Showing posts with label Chiru. Show all posts
Showing posts with label Chiru. Show all posts

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి గారు




మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అయినా, చిరంజీవిగానే ఆయన సుపరిచితుడు. కేంద్ర మంత్రి కాకముందే చిరంజీవికి దేశవ్యాప్తంగా పాపులారిటీ వుండది. ఎందుకంటే, తన డాన్సులతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఓ ఊపు ఊపేశారు చిరంజీవి. బాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, అక్కడా తన ఉనికిని చాటుకున్నారాయన. 
తెలుగు తెరపై రెండు దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యం చిరంజీవిదే. నెంబర్‌ వన్‌ అన్న పొజిషన్‌ జోలికి ఇంకొకర్ని రానివ్వలేదాయన. తెలుగు సినీ బాక్సాఫీస్‌కి చిరంజీవి కొత్త అర్థం చెప్పారు. రికార్డులంటే చిరంజీవి మాత్రమే.. అనేంతలా తెలుగు సినీ పరిశ్రమని శాసించారు చిరంజీవి. ఈ విషయంలో ఎవరూ విభేదించే అవకాశాలే లేవు. ఫ్లాప్‌ సినిమా అంటే ఐదు నుంచి ఏడు వారాలు థియేటర్లలో ప్రదర్శితమయ్యేది. చిరంజీవితో సినిమా తీసి నష్టపోయినవారు లేరు, ఆయనకి స్టార్‌డమ్‌ వచ్చాక. ఫ్లాపయినా నిర్మాత సేఫ్‌.. హిట్టయితే, నిర్మాతకి పండగే పండగ.. ఇదీ తెలుగు సినీ రంగంలో చిరంజీవికి మాత్రమే చెల్లిన 'లెక్క'. 
రోజులు మారాయి. 'ఇంద్ర', 'ఠాగూర్‌' తర్వాత తెలుగు సినిమా లెక్కలూ మారిపోయాయి. సరిగ్గా ఆ టైమ్‌లోనే చిరంజీవి సినిమాల్ని తగ్గించేశారు. 'శంకర్‌దాదా జిందాబాద్‌' తర్వాత చిరంజీవి హీరోగా సినిమా ఇప్పటిదాకా రాలేదు. దాదాపు పదేళ్ళపాటు చిరంజీవి వెండితెరకు దూరమయ్యారు. 'మగధీర', 'బ్రూస్‌లీ' సినిమాల్లో కనిపించినా, చిరంజీవి హీరోగా సినిమా అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. కాలం తెచ్చిన మార్పులెన్నో వున్నాయి. బాక్సాఫీస్‌ లెక్కలు బాగా మారిపోయాయి. 
ఏడాది పాటు సినిమా ప్రదర్శితమవడం, 175 రోజుల ప్రదర్శితమవడం, హండ్రెడ్‌ డేస్‌.. 50 డేస్‌.. అనే ప్రశ్నే లేదిప్పుడు. తొలి రోజు ఎంత.? తొలి వారం ఎంత.? ఇదే లెక్క చుట్టూ నిర్మాతలు నానా తంటాలూ పడ్తున్నారు. ఆ లెక్కలు పట్టుకునే, స్టార్‌డమ్‌ అంటూ కొందరు హీరోలు, వారి అభిమానులు విర్రవీగుతున్నారు. కానీ, 'వన్‌ టూ టెన్‌ చిరంజీవిగారే.. ఆ తర్వాతే మేం ఎవరమైనా..' అని ఓ సందర్భంలో మహేష్‌ వ్యాఖ్యానించాడు. అది చిరంజీవి మీద గౌరవంతో అన్నాడో, నిజంగానే అన్నాడోగానీ, అది నిజం. 
పెద్ద హీరోల సినిమాలు హిట్టయితే ఓకే.. లేదంటే, నష్టాలు దారుణంగా వుంటున్నాయి. హిట్టయినా, నిర్మాతలకు డబ్బులు రాని పరిస్థితి. హైప్‌ పెంచడం కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసేయడం, ఆ తర్వాత చతికిలపడ్డం.. ఇది తెలుగు సినిమాకి, అందునా పెద్ద సినిమాలకు పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. ఈ లెక్కల నడుమ, చిరంజీవి హీరోగా కొత్త సినిమా రానుంది. అందుకే, ఈ ఏడాది పుట్టినరోజు చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్‌. 
బాలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్‌ని శాసించిన అమితాబ్‌ బచ్చన్‌, ఇప్పుడు తనకు సూటయిన సినిమాలే చేసుకుంటున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ తీరు వేరు. తన సినిమాలతో ప్రేక్షకుల్ని, డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లనీ, నిర్మాతల్నీ నిలువునా ముంచేస్తున్నారు. ఆకాశాన్నంటే అంచనాల నడుమ రజనీకాంత్‌ అన్న పేరు, సినిమా పబ్లిసిటీకి పనికొస్తుంది తప్ప, ఆ సినిమా నిర్మాతని కాపాడలేకపోతోంది. మరి, చిరంజీవి పరిస్థితేంటి.? 
తమిళ సినిమా 'కత్తి'ని చిరంజీవి రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. మరి, ఈ సినిమాతో చిరంజీవి, తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త అర్థం చెబుతారా.? చెప్పగలిగితే మాత్రం.. మహేష్‌ మాట నూటికి నూరుపాళ్ళూ నిజం. వన్‌ టూ టెన్‌ చిరంజీవే. ఓవర్సీస్‌ లెక్కలు, భారీ అంచనాలు, తొలి రోజు వసూళ్ళు.. వీటన్నిటి నడుమ, మెగాస్టార్‌ ఇమడలేకపోతే మాత్రం.. కష్టమే.! 
ఏదిఏమైనా, సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తెరపై సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందించేద్దాం. హ్యాపీ బర్త్‌ డే టూ మెగాస్టార్‌ చిరంజీవి.

