Showing posts with label Mobiles. Show all posts
Showing posts with label Mobiles. Show all posts

INTEX 4G Mobile Cost 700rs !




రిలయన్స్‌ జియో 4జి ఫీచర్‌ ఫోన్‌ కంటే ముందే మార్కెట్లో 4జి ఫీచర్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. దేశీయ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ మంగళవారం తన నవరత్న సీరీస్‌లో కొత్త 4జి వోల్టే ఫీచర్‌ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లతో పాటు కంపెనీ ఇదే సీరీస్‌లో మరో ఎనిమిది 2జి ఫీచర్‌ ఫోన్లనూ విడుదల చేసింది. వీటి ధర ఫీచర్లను బట్టి రూ.700 నుంచి రూ.1,500 వరకు ఉంది. టర్బో + 4జి పేరుతో విడుదల చేసిన 4జి వోల్ట్‌ ఫీచర్స్‌ ఫోన్ల స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 2.4 అంగుళాల క్యువిజిఎ
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : కాయ్‌ ఔస్‌
ర్యామ్‌ : 512 ఎంబి
ఇంటర్నల్‌ స్టోరేజ్‌ : 4 జిబి (32 జిబి వరకు పెంచుకోవచ్చు)
కెమెరా : వెనక 2 ఎంపి, ముందు విజిఎ షూటర్‌
బ్యాటరీ : 2000 ఎంఎహెచ్‌


Top 10 Mobiles in India - 2017 Best Mobile Phones



 ఆన్‌లైన్‌లో ఎక్కువమంది ఆసక్తిగా వెతికిన టాప్‌ 10 స్మార్ట్‌ఫోన్లు తెలుసుకోవాలని ఉందా… ఎక్కువమంది ఈ వారం సెర్చ్‌ చేసిన డాటా ఆధారంగా టాప్‌ ట్రెండింగ్‌ జాబితా మీకోసం….

సామ్‌సంగ్‌ గెలాక్సీ 8 మొదటి స్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: వెనుక 12ఎంపీ, ముందు 8ఎంపీ బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

షియోమి రెడ్‌మి 4ఏ రెండో స్థానంలో నిలిచింది. ర్యామ్‌: 2జీబీ, కెమెరా: వెనుక 13ఎంపీ, ముందు 5ఎంపీ బ్యాటరీ: 3120ఎంఏహెచ్‌

సామ్‌సంగ్‌ గెలాక్సీ జే7ప్రైమ్‌ మూడోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 3జీబీ, కెమెరా: 13ఎంపీ (వెనుక), 8ఎంపీ (ముందు), బ్యాటరీ: 3300ఎంఏహెచ్‌

షియోమి రెడ్‌మి నోట్‌ 4 (ఎంఐ 4) నాలుగోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: వెనుక 13ఎంపీ (వెనుక), 5ఎంపీ (ముందు), బ్యాటరీ: 4100ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ 8ప్లస్‌ది ఐదో స్థానం. ర్యామ్‌: 4జీబీ, కెమెరా:12ఎంపీ (వెనుక), 8ఎంపీ (ముందు) బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ5 (2017)ది ఆరోస్థానం. ర్యామ్‌: 3జీబీ, కెమెరా:16ఎంపీ (వెనుక), 16ఎంపీ(ముందు), బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌7ది ఎడ్జ్‌ ఏడో స్థానం. ర్యామ్‌: 4జీబీ, కెమెరా:12ఎంపీ(వెనుక), 5ఎంపీ(ముందు) బ్యాటరీ: 3600ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ సీ9 ప్రో ఎనిమిదోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 6జీబీ, కెమెరా:16ఎంపీ(వెనుక), 16ఎంపీ(ముందు), బ్యాటరీ: 4000ఎంఏహెచ్‌

మోటోరోలా మోటో జీ5ప్లస్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: 12ఎంపీ (వెనుక) , 5ఎంపీ (ముందు) బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

ఎల్‌జీ జీ6 పదోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: 13ఎంపీ (వెనుక), 5ఎంపీ (ముందు) బ్యాటరీ: 3300ఎంఏహెచ్‌.

