Showing posts with label Reliance Jio. Show all posts
Showing posts with label Reliance Jio. Show all posts

5G మొబైల్ తో జియోకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న నోకియా Nokia is Back



ఒకప్పుడు సెల్‌ఫోన్ అంటే నోకియా అన్నంతగా ఆ బ్రాండ్ జనాల్లోకి వెళ్లగలిగింది. కానీ కాల క్రమంలో పుట్టుకొచ్చిన స్మార్ట్ ఫోన్ల ధాటికి నోకియా కనుమరుగవక తప్పలేదు. తిరిగి ఇన్నాళ్లకు నోకియా మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ దఫా 5జీ కనెక్టివిటీతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించేందుకు నోకియా కసరత్తులు మొదలుపెట్టింది. మళ్లీ చాలాకాలం తర్వాత మోడ‌ల్ 3310తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ ఫిన్‌లాండ్ సంస్థ నోకియా. త్వ‌ర‌లోనే 5జీ టెక్నాల‌జీపై నోకియా దృష్టిసారించ‌నుంది. ఇందుకోసం టెలికాం రంగంలో ప్ర‌ముఖ సంస్థ ఎయిర్‌టెల్‌, ప్ర‌భుత్వ‌రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో క‌లిసి భార‌త్‌లో 5జీ నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. ఇదే విష‌య‌మై ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌,బీఎస్ఎన్ఎల్ సంస్థ‌ల‌తో నోకియా అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. 2019-2020క‌ల్లా భార‌త్‌లో 5జీ టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టేందుకు ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని నోకియా హెడ్ ఇండియా మార్కెట్ సంజ‌య్ మాలిక్ తెలిపారు.

బెంగ‌ళూరు కేంద్రంగా 5జీ టెక్నాల‌జీపై మ‌రింత ప‌రిశోధ‌న‌లు చేసేందుకు నోకియా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఒక‌ప్పుడు విరివిగా సేవ‌లందించిన నోకియా ఆ త‌ర్వాత స్మార్ట్ ఫోన్ విప్ల‌వంతో మార్కెట్లో క‌నుమరుగైంది. మ‌ళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు నోకియా సిద్ధ‌మ‌వ‌డ‌మేగాక ఏకంగా 5జీ టెక్నాల‌జీతో వ‌స్తుండ‌టంతో మొబైల్ ప్రియులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

జియో ఫోన్ కొనాలనుకునేవారు ఈ విషయాలను తెలుసుకోండి



టెలికాం రంగంలో ప్రకంపనాలు సృష్టించిన జియో తాజాగా 4 జి ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టి ప్రత్యర్దుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాలా చేస్తోంది..ఈ ఫీచర్ ఫోన్ పై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..రూ.1500 డిపాజిట్ తో లభించనున్న ఈ ఫోన్ ఆగస్టు 24 నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్ లో కేవలం ఒక్క సిమ్ కే అవకాశం ఉందట. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ ఫీచర్ తో రావడం లేదని తెలిసింది. అది కూడా వీవోఎల్ టీఈ ఫీచర్ ఉన్న సిమ్ మాత్రమే ఈ ఫోన్ లో పని చేస్తుంది.

అంటే.. ప్రస్తుతం వీవోఎల్ టీఈని అందిస్తున్నది దేశంలో జియో మాత్రమే కనుక, కేవలం ఆ సంస్థకు చెందిన సిమ్ లు మాత్రమే జియో 4జీ ఫీచర్ ఫోన్ లో పనిచేస్తాయన్నమాట. ఇతర నెట్ వర్క్ లకు చెందిన సిమ్ లను వేసుకోలేం. అయితే భవిష్యత్తులో ఈ ఫోన్ కు చెందిన డ్యుయల్ సిమ్ వేరియెంట్ ను తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు జియో ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఫోన్ పై అనేక సందేహాలు కూడా ఉన్నాయి.