‘పునాది రాళ్లు’ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా పునాది వేసుకొని ఆ తరువాత వరుస సూపర్ డూపర్ హిట్స్ తో విజేత గా మారి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ గా ముద్ర వేసుకొని గ్యాంగ్ లీడర్ బిరుదు తో ముఠా మేస్త్రి అనిపించుకోవడం ఒక్క చిరంజీవి కే సొంతం.. టాలీవుడ్ సినిమాకు తన డాన్సులతో నటనతో చిరు మరింత కళ తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో విలన్ గా అలరించిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మెగా స్టార్ అని పిలిపించుకున్నాడు. ఇక తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకొని సంచలనం సృష్టించాడు మెగా స్టార్. ఎనలేని అభిమానులతో పాటు తిరుగులేని రికార్డులు కూడా చిరు సొంతం. చిరు చిత్రం వస్తుందంటే చాలు ఆ రోజు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులకూ పండగే. 

చిరు మీలో ఎవరు కోటీశ్వరుడుని మరో స్థాయికి తీసుకెళ్తాడు : నాగ్



మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయి. ఇంతకుముందెన్నడూ లేని టీఆర్పీ రేటింగ్ సాధించింది ఈ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం అంత పెద్ద సక్సెస్ కావడంలో నాగార్జునది కీలక పాత్ర. ఐతే మూడు సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగ్.. అనూహ్యంగా నాలుగో సీజన్ కు దూరమైపోయాడు. ఆయన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. ఐతే ఇది ప్రోగ్రాం మేలు కోసం తీసుకున్న నిర్ణయమే అని.. చిరంజీవి ఈ కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాడని ధీమా వ్యక్తం చేశాడు నాగ్.

‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అది నా జీవితంలో ఓ కీలక మలుపు. ఇన్నేళ్లలో సినిమాల ద్వారా ఎంత ఆదరణ సంపాదించుకున్నానో.. అంత ఆదరణ ఈ ప్రోగ్రాంతో దక్కింది. ఐతే సమయానికి తగ్గట్లు మనం ముందుకు వెళ్లిపోవాలి. షో సూపర్ సక్సెస్ అయినపుడే నిష్క్రమించడం మంచిదే. చిరంజీవి గారు నా స్థానంలోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్తారు’’ అని నాగ్ అన్నాడు.