5G మొబైల్ తో జియోకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న నోకియా Nokia is Back



ఒకప్పుడు సెల్‌ఫోన్ అంటే నోకియా అన్నంతగా ఆ బ్రాండ్ జనాల్లోకి వెళ్లగలిగింది. కానీ కాల క్రమంలో పుట్టుకొచ్చిన స్మార్ట్ ఫోన్ల ధాటికి నోకియా కనుమరుగవక తప్పలేదు. తిరిగి ఇన్నాళ్లకు నోకియా మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ దఫా 5జీ కనెక్టివిటీతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించేందుకు నోకియా కసరత్తులు మొదలుపెట్టింది. మళ్లీ చాలాకాలం తర్వాత మోడ‌ల్ 3310తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ ఫిన్‌లాండ్ సంస్థ నోకియా. త్వ‌ర‌లోనే 5జీ టెక్నాల‌జీపై నోకియా దృష్టిసారించ‌నుంది. ఇందుకోసం టెలికాం రంగంలో ప్ర‌ముఖ సంస్థ ఎయిర్‌టెల్‌, ప్ర‌భుత్వ‌రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో క‌లిసి భార‌త్‌లో 5జీ నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. ఇదే విష‌య‌మై ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌,బీఎస్ఎన్ఎల్ సంస్థ‌ల‌తో నోకియా అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. 2019-2020క‌ల్లా భార‌త్‌లో 5జీ టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టేందుకు ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని నోకియా హెడ్ ఇండియా మార్కెట్ సంజ‌య్ మాలిక్ తెలిపారు.

బెంగ‌ళూరు కేంద్రంగా 5జీ టెక్నాల‌జీపై మ‌రింత ప‌రిశోధ‌న‌లు చేసేందుకు నోకియా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఒక‌ప్పుడు విరివిగా సేవ‌లందించిన నోకియా ఆ త‌ర్వాత స్మార్ట్ ఫోన్ విప్ల‌వంతో మార్కెట్లో క‌నుమరుగైంది. మ‌ళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు నోకియా సిద్ధ‌మ‌వ‌డ‌మేగాక ఏకంగా 5జీ టెక్నాల‌జీతో వ‌స్తుండ‌టంతో మొబైల్ ప్రియులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Apple Iphone 7 Launch on September



ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తోందంటే చాలు... ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ వినియోగదారులకు పండుగ అని చెప్పాలి. ఆపిల్ ఐఫోన్ 7 గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. గత సిరీస్ ఫోన్లకంటే విభిన్నంగా ఉంటుందనీ అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉండబోతాయని.. ఇలా చాలా అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ ఎదురుచూపులకు తెరదించుతూ త్వరలోనే ఒక శుభవార్తను వినిపించబోతోంది ఆపిల్ సంస్థ.

సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 10 గంటలకు శాన్ ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియంలో ఒక భారీ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ప్రముఖ మీడియా సంస్థలకు ఆపిల్ ఆహ్వానాలు పంపింది. ఈ ఈవెంటులోనే ఆపిల్ ఐఫోన్ 7ను వినియోగదారులకు పరిచయం చేస్తుందని ఫోర్బ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఏయే డివైజ్ లను లాంచ్ చేస్తారన్నది మాత్రం ఆహ్వానంలో పేర్కొనలేదు. కానీ ఆపిల్ ఐఫోన్ 7 - ఐఫోన్ 7 ప్లస్ లతోపాటు కొత్త తరం ఐవాచ్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సెప్టెంబర్ 9 నుంచే కొత్త ప్రాడెక్టులకు ప్రీ ఆర్డర్ తీసుకుంటారనీ అదే నెల 16 నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయని ఫోర్బ్స్ రిపోర్ట్ వెల్లడించింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ నోట్ 7కి ధీటుగా కొత్త ఐఫోన్ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీని స్పెక్స్ గురించి చాలా అంచనాలున్నాయి. ఈసారి ఐఫోన్ లో 3.5 ఎం.ఎం. ఆడియో జాక్ ఉండదని అంటున్నారు. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే హెడ్ ఫోన్స్ ఉంటాయని అంటున్నారు. అలానే డ్యుయెల్ కెమెరాతోపాటు బయోమెట్రిక్ ఇంటిగ్రేషన్ - టైప్ సీ పోర్టులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఈ అంచనాలన్నింటికీ తెర దించుతూ సెప్టెంబర్ 7న ఆపిల్ అభిమానులకు శుభవార్త అందుతుంది.

స్మార్ట్ ఫోన్లు శఖం ముగియనుందా !!




నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ నిద్ర పోయే వరకూ మనిషి చుట్టూ స్మార్ట్ ప్రపంచమే. చేతిలో స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి అన్నింటిలోనూ స్మార్ట్ కనిపించక మానదు. మరి.. ఇప్పుడు చేతిలో దర్శనమిస్తున్న స్మార్ట్ ఫోన్ తర్వాతి దశ ఏమిటి? ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్.. ల్యాప్ టాప్ తర్వాతి వెర్షన్ ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఏ విధంగా ఉండనుంది? లాంటి ప్రశ్నలు సర్వసాధారణం. కానీ.. వీటికి చాలామంది చాలా సమాధానాలు చెప్పినా.. గూగుల్ సీఈవో చెప్పే భవిష్యత్ దర్శనం ఆసక్తికరంగానే కాదు.. నమ్మొచ్చు సుమా అనిపించటం ఖాయం.