జియో 4జీ ఫీచర్ ఫోన్ నడిచేది పూర్తిగా విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్ తో. ఆ ఫోన్ కోసం ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. కనుక అందులో వాట్సప్ రాదు. కానీ యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ ను అందించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక వాట్సప్ కు ప్రత్యామ్నాయంగా అందులో ఇచ్చే జియో చాట్ యాప్ ను వాడుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు ఈ ఫోన్ కు చెందిన పూర్తి స్పెసిఫికేషన్లను జియో వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన స్ప్రెడ్ ట్రమ్ కమ్యూనికేషన్ తోపాటు మరో ప్రాసెసర్ తయారీ సంస్థ అయిన క్వాల్ కామ్ కూడా జియోతో కలసి పనిచేస్తున్నట్టు గతంలో చెప్పాయి. కనుక స్ప్రెడ్ ట్రమ్ ప్రాసెసర్, క్వాల్ కామ్ ప్రాసెసర్ తో ఉండే జియో 4జీ ఫోన్ రెండు మోడల్స్ లో విడుదలయ్యేందుకు అవకాశం ఉంది.

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి రీచార్జి చేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ ఫోన్ కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు.

జియో 4జీ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఆర్డర్ కన్ ఫాం అయి డెలివరీ అవుతుంది.

జియో ఫోన్ కు అనుసంధానించుకునే కేబుల్ ను రూ.500 వరకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందట. దాంతోపాటు నెలకు రూ.309 ప్లాన్ ను కచ్చితంగా తీసుకుంటేనే ఆ కేబుల్ ను వాడుకునే వీలుంటుందని తెలిసింది.

జియో 4జీ ఫీచర్ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ లేదు. దీంతో ఈ ఫోన్ లో ఉన్న ఇంటర్నెట్ ను ఇతర డివైస్ లకు షేరింగ్ ద్వారా పొందలేము.

జియో 4జీ ఫీచర్ ఫోన్ ను కొని అందులో వాడే సిమ్ ను రీచార్జి చేసుకున్నాక రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుందని చెప్పారు. అదండీ జియో ఫోన్ సంగతి...

డిజిటల్ ఇండియాకు ముందుంది మోడినా ? ముఖేశా ?



డిజిటల్ ఇండియా అంటూ ఎన్నెన్నో చెప్తున్న మోడీ ప్రభుత్వం విద్యార్థులను పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ కు చేరువ చేయలేకపోయింది. అయితే... మోడీ చేయలేని పనిని ముకేశ్ అంబానీ చేస్తున్నారు. గత ఏడాది జియో ఫ్రీ డాటాతో చాలావరకు యూత్ కి ప్రపంచాన్ని చూపించిన ఆయన ఇప్పుడు కాలేజి విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. దేశంలోని 3 కోట్ల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా వేలాది కాలేజీల్లో జియో ఫ్రీ వైఫై సేవలు ఆరంభించబోతున్నట్లు సమాచారం.
   
దీనిపై ఇప్పటికే రిలయన్స్ జియో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)కి ఓ ప్రపోజల్ను పంపినట్టు తెలిసింది. ఇది ఓకే అయితే మొదటి దశలో దేశంలో ఉన్న 38వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత మిగిలిన కళాశాలల్లోనూ ఇలాంటి సేవలు అందించనున్నాట్లు తెలుస్తోంది.
   
అయితే.. ఉచిత వైఫైని జియో అందించాలని రిలయన్స్ అనుకున్నా కూడా అది ఏకపక్షంగా సాధ్యం కాదని.. నేరుగా ఆ కంపెనీకే ప్రాజెక్టు ఇవ్వడం కుదరదని ఈ విషయంలో టెండర్లను ఆహ్వానిస్తామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే ఉచితంగా వైఫై సేవలను అందించడానికి జియో ముందుకొస్తుండడంతో ఆ కంపెనీకే టెండరు దక్కడం ఖాయం.

