Showing posts with label SS Rajamouli. Show all posts
Showing posts with label SS Rajamouli. Show all posts

చిరు ఉయ్యాలవాడ ఫాస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్న జక్కన్న




‘బాహుబలి’తో రాజమౌళి ఇండియన్ సినిమాను ఎంతగా ఇన్ స్పైర్ చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నా.. అల్లు అరవింద్ రూ.500 కోట్లతో ‘రామాయణం’ అనౌన్స్ చేశాడన్నా.. సుందర్ రూ.250 కోట్లతో ‘సంగమిత్ర’ తీసే ప్రయత్నం చేస్తున్నాడన్నా.. అన్నింటికీ ఆ ధైర్యాన్నిచ్చింది దర్శక ధీరుడు రాజమౌళే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ముందు మామూలుగా తీయాలనుకుని.. ఆ తర్వాత దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా ప్రణాళికలు వేయడానికి కూడా ‘బాహుబలి’తో రాజమౌళి స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు.

మొత్తానికి పది నెలలుగా జరుగుతున్న స్క్రిప్టు పనులు.. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ మామూలుగా ఉండదని.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా చూపిస్తారట. చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమౌళే అని సమాచారం. ‘ఉయ్యాలవాడ..’కు పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రాజమౌళి చేతుల మీదుగానే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. ‘ఉయ్యాలవాడ..’ను పాన్ ఇండియన్ సినిమాగా తీయాలని భావిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని రామ్ చరణ్ ఇలా ప్లాన్ చేశాడంటున్నారు.

జనతా గ్యారేజ్ ను రెండుసార్లు చూసిన రాజమౌళీ

Rajamouli watched Janatha Garage 2 times


ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో ఉన్నారు. తొలిరోజే జనతా గ్యారేజ్ చూసేద్దాం అని బాక్సాఫీసుల వద్ద నిన్నటి నుంచే బారులు తీరడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళీ కూడా ఒకరు! గతంలో సింహాద్రి - యమదొంగ వంటి మాంచి మాస్ మసాలా చిత్రాలను తారక్ తో చేశారు జక్కన్న. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. తారక్ నటన - డాన్స్ అంటే జక్కన్నకు చాలా ఇష్టం. కాబట్టి సహజంగానే ఎన్టీఆర్ అంటే ఇష్టమూ అభిమానమూ ఉన్న జక్కన్న తొలిరోజే తొలి ఆట చూసేశారు. అయితే  ఆసినిమాను ఒక్కసారి చూస్తే రొటీన్. ఈ చిత్రాన్ని జక్కన్న రెండుసార్లు చూడటం విశేషం. ఒక షో పూర్తయిన వెంటనే... ఆ తరువాతి షోకి కూడా టిక్కెట్ తీసుకుని జక్కన్న చూసేశారు. అంటే బ్యాక్ టు బ్యాక్ షోలు చూశారన్నమాట. తారక్ వీరాభిమానులు కూడా బహుశా ఒక షో చూసి సంతృప్తి పడతారని చెప్పుకోవచ్చు. కానీ జక్కన్న ఇలా రెండు షోలు చూశారంటే... ఎంత అభిమానమో చూడండి. తొలిసారి చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో... రెండోసారి కూడా అదే స్థాయిలో ఆనందించారట.

తన ట్విట్టర్ లో ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు జక్కన్న. జనతా గ్యారేజ్ చిత్రాన్ని బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండుసార్లు చూశానని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో తారక్ నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. పరిపక్వమైన నటనను ప్రదర్శించాడు అన్నారు. ఎన్టీఆర్ - మోహన్ లాల్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్యా సాగిన సన్నవేశాలు ఉద్వేగభరితంగా ఉన్నాయన్నారు. టెంపర్ సినిమా తరువాత తన కెరీర్ పంథాను మార్చుకున్న తారక్ తీరును జక్కన్న ప్రశంసించారు. సో... ఈ ట్వీట్ చూడగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బోలెడంత ఆనందం కలుగుతుంది అని వేరే చెప్పాలా..?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో రాజమౌళికి కూడా తెలియదా !

why kattappa killed baahubali


అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే.. దానికి రాజమౌళి త్వరలోనే ఆన్సర్ చెబుతున్నాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎలాగో 2017లో తెలిసిపోతోంది కాబట్టి.. ఇంకో 8 నెలల వెయిట్ చేయడంలో ఆడియన్స్ కూడా కిక్ ఫీలవుతున్నారు. అయితే అసలు బాహుబలిని ఎందుకు చంపాడనేది రాజమౌళికి క్లారిటీగా తెలియదా??

