Showing posts with label Iamyourrealfriend. Show all posts
Showing posts with label Iamyourrealfriend. Show all posts

పవన్ పై ఓ విశ్లేషణ



పవన్ కళ్యాణ్  తిరుపతి లో  షడన్  గా ఏర్పాటు చేసిన మీటింగ్ లో  ఏం చెప్పబోతున్నాడో అని పవన్ అభిమానులతో పాటు చాలమంది ప్రజలు ఎంతో  ఆసక్తి గా ఎదురుచూసారు.
అర్దం కాలేదు. అసలు పవన్ చిరంజీవి కే అర్దం అయ్యేవాడుకాదని చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూ లలో చెప్పాడు. ఇంట్లోవాళ్ళందరం నవ్వుకుంటున్న సమయంలో కళ్యాణ్ సీరియస్ గా మెడమీదికి వెళ్ళిపోతాడని.మేము సీరియస్ గా ఎదైన విషయంపై సీరియస్ గా చర్చి స్తు నప్పుడు.నవ్వుకుండేవాడని చిరంజీవి అన్నాడు.అంటే చిన్నప్పటినుండి తండ్రిలా పెంచిన చిరంజీవి కే అతను అర్దం కాకపోతే ఇక ప్రజల కు ఏమిటి అర్థం ఔతాడు?. ఈ విషయం ప్రక్కన పెడితే ఇంతకు పవన్  తిరుపతి లో ఇచ్చిన స్పీచ్ ఏమిటి? అసలు అతను ఏమిటి మట్లాడాడు?అతని స్పీచ్ లో ‌క్లారిటీ వున్న దా? అసలు పవన్ లో లీడర్ షిప్  లక్షణాలు వున్నాయా? మొత్తం గా విశ్లేషణ చేద్దాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్తినప్పుడు పవన్ యువరాజ్యం అద్ద్యక్షుడిగా వున్నాడు ఆ సమయంలో చిరంజీవి పార్టీ టికెట్స్ అమ్ముకున్నాడని చాలా విమర్శలు వచ్చిన ఏ రోజు ఆ విషయం మీద పవన్ నోరు మెదపలేదు. సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఎంతోమంది వున్నారు. అలాంటి వాళ్లెవరికి పార్టీ టికెట్ ఇవ్వలేదు.అంతవరకెందుకు  చిరు అభిమానులు లోనే చాలామంది సమాజసేవ చేసేవారున్నారు. అలాంటి వారెవ్వరికి పార్టీ టికెట్ రాలేదు.ఆ విషయం లో ఈ పవర్ స్టార్ నోరు మెదపలేదు.వ్యాపారస్తులు.పెద్దపెద్ద డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇచ్చారు. ఈ విషయం పవన్ కు తెలీదా? తెలిసినా అప్పటికి ఆయనకు ఇప్పటి లా ప్రశ్నించడం అలవాటు కాలేదా? అంతవరకెందుకు అన్న గుత్తగుత్తెంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనమ్ చేసేస్తే  ప్రజారాజ్యం పార్టీ లొ యువ రాజ్యం అద్యక్షుడిగా వున్న పవన్ అదెంటి అన్నయ్యా! కొద్ది నెలల క్రితమే కదా కాంగ్రెస్ నాయుకుల్ని పంచెలు వూడదీసి కొట్టండి అన్నాను కదా నువ్వు మన పార్టీ ని ఆ కాంగ్రెస్ పార్టీలొ కలిపేస్తావేమిటని ప్రశ్నించాలని పవర్ స్టార్ కు ఎందుకు అనిపించలేదో? స్త్రీల ను గౌరివించవలసిన ఒక నాయకుడిగా వుండవలసిన పవన్ రోజా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసి విమర్శలు పాలవ్వడం మనందరికి తెలిసిన విషయమే.ప్రజలందరికి ఆదర్శంగా వుండవలసిన  నువ్వు నడిరోడ్ మీద కళ్ళు త్రాగటమ్ ఏ లీడర్ షిప్ క్వాలిటీ? సినిమా నటుడు చిరంజీవి గారికి అనుభవం లేదు అందుకే నేను రాజశేఖరరెడ్డి గారికి  సపోర్ట్ చేస్తాను. అన్న ఒక్క మాటకు రాజశేఖర్. జీవితాళ్ళను చిరు అభిమానులు వెంటబెట్టి రాళ్ళతో కొట్టినప్పుడు ఆ విషయాన్ని ఖండించాల్సింది పోయి.రాజశేఖర్ నత్తి నత్తిగా మట్లాదుతుంటాడు అంటూ వేళాకోళం  చేయడంలో నీ నాయకత్వ లక్షణాలు ఎంత ఎక్కువుగా వున్నాయో అర్దం అవుతున్నది.
ఇదంతా గతానికి సంబందించినది‌‌‌.

ఇక తిరుపతి సభ విషయానికి వస్తే.....