ప్రస్తుతం సినిమాలతో తాను తీరిక లేకుండా ఉన్నానని.. తన కొడుకులిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించనుండటంతో తనపై బాధ్యత పెరిగిందని నాగ్ అన్నాడు. కొడుకులిద్దరికీ సొంత బేనర్లో మంచి సినిమాలు అందిస్తానని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వాళ్లిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించబోతున్నానని.. అవి కచ్చితంగా పెద్ద విజయాలు సాధిస్తాయని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

బాస్ ఈజ్ బ్యాక్ చిరు 150వ సినిమా ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్




ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు పురస్కరించుకుని.. ఆయన కొత్త సినిమా.. రీఎంట్రీ సినిమా.. 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్లో కేవలం చిరంజీవిని వెనుకనుండే చూపించినప్పటికీ.. ''ఖైదీ నెం 150'' అనే టైటిల్ లుక్ అదిరిపోయింది. అంతేకాదు.. ఈ టీజర్ కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కత్తిలా ఉందంతే. ''ఖైదీ నెం వన ఫైవ్ జీరో.. అరె వచ్చేశాడు మనకోసం మన ఎవర్ గ్రీన్ హీరో'' అంటూ ''బాస్ ఈజ్ బ్యాక్'' అనే థీమ్ సాంగ్ కంపోజ్ చేసిచ్చాడు దేవిశ్రీ. మొత్తంగా ఈ లుక్ అదిరిపోయిందంతే. అలాగే రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ వారి లోగో డిజైన్ కూడా అదిరిపోయింది. 

కాకపోతే ఎక్కడా కూడా చిరంజీవి ఫేస్ అస్సలు చూపించలేదనే చిన్న వెలితి మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఎక్కడో తెలియని చిన్న బాధను కలగజేసిందని టాక్. అయితే ఈ మొత్తం టీజర్ తాలూకు హైప్ మాత్రం మామూలుగా లేదులే. 


Boss is Back :- Mega Star 150th Film Khaidi No_150 First Look Motion Poster Download on MaTelugu.Com



చిరు బర్త్ డే కానుకగా 150వ సినిమా ఫస్ట్ లుక్

Chiranjeevi 150th Movie Pre Release Poster



మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా సందడి మొదలై రెండు నెలలు పైగానే గడిచింది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా చిరు బర్త్ డే కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అటు తమ అభిమాన హీరో బర్త్ డే కావడంతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనే టాక్ గట్టిగానే వినిపించింది.

అభిమానుల అంచనాలను ఏ మాత్రం కాదనకుండా.. చిరు 150 ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 22న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్ చరణ్ ప్రకటించేశాడు. 'ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు టీమ్ అంతా రెడీగా ఉన్నాం' అన్న రామ్ చరణ్.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓ మ్యాప్.. దానికి ముందు రెడ్ కలర్ కర్టెన్ ఆ పోస్టర్ లో కనిపిస్తాయి. హైద్రాబాద్ మ్యాప్ అని అర్ధమయ్యేందుకు కర్టెన్ పై బుద్ధుడుని.. చార్మినార్.. గోల్కొడ కోటలను చూపించారు. మ్యాప్ పై అండర్ గ్రౌండ్ ని చూపించారు లెండి. ఈ థీమ్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే కానీ.. కర్టెన్ రైజర్ పోస్టర్ ని చూసి.. ఫ్యాన్స్ ఆనందంతో కేకలు పెట్టేస్తున్నారు.