రిలయన్స్ జియో రీఛార్జి ప్లాన్స్ వివరాలు

Reliance Jio Network Recharge Plans Details


రిలయన్స్ జియో... ఇటీవల దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ యూజర్లను ఊరిస్తోంది. ఇదే సమయంలో ఇతర నెట్ వర్క్ ప్రొవైడర్లను టెన్షన్ పెడుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. ఇటీవలే రిలయన్స్ కుటుంబంలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్తు గురించి ముఖేష్ అంబానీ మాట్లాడారు. 42వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మొబైల్ వినియోగదారులపై వరాలు కురిపించారు.

ఇతర దేశాల్లో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలకే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాం అని ముఖేష్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జియో అంకితం చేస్తున్నట్టు ముఖేష్ వివరించారు. ఇక వినియోగదారులపై పెద్ద ఎత్తున వరాలు కురిపించారు. జియో నెట్ వర్క్ ద్వారా ఇతర నెట్ వర్క్లు దేనికైనా ఉచితంగా రోమింగ్ తోపాటు వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఈ కనెక్షన్ కావాలనుకున్నవారు ఆధార్ కార్డు జెరాక్స్ సమర్పిస్తే 15 నిమిషాల్లో సిమ్ ఇచ్చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి జియో సేవల్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అడిషన్ మొబైల్ డాటా అందించబోతున్నట్టు చెప్పారు. స్టూడెంట్ ఐడీ కార్డు ఉన్నవారికి అదనంగా 50 శాతం డాటా అందించబోతున్నారు. రూ. 50కే ఒక జీబీ డాటా అందించబోతున్నారు. ఇక పండుగ రోజుల్లో మెసేస్ లు బ్లాకింగ్ వంటివి ఉండవు. 300 ఛానల్స్ లైవ్ లో చూసుకోవచ్చు. లక్షల కొద్దీ కాలర్ ట్యూన్స్ - ఆరు వేల సినిమాలు ఉచితం - 60 వేల సంగీత వీడియోలు ఉచితం - ఇక మొబైల్ అప్లికేషన్స్ ప్రత్యేకం... ఇలా వినియోగదారులపై ఎన్నో రకాల వరాలు కురిపిస్తున్నారు ముఖేష్ అంబానీ. వచ్చే ఏడాది నాటికి 90 శాతం గ్రామాలకు  ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఈ ప్లాన్ అంతా ముకేష్ పిల్లలదే 


దేశమంతా సంచలనం రేపుతున్న రిలయన్సు జియో డాటా ప్యాకేజీలు మిగతా టెలికాం ఆపరేటర్లను ఒక్క రోజులోనే దారుణంగా దెబ్బతీశాయి. పోటీ సంస్థలైన ఎయిర్ టెల్ - ఐడియా వంటి కంపెనీలను దారుణంగా దెబ్బతీసిన ఈ జియో ప్లాను కాకలు తీరిన ముకేశ్ అంబానీది కాదట. రిలయన్సులో ఇంకా పూర్తిగా రాటుదేలని ముకేశ్ పిల్లల తడాఖా అట. అవును...  రిలయన్స్ జియోలో రెండేళ్ల క్రితం ముకేశ్ కుమారుడు ఆకాశ్ - కుమార్తె ఈషా డైరెక్టర్లుగా చేరారు.  వారిద్దరి ఆలోచనే ఈ జియో ప్లాను అని రిలయన్సు అధినేత ముకేశ్ ప్రకటించారు. జియో డేటా టారిఫ్ ల రూపకల్పన అంతా వారే చూసుకున్నారని ఆయన చెప్పారు.