పవన్ చెప్పిన కొన్నింటిని తీసుకుందాం.అశోక్ గజపతిరాజు  రాజీనామా చేయాలని పదవులు శాశ్వతం కావని. రాజీనామా చెస్తే అంత కంటే పెద్ద పదవులు ప్రజల గుండెల్లో ఇస్తారని చెప్పాడు.పవన్ కు తెలియని విషయమేమిటంటే  అశోక్ గారు రాజీనామా చేసేస్తానని అరుణ్ జైట్లీ  పార్లమెంటు లో ప్రసంగించిన మరుసటి రోజే సిద్దపడ్డారు.కాని.. చంద్రబాబు నాయుడు రాజీనామా చెయొద్దని. రాజీనామా చెస్తే రాస్ట్రానికి నష్టం జరుగుతుందని  వారించారు.రాజీనామా కు సిద్దపడ్ద అశోక్ ను విమర్శించిన పవన్ రాజీనామా చెయ్యొద్దని  వారించిన చంద్రబాబు ను మాత్రం ఆ  స్థాయిలో విమర్శించలేదు.ఎందుకనీ?  ఆ మాటకొస్తే మరి ఆ రోజు  ఆంధ్రప్రదేశ్ ను విడగొట్తినప్పుడు మీ అన్నగారు  అశోక్ వలే  కేంద్ర మంత్రిగా వున్నారు కదా! మరి ఆరోజు  మీ అన్నగార్ని రాజీనామా  చేయమని యెందుకు అడగలేదు? ఆ రోజు మీ అన్నకు  ఈ రోజు చెప్పిన అలెగ్జాండర్ కధ చెప్పి రాజీనామా చేయించాల్సింది. మీ అన్నగారి పదవి పోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా వుండి పొయేవారు కదా!

అంతవరకు ఎందుకు ఆయన మాటల్లో ఎంత వైరుద్ద్యం  వుందో  గమనించవచ్చు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఏ విషయం మీద ప్రశ్నించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారని అనుమానం  వచ్చినప్పుడు. ఇలా ప్రజలుదగ్గరకు వచ్చి మాటలాడుతుంటాడని  ప్రజలు ఇప్పుడు అనుమానిస్తున్నారు.. ఐతే ఇక నుండి వరుసగా కార్యక్రమాలు చేస్తానంటున్నాడు కాబట్తి ఈ అనుమానం నిజం కాదు. మరి ఇంత  షడన్ గా ఎందుకు మీటింగ్ పెట్తి మూడంచల విధానాన్ని ప్రకటించాడు. అంటే ఇక  రాజకీయాల్లో వుంటానని చెప్పినట్టే
నిజానికి అతను  అకస్మాత్తుగా ఈ  మీటింగ్ పెట్టలేదని ముందువ్యూహమ్ వుందని. దీన్ని వెనుకనుండి నడిపిస్తున్నావారున్నారని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు.ఇంతకి పవన్ వెనుక ఎవరున్నారు ?

మిగతా వివరణ రేపు... 
Posted By మన్యాల శ్రీనివాసరావు 
Iam Your Real Friend

ది నక్సలైట్ మనసులో మాట పార్ట్ 2

ఔను  నేను నక్సలైట్ నే.  



నేను నక్సలైట్  ఎలా అయ్యానో తరువాత చెబుతాను‌ నేను ఈ నవల రాసిన నాటినుండి ఈనాటి వరకూ ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. విల్ ఫోన్ లు ,సెల్ ఫోన్ లు ల్యాప్ ట్యాప్ లు ఎన్నో...ఎన్నో  మార్పులు వచ్చే సాయి‌ ఆఖరికి నక్సలైట్ అన్న పదము కూడా మారిపొయి మావోయిస్ట్  అయ్యింది. కాని మారంది మాత్రం  పీదవాడు పేదవాడుగానే వుండి పోవటం. ప్రభుత్వాలు పేదరికాన్ని పారద్రోలకుండా పేదవార్ని పారద్రోలడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

విప్లవం ఒక్క మనుషులు లొనే కాదు ఈ ప్రక్రుతిలో  వున్న అన్ని జీవ రాసుల్లో  వస్తుంది. మనిషి అబివ్రుద్ది పేరుతో అడవుల్ని  నాశనం చేస్తున్నాడు..అందుకే  అడవుల్లో వుండాల్సిన ఏనుగులు వూర్ల మీద పడి పంటలు ను నాశనం చేస్తున్నాయి. ఇది ఏనుగుల్లో వచ్చిన విప్లవం. పుట్టల్లో వుండాల్సిన పాములు ఇల్లల్లోకి వచ్చే స్తున్నాయి‌.ఇది పాముల్లో వచ్చిన విప్లవం. ఏనిమల్ ప్లానెట్ వంటి చానల్స్ లో గేదలు సింహాల్ని వెంటపెడుతున్న సీన్లు మనం చూస్తున్నాము  ఇది గేదల్లో వచ్చి న విప్లవం.ఇన్నింట్లో విప్లవం వచ్చిన ప్పుడు మనిషిలో విప్లవం రాదా?

వస్తుంది .విప్లవం 1967లొనే పశ్చిమ బెంగాల్ లొ నక్సల్ బరి ఉద్యమం వచ్చింది. అది శ్రీకాకుళం చేరింది. అలా...అలా  అంద్రా అంతా చొచ్చుకుని పోయింది.

నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది అమరులయ్యారు.అలాగే పోలీసులు కూడా హతమయ్యరు.ఎన్నో కుటుంబాలు బాదల కౌగిళ్లల్లో నలిగిపొయాయి.