ఇక కొణిదెల ప్రాడక్షన్స్ అనే బ్యానర్ తో విడుదలైన మొదటి పోస్టర్ ఇదే కావడంతో ఆభిమానులు ఆత్రంగా షేర్ చేసేకుంటున్నారు. ఫస్ట్ లుక్ ఆగస్ట్ 22న ఖాయమని చెర్రీ చెప్పేయడంతో.. మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈసారి చిరు బర్త్ డే సంబరాలతో పాటు.. చిరు 150కి సంబంధించిన ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ కానుంది.

chiru 150th movie first look teaser trailer download watch teaaser online chiru 150 movie mega star 150th movie 

మా టీవీ సినిమా అవార్డ్స్ లో చిరు డాన్స్ అదరహో





మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై డ్యాన్స్ వేశారంటూ.. చిరు డ్యాన్స్ ఫినిషింగ్ ని మాత్రం టీజర్ లో చూపించి మాటీవీ తెగ ఊరించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ అభిమానులు ఆత్రంగా టీవీలకు అతుక్కు పోయేట్టు చేయడంలో బాగానే సక్సెస్ అయింది. రెండు రోజుల పాటు టీజర్ చూపించి.. రెండు నిమిషాలు మాత్రమే పెర్ఫామెన్స్ చేయడం కొంత నిరుత్సాహం కలిగించే విషయమే అయినా.. దానికి ముందు మాటీవీ అనుసరించిన స్ట్రాటజీని అదరహో అనాల్సిందే. 

దాదాపు ఒక గంటపాటు మెగా ఎపిసోడ్ ని నడిపించారు. తనికెళ్ల భరణితో స్టార్ట్ చేసి.. దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ-ఓ సాంగ్ కి పెర్ఫామెన్స్.. తర్వాత నవదీప్ స్టేజ్ పైకి వచ్చాడు. సేమ్ కాసేపు చిరు గురించి.. నెక్ట్స్ మళ్లీ ఓ సాంగ్. ఆ తర్వాత మెగామేనల్లుడు సాయిధరం తేజ్ వచ్చాడు. ఓ ఏవీ.. దానికి సాయి కుమార్ వాయిస్ ఓవర్.. ఇక తేజు కూడా ఓ మెగా సాంగ్ కి చిందులేశాడు. అప్పుడు శ్రీకాంత్ రంగ ప్రవేశం చేశాడు. అందరూ వచ్చాక మెగా స్టార్ గురించి నాలుగు మాటలు చెప్పారు. 

అప్పుడు మొదలైంది అసలు సందడి. మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి రాగానే ఆడిటోరియం అంతా స్టాండింగ్ ఒవేషన్. ఆ ఒక్క ఫ్రేమ్ చాలు.. మెగాభిమానుల గుండెలు ఉప్పొంగిపోవడానికి. మెగా 150 గురించి మెగాస్టార్ నోటి వెంట విన్నాక.. అసలు ఈవెంట్ కే హైలైట్ ప్రారంభమైంది. గ్యాంగ్ లీడర్ లో చిక్ చిక్ చేలం పాటకు చిరువేసిన డ్యాన్స్ తో మొత్తం ఆడిటోరియం మెస్మరైజ్ అయిపోయింది. 61ఏళ్ల వయసులో అంత గ్రేస్ తో మెగాస్టార్ డ్యాన్స్ చేయడం చూస్తే.. మొత్తానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 

ఇక చిరు డ్యాన్స్ అయిపోయాక రామ్ చరణ్ వాటర్ బాటిల్ పట్టుకుని పరుగెత్తుకుంటూ రావడం.. బన్నీ కంటి వెంట నీరు కారిపోతుంటే తుడుచుకోవడం.. మాకోసం  మీకు ఇలాంటివి అవసరం అని నాగార్జున అనడం.. మెగాస్టార్ డ్యాన్స్ చేస్తుంటే మా ఫ్యామిలీ అందరి మొహాలు వెలిగిపోయాయి.. మొత్తం తెలుగు ఆడియన్స్ కూడా అంతే అనుకుంటున్నా అని అల్లు అరవింద్ చెప్పడం.. ఇలా చివరి గంట మొత్తం మెగా స్టార్ కి అంకితం అయిపోయింది సినీ మా అవార్డ్స్ ఫంక్షన్. 


