ఇకపై వాహనదారులు టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు



టోల్ గోస తీరింది. వాహనదారులు ఇకపై ప్రతీ టోల్  గేట్ దగ్గర గంటల తరబడి ఆగడం…  టాక్స్ లు చల్లించుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. టాక్స్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రహదారుల ప్రాదికార సంస్థ(NHAI) రెండు యాప్స్ ను ప్రారంభించింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని 371 టోల్ ప్లాజాల దగ్గర దీన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి NHAI గురువారం (ఆగస్టు 17) మైఫాస్ట్‌ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్ పార్ట్నర్‌ పేరుతో ఈ మొబైల్ యాప్ లను ఆవిష్కరించింది.

ఫాస్ట్ ట్యాగ్ లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు టోల్‌గేట్ల దగ్గర కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) ద్వారా వాటిని అమ్మేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. శుక్రవారం (ఆగస్టు18) నుంచి ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. బ్యాంకులు, NHAI, IHMCL వెబ్‌సైట్‌ల ద్వారా ఈ ఫాస్టాగ్‌లను వాహనదారులు కొనుగోలు చేయవచ్చు.

మైఫాస్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చని..లేదంటే రీచార్జి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఫాస్టాగ్‌ పార్ట్నర్‌ యాప్‌ ద్వారా వాహనాలడీలర్లు, బ్యాంకులు,CSC వంటి సంస్థలు ఫాస్టాగ్‌లను అమ్మవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6 లక్షల ఫాస్ట్ ట్యాగ్ ల అమ్మకాలు జరిగాయని… తాజా చర్యలతో ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది ఎన్‌హెచ్‌ఏఐ. ఫాస్ట్ ట్యాగ్ ఎలక్రాటినిక్  టోల్‌ వసూలు కోసం వినియోగించే పరికరం. వాహనదారుడికి సంబంధించిన అకౌంట్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత ఈ పరికరాన్ని వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. వాహనం టోల్‌గేట్‌ దగ్గరకుచేరుకోగానే, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌  టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్‌ అకౌంట్‌ నుంచి టోల్‌ టాక్స్ సంబంధిత సంస్థకు జమ అవుతుంది. దీంతో..వాహనదారుడు టోల్‌గేట్‌ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.

ThanQ Visit Again.

Related Posts