Showing posts with label Rajamouli. Show all posts
Showing posts with label Rajamouli. Show all posts

చిరు ఉయ్యాలవాడ ఫాస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్న జక్కన్న




‘బాహుబలి’తో రాజమౌళి ఇండియన్ సినిమాను ఎంతగా ఇన్ స్పైర్ చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నా.. అల్లు అరవింద్ రూ.500 కోట్లతో ‘రామాయణం’ అనౌన్స్ చేశాడన్నా.. సుందర్ రూ.250 కోట్లతో ‘సంగమిత్ర’ తీసే ప్రయత్నం చేస్తున్నాడన్నా.. అన్నింటికీ ఆ ధైర్యాన్నిచ్చింది దర్శక ధీరుడు రాజమౌళే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ముందు మామూలుగా తీయాలనుకుని.. ఆ తర్వాత దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా ప్రణాళికలు వేయడానికి కూడా ‘బాహుబలి’తో రాజమౌళి స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు.

మొత్తానికి పది నెలలుగా జరుగుతున్న స్క్రిప్టు పనులు.. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ మామూలుగా ఉండదని.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా చూపిస్తారట. చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమౌళే అని సమాచారం. ‘ఉయ్యాలవాడ..’కు పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రాజమౌళి చేతుల మీదుగానే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. ‘ఉయ్యాలవాడ..’ను పాన్ ఇండియన్ సినిమాగా తీయాలని భావిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని రామ్ చరణ్ ఇలా ప్లాన్ చేశాడంటున్నారు.

జనతా గ్యారేజ్ ను రెండుసార్లు చూసిన రాజమౌళీ

Rajamouli watched Janatha Garage 2 times


ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో ఉన్నారు. తొలిరోజే జనతా గ్యారేజ్ చూసేద్దాం అని బాక్సాఫీసుల వద్ద నిన్నటి నుంచే బారులు తీరడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళీ కూడా ఒకరు! గతంలో సింహాద్రి - యమదొంగ వంటి మాంచి మాస్ మసాలా చిత్రాలను తారక్ తో చేశారు జక్కన్న. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. తారక్ నటన - డాన్స్ అంటే జక్కన్నకు చాలా ఇష్టం. కాబట్టి సహజంగానే ఎన్టీఆర్ అంటే ఇష్టమూ అభిమానమూ ఉన్న జక్కన్న తొలిరోజే తొలి ఆట చూసేశారు. అయితే  ఆసినిమాను ఒక్కసారి చూస్తే రొటీన్. ఈ చిత్రాన్ని జక్కన్న రెండుసార్లు చూడటం విశేషం. ఒక షో పూర్తయిన వెంటనే... ఆ తరువాతి షోకి కూడా టిక్కెట్ తీసుకుని జక్కన్న చూసేశారు. అంటే బ్యాక్ టు బ్యాక్ షోలు చూశారన్నమాట. తారక్ వీరాభిమానులు కూడా బహుశా ఒక షో చూసి సంతృప్తి పడతారని చెప్పుకోవచ్చు. కానీ జక్కన్న ఇలా రెండు షోలు చూశారంటే... ఎంత అభిమానమో చూడండి. తొలిసారి చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో... రెండోసారి కూడా అదే స్థాయిలో ఆనందించారట.

తన ట్విట్టర్ లో ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు జక్కన్న. జనతా గ్యారేజ్ చిత్రాన్ని బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండుసార్లు చూశానని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో తారక్ నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. పరిపక్వమైన నటనను ప్రదర్శించాడు అన్నారు. ఎన్టీఆర్ - మోహన్ లాల్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్యా సాగిన సన్నవేశాలు ఉద్వేగభరితంగా ఉన్నాయన్నారు. టెంపర్ సినిమా తరువాత తన కెరీర్ పంథాను మార్చుకున్న తారక్ తీరును జక్కన్న ప్రశంసించారు. సో... ఈ ట్వీట్ చూడగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బోలెడంత ఆనందం కలుగుతుంది అని వేరే చెప్పాలా..?

ఇండియన్ అఫ్ ది ఇయర్ 2015 అవార్డుకు ఎంపికైన రాజమౌళి




ఓ వైపు జాతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు.. మరోవైపు పద్మశ్రీ పురస్కారం.. తాజాగా సీఎన్ ఎన్ ఐబీఎన్ ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’.. మొత్తానికి మన రాజమౌళి జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడించేస్తున్నాడు. లేటెస్టుగా అందుకున్న ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది ఓ టీవీ ఛానెల్ కాబట్టి దీన్ని లైట్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ అవార్డును చాలా ప్రతిష్టాత్మకంగానే భావిస్తారు. ఎక్కువగా బాలీవుడ్ వాళ్లకే పట్టం కట్టే ఈ ఛానెల్.. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మన రాజమౌళిని ఈ అవార్డుకు ఎంపిక చేయడమంటే మామూలు విషయం కాదు. సంజయ్ లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ).. ప్రియాంక చోప్రా (బాజీరావ్ మస్తానీ-దిల్ దడ్కనే దో).. రణ్వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ-దిల్ దడ్కనే దో).. ‘పీకూ’ టీమ్.. ‘తల్వార్’ టీమ్.. ఇలా రాజమౌళికి పోటీ తీవ్రంగానే ఉంది. అయినప్పటికీ మన జక్కన్నే పురస్కారానికి ఎంపికయ్యాడు.