సచిన్ తో పాటు కేరళ ఫుట్ బాల్ క్లబ్ ను కొన్న చిరు నాగ్





క్రికెట్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను పెట్టినట్లు.. ఫుట్ బాల్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ ఒకటి పెట్టారు. ఈ లీగ్ లో పివిపి సంస్థ.. ఇతర పార్టనర్లతో కలసి ''కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్'' టీమ్ ను కొనుక్కుంది. అయితే లీగల్ కేసుల్లో ఇరుక్కోవడం కారణంగా పివిపి తప్పుకున్నారు. ఆ తరువాత కేరళ టీమ్ ఏమవుతుంది అంటూ అందరూ ఖంగారుపడుతున్నవేళ.. మేమున్నాం అంటూ ముందుకొచ్చారట తెలుగు స్టార్లు. క్రికెట్ లెజండ్ సచిన్ టెండుల్కర్ తో కలసి.. చిరు అండ్ నాగ్ గ్యాంగ్ గతంలో ఎలాగైతే మాటివి లో షేర్ కొనుకున్నారో.. ఇప్పుడు ఈ క్లబ్ ను కూడా కొనుక్కున్నారు. అబ్బబ్బా.. డబ్బులును సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం అంటే.. చిరంజీవి అండ్ నాగ్ తరువాతేనబ్బా. పిచ్చెక్కించారు కదూ. 

ఇకపోతే ఈ విషయాన్ని స్వయంగా కింగ్ నాగార్జున కూడా కన్ఫామ్ చేశారు. సచిన్ తో కలసి తామందరం క్లబ్ కొన్నట్లు ఆయన ఈరోజు ఉదయం తిరుమల దర్శనం చేసుకున్న తరువాత అఫీషియల్ గా ప్రకటించారు. 

కొబ్బరిమట్ట టీజర్ ను మెగాస్టార్ కి దగ్గరుండి చూపించిన సంపూ



బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆనందానికి అవధుల్లేవిప్పుడు. బాబు కొత్త సినిమా ‘కొబ్బరిమట్ట’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేసింది సోషల్ మీడియాలో. బర్నింగ్ స్టార్ పలికిన సుదీర్ఘమైన డైలాగ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ.. మొత్తానికి అది చర్చనీయాంశం అయితే అయ్యింది. టీజర్ సెన్సేషనల్ హిట్టయిపోయింది. 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్స్ లో దీనికి చోటు దక్కింది. ట్విట్టర్లో సైతం ‘కొబ్బరి మట్ట’ ట్యాగ్ హైదరాబాద్ స్థాయిలో టాప్ లో ట్రెండ్ అయింది. సెలబ్రెటీలు చాలామంది ఈ టీజర్ గురించి పాజిటివ్ గా స్పందించారు.

ఇప్పుడిక సంపూ ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ టీజర్ చూశారు. నిన్న సినీ కార్మికులకు సంబంధించి జరిగిన సన్మాన వేడుకకు చిరంజీవి అతిథిగా రాగా.. అక్కడే మాటు వేసిన సంపూర్ణేష్ బాబు చిరును కలిసి తన టీజర్ చూపించాడు. తన మేనల్లుడు సాయిధరమ్ రిలీజ్ చేసిన ఈ టీజర్ ను చిరంజీవి ఆసక్తిగా తిలకించాడు. సంపూ పలికిన సుదీర్ఘమైన డైలాగ్ చూస్తూ సరదాగా నవ్వుకున్నాడు మెగాస్టార్. టీజర్ బాగుందంటూ సంపూను అభినందించాడు కూడా. ఇక బర్నింగ్ స్టార్ ఆనందానికి అవధులేముంటాయి చెప్పండి. కేవలం సోషల్ మీడియాను నమ్ముకుని ఎదిగిన సంపూ.. ఇలా తన సినిమా టీజర్ ను మెగాస్టార్ కు చూపించి ప్రశంసలు అందుకోవడం చిన్న విషయం కాదు కదా.

