam Gajaganam Aayudhamulu
Andhra Keerthi Kethana Visphaaritaalu
Shathakarni Khyathike Avi Manjeeraalu
Saathavahanulaku Sottu Simha Rajasam
Saatakarni Gunde Ninda Simha Porusham
Saatakarni Gunde Ninda Simha Porusham
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Dushkaramannadi Thanu Eragadu
Mushkara Mookala Tega Narike
Telugu Jathiki Sreyaskarudai
Telugu Yasassuki BHaskarudai
Pushkarudai Pravahinche Satru Srenula Raktapu Nadilo
Pushkaramai Vikasinche Sampadalenno Telugua Vanilo
Mushkara Mookala Tega Narike
Telugu Jathiki Sreyaskarudai
Telugu Yasassuki BHaskarudai
Pushkarudai Pravahinche Satru Srenula Raktapu Nadilo
Pushkaramai Vikasinche Sampadalenno Telugua Vanilo
Saathavahanulaku Sottu Simha Rajasam
Saatakarni Gunde Ninda Simha Porusham
Saatakarni Gunde Ninda Simha Porusham
Sathru Rajyamulaku Simha Swapnam
Telugu Charithra Garimakithadu Simha Dwaaram
Gouthamiputra Saatakarni
Darpamu Tho Thala Ettenu Telugu Dharani
Telugu Charithra Garimakithadu Simha Dwaaram
Gouthamiputra Saatakarni
Darpamu Tho Thala Ettenu Telugu Dharani
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Yodhudu Yodhudu
Dictator Movie Review And Rating, Story, NBK,Sriwass,EROS
విడుదల తేదీ : 14 జనవరి 2016
రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : శ్రీవాస్
నిర్మాత : శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్
సంగీతం : ఎస్ఎస్ తమన్
నటీనటులు : బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష ..
ఇప్పటి వరకూ సంక్రాంతి సీజన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన నందమూరి బాలకృష్ణ నటించిన 99వ సినిమా ‘డిక్టేటర్’. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్ కి తగిన పర్ఫెక్ట్ స్టొరీ తో చేసిన ఈ స్త్య్కిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీవాస్ డైరెక్టర్. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ స్టైలిష్ డిక్టేటర్’తో బాలకృష్ణ మరో సంక్రాంతి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
హైదరాబాద్ లోని ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబందించిన ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటాడు ధర్మ(బాలకృష్ణ). తన పని తానూ చేసుకుపోతూ, గొడవలకి దూరంగా చాలా శాంతంగా ఉండే ధర్మ కాత్యాయని(అంజలి) వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ధర్మ – కత్యాయానికి పెళ్లై ఉంటుంది కానీ కాత్యాయని ఉద్యోగరిత్యా వేరే ప్లచె లో ఉంటుంది. దాంతో కాత్యాయని ఇంటి బాధ్యత మొత్తాన్ని ధర్మ చూసుకుంటూ ఉంటాడు. అలా సాగిపోతున్న లైఫ్ లోకి అనుకోకుండా ఇందు(సోనాల్ చౌహాన్) ప్రవేశిస్తుంది. ఇందు వాళ్ళ అన్నయ్య వలన డ్రగ్ డీలర్ అయిన విక్కీ(విక్రమ్ జీత్) గ్యాంగ్ నుంచి ఇందుకి ఓ సమస్య వస్తుంది.