ఇక అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ తనకీ పురస్కారం ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు రాజమౌళి. తనకు ఒక్కడికి కాకుండా.. బాహుబలి టీంకు ఈ అవార్డు ఇస్తే చాలా సంతోషించేవాడినని.. ‘బాహుబలి’ లాంటి సినిమా టీం వర్క్ వల్లే సాధ్యమైందని.. ఇందుకోసం అందరూ ఎంతో శ్రమించారని రాజమౌళి చెప్పాడు. ఈ మాట అనగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగింది. ఈ అవార్డుకు రాజమౌళి పేరును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇక చివర్లో ప్రముఖ క్రిటిక్.. సీఎన్ ఎన్ ఐబీఎన్ ఛానెల్ ప్రతినిధి రాజీవ్ మసంద్ మైక్ అందుకుని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పమని అడగ్గా అది చెప్పలేనని.. అందుకోసం ఇంకో ఏడాది ఆగితే సరిపోతుందని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు జక్కన్న.

బాహుబలి 2 డిసెంబర్ నుండి ప్రారంభమౌతుంది

Baahubali 2 will start from December


[caption id="attachment_492" align="aligncenter" width="526"]Baahubali 2 Baahubali 2[/caption]

The core team of Baahubali met for the story narration of part two. Latest reports reveal that Rajamouli has started working on the set designs of the film and also re-designed the war episodes to make the sequel an even bigger success in terms of visual effects.
In a recent media interaction, Rajamouli officially announced that the regular shooting of Baahubali 2 will start from December.Meanwhile, Prabhas and Anushka have already begun preparing for their roles.

Celebrities tweets about Rudramadevi – Prabhas, SS Rajamouli, Akhil, Vishnu Manchu wished Rudramadevi team!

[caption id="attachment_302" align="aligncenter" width="1600"]Rudhramadevi Review - Rating Celebrities tweets about Rudramadevi – Prabhas, SS Rajamouli, Akhil, Vishnu Manchu wished Rudramadevi team![/caption]

Finally, big day arrived! Anushka Shetty’s Rudramadevi hit the screens today (October 9th). This movie is receiving positive reports everywhere, mainly Anushka’s performance and Allu Arjun’s performance as Gona Ganna Reddy are the highlight of this movie.

Audiences and celebrities are making plans to watch this movie on the first day itself. Rudramadevi was released in 2D and 3D and this is another interesting aspect in this movie. People are showing interest to watch this movie in 3D format especially.

Celebrities such as Prabhas, SS Rajamouli, Akhil, Allu Sirish, Gopichand Malineni, Sai Dharam Tej, Vennela Kishore wished the movie and they wished Rudramadevi team a huge success.

Here are the tweets of SS Rajamouli, Prabhas, Akhil etc:

Prabhas

Wishing my friends, Bunny, Sweety, and Rana all the best for Rudhramadevi. I know that director Gunashekhar garu and his team have worked very hard for this film. I wish the entire cast and crew the very best…

Akhil

All the best to the whole team of #Rudramadevi ! Hope this film pays off for all the hard work put in.

Gopichand Malineni

Wishing all the very best to entire team of #Rudramadevi ..I am sure hardwork n passion will pay off

Sai Dharam Tej

Wishing the team of #rudramadevi all the very best

Vennala Kishore

Rudhramadevi releasing tomorrow in 3d..wishing the movie a super duper success..

SS Rajamouli

Just heard that #Rudhramadevi has been made tax free in Telangana. Fantastic news for Gunasekhar garu

Allu Sirish

I am happy Bunny is a part of films like Vedam & Rudramadevi. Wish he continues to support such films.

Vishnu Manchu

Wishing and praying that #Rudramadevi does very well at the box office.Its known that a lot of passion, hard work & guts went into making it

Krish

U just have to trust ur madness n everything will work in ur passions’s favour. May the force be with @Gunasekhar1

Rajamouli about Gona Ganna Reddy Character on Rudhramadevi

గోన గన్నారెడ్డిపై రాజమౌళి ప్రశంసల వర్షం


Allu Arjun-as-Gona-Ganna-Reddy

దర్శకుడు రాజమౌళి ఏదైనా సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో తనకు నచ్చిన అంశాలను నిర్మొహమాటంగా బయట పెడతారు. తాజాగా విడుదలైన రుద్రమదేవి సినిమా చూసిన తర్వాత దర్శకుడు రాజమౌళి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలెట్ అయందని, ఆ పాత్ర వల్లే సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. బన్నీ ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ హీరో అంటూ రాజమౌళి కితాబిచ్చారు. రుద్రమదేవి సినిమా ఆగిపోయిన సమయంలో బన్నీ గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకుని సినిమాను నిలబెట్టారని చెప్పుకొచ్చారు రాజమౌళి. పన్ను మినహాయింపు విషయంలో బన్నీ రోల్ ఎంతో కీలకం. రెస్పెక్ట్ గోన గన్నారెడ్డి అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు. ఇక హీరోయిన్ అనుష్కపై కూడా రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. స్వీటీ స్క్రీన్ ప్రెసెన్స్, డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ ఉన్న ఆర్టిస్ట్ అంటూ ప్రశంసించారు. రుద్రమదేవి పాత్రను అనుష్క తప్ప మరెవరూ ఈ స్థాయిలో చేయలేరు అని రాజమౌళి ప్రశంసించారు. రానా, ప్రకాష్ రాజ్, దర్శకుడు గుణశేఖర్ ను పొగుడుతూ కూడా రాజమౌళి ట్వీట్స్ చేసారు