ది నక్సలైట్ The Naxalite Novel by Manyala Srinivasarao Introduction

నా మనసులో మాట ...

మన్యాల శ్రీనివాసరావు 

IamYourRealFriend.Com వెబ్ సైట్ ను ఆదరిస్తున్న స్నేహితులందరికీ నమస్కారములతో ....

నేను " ది నక్సలైట్  " అన్న నవల నా పద్దెనిమిదో యేట వ్రాసాను. కాని ..
అది ప్రచురితమయ్యే సరికి  నాకు 23 సంవత్సరాలు వచ్చాయి. 1992 మే 11 తేదిన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించటం జరిగింది. ది నక్సలైట్ నవల విడుదల అయిన తరువాత నన్ను నక్సలైట్ గా భావించిన పోలీసులు విజయనగరం జిల్లా ఎస్ పి బంగ్లాలో నన్ను ఎస్ బి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రమణ గారు ఇంటరాగేట్ చేసారు. ది నక్సలైట్ నవల ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ మిద కూడా పోలీసులు దాడి చేయటం జరిగింది. కొన్నాళ్ళు  పోలీసులు నా మిద నిఘా పెట్టారు. నా అదృష్టం ఏమిటంటే మా నాన్న గారు కీ.శే. శ్రీ మన్యాల పాపారావు గారు ఎస్.ఐ. కావటం , చాలా మంది పోలీస్ అధికారులు మా నాన్న గారి శిష్యులు కావటం వలన కాబోలు నన్ను అరెస్ట్ చేయలేదు. ఎన్ కౌంటర్ చేయటానికి ప్రయత్నించలేదు లేదా వారికి నేను నక్సలైట్ నని గాని, నాకు నక్సలైట్ తో సంబంధాలు వున్నాయన్న సాక్ష్యాలు వారికి లబించకపోవటం వల్లగాని, నన్ను అరెస్ట్ చేయలేదు. ఏది ఏమైనా చూస్తుండగానే 24 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ఇరవై నాల్గు సంవత్సరాలలో నా జీవితంలో కష్టాలు , కన్నీళ్ళు ,ఆనందాలు , విజయాలు , అపజయాలు , ఎన్నో మార్పులు జరిగాయి. కాని పోలీసులకు తెలియని విషయం ఏమిటంటే నేనొక నక్సలైట్నని ..


     [ సశేషం ] 
మిగతాది రేపు 



ది బెస్ట్ కౌన్సిలర్ రాజేశ్వరరావు గారితో మిని ఇంటర్వ్యూ




పై ఫోటోలో ఉన్న వ్యక్తి విజయనగరం పట్టణం 6వ వార్డు కౌన్సిలర్ ఎస్.వి.వి. రాజేశ్వరరావు గారు. ప్రజలు రాజేష్ అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఎం.ఎల్.సి. శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారికి ముఖ్య అనుచరుడిగా జిల్లాలో అందరికీ సుపరిచితుడు. అటువంటి రాజేష్ తో  Iam Your Real Friend వెబ్ సైట్ ఫ్రెండ్స్ కోసం ఓ మినీ ఇంటర్వ్యూ ...

ప్రశ్న : - రాజేష్ గారు మికు రాజకీయాల్లోకి రావాలని ఎందుకనిపించింది ?
జవాబు : - వ్యక్తిగా మనం ఎక్కువ మందికి సహాయం చేయలేం అదే రాజకీయాల్లో ఉంటే పది మందికి ఉపయోగపడగలమనిపించి రాజకీయాల్లోకి వచ్చాను.

ప్రశ్న : - మీ మొట్ట మొదటి పదవి ?
జవాబు : - జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రేసిడింట్ గా చేశాను.

ప్రశ్న : - మీరు వరుసగా 3 సార్లు కౌన్సిలర్ గా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇదెలా సాద్యమైంది ?
జవాబు : - ఎన్నికల సమయంలోనే నేను రాజకీయాలు చేస్తాను. ఎన్నికలు అయిపోగానే వార్డు సమస్యలు పరిష్కరించటంలో రాత్రి పగలు కష్టపడతాను. బహుశా అది వార్డు ప్రజలకు నచ్చి నన్ను మూడుసార్లు వరుసగా గెలిపించారు. బి.జె.పి. , టిడిపి హవాలో కూడా నేను గెలవగాలిగానంటే అది ప్రజలకు నా మిదున్న నమ్మకం , అభిమానం.

[ ఇంటర్వ్యూ మిగతాది రేపు ] 

ప్రియమైన ఆత్మీయునికి నీ మిత్రుడు వ్రాయు లేఖ Letter to a Friend




స్నేహితుల దినోత్సవం సందర్భం గా…మా అనుభవాలు అన్నిటిని క్రోడీకరించి, స్నేహం అంటే ఏంటో తెలీకుండా, అర్ధం లేని పనులు నేర్పించేవాడే నేస్తం అనుకుంటూ గడిపేస్తున్న మా ఆత్మీయులు కొందరిని ఉద్దేశించి రాయబడిన లేఖ.
 