ఇందుని కిడ్నాప్ చేసి తన అన్నయ్య కోసం చిత్ర హింసలు పెడతారు. కట్ చేస్తే ఇందుని కాపాడటానికి ధర్మ వస్తాడు. మొదట మంచిగా చెప్తే వినకపోవడంతో అతను తనలోని రౌద్ర రూపాన్ని బయప పెట్టి అందరినీ చితకబాది ఇందుని సేవ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ ద్వారా టీవీలో ధర్మని చూసిన ధర్మ గ్రూప్ అఫ్ కంపనీ ఎండి రాజేసేఖర్(సుమన్) వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. అందరూ ధర్మని నిలదీస్తున్న టైంలో రాజశేఖర్ తనే డిక్టేటర్ అని పరిచయం చేస్తాడు. దాంతో కథలో అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? డైరెక్టర్ గా ధర్మ కథ ఏంటి? ఎందుకు అతను ధర్మగా మారాల్సి వచ్చింది? అసలు డిక్టేటర్ ఏం చేసేవాడు? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నందమూరి బాలకృష్ణ సినిమా అనగానే అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు పవర్ఫుల్ పాత్రతో పాటు, బలమైన యాక్షన్ సీన్స్, పంచ్ డైలాగ్స్, నువ్వా – నేను అంటూ హీరోకి – విలన్ కి మధ్య సాగే ఆసక్తికర పోరును ఆశిస్తారు. ఇలా థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరి అంచనాలను వమ్ము చేయకుండా వారికి కావలసిన అన్ని అంశాలను సమపాళ్ళలో దట్టించి తీసిన సినిమానే ఈ ‘డిక్టేటర్’. ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వల్ బ్లాక్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో హీరోయిజం ఎలివేట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఆ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళడం, అక్కడ అసలైన డిక్టేటర్ గురించి చెప్పడం మరియు డిక్టేటర్ పాత్రకి రతి అగ్నిహోత్రి, నవాబ్ షా పాత్రలకి మధ్య జరిగే పోటా పోటీ సీన్స్ ఆడియన్స్ లో మంచి ఊపు తెస్తాయి. పవర్ఫుల్ డిక్టేటర్ పాత్ర ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఫస్ట్ హాఫ్ అటు ఇటుగా జరిగినా.. సెకండాఫ్ మాత్రం సూపర్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో బాలయ్య మార్క్ దబిడి దిబిడే ఫార్మాట్ లో ఉండడం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.
నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాని నిల బెట్టింది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. అందులో మొదటి పాత్రలో చూడటానికి సింపుల్ అండ్ కూల్ గా కనిపించాడు. ఈ పాత్రలో పబ్ ఫైట్ లో యాక్షన్, డైలాగ్స్ తో అభిమానుల చేత విజిల్స్ కొట్టిస్తాడు. ఇక అసలైన డిక్టేటర్ పాత్రలో బాలకృష్ణ మునుపెన్నడూ కనపడననత స్టైలిష్ గా కనిపించడమే కాకుండా.. పవర్ఫుల్ డైలాగ్స్ తో, విలన్స్ ని నువ్వా నేనా అంటూ ఢీ కొట్టిన తీరు సింప్లీ సూపర్బ్. చాలా కాలం తర్వాత బాలయ్య సూపర్ స్టైలిష్ గా కనిపించడం కూడా సినిమాకి కొత్తదనాన్ని అందించింది. అంజలి హీరోతో కలిసి రొమాన్స్ చేయడమే కాకుండా పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా మెప్పించింది. సెకండాఫ్ లో కథకి మంచి బలాన్ని చేకూర్చే పాత్రలో అంజలి మంచి నటనని కనబరచడమే కాకుండా కామెడీ, ఎమోషనల్ గా కూడా బాగా చేసింది. ఇక సోనాల్ చౌహాన్ ఫస్ట్ హాఫ్ కి గ్లామర్ అట్రాక్షన్ తీసుకొచ్చిన పాత్ర, ఫస్ట్ హాఫ్ లో తన అందాల ఆరబోత మాస్ ఆడియన్స్ కి మస్త్ అనిపిస్తుంది.