నిజానికి ఆ క్లయమ్యాక్స్ పంచ్ ఇంత వైరల్ అవుతుందని రాజమౌళి కూడా ఊహించలేదట. అందుకే ఇప్పుడు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూర్చొని ఆయన నాలుగు రకాల ఆన్సర్లను రెడీ చేశాడట. అదేనండీ.. నాలుగు రకలా ప్రీ క్లయ్ మ్యాక్స్ అండ్ క్లయ్ మ్యాక్స్ లను రెడీ చేశాడు జక్కన్న. అయితే వీటిల్లో ఏది బాగుంది అనే విషయంపై డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా టైమ్ పట్టేసింది. ఇకపోతే షూటింగులో ఏకంగా వీటిలో రెండు వర్షన్లను ఆయన షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా రెండూ షూట్ చేయాలా వద్దా అనేది కూడా త్వరలోనే డిసైడ్ అవుతారట.

మొత్తంగా నాలుగు వర్షన్లనూ రెడీ చేసి.. వాటిలో ఏది కిక్కిచ్చింది అనుకుంటే అదే రిలీజ్ చేస్తారనమాట. అయినా రాజమౌళి వంటి జీనియస్ డైరక్టర్ కూడా ఇలా నాలుగేసి క్లయమ్యాక్సులు షూట్ చేసుకుంటూ పోతే ఎలా!!

500 మంది కార్మికులతో బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని నిర్మిస్తున్న జకన్న



దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న బాహుబలి 2  షూటింగ్ శరవేగంగా రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న సంగతి తెలిసినదే. నిర్విరామంగా చాలా రోజులనుండి సాగుతున్న ఈ క్లైమాక్స్ ఫైట్ భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అద్భుతంగా నిలవనుందని సమాచారం. 

అయితే ఈ ఫైట్ లో భాగంగా మాహిష్మతి కోటను విస్తరించనున్నట్టు సమాచారం. మొదటి భాగంలో చూసిన సెట్ లే కాకుండా రెండో భాగానికి సంబంధించి మరికొన్ని కొత్త సెట్స్ మాహిష్మతి రాజ్యంలో నిర్మిస్తున్నారు. 

ఇందులో భాగంగా ఒక భారీ సెట్ కోసం దాదాపు 500మంది కార్మికులు రోజూ కష్టపడుతున్నట్టు సమాచారం. బాహుబలిలో ఇండియా లెవెల్లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న రెండో భాగంతో ఏకంగా ప్రపంచ స్థాయిలో ఖ్యాతి కీర్తి కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. 

రెండు వందల కోట్లతో బాహుబలి 2 నిర్మాణం ఏప్రిల్ లో విడుదల




బాహుబలి ది బిగినిoగ్ మూవీ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిలిమ్ ఇoడస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. విడుదలైన ప్రతీ భాషలో సoచలనాలు సృష్టించింది. ఇoతగా ఆ మూవీ సెన్సేషన్స్ కి కారణం.. అందులో ఉన్న భారీతనమే. మిగతా సినిమా మొత్తo కంటే.. ఆ మూవీ క్లైమాక్స్ తీసిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

బాహుబలి ది బిగినిoగ్ క్లైమాక్స్ చిత్రీకరణ కోసo 1000 మoది ఆర్టిస్టులను ఉపయోగిoచారు. అయినా సరే గ్రాఫిక్స్ లో లక్షల కొద్దీ సైన్యాన్ని సృష్టిoచారు. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కోసo.. ఏకంగా వoద రోజుల షూటింగ్ ప్లాన్ చేయడమే కాకుండా.. 5వేల మoది ఆర్టిస్టులను ఉపయోగిస్తుండడం విశేషo. పైగా కేవలo క్లైమాక్స్ చిత్రీకరణే 30 కోట్ల బడ్జెట్ ను కేటాయిoచారు దర్శక నిర్మాతలు. ఇoత భారీగా తీయడాన్ని నిజానికి సాహసమే అనాలి కానీ.. తాను ఎoత బడ్జెట్ తో తీసిన చిత్రానికి అయినా న్యాయo చేయగలనని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు జక్కన్న.