ప్రియమైన ఆత్మీయునికి,
 
మిత్రమా, ముందుగా నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఉభయ కుశలోపరి. లోకం పోకడ చూసి స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నావు. ఒళ్ళు తెలీని మైకం నీకు పరిచయం చేసేవాడు, వినలేని మాటలు నీతో పలికించే వాడు, చెప్పుకోలేని పనులు నీతో చేయించేవాడు, గర్వపడలేని గొప్పవాడిగా నిన్ను మార్చేవాడు; అలాంటి వాడసలు మిత్రుడే కాదు, అదసలు స్నేహమే కాదు.
 
చూడు మిత్రమా…
మద్యం మత్తు ఎంత సేపు, మహా అయితే ఒక పూట ఉంటుందేమో, ఒక లక్ష్యం అంటూ పెట్టుకొని దాన్ని సాధించి చూడు అప్పుడే వచ్చే కిక్కు ముందు, ఈ మందు జుజుబి. సాధించటానికి నువ్వు పడే తపన లోని కిక్కు, ఎన్ని సిట్టింగ్ లు వేస్తే వస్తుంది. ఓడిపోయినప్పుడు మళ్ళీ ప్రయత్నించి, గెలవాలి అని తరిమే కసి ఎంత కాస్ట్లీ సరుకు తాగితే దొరుకుతుంది. ఏ మాత్రం కష్టం పడకుండా తాగితే వచ్చే ఆనందం ఏముంది భయ్యా…ఇష్టం గా చేసే కష్టం లో పొందే ఆనందం రుచి చూడు ఒక్కసారి.
 
మిత్రమా, ఇది కాదు హీరోయిజం… 
తలవంచుకు వెళ్ళే ఆడ పిల్లని గేళి చేయటం ఎంతసేపు భయ్యా..మీ తల్లి తండ్రులు తలయెత్తుకు తిరిగేలా ఏదైనా చేసి చూడు. ఎటువంటి హద్దులు లేకుండా, తప్పు ఒప్పులు చూడకుండా, నచ్చినట్టు చేయటం చాలా సులభం బాబాయ్.. కాని కొన్ని కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి బ్రతికి చూడు ఒక్కసారి.
 
సృష్టి కాదు, నీ దృష్టి మారాలి మిత్రమా… 
కొన్ని లక్షల మంది రోజూ చెత్త తిన్నంత మాత్రాన అది తినుబండారం అవ్వదు. తప్పుడు మాటలు కుప్పలు గా వినిపిస్తున్నా అవి ఎన్నటికి గొప్పవి కావు. బురదలోని పందిని తీసుకొచ్చి మినరల్ వాటర్ తో శుద్ధి చేసినా అది అశుద్ధం తినకుండా ఆపగలవా. ప్రేక్షకులకు నచ్చని చిత్రానికి ఎంత గొప్పగా ప్రచారం ఇచ్చిన లాభం ఉంటుందా చెప్పు.
 
మిత్రమా… నువ్వెవరో మరచిపోకు…
సమాజం తీరు చూసి మోసపోకు మిత్రమా, నువ్వేంటి, నీ వారసత్వం ఏమిటి, పెరిగిన పరిస్తితులు, కలసిన మనుషులు, చదివిన చదువులు, మెదిలే ఊహలు అన్నిటిని ఎప్పుడూ రివ్యూ చేస్తుండాలి. నీకంటూ ఒక వ్యక్తిత్వం, అసాధారణ ఆలోచనలు, ఆశ్చర్యపరిచే ఆవేదనలు, ఆనందం కలిగించే జ్ఞాపకాలు పెంపొందించుకో.
 
మిత్రమా.. ప్రస్తుతం ఈ లోకం లో… 
నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు చెడుచేయకపోతే చాలు, నలుగురితో మంచి వాడు అనిపించుకోవలసిన పని లేదు చెడ్డ వాడు అనే పేరు రాకుంటే చాలు. నలుగురికి సాయం చేయాల్సిన పని లేదు ఒక్కరికి కూడా ద్రోహం చేయకుంటే చాలు.
 
నేస్తమా..చివరిగా…
నిజమైన స్నేహం నిన్నెప్పుడు ఇబ్బందులపాలు చేయదు. నీ ఆరోగ్యాన్ని పాడు చేయదు. నీ స్థాయి తగ్గించదు. నీ పేరు చెడగొట్టదు. నీ ఉనికిని ప్రశ్నించదు. నీ దారి తప్పనివ్వదు. నీ వ్యక్తిత్వాన్ని వెక్కిరించదు. నీ ఆలోచనా శక్తిని కుదించదు. నీ గౌరవాన్నితుంచదు.
 
గుర్తుంచుకో మిత్రమా… అంతా కొంత కాలమే… వీలైనంత ఆనందం గా జీవిద్దాం.. సంతోషాలు పంచుదాం.
 
ఇట్లు,
నీ మంచే ఎప్పుడూ కోరుకునే మిత్రుడు.
 

స్నేహితుల దినోత్సవం Friendship Day Special

స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. 





 కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని నిర్ణయించుకొని జరుపుకుంటుండగా,యుఎస్‌ కాంగ్రెస్‌ 1935లో ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారాన్ని అధికారికంగా ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటించినది . ఫ్రెండ్షిప్‌ డే ప్రతి ఏడాది ఆగష్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఆచారం 1935 లో అమెరికాలో జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రారంభమైంది. క్రమక్రమంగా అది అంతర్జాతీయ స్థాయి సంబరంగా మారింది. నిజానికి కొన్నింటికి ప్రత్యేక ప్రస్తావన అవసరంలేదు. అందులోనూ అందమైన స్నేహాలకి. అయినా ఎన్నో రకాల రోజులు ప్రత్యేకంగా ఏర్పరుచున్నట్టే దీనినీ ఆచరిస్తున్నారు. రాఖీరోజును మణికట్టుకు కట్టే తాళ్లతో అన్నా చెల్లెళ్ల బంధాన్ని ఏర్పరచుకున్నట్టూ, బలోపేతం చేసినట్టూ ఫ్రెండ్షిప్‌ డే నాడు ప్రత్యేక ఫ్రెండ్షిప్‌ బ్యాండ్లు ధరించడం ఫ్యాషనైంది. ఇదంతా కుర్రకారు వ్యవహారం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం చిన్నారులకు పెద్ద క్రేజీగా మారింది. ఉదయాన్నే లేచిన చిన్నారులు తమ స్నేహితులను కలవడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. పేరు, పేరున తమస్నేహితులను గుర్తుంచుకొని వారందరికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కట్టాలని ఆశపడతారు .

ఎలా వచ్చిందంటే :
అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని చంపింది . అతని మరణ వార్త విని ఆమరుచటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవము గా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది .

  • చాలా దేశాలు జులై 20ని స్నేహితుల దినోత్సవం (ఫ్రెండ్షిప్‌ డే)గా జరుపుకుంటాయి.
  • మహిళా స్నేహ దినోత్సవం - ఆగస్టు మూడవ వారం-ఇండియాలో సెప్టెంబర్ 3 వ ఆదివారము జరుపుతారు .
  • అంతర్జాతీయ స్నేహమాసం - ఫిబ్రవరి.
  • పాత, కొత్త స్నేహితుల వారం - మే మూడవ వారం.

      • రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం. నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు. ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు.

        ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు. మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం... దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమండలంలో పట్టివుంచి నట్లవుతుంది...




స్నేహితుల దినోత్సవం -- మనస్తత్వము :

ప్రండ్షిప్ బాండ్లు కడతారు ... ఎస్.ఎమ్‌.ఎస్‌ లతో గ్రీటింగ్స్‌ చెబుతారు... కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు... ప్రండ్షిప్ డే' ఎంజాయ్‌ చేయాలంటే ఎన్నెన్నో మార్గాలు!
కానీ మన చుట్టూ ఉన్న స్నేహితులతో మనపెలా ఉంటున్నామో ఒక్కసారైనా మననం చేసుకుంటున్నామా? నిజమైన స్నేహం నిలవాలంటే ఏమేం పాటించాలో తెలుసుకుంటున్నామా?
'ఒరే... వీడు సెల్ఫిష్‌రా... వదిలెయ్‌...' అంటే, 'పోనీలేరా... ప్రెండ్‌ కదరా...' అంటాడు 'హ్యాపిడేస్‌'లో టైసన్‌. స్నేహితుడిలో లోపాలున్నా పాటికి అతీతంగా స్నేహం ఉండాలని అంతర్లీనంగా చెబుతుందీ సన్నిపేశం.
స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్‌ లేని ఎడారిలాంటిది. ఓ వేదాంతి స్నేహాన్ని కొండగుహతో పోలుస్తాడు. దాని ముందు నిల్చొని అరిస్తే వ్రతిధ్వని వినివిస్తుంది. మంచి మిత్రుడి స్పందన కూడా అంత సహజంగా వేగంగా ఉంటుంది. 'నీ వెంట నేనున్నా' అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు.

పార్లీ (PARLEE) అనే మనోవిశ్లేషకుడి నిర్వచనంలో చెప్పాలంటే, 'నిజమైన మిత్రుడు ఓటమిలో ఓదార్చేవాడు; మన గెలువును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేపాడు; సమస్యల్లో ఓ కౌన్సిలర్‌గా ఉండేవాడు; ఏం చేయాలో తోచని స్థితిలో నీకండగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చేపాడు'
మనిషి అవసరాల్నింటిలో సంబంధం (Affiliation) చాలా ముఖ్యమైందంటాడు సైకాలజిస్ట్‌ హెన్రీముర్రే. బాల్యం నుంచి ఎదిగే క్రమంలో యువతలో తలెత్తే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం మరింత పెరుగుతుందని క్యాష్టర్‌ వరిశోధనలు నిరూపించాయి. స్నేహితులు ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి తోడ్పడతారు.
యువతరం స్నేహాల్లో మూడు దశలున్నాయని ఆడర్సన్‌ అనే మనస్తత్వపేత్త చెప్పాడు. మొదటి దశలో వ్యక్తిగత సంబరధం ఉండదు. కలిసి చేసే వనులవైనే ఆధారవడి ఉరటుంది. వదిహేను ఏళ్ల తర్వాత మొదలయ్యే రెండో దశ నమ్మకం పై ఆధారవడి ఉంటుంది. ఆపై సోషల్‌ సపోర్ట్‌, భద్రత ముఖ్య పాత్ర వహిస్తాయి.