ఇక సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన అక్ష, నాజర్, సుమన్, సాయాజీ షిండే తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పిస్తే.. 30 ఇయర్స్ పృధ్వీ, ప్రభాస్ శ్రీను, పోసాని క్రిష్ణమురళీ, శకలక శంకర్ లాంటి వాళ్ళు చేసిన కామెడీ కొన్ని కొన్ని చోట్ల నవ్విస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో కూసింత కామెడీ, బాలయ్య మార్క్ ఇంటర్వల్ బ్లాక్ ఆకట్టుకుంటే సెకండాఫ్ లో బాలయ్య ఒక్కడే డిక్టేటర్ పాత్రలో ఒంటి చేత్తో సినిమాని చాలా పవర్ఫుల్ గా నడిపించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. శ్రద్ధ దాస్ – ముమైత్ ఖాన్ లతో చేసిన ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
డిక్టేటర్ సినిమాకి మైనస్ పాయింట్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది.. ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా ఉండడం అలాగే అక్కడక్కడా కామెడీ, ఇంటర్వల్ బ్లాక్ ఉన్నా కథా పరంగా అస్సలు ముందుకు వెళ్లకపోవడం వలన అక్కడక్కడా బోర్ కొడుతుంది. కొన్ని చోట్ల కామెడీ కోసమే కథని ఎక్కువ సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక అసలు కథ విషయంలోకి వస్తే కథా పరంగా సూపర్ స్ట్రాంగ్ పాయింట్ లేదు. కేవలం డిక్టేటర్ అనే ఒక్క పాత్రనే హైలైట్ చెయ్యాలని కథ రాసుకున్నారు. అందుకే సినిమా కథ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉండే బాగుండేది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కథలో జరిగిన మరో పొరబాటు విలనిజం స్ట్రాంగ్ గా లేకపోవడం. డిక్టేటర్ లాంటి పవర్ఫుల్ పాత్ర రాసుకున్నప్పుడు విలన్ అనే పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ విలన్స్ గా రతి అగ్నిహోత్రి, నవాబ్ షా మరియు కబీర్ దుహన్ సింగ్ పాత్రలలో ఆ స్ట్రాంగ్ నెస్ లేదు. అదీకాక డిక్టేటర్ లాంటి పాత్రకి లేడీ విలన్ ని పెట్టడం కూడా మరో మైనస్.
కథ ఇలా ఉంది అంటే కథనం అన్నా బాగుండాలి. కానీ కథనం కూడా చాలా సింపుల్ గా ఉంది.. కథలో ఎలాంటి ట్విస్ట్ లు లేవు.. చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. దానికి తోడూ నేరేషన్ కూడా చాలా స్లోగా ఉండడం వలన చాలా చోట్ల బోరింగ్ గా కూడా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సినిమా మొత్తం ఊహాజనితంగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ లో కథ చెప్పకపోయినా ఎంటర్ టైన్మెంట్ అనేదానికి చాలా స్కోప్ ఉంది, కానీ రెండు మూడు సీన్స్ లో నవ్వించారే తప్ప మిగతా ఎక్కడా నవ్వించలేకపోయారు. దాని వలన ఫస్ట్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ అవ్స్తుంది. అలాగే సినిమా రన్ టైంని 155 నిముషాలు కాకుండా 140 నిమిషాల్లో చెప్పేలా ఎడిట్ చేసి కొన్ని అనవసర సీన్స్ ని తీసేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల్లో అదిరిపోయే అవుట్ పుట్ ఇచ్చిన వాళ్ళలో మొదటగా చెప్పాల్సిన పేరు శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ. బాలకృష్ణని మును పెన్నడూ చూడనంత స్టైలిష్ గా చూపడమే కాకుండా, బాలయ్య ఇమేజ్ కి ఎలాంటి షాట్ పెట్టాలి అనేదాని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తీసాడు. చాలా చోట్ల శ్యాం కె నాయుడు బాలయ్యని చూపిన విధానంకే అభిమానులు ఫిదా అయిపోతారు. ఓవరాల్ గా కూడా సినిమా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. తమన్ మ్యూజిక్ అందించిన పాటలు బాగుంటే, విజువల్స్ పరంగా ఇంకాస్త బెటర్ అనిపిస్తాయి. వీటితో పాటు బాలకృష్ణ చేసిన రోరింగ్ పాత్రకి సరిపోయేలా చిన్నా ఇచ్చిన నేపధ్య సంగీతం కూడా సెకండాఫ్ కి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ మరియు తను వేసిన సెట్స్ సినిమా నేచర్ కి పర్ఫెక్ట్ గా మాచ్ అయ్యాయి. ఎడిటర్ గౌతమ్ రాజు అక్కడక్కడా సినిమాని సాగదీసిన ఫీఎలింగ్ కలిగించినప్పటికీ మేజర్ సీన్స్ లో ఫాస్ట్ ఎడిటింగ్ తో ఆకట్టుకునేలా చేసాడు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు రవి వర్మ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
