Showing posts with label MOBILE NETWORKS. Show all posts
Showing posts with label MOBILE NETWORKS. Show all posts

రిలయన్స్ జియో 4జి నెట్ వర్క్ సర్వీసెస్ ౩ నెలలు ఉచితం




Reliance JIO 4G సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి

ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న రిలయన్స్ 4జి సేవలు ఇప్పుడు అంతట మొదలయ్యాయి.

జియో అను పేరుతో రిలయన్స్ కొత్త సేవలను ప్రారంభించింది. అయితే  ప్రస్తుతం  ఈ జియో సిమ్ కేవలం రిలయన్స్ లైఫ్ Reliance LYF మోడల్స్ మొబైల్స్ లో మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి

జియో గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్న అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఎయిర్ టెల్ , ఐడియా  వంటి 4జి సేవలు ఎక్కడో  అరకొర వున్నాయి.

అసలు చెప్పాలంటే కొన్ని గ్రామాలలో  2జి సిగ్నల్స్ కి దిక్కులేని పరిస్థితి ( ఎవరిదో ఎందుకు మా గ్రామంలోనే చాలా నెట్వర్క్ సిగ్నల్ లేవు)

రిలయన్స్ లైఫ్ మొబైల్ కొంటే జియో సిమ్ ఫ్రీగా ఇచ్చారు. సిమ్ మాత్రమే కాదు ౩ నెలల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్  & డేటా కూడా ఫ్రీ Free

4జి ఎక్కడ చూసిన  ఫుల్ సిగ్నల్ తో వస్తుంది.

దీనికి కారణం రిలయన్స్ కంపెనీ 34 వేల కోట్లతో 2.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ ను 18,000 నగరాలు - లక్ష గ్రామాలకు సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం జియో ప్రతి నెల అత్యధిక డేటా యూస్ చేసే నెట్వర్క్స్ లో 6 వ స్థానంలో ఉంది. ఇంకా  ఆఫిసియాల్ గా స్టార్ట్ కాకముందే నెలకు 70 లక్షల యుసార్స్ 13 మిలియన్ జిబి వాడుతుండగా ఎయిర్ టెల్ 55 మిలియన్  యుసార్స్ తో 45 మిలియన్ జిబి వాడుతుంది. ఈ లెక్కన చూస్తే జియోకి మొదటి స్థానం రావటానికి ఎంతో సమయం పట్టదు.

ఇంకా చివరిగా స్పీడ్ గురించి మాట్లాడదాం ...

జియో 4జి  డౌన్లోడ్ స్పీడ్ 8 ఎంబిపిస్ నుండి 18 ఎంబిపిస్ వరకు వస్తుండగా మిగతా నెట్వర్క్స్  6ఎంబిపిస్ నుండి 10ఎంబిపిస్ వరకు మాత్రమే వస్తుందట !

అంటే మిగతా నెట్ వర్క్స్ కు రిలయన్స్ జియో గట్టి పోటినే ఇవ్వనుంది.ఈ సిమ్ కోసం ఏడాది చివరి వరకు ఆగాల్సిందే లేదా రిలయన్స్ లైఫ్ మొబైల్ కొనుక్కోవలసిందే...

హ్యాపీ టూ యూస్ జియో నెట్

రివ్యూ బై దుర్గరావ్ కాళ్ళ
దాకమర్రి , విశాఖపట్నం

Mobile Network USSD Codes

How to Check Your Mobile Balance on Your Airtel , Aircel , BSNL , IDEA , Reliance , TATA DOCOMO , VODAFONE NETWORKS
[robo-gallery id="242"]