కాగా డాటా వాడకం కోసం భారతీయ యువత ఎంత ఖర్చు చేస్తున్నారు... సగటున ఎంత డాటా వాడుతున్నారన్న విషయంలో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ప్లాన్లను రూపొందించారు.  భారత్ లో స్మార్ట్ ఫోన్ వినయోగదారుల సగటు వయసులోనే ఉన్న ఆకాష్ - ఈషాలు యువతరానికి ప్రతినిధులని ముఖేష్ చెప్పారు. జియోను వాడేవారిలో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే ఉంటారని ముకేశ్ అభిప్రాయపడ్డారు. జియో రాకతో ఇండియాలో డాటాగిరీ మొదలవుతుందని ఆయన అన్నారు.

ఆకాష్ - ఈషాలు సృష్టించిన సంచలనం గురించి ముకేశ్ ఉద్వేగంగా వివరిస్తున్న సమయంలో మార్కెట్లు షేకయ్యాయి. రిలయన్స్ జియోను పరిచయం చేస్తూ - తామందించే వివిధ ప్యాకేజీల గురించిన వివరాలను ముఖేష్ అంబానీ వెల్లడిస్తున్న వేళ - ఐడియా సెల్యులార్ - భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు రూ. 12 వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీ వాటా విలువ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 9 శాతం వరకూ దిగజారింది. ఆపై భారతీ ఎయిర్ టెల్ కొద్దిగా నిలదొక్కుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84.50 వద్ద - భారతీ ఎయిర్ టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310.75 వద్దా కొనసాగుతున్నాయి.  అత్యధికంగా నష్టపోయిన టాప్-2 కంపెనీల్లో ఐడియా - ఎయిర్ టెల్ నిలిచాయి. కాగా బడా సంస్థలను ఒక్క ఆలోచనతో దెబ్బ కొట్టిన ఈషా - ఆకాష్ లు కవలలు. బ్రౌన్ యూనివర్సిటీలో ఆకాష్  గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగా  ఈషా యెల్ యూనివర్సిటీలో చదువుకుంది.  ఈషా బిజినెస్ విశ్లేషకురాలిగానూ పనిచేసింది.  రెండేళ్ల క్రితమే వీరు రిలయన్సులో డైరెక్టర్లుగా అడుగుపెట్టారు. ఇప్పుడు పెను సంచలనంగా మారారు.


జియో 4జీ సిమ్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ల లిస్టు

Reliance JIO 4g Sim Supported Smart Phones List



4జీ మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపిన Reliance Jio మరింత అగ్రెసివ్‌గా జనంలోకి దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది.
4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ నేపథ్యంలో క్లారిటీ కోసం రిలయన్స్ జియో 4జీ సిమ్ కార్డ్‌లను సపోర్ట్ చేస్తున్నస్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీముందు ఉంచుతున్నాం...
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న LYF స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
లైఫ్ ఎర్త్ 1, లైఫ్ ఎర్త్ 2, లైఫ్ ఫ్లేమ్ 1, లైఫ్ ఫ్లేమ్ 2, లైఫ్ ఫ్లేమ్ 3, లైఫ్ ఫ్లేమ్ 4, లైఫ్ ఫ్లేమ్ 6, లైఫ్ వాటర్ 1, లైఫ్ వాటర్ 2, లైఫ్ వాటర్ 3, లైఫ్ వాటర్ 4, లైఫ్ వాటర్ 5, లైఫ్ వాటర్ 6, లైఫ్ వాటర్ 7, లైఫ్ వాటర్ 8, లైఫ్ విండ్ 1 (16జీబి వర్షన్), లైఫ్ విండ్ 2 (8జీబి వర్షన్), లైఫ్ విండ్ 3, లైఫ్ విండ్ 4, లైఫ్ విండ్ 5, లైఫ్ విండ్ 6.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Samsung స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ , సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 (SM-A800F), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్, సామ్‌సంగ్ నోట్ 5 డ్యుయోస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2, సామ్‌సంగ్ గెలాక్సీ జే7, సామ్‌సంగ్ గెలాక్సీ జే5, సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే6 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న apple స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
యాపిల్ ఐఫోన్ 6, యాపిల్ ఐఫోన్ 6 ప్లస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న blackberry స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
బ్లాక్ బెర్రీ ప్రివ్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న కూల్‌ప్యాడ్ (coolpad) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
కూల్‌ప్యాడ్ నోట్ 3
కూల్‌ప్యాడ్ మాక్స్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జియోనీ (gionee) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
జియోనీ ఎస్ ప్లస్
జియోనీ ఎఫ్103
జియోనీ ఇలైఫ్ ఎస్6
జియోనీ ఎం5 ప్లస్ జియోనీ పీ5ఎల్
జీయోనీ ఎఫ్103 ప్రో

* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఇన్‌ఫోకస్ (infocus) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
ఇన్‌ఫోకస్ ఎమ్370, ఇన్‌ఫోకస్ ఎమ్535, ఇన్‌ఫోకస్ ఎమ్680, ఇన్‌ఫోకస్ ఎమ్370I, ఇన్‌ఫోకస్ ఎమ్M535+
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
ఇంటెక్స్ ఆక్వా 4జీ, ఇంటెక్స్ ఆక్వా ఏస్ 2, ఇంటెక్స్ ఆక్వా క్రేజ్, ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్, ఇంటెక్స్ ఆక్వా ఏస్ మినీ, ఇంటెక్స్ ఆక్వా రేజ్, ఇంటెక్స్ ఆక్వా 4జీ స్ట్రాంగ్, ఇంటెక్స్ ఆక్వా షైన్ 4జీ, ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్, ఇంటెక్స్ ఆక్వా వ్యూ.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న karbonn స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
కార్బన్ క్వాట్రో ఎల్45 ఐపీఎస్ కార్బన్ క్వాట్లో ఎల్55 హైడెఫినిషన్, కార్బన్ Aura పవర్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న లావా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
లావా ఎక్స్50, లావా ఏ71, లావా ఏ72, లావా ఏ88, లావా ఏ76, లావా ఏ89, లావా ఎక్స్46, లావా ఎక్స్38, లావా ఎక్స్17, లావా ఎక్స్11. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న lenovo స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
లెనోవో వైబ్ షాట్, లెనోవో ఏ6000 ప్లస్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఎల్‌జీ (lg) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
ఎల్‌జీ ఎక్స్ స్ర్కీన్, ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్, ఎల్‌జీ స్పిరిట్, ఎల్‌జీ కే7, ఎల్‌జీ కే10, ఎల్‌జీ స్టైలస్ 2 ప్లస్, ఎల్‌జీ స్టైలస్ 2
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
YU Yunique YU4711, మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5 ,మైక్రోమాక్స్ కాన్వాస్ అమేజ్ యు యుపోరియా యు నోట్ (యు6000), మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 2 క్యూ426
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న మోటరోలా (Motorola) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
మోటరోలా మోటో ఇ (మూడవ జనరేషన్), న్యూ వర్షన్ మోటో ఇ (సెకండ్ జనరేషన్), న్యూ వర్షన్ మోటో ఎక్స్ (మోటో ఎక్స్ ప్లే), మోటరోలా మోటో జీ టర్బో, మోటరోలా మోటీ జీ4, మోటరోలా మోటో జీ4 ప్లస్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
వన్‌ప్లస్ 3, ఒప్పో ఎఫ్1, ఒప్పో ఏ37, ఒప్పో ఎఫ్1 ప్లస్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న panasonic స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
పానాసోనిక్ Eluga 12 (2జీబి), పానాసోనిక్ Eluga 12 (3జీబి), పానాసోనిక్ Eluga ఆర్క్, పానాసోనిక్ Eluga ఐకాన్ 2,పానాసోనిక్ Eluga ఐ3, పానాసోనిక్ Eluga ఏ2, పానాసోనిక్ Eluga నోట్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న సోనీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్ (ఈ6883), సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ (ఎఫ్5122)
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న టీసీఎల్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
టీసీఎల్ 560
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న వీడియోకాన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
వీడియోకాన్ వీ45ఈడి,
వీడియోకాన్ జెడ్55 క్రిప్టాన్ (V50FA3)
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న వివో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
వివో వీ3, వివో వీ3 మాక్స్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
షియోమీ రెడ్మీ 2 ప్రైమ్ (హెచ్2ఎక్స్), షియోమీ రెడ్మీ నోట్ 3, షియోమీ ఎంఐ5, షియోమీ ఎంఐ మాక్స్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జోలో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
జోలో ఎరా 4 జి
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జోపో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
జోపో స్పీడ్ 8