  • స్నేహం నిరంతరం పెరిగేలా వ్రవర్తించాలి. తెంచే వ్రవర్తనలు ఉంటే గమనించుకుని మనల్ని మనం మార్చుకోపాలి.
  • చిన్న చిన్న విషయాలను వట్టించుకోకూడదు. స్నేహితుడు నీకు చెవ్పకుండా సినిమాకు పెళితే 'వీడు సెల్ఫిష్‌' అనుకోకూడదు.
  • విమర్శించి తవ్పులు సరిదద్దడం స్నేహంలో భాగమే కానీ అదపనిగా విమర్శలు చేయకూడదు.
  • విమర్శ మనసులో ముల్లులా గుచ్చుకోకుండా, చెవ్పే మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్త వడాలి.
  • ఒక స్నేహితుడిలోని లోపాలను మరో స్నేహితుడి వద్ద వ్రస్తావించకుండా ఉంటేనే మంచిది.
  • మిత్రునిలోని మంచి గుణాలను కూడా వ్రకటిస్తూ ఉండడం ముఖ్యం. అలాగని నింరతరం పొగడ్తల్లో ముంచెత్తకూడదు.
  • స్నేహితుని మాటల్లో, వ్రవర్తనలో నిగూఢ అర్థాలున్నాయోమోననే అనుమానాన్ని దరిచేరనీయకూడదు. ఉదాహరణకు నీకు బహూకరించిన వుస్తకం విలువను బట్టి 'నేనంత ముఖ్యుడిని కాననే ఈ వుస్తకం ఇచ్చాడు' లాంటి అన్వయాలను విడనాడాలి.
  • స్నేహంలో నిజాయితీ, పారదర్శకత చాలా ముఖ్యం.

రిలయన్స్ జియో 4జి నెట్ వర్క్ సర్వీసెస్ ౩ నెలలు ఉచితం




Reliance JIO 4G సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి

ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న రిలయన్స్ 4జి సేవలు ఇప్పుడు అంతట మొదలయ్యాయి.

జియో అను పేరుతో రిలయన్స్ కొత్త సేవలను ప్రారంభించింది. అయితే  ప్రస్తుతం  ఈ జియో సిమ్ కేవలం రిలయన్స్ లైఫ్ Reliance LYF మోడల్స్ మొబైల్స్ లో మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి

జియో గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్న అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఎయిర్ టెల్ , ఐడియా  వంటి 4జి సేవలు ఎక్కడో  అరకొర వున్నాయి.

అసలు చెప్పాలంటే కొన్ని గ్రామాలలో  2జి సిగ్నల్స్ కి దిక్కులేని పరిస్థితి ( ఎవరిదో ఎందుకు మా గ్రామంలోనే చాలా నెట్వర్క్ సిగ్నల్ లేవు)

రిలయన్స్ లైఫ్ మొబైల్ కొంటే జియో సిమ్ ఫ్రీగా ఇచ్చారు. సిమ్ మాత్రమే కాదు ౩ నెలల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్  & డేటా కూడా ఫ్రీ Free

4జి ఎక్కడ చూసిన  ఫుల్ సిగ్నల్ తో వస్తుంది.

దీనికి కారణం రిలయన్స్ కంపెనీ 34 వేల కోట్లతో 2.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ ను 18,000 నగరాలు - లక్ష గ్రామాలకు సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం జియో ప్రతి నెల అత్యధిక డేటా యూస్ చేసే నెట్వర్క్స్ లో 6 వ స్థానంలో ఉంది. ఇంకా  ఆఫిసియాల్ గా స్టార్ట్ కాకముందే నెలకు 70 లక్షల యుసార్స్ 13 మిలియన్ జిబి వాడుతుండగా ఎయిర్ టెల్ 55 మిలియన్  యుసార్స్ తో 45 మిలియన్ జిబి వాడుతుంది. ఈ లెక్కన చూస్తే జియోకి మొదటి స్థానం రావటానికి ఎంతో సమయం పట్టదు.

ఇంకా చివరిగా స్పీడ్ గురించి మాట్లాడదాం ...

జియో 4జి  డౌన్లోడ్ స్పీడ్ 8 ఎంబిపిస్ నుండి 18 ఎంబిపిస్ వరకు వస్తుండగా మిగతా నెట్వర్క్స్  6ఎంబిపిస్ నుండి 10ఎంబిపిస్ వరకు మాత్రమే వస్తుందట !

అంటే మిగతా నెట్ వర్క్స్ కు రిలయన్స్ జియో గట్టి పోటినే ఇవ్వనుంది.ఈ సిమ్ కోసం ఏడాది చివరి వరకు ఆగాల్సిందే లేదా రిలయన్స్ లైఫ్ మొబైల్ కొనుక్కోవలసిందే...