ఒక క్లైమాక్స్ కే 30 కోట్ల చొప్పున... మొత్తo సినిమాకి 200 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయిoచి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మరో రెoడు నెలల్లో షూటింగ్ పూర్తి కానుoడగా.. 2017 ఏప్రిల్ లో బాహుబలి ది కoక్లూజన్ విడుదల చేయనున్నాడు రాజమౌళి.

1Year For Indian Epic Baahubali బాహుబలి వచ్చి సంవత్సరమైంది




సరిగ్గా ఏడాది క్రితం.. ఇదో రోజున టాలీవుడ్ లో ఓ అద్భుతo చోటు చేసుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న ఏ అoచనా తప్పకుండా.. ఓ తెలుగు సినిమా అయిన బాహుబలి అద్భుతాలను సాక్షాత్కరిoచిoది. ఓ తెలుగు సినిమాతో ఇలాoటి అసామాన్య విజయాన్ని సాధిoచవచ్చని.. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి.

2015 జూలై 10న బాహుబలి ది బిగినిoగ్ విడుదలై.. ఎన్నెన్నో విజయాలను  సాధిoచిoది. దశాబ్దాల పాటు థియేటర్ల మొహo చూడని వాళ్లను కూడా.. సినిమా థియేటర్ వైపు నడిపిoచిoది. ఈ సందర్భంగా.. బాహుబలి ది బిగినిoగ్ కి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను బాహుబలి యూనిట్ విడుద చేసిoది. ఇందులో హీరో ప్రభాస్ నుoచి.. విలన్ రానా.. హీరోయిన్స్ అనుష్క.. తమన్నాలతోపాటు కట్టప్ప పాత్ర పోషిoచిన సత్యరాజ్ పడ్డ కష్టo కూడా కనిపిస్తుoది. నిమిషo పైగా నిడివి ఉన్న ఈ వీడియోని చూసిన తర్వాత.. ప్రేక్షకులు ఒక విషయoలో మాత్రం ఆశ్చర్యానికి గురవుతారు.

బాహుబలి ది బిగినింగ్ మూవీలో తాము చూసిన ప్రతీ సన్నివేశo గ్రాఫిక్ మాయాజాలమే అనే విషయo ప్రేక్షకులకు అర్ధమవుతుంది. అoతగా తన ఊహలను విజువలైజ్ చేసి ఆడియన్స్ కి పిచ్చిక్కిoచిన ఘనత రాజమౌళికి దక్కుతుoది. టాలీవుడ్ స్థాయిని ఖ్యాతిని దిగoతాలకు తీసుకెళ్లడంలో బాహుబలి పాత్ర ఎoతగా ఉందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాo. మరో రెండు వారాల్లో చైనాలో ఈ సినిమా సత్తా చాటనుoది.

Download This Video on MaTelugu.Com




ఇండియన్ అఫ్ ది ఇయర్ 2015 అవార్డుకు ఎంపికైన రాజమౌళి




ఓ వైపు జాతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు.. మరోవైపు పద్మశ్రీ పురస్కారం.. తాజాగా సీఎన్ ఎన్ ఐబీఎన్ ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’.. మొత్తానికి మన రాజమౌళి జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడించేస్తున్నాడు. లేటెస్టుగా అందుకున్న ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది ఓ టీవీ ఛానెల్ కాబట్టి దీన్ని లైట్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ అవార్డును చాలా ప్రతిష్టాత్మకంగానే భావిస్తారు. ఎక్కువగా బాలీవుడ్ వాళ్లకే పట్టం కట్టే ఈ ఛానెల్.. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మన రాజమౌళిని ఈ అవార్డుకు ఎంపిక చేయడమంటే మామూలు విషయం కాదు. సంజయ్ లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ).. ప్రియాంక చోప్రా (బాజీరావ్ మస్తానీ-దిల్ దడ్కనే దో).. రణ్వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ-దిల్ దడ్కనే దో).. ‘పీకూ’ టీమ్.. ‘తల్వార్’ టీమ్.. ఇలా రాజమౌళికి పోటీ తీవ్రంగానే ఉంది. అయినప్పటికీ మన జక్కన్నే పురస్కారానికి ఎంపికయ్యాడు.