150 వ సినిమాకు చిరు రెమ్యునరేషన్ ?




సాధారణంగా సొంత బ్యానర్ లో సినిమాలు తీసే హీరోలు రెమ్యునరేషన్ గురించి పట్టించుకోరు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి నటించిన ఏ సినిమాలోనూ నాగార్జున రెమ్యునరేషన్ తీసుకున్న వార్తలు లేవు. 

అలానే దగ్గుబాటి వారి ఫ్యామిలీ కుడా. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ తో అల్లు అర్జున్ చేసిన ఏ సినిమాకు బన్నీ పారితోషికం పట్టించుకోడని టాక్. చరణ్ కూడా తన మూడవ సినిమా ఆరెంజ్ నాగబాబు బ్యానర్ లో తీసిన నేపధ్యంలో పేమెంట్ అడగలేదని వార్తలు వినిపించాయి. 

అయితే ఇప్పుడు సొంత తనయుడి బ్యానర్ లో చిరు నటించనున్న 150వ సినిమాకు మాత్రం చిరు ఏకంగా 30కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిగర్ ఇప్పుడున్న బడాహీరోలకంటే ఒక 15శాతం పెద్దదే. అయితే ఈ వార్తపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించడం విశేషం. రీ ఎంట్రీ విషయంలో డేట్ లనుండీ మనీ మ్యాటర్స్ వరకూ అన్నీ పక్కాగా వుండాలని చరణ్ భావిస్తున్నాడని ఒకరు అంటుంటే నేటి హీరోలకంటే తానెప్పుడూ ఎక్కువే అని నిరువుపించుకోవాలని చిరు కోరిక అన్నది మరొకరి వాదన. 

మెగా హీరోల సందడి 3 రోజుల్లో 5 సినిమాల ప్రారంబోత్సవం



మా ఫ్యామిలీ హీరోలందరినీ కలిపితే క్రికెట్ టీమ్ తయారైపోతుందని జోక్ చేశాడు వరుణ్ తేజ్. అవును.. టాలీవుడ్లో ప్రస్తుతం ఏ ఫ్యామిలీలో లేనంత మంది హీరోలున్నారు మెగా కుటుంబంలో. నాగబాబును మినహాయిస్తే ప్రతి ఒక్కరూ యాక్టివ్ గా ఉన్నవాళ్లే. చిరంజీవి కూడా పునరాగమనానికి రెడీ అయిపోతున్నాడు. ఏడాదికి అరడజనుకు తక్కువ కాకుండా మెగా ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి. అలాగే ఆ హీరో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు.. ఆడియో వేడుకలు.. తరచుగా జరిగిపోతుంటాయి. మరీ ఇప్పుడైతే వారం రోజుల వ్యవధిలో ఐదు మెగా సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటుండటం విశేషం.

ఇవాళ ముందుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఏ హడావుడి లేకుండా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీని తర్వాత గురువారం వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమాను ఆరంభించబోతున్నారు. ఇదే రోజు అల్లు శిరీష్ హీరోగా.. కొత్త దర్శకుడు మల్లిడి వేణు రూపొందించబోయే సినిమాను కూడా మొదలుపెట్టబోతన్నారు. ఇక శుక్రవారం కూడా రెండు సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాయి. 

అందులో మోస్ట్ అవైటెడ్ చిరంజీవి 150వ సినిమా ఉండటం విశేషం. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా మొదలవుతోంది. అదే రోజు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఈ నెల 29 తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈ మూడు రోజుల్లోనే చకచకా ప్రారంభోత్సవాలు జరిపించేస్తున్నారు మెగా హీరోలు.