రిలయన్స్ జియో 4జి నెట్ వర్క్ సర్వీసెస్ ౩ నెలలు ఉచితం




Reliance JIO 4G సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి

ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న రిలయన్స్ 4జి సేవలు ఇప్పుడు అంతట మొదలయ్యాయి.

జియో అను పేరుతో రిలయన్స్ కొత్త సేవలను ప్రారంభించింది. అయితే  ప్రస్తుతం  ఈ జియో సిమ్ కేవలం రిలయన్స్ లైఫ్ Reliance LYF మోడల్స్ మొబైల్స్ లో మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి

జియో గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్న అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఎయిర్ టెల్ , ఐడియా  వంటి 4జి సేవలు ఎక్కడో  అరకొర వున్నాయి.

అసలు చెప్పాలంటే కొన్ని గ్రామాలలో  2జి సిగ్నల్స్ కి దిక్కులేని పరిస్థితి ( ఎవరిదో ఎందుకు మా గ్రామంలోనే చాలా నెట్వర్క్ సిగ్నల్ లేవు)

రిలయన్స్ లైఫ్ మొబైల్ కొంటే జియో సిమ్ ఫ్రీగా ఇచ్చారు. సిమ్ మాత్రమే కాదు ౩ నెలల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్  & డేటా కూడా ఫ్రీ Free

4జి ఎక్కడ చూసిన  ఫుల్ సిగ్నల్ తో వస్తుంది.

దీనికి కారణం రిలయన్స్ కంపెనీ 34 వేల కోట్లతో 2.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ ను 18,000 నగరాలు - లక్ష గ్రామాలకు సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం జియో ప్రతి నెల అత్యధిక డేటా యూస్ చేసే నెట్వర్క్స్ లో 6 వ స్థానంలో ఉంది. ఇంకా  ఆఫిసియాల్ గా స్టార్ట్ కాకముందే నెలకు 70 లక్షల యుసార్స్ 13 మిలియన్ జిబి వాడుతుండగా ఎయిర్ టెల్ 55 మిలియన్  యుసార్స్ తో 45 మిలియన్ జిబి వాడుతుంది. ఈ లెక్కన చూస్తే జియోకి మొదటి స్థానం రావటానికి ఎంతో సమయం పట్టదు.

ఇంకా చివరిగా స్పీడ్ గురించి మాట్లాడదాం ...

జియో 4జి  డౌన్లోడ్ స్పీడ్ 8 ఎంబిపిస్ నుండి 18 ఎంబిపిస్ వరకు వస్తుండగా మిగతా నెట్వర్క్స్  6ఎంబిపిస్ నుండి 10ఎంబిపిస్ వరకు మాత్రమే వస్తుందట !

అంటే మిగతా నెట్ వర్క్స్ కు రిలయన్స్ జియో గట్టి పోటినే ఇవ్వనుంది.ఈ సిమ్ కోసం ఏడాది చివరి వరకు ఆగాల్సిందే లేదా రిలయన్స్ లైఫ్ మొబైల్ కొనుక్కోవలసిందే...

హ్యాపీ టూ యూస్ జియో నెట్

రివ్యూ బై దుర్గరావ్ కాళ్ళ
దాకమర్రి , విశాఖపట్నం