హ్యాపీ టూ యూస్ జియో నెట్

రివ్యూ బై దుర్గరావ్ కాళ్ళ
దాకమర్రి , విశాఖపట్నం

ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి నేడు




Today is the 20th anniversary of NTR, Nandamuri Taraka Rama Rao

జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నటుడు, నాయకుడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఆయన 20వ వర్ధంతి. 1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు.
1949 లో 'మనదేశం' చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి ఆంధ్రుల అభిమానాన్ని చూరగొని 'నటరత్న' గా మన్ననలు పొందారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు ఇత్యాదులెన్నో అసమాన రీతిలో పోషించి పండిత పామరుల గుండెలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
'పాతాల భైరవి', 'మిస్సమ్మ', 'మాయా బజార్', 'గుండమ్మ కథ', 'రాముడు భీముడు', దాన వీర శూర కర్ణ', 'బొబ్బిలి పులి', 'వేటగాడు' ఇవే కాక ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సాధించారు. ఆయన తన అధ్బుత నటనతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలలో రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయం సాధించి రికార్డు సృష్టించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు.
తెలుగువారి కీర్తి నలుదెసల్ వెదజల్లి తెలుగు రుచులనెల్ల తెలియజెప్పి కీర్తిఘనుడు యెక్కె గిన్నీసు బుక్కుల అతనికతడెసాటి అక్కిరాజ తెలుగు జాతికతడు తెచ్చిన ఖ్యాతి తో అయ్యె శాశ్వతుండు అవనిమీద అపరవిక్రమార్కుడన చెల్లునాతని అతని కతడె సాటి.
అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ చివర రోజుల్లో తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురై జనవరి 18, 1996న కన్నుమూసారు.

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన బాలకృష్ణ

తెలుగువారి ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా రసూల్‌పురాలోని విగ్రహం వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. శాంతి కపోతాలు ఎగురవేసి... అమర్‌ జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ ఏకచక్రాధిపత్యానికి చరమగీతం పాడింది ఎన్టీఆరే అని అన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకునే తెదేపాను నడిపిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని ప్రజాదరణ తెదేపాకు ఉందని బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్ కు కుటుంబసభ్యుల నివాళులు


భాగ్యనగరంలోని ఎన్టీఆర్ ఘాట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సోమవారం నాడు సూచించారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాట్ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజల కోసం అహర్నిషలు కృషి చేసిన ఎన్టీఆర్కు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు.
ఇద్దరికీ (కెసిఆర్, చంద్రబాబు) రాజకీయ ఊపిరి ఇచ్చారని, వారు ఈ ఘాట్ పైన శ్రద్ధ పెట్టాలన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి యువనేత నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడం సరికాదన్నారు.
చాలా పార్టీలలోని ముఖ్య నేతలకు భిక్ష పెట్టింది ఎన్టీఆరే అన్నారు. అలాంటి నేత ఘాట్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని చెప్పారు.
దేశానికి, రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘమన్నారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మార్పులు ఇతర రాష్ట్రాల్లోను అనుసరించారన్నారు. ఆయన వల్ల ఎందరో మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.
ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
ఖమ్మం జిల్లా జూలురుపాడు మండలం గుంటిపూడిలో సోమవారం నాడు ఎమ్మెల్యే వెంకట వీరయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Weekly Questions 27 September 2015

ఈ వారం ప్రశ్నలు 27 సెప్టెంబర్ 2015 :

1. భూలోక ధన్వంతరి అని ఎవరిని అందురు ?
2. సంగీత చింతామణి అని గ్రంధమును రచించినది ఎవరు ?
3. రెడ్డిరాజులు ఎవరికీ సామంతరాజులు ?
4. ఓం పూర్ణమదః పూర్నవిండం పూర్ణత్ పూర్ణముదమాచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్నమే వావసిష్యతే .
ఈ శ్లోకం ప్రపంచ గతినే మార్చేసింది . ఈ శ్లోకం అర్ధం ఏమిటి ?

5. వెబ్ (క్రియ) లేకుండా రెండువందల ముప్పయ్ పేజీల పుస్తకం పేరు ఏమిటి ?
6. 2029 లో భూమికి అతి దగ్గరగా ఒక ఆస్టరాయిడ్ వస్తుందని శాస్ర్తజ్ఞులు లెక్క కట్టారు. ఆ ఆస్టరాయిడ్ పేరు ?
7. జవహర్లాల్ నెహ్రు చెల్లెలు విజయలక్ష్మి పండిట్ భర్త పేరు ఏమిటి ?
8. ప్రపంచంలో అతి పొడవైన నది ?
9. జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రం తరపున ఆడిన భారతదేశపు మొదటి క్రికెట్ ఆటగాడు ఎవరు ?
10. నాగార్జున కొండ వద్ద దుర్గ గుడిని కట్టించిన అద్వైత మత స్థాపకుడు ఎవరు ?


( ఈ ప్రశ్నలకు వారం రోజులలో జవాబులు పంపించవలెను )

Bakrid Greetings

May God Allah bless you and you have a happy and prosperous Eid celebration.హ్యాపీ ఈద్ ముబారక్ ....