తాజాగా అలాంటి ప్రయత్నాన్నే చేశారు గూగుల్ సీఈవో.. ప్రవాస భారతీయుడు సుందర్ పిచాయ్. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ల అయుష్షు తీరిపోయే రోజు దగ్గర్లోనే ఉందట. కంప్యూటర్ ను భౌతికంగా కాకుండా.. మరో రూపంలో ఉంటుందన్న భావనను వ్యక్తం చేశారు. రోజువారీ కార్యకలపాల్లోసాయం చేసే కంప్యూటర్ కంటికి కనిపించకుండా ఉండే వీలుందని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశారు సుందర్ పిచాయ్.

స్మార్ట్ ఫోన్.. టచ్ స్ర్కీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఉత్పత్తులు పెరుగుతాయని.. అవేవీ కంటికి కనిపించవని చెప్పుకొచ్చారు. మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. మరి.. అలాంటి చిత్రమైన రోజులు ఎప్పుడొస్తాయో..?

Best Mobiles To Buy on Market


Top Mobiles List in Telugu



సామ్సంగ్ గేలక్సీ S3

గేలక్సీ S2 తరువాత కొన్ని నెలలు పాటు 2012 లో సక్సెస్ఫుల్ గా నంబర్ వన్ స్థానంలో ఉంది గేలక్సీ S3. 

***
సామ్సంగ్ S3 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

మోటో x (2014)
ధర 21,999 రూ.
మోటో x సామ్సంగ్ s3 కి అన్ని విధాలుగా మంచి అపగ్రేడ్. కాంపాక్ట్ డిజైన్, ఫుల్ HD, స్నాప్ డ్రాగన్ 801 ప్రోసెసర్ దీని సొంతం. అలాగే ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా దీనికి ఎక్కువుగా ఉంటాయి. సామ్సంగ్ s3 కు ఇంతవరకూ లాలిపాప్ అప్డేట్ రాలేదు.

***

సామ్సంగ్ S3 కి రెండవ అపగ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గెలాక్సీ S6
ధర 39,000 రూ.
హై ఎండ్ బడ్జెట్ లో అప్ గ్రేడ్ అవుదామని చుస్తే కనుక ఇది తిరుగులేని ఆప్షన్

***

ఆపిల్ ఐ ఫోన్ 4S

ఇది ఇప్పుడు డబ్బా ఫోన్ లా అనిపించవచ్చు కాని, 2011, 2012 లో ఐ ఫోన్ 4S ఒక డ్రీమ్ ఫోన్ అందరికి.  తాజగా ఇప్పడు ఐ os 9 అప్డేట్ 4S మోడల్ కు కూడా సపోర్ట్ చేసేలా డిజైన్ చేసింది ఆపిల్. అయితే స్పెసిఫికేషన్స్ పరంగా చుస్తే దీని నుండి అపగ్రేడ్ అవ్వాలి.

***

ఐ ఫోన్ 4S కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

ఐఫోన్ 6
ధర 43,500 రూ
ఐ ఫోన్ 6 బెటర్ స్క్రీన్, ప్రోసెసర్, కెమేరా లతో 4S కు మంచి కాంపాక్ట్ అపగ్రేడ్ మోడల్. 

***

ఐ ఫోన్ 4S కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

సోనీ ఎక్స్పిరియా Z3 కాంపాక్ట్
ధర 32,000 రూ.
ఆపిల్ నుండి ఆండ్రాయిడ్ కు షిఫ్ట్ అవుదామని, అయితే 4S లాగే చిన్న సైజు లో ఉన్న ఫోన్ కావాలని అనుకుంటే, స్పీడ్ మరియు కన్ఫిగరేషన్ పరంగా కాంప్రమైజ్ అవకుండా దీనికి అపగ్రేడ్ అవచ్చు.

***

నేక్సాస్ 4

గూగల్ నుండి అఫీషియల్ గా థర్డ్ పార్టీ బ్రాండ్ ల తయారీ లో వచ్చే నేక్సాస్ మోడల్ లో నేక్సాస్ 4 చాలా ఫేమస్. డిజైన్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా, రియల్ టైమ్ లో స్పీడ్ పరంగా ఇది రెండు సంవత్సరాలు పాటు తిరుగులేని డివైజ్ గా స్మార్ట్ ఫోన్ ప్రపంచానికి మకుటం లేని మహారాజు నేక్సాస్ 4 :)

***

నేక్సాస్ 4 కి మొదటి అపగ్రేడ్ ఆప్షన్

మోటో x(2014)
ధర 21,999 రూ.
నేక్సాస్ 4 కన్నా కొంచెం సైజ్ పెద్దది కాని ఎక్సలెంట్ ఫోన్ ఇది. నేక్సాస్ మాదిరి గా లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ను పొందే డివైజ్ మోటో x. 