మెగాస్టార్ ఇంట్లో పెళ్లి సందడి చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం








మెగాస్టార్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం కోసం మెగా లెవెల్లోనే ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక- రిసెప్షన్ కనీవినీ ఎరుగని స్థాయిలో జరపబోతున్నారు.  హైదరాబాద్ - బెంగుళూరుల్లోని చిరంజీవి నివాసాలు కొత్త శోభని సంతరించుకున్నాయి.  కూతురు పెళ్లిని దృష్టిలో ఉంచుకొని రెండు చోట్లా తన ఇళ్లని  ఈమధ్యే రెనొవేషన్ చేయించాడు చిరు. ఇప్పుడు  ఆ ఇళ్లకి పెళ్లి హంగులు కూడా జోడవడంతో మరింత కళ సంతరించుకున్నాయి. వివాహం బెంగుళూరులోని ఇంట్లో 28న జరగబోతోంది. అక్కడికి పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రుల్ని ఆహ్వానించారట. 31న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. అక్కడికి మాత్రం సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఆహ్వానించారు. 

శ్రీజ ఇప్పటికే పెళ్లి కూతురైంది.  పెళ్లి కళ ఉట్టిపడుతున్న ఆమెతో కలిసి తమ్ముడు వరుణ్ తేజ్ ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు. శ్రీజ నిజంగానే కుందనపు బొమ్మలా ఉంది. మా ఇంట్లో సెలబ్రేషన్స్ షురూ అయ్యాయంటే వరుణ్ తేజ్ ట్వీటాడు. వారం రోజులపాటు జరిగే ఈ సంబరాల్లో చిరంజీవి కుటుంబం మొత్తం పాల్గొంటుంది. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా పనుల్ని పక్కనపెట్టి మరీ ఈ వేడుకల్లో పాలు పంచుకొంటాడట. ఇటీవలే చిరు - పవన్ లు కలిసి ఆడియో వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య ఎంత సఖ్యత ఉందో ఆ వేడుకతో నిరూపించారు. ఇప్పుడొచ్చిన ఫ్యామిలీ ఫంక్షన్ తో మళ్లీ  మెగా హీరోలంతా కలిసి ఒకచోట సందడి చేయబోతున్నారన్నమాట.

Jagan Meets To Mega Star Chiru !! చిరుని కలవనున్న జగన్ !!



వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ నష్టనివారణ చర్యలు చేపడుతున్నారా? ఈ క్రమంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఆయన సమర్థంగా ఉపయోగించుకునేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారా? అంటే తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం అవుననే సమాధానం వస్తోంది. తునిలో కాపు గర్జన సభను ఏ పార్టీ నిర్వహించకుండానే అంతమంది కాపులు హాజరు కావటం జగన్కు ఆశ్చర్యం కలిగించిందట. ఈ ఎపిసోడ్ పై తీవ్రంగా ఆలోచించిన జగన్..ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు.

పార్టీలో ఇప్పటికే కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలు అంబటి రాంబాబు - వంగవీటి రాధ లాంటి వాళ్లు ఉన్నా...వారి శక్తి సామర్ధ్యాలని సరిగ్గా ఉపయోగించటం లేదు. దీంతో కాపులను తను వైపు తిప్పుకోవటం కోసం మరో కొత్త నాయకున్ని వెతికే పనిలో జగన్ పడ్డారట. ఈ లిస్ట్ లో ఇద్దరు నాయకులు కనిపించారని అందులో ఒకరు కాపు గర్జనని దగ్గరుండి నడిపించిన ముద్రగడ అయితే..మరొకరు అదే సామాజిక వర్గంలో బలంగా ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి అని చెప్తున్నారు. మొదట ముద్రగడకు అవకాశం ఇద్దామని అనుకున్నా...కాపు గర్జన సభ తరువాత చంద్రబాబుకు అనుకూలంగా ముద్రగడ మారాడని వెనక్కి తగ్గారట. అయితే ఇప్పుడు అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి చిరంజీవి మాత్రమే సో...ఈయనకి అవకాశం ఇచ్చి  రానున్న ఎలక్షన్ లో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లే జరిగితే జగన్ త్వరలో చిరంజీవి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తో కలవటం వల్ల చాల ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటున్నారు పార్టీ వర్గాలు. 2019లో గెలిచేది జగన్ అని... పార్టీలోకి వస్తే మంచిదని చిరంజీవికి జగన్ పార్టీ వర్గాలు చెబుతున్నాయని సమాచారం. దీంతో పాటు చిరంజీవి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసినా..తనకు రాల్సినంత గౌరవం పార్టీనుంచి రావటం లేదని చిరు చాలా సార్లు తన సన్నిహితుల దగ్గరచెప్పారని అంటున్నారు. దీంతో చిరంజీవి పార్టీలోకి చేరితే జగన్ కు అటు చిరంజీవికి మేలు జరుగటం ఖాయమంటున్నారు. ఈ ప్రతిపాదన తెరమీదకు వస్తుందా?  వేచి చూడాలి మరి.