ఇక అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ తనకీ పురస్కారం ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు రాజమౌళి. తనకు ఒక్కడికి కాకుండా.. బాహుబలి టీంకు ఈ అవార్డు ఇస్తే చాలా సంతోషించేవాడినని.. ‘బాహుబలి’ లాంటి సినిమా టీం వర్క్ వల్లే సాధ్యమైందని.. ఇందుకోసం అందరూ ఎంతో శ్రమించారని రాజమౌళి చెప్పాడు. ఈ మాట అనగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగింది. ఈ అవార్డుకు రాజమౌళి పేరును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇక చివర్లో ప్రముఖ క్రిటిక్.. సీఎన్ ఎన్ ఐబీఎన్ ఛానెల్ ప్రతినిధి రాజీవ్ మసంద్ మైక్ అందుకుని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పమని అడగ్గా అది చెప్పలేనని.. అందుకోసం ఇంకో ఏడాది ఆగితే సరిపోతుందని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు జక్కన్న.

'బాహుబలి 2' షూటింగ్‌కు కేరళ గిరిజనులు అడ్డంకి !!




బాహుబలి-2 చిత్రాన్ని రామోజీ ఫిలింసిటీలో కొంత తీశాక.. బల్గేరియాలోనూ, కేరళలోనూ కొంత పార్ట్‌ తీయాలని ప్లాన్‌ చేశారు. ఇందుకోసం రంగం సిద్ధమైంది. అయితే.. కేరళలోని గిరిజన ప్రాంతంలోని ఓ అడవిలో షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇందుకోసం ఆ ప్రభుత్వం నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

బాహుబలి మొదటిభాగం అక్కడ కూడా బాగానే ఆడింది. అయితే అక్కడి గిరిజనులు ఈ చిత్ర షూటింగ్‌ అడ్డుకుంటామని ప్రకటించడంతో.. యూనిట్‌ ఆలోచనలో పడింది. దానికి ప్రధాన కారణం.. అక్కడ గతంలో చేసిన చిత్రీకరణలో కొంతమంది గిరిజనులు పాల్గొన్న వారెవరూ ఆ చిత్రంలో లేరట. దాంతో వారికి సరైన వివరణ ఇచ్చుకోలేని యూనిట్‌, మరో ప్రాంతానికి వెళ్ళే ఆలోచనలో వున్నట్లు తెలియవచ్చింది. ఇందుకోసం చిత్ర యూనిట్‌ కొత్త ప్రాంతాన్ని వెతికే పనిలో వున్నారు. కాగా, ఈ నెల 26 నుంచి అక్కడ ప్లాన్‌ చేయాల్సి వుంది.

లాటిన్‌ అమెరికాలో బాహుబలి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం చిత్రం బాహుబలి. ప్రభాస్‌, రానా, రమకృష్ణ, అనుష్కలు లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఇండియాతో పాటు, అమెరికా, జపాన్‌ లాంటి చాలా దేశాల్లో భారీ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించాలని బాహుబలి లాటిన్‌ అమెరికాలో విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ సన్‌ డిస్ట్రబ్యూటర్స్‌, బాహుబలి సినిమాను లాటిన్‌ అమెరికాలో భారీగా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తోంది. బాహుబలి హక్కులను సొంతం చేసుకుంది. అమెరికాలో వీలైననిన ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. అందుకోసం పెద్ద సంఖ్యలో థియేటర్లను బ్లాక్‌ చేయడానికి సంప్రదింపులు జరుపుతోంది.