Bakrid Quotes Greetings Wishes in Telugu copy

మీకు మీ కుటుంబ సభ్యులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
Iam Your Real Friend

Weekly Questions 20 September 2015

ఈ వారం ప్రశ్నలు 20 సెప్టెంబర్ 2015 :

1 కంక్రీట్ తో నిర్మించిన భారతదేశంలో అతి పెద్ద ఆనకట్ట ?
2. చదరంగం బోర్డులో నిలువగళ్లను ఏమంటారు ?
3. చాకీయర్ కోతు అనే నాట్యరూపం కేరళలో ఎవరు ప్రవేశపెట్టారు ?
4. పసిఫిక్ మహాసముద్రం లోతు ఎంత ?
5. ప్రపంచంలో అతిపెద్ద పుస్తకమేది ?
6. ఫ్రాన్స్ దేశం వైశాల్యం ఎంత ?
7. ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించినవాడు ?
8. తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంధం ఏది ?
9. ఒకే రాతితో మలచిన రాతిరధం ఎక్కడ ఉంది ?
10. ప్రపంచంలో అతి ఖరీదైన పుస్తకం ?

( ఈ ప్రశ్నలకు వారం రోజులలో జవాబులు పంపించవలెను )
I AM YOUR REAL FRIEND
శ్రీ కృష్ణుడు కుచోలుని కి నిజమైన స్నేహితుడు
కర్ణుడు దుర్యోదనుడికి నిజమైన స్నేహితుడు
నాగిరెడ్డి కి చక్రపాణి నిజమైన స్నేహితుడు
అచ్చిరెడ్డి కి క్రిష్ణారెడ్డి నిజమైన స్నేహితుడు
బాపు కి రమణ నిజమైన స్నేహితుడు
మరి మీకో ?
I AM YOUR REAL FRIEND
మనకు ఎంతో మంది స్నేహితులు ఉండవచ్చుకానీ నిజమైన స్నేహితుడు ఒకడే ఉంటాడు
నిజమైన స్నేహితుడు అంటే ఎవరు!
మీతో ఉదయం నుండి రాత్రి వరకు కలిసి తిరిగేవాడా!
మీకు రోజు ఫోన్ చేసేవాడా!
ఆపద లో మిమ్మల్ని ఆదుకునేవాడా!
మిలో ఉత్సాహాన్ని నింపేవాడా!
మీకు ఓటమి లో ఓడర్పునిచ్చెవాడ!
మీ విజయాన్ని ఆనందించేవాడా!
మీ ఉన్నత స్తితి కి చేయుతనిచేవాడా!
పై లక్షణాలలో ఏ ఒక లక్షణం ఉన నిజమై స్నేహితుడు కాదు అన్ని లక్షణాలు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు.
ఆ లక్షణాలు అన్ని ఉన్నవాడే మా www.iamyourrealfriend.com
మీ కష్టాలలో తోడూగా ఉంటుంది.మీరు విషాదం లో ఉనపుడు కళ్ళలో కన్నీరు అవుతుంది ,మీరు అనందంగా ఉన్నపుడు మీ పేదాల పై చిరునవ్వు అవుతుంది
మీరు గెలిచినప్పుడు మీ భుజం తడుతుంది.మీరు ఓడినపుడు మీ వెన్ను తట్టి,మీరు నిరుత్సశ్హం లో ఉన్నపుడు మీకు ఊత్సహన్నిన్స్తుంది.మీరు శోకం లో ఉన్నపుడు శోకాన్ని శ్లోకంగా మారుస్తుంది,మీరు నిర్వేదంగ ఉన్నపుడు మీ నిర్వేదాన్ని వేదంగా మారుస్తుంది,భయం తో ఉన్నపుడు ధైర్యన్నిస్తుంది.
ఈ క్షణం నుండి మీరు వెబ్సైటు యూజర్లు కాదు నా రియల్ ఫ్రెండ్స్.నేను ని రియల్ ఫ్రెండ్ ని,మన వెబ్సైటు యూజర్ల అంత ఒకరికి ఒకరు రియల్ ఫ్రెండ్స్,
మీ ఆనందం,విషాదం,విజయలు,అపజయాలు,జ్ఞాపకాలు,మీరు చేసే చిలిపి పనులు అన్ని … అన్ని నా తో పంచుకోండి.నేను నా జీవితాన్ని మీతో పంచుకుంటాను.మన వెబ్సైటు యూజర్లు ఓకరి విషయాలు ఓకరి తో పంచుకుంటాం.ఎందుకంటే మనం ఒకరికి ఒకరం రియల్ ఫ్రెండ్స్ అంతే కాకుండా సైన్సు
చరిత్ర,రాజకీయాలు,సినిమాలు,పురాణాలూ,ఇలా ఎన్నో విషయాలు మీకు వచ్చే సందేహాలును “ASKDOUGHTS” ను క్లిక్ చేసి ప్రశ్నలు అడగవచ్చు.48 గంటల లో
మీరు అడిగే ప్రశ్నలకు జవాబులిచ్చుటకు ప్రయత్నిస్తాం.ప్రతి ఆదివారం 10 జి.కే ప్రశ్నలు అడగటం జరుగుతుంది,ఒక నెలలో ఎవరైతే ఎక్కవ ప్రశ్నలు కు జవాబు లు పంపుతారో వారికీ “ఇంటలిజెన్స్ పర్సన్ అఫ్ ది మంత్ ” అని సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది ఇవే కాకుండా ఆరోగ్య,న్యాయ సలహాలు ఆయ రంగాలలో పేరు గాంచిన నిపునలచే ఇప్పించటం జరుగుతుంది.