Bruce lee first weekend collections

Mega Power Star Ram Charan’s Bruce Lee heading to flop. The film which was released amid huge expectations failed to reach them. The film has collected 26.84 Crores by end of its first weekend. As per reports many theatres replacing Bruce Lee with Rudramadevi movie.

No Big ticket films are releasing in this weekend and it may help to fetch some more bucks for Bruce Lee. We need to see where the film will end its run.

Bruce Lee First Weekend box office Collections:

Nizam areas: Rs 6.10 crores

Ceeded Region: Rs 4.10 crores

Uttara Andhra areas: Rs 2.20 crores

Guntur region: Rs 2.38 crores

Krishna district: Rs 1.32 crores

East: Rs 2.02 crores

West: Rs 1.70 crores

Nellore: Rs 97 lakhs

Bruce Lee First Weekend AP & Nizam Collections: Rs 20.79 crore

Karnataka region : Rs 2.50 crores

ROI: 40 lakhs

Chennai: Rs 0.25 crore

USA: Rs 1.90 crore

ROW: Rs 0.50 crore

Tamil Version: 0.50 crore

Bruce Lee First Weekend WORLDWIDE Collections: Rs 26.84 crore

చిరంజీవి పార్టీ మారుతున్నాడా ...?!!

తెలుగు చలన చిత్ర రంగంలో రారాజుగా వెలిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఏడేళ్ల క్రితం రాజకీయ రంగంలో అడుగు పెట్టి సొంతగా 'ప్రజారాజ్యం' అనే పార్టీని స్థాపించి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు. తర్వాత మళ్లీ సినిమా రంగానికి రావాలని నిశ్చయించుకున్నారు. చిరంజీవి త్వరలో మొదలెట్టనున్న 150చిత్రానికి రాహుల్ గాంధీ రెడ్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అందుకే ఆయన 150 సినిమా అనుకున్న ప్రకారం బర్త్ డే రోజు మొదలు కాలేదని చెప్తున్నారు. రాహుల్ సూచనతో చిరంజీవి నోచ్చుకున్నారని అయన సన్నిహితులు అంటున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చిరంజీవి కోపంగా ఉన్నారని వార్తలొస్తున్నాయని, పార్టీ కార్యకలాపాల్లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తనను పక్కన పెడుతున్నారని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ బాగా గ్రహించినట్లు తెలుస్తోంది. దిలా ఉండగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల నుంచి బెజేపీకి మద్దతు కొనసాగిస్తున్నారు. చిరంజీవి స్టెప్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Chiru

ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది అలాంటి వ్యక్తి ని తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు . శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరంజీవి పేరున్న నటుడని, అతనికున్న ఇమేజ్ పార్టీకి సహకరిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన బిజెపిలోకి వస్తానంటే, ఆనందంగా స్వాగతం పలుకుతామని వివరించారు.ఈ నేపథ్యంలోనే, ఇకపై ఆ పార్టీలో కొనసాగరాదని చిరంజీవి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడితే, బిజెపిలో చేరుతారా? లేక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా? అనేది వేచి చూడాలి.
Previous Page