***

నేక్సాస్ 4 కి రెండవ అపగ్రేడ్ ఆప్షన్

OnePlus వన్
ధర: 18,998 రూ.
పెద్ద సైజ్ ఫోన్ మీకు ప్రాబ్లెం కాకపొతే, ఇది అన్నీ విధాలుగా అన్ని లేటెస్ట్ హార్డ్వేర్ మరియు సాఫ్టవేర్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది.

***

బ్లాక్బెర్రీ బోల్డ్

క్లాసిక్ ఫోన్స్ గురించి ప్రస్తావించినప్పుడు కచ్చితంగా బ్లాక్ బెర్రీ మోడల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది బ్లాక్ బెర్రీ లో లాస్ట్ క్లాసిక్ ఫోన్ అని చెప్పవచ్చు. క్వార్టి కీ పాడ్ మరియు టచ్ స్క్రీన్ రెండు దీనిలో ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ అంతా టచ్ ఫోన్స్. కానీ బోల్డ్ 9900 కు ఉన్న క్వర్టీ మొత్తం బ్లాక్ బెర్రీ అన్ని క్వర్టీ ఫోనుల లో చాలా బెటర్ క్వర్టీ ఫోన్.

***

బ్లాక్ బెర్రీ బోల్డ్ 9900 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

బ్లాక్ బెర్రీ Q5
ధర 19,000 రూ.
మీకు ఇంకా క్వర్టీ ఫోనులను వాడాలని అనుకుంటున్నారా? అయితే బ్లాక్ బెర్రీ Q5 ఫాస్ట్ ప్రోసెసర్, మంచి స్క్రీన్, కలర్ ఆప్షన్స్ తో లభ్యమవుతుంది. Q10 ఉంది కాని అది కొంచెం కాస్ట్ ఎక్కువ.

***

బ్లాక్ బెర్రీ బోల్డ్ 9900 కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్
ఆపిల్ ఐ ఫోన్ 6
ధర: 43,500 రూ.
అవును బ్లాక్ బెర్రీ కి దీనికి చాలా తేడా ఉంటుంది. కాని బ్లాక్ బెర్రీ వలె కొంచెం స్టేటస్ ఉన్న బ్రాండ్ మరియు స్టాండర్డ్ డివైజ్ ను వదలని అనుకుంటే ఆపిల్ ఫోన్ మాత్రమే మీకు స్టాండర్డ్ ఫీలింగ్ ను ఇస్తుంది. ఇక os పరంగా చెప్పుకుంటే, అన్నీ విధాలుగా బ్లాక్ బెర్రీ కన్నా ఐ os చాలా బెటర్.


***

HTC వన్
HTC కంపెని ఫోనులు అంటే మొదట్లో ఐ ఫోన్ తరువాతి స్థానంలో ఉండేవి. ఈ బ్రాండ్ లో మొట్ట మొదటిగా వచ్చిన HTC one మోడల్ హై ఎండ్ సక్సెస్ఫుల్ డివైజ్ గా ఉండేది.


***

HTC one కు మొదటి అప్ గ్రేడ్ ఆప్షన్

HTC M9+
ధర: 48,000 రూ.
సూపర్ లేటెస్ట్ ఫీచర్స్  మరియు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ దీని సొంతం. మీడియా టెక్ ట్రూ ఆక్టో కోర్ ప్రోసెసర్ బ్లేజింగ్ స్పీడ్ పెర్ఫార్మెన్స్ ను ఇస్తుంది.


***

htc one కు రెండవ అప్ గ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గేలక్సీ S6
ధర: 39,000
ముందు చెప్పుకున్నట్టు, ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోనుల్లో S6 డి బెస్ట్. ఒక విధంగా ఇది ఐ ఫోన్ 6 కన్నా మెరుగైన పెర్ఫార్మెన్స్ మరియు కెమేరా ను అందిస్తుంది.


***

మోటోరోలా మోటో G

దీని గురించి చాలా మందికి తెలుసు, కారణం ఇది మోటోరోలా బడ్జెట్ ర్యాంజ్ లో దించిన గొప్ప స్మార్ట్ ఫోన్. మంచి స్క్రీన్, ప్రోసెసర్, మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ను అందుబాటు ధరలో దింపి రివల్యుషణ్