డిక్టేటర్ సినిమా కథ – కథనం అందించింది కోన వెంకట్ – గోపి మోహన్. వీరిద్దరూ బాగా ఫేమస్ అయిన కామెడీ ఫార్మాట్ ని ఫస్ట్ హాఫ్ లో ఇన్వాల్ చేస్తూనే బాలయ్య మార్క్ సీన్స్ కూడా మిక్స్ చేసి రాసుకోవడం బాగుంది. కానీ వాళ్ళు కథా పరంగా పెద్ద స్ట్రాంగ్ లైన్ తీసుకోకపోవడం మైనస్. బాలయ్యని కొత్తగా చూపుతూ, బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడా కొన్ని సీన్స్ తో సినిమాని రాసేసారు తప్ప కథకి ప్రాధాన్యత ఉండేలా చూసుకోలేదు. కథలో స్ట్రాంగ్ పాయింట్ ఉండి దాని చుట్టూ ఇలాంటి సీన్స్ అల్లుకొని ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడా కాస్త స్లో అనిపించినా కొన్ని చోట్ల మాత్రం పరిగెత్తించారు. కోన వెంకట్ – గోపి మోహన్ లు అనుకున్న కథకి రచన సహకారం అందించిన శ్రీధర్ సీపాన రచన బాగుంది. అలాగే ఈ కథకి తగ్గా డైలాగ్స్ రాయడంలో ఎం. రత్నం సక్సెస్ అయ్యాడు. ఇక శ్రీవాస్ తెరపైన బాలయ్య లాంటి ఓ స్టార్ హీరోని సెకండాఫ్ లో పవర్ఫుల్ గా చూపడంలో సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ గా ఒక్క బాలయ్య మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వలన అక్కడక్కడా బోరింగ్ ఎలిమెంట్స్ వచ్చాయి. శ్రీవాస్ అన్నా డైరెక్టర్ గా కథ- కథనం మరియు విలన్ పాయింట్ లో ఇంకాస్త బెటర్ మెంట్ చేయాల్సింది. ఇక దర్శకుడిగానే కాకుండా ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి ఒక నిర్మాతగా కూడా బెస్ట్ క్వాలిటీ ఉన్న సినిమాని అందించాడు.
తీర్పు :
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానులు నందమూరి బాలకృష్ణ నుంచి ఏమేమి ఆశిస్తారో ఆ అంశాలను మెయిన్ అజెండాగా చేసుకొని తీసిన పర్ఫెక్ట్ స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘డిక్టేటర్’. డిక్టేటర్ అనే పాత్రని సెకండాఫ్ లో పవర్ఫుల్ గా చూపించడం, ఆ పాత్రలో బాలయ్య అదుర్స్ అనే నటనని కనబరచడమే ఈ సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉన్నా ఇంటర్వల్ బ్లాక్ నుంచి హీరోయిజం ని ఎలివేట్ చేయడం వలన థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు నిరుత్సాహపడరు. డైరెక్టర్ కథ – కథనం పరంగా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోకపోవడం ఈ సినిమాకి నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. డిక్టేటర్ గా బాలకృష్ణ పవర్ఫుల్ యాక్షన్, ఇంటర్వల్ బ్లాక్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయితే, సింపిల్ కథ, కాస్త సాగాదీత, రొటీన్ క్లైమాక్స్ లు చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా బాలకృష్ణ అభిమానులు, మాస మసాలా కోరుకునే అభిమానులు ఈ సంక్రాంతిని థియేటర్స్ లో అరుపులు పెడుతూ ఎంజాయ్ చేయదగిన కమర్షియల్ సినిమానే ‘డిక్టేటర్’.
NBK wished for Dussehra, Dictator New Look Out
A new look of Balayya was out from his much awaited film Dictator. Nandamuri Balakrishna wished all his fans in advance for Dussehra and Diwali festivals.
[caption id="attachment_392" align="aligncenter" width="474"]
Balayya-Dictator-Look[/caption]
Check out the cool and stylish look of Nandamuri Balakrishna above. Dictator is directed by Sriwas and it is Balayya’s most expensive film till date. Directed by Sriwas of Loukyam fame this film has Anjali in lead role. The teaser of Dictator will be released on Vijaya Dasami day as per sources.
[caption id="attachment_392" align="aligncenter" width="474"]
Check out the cool and stylish look of Nandamuri Balakrishna above. Dictator is directed by Sriwas and it is Balayya’s most expensive film till date. Directed by Sriwas of Loukyam fame this film has Anjali in lead role. The teaser of Dictator will be released on Vijaya Dasami day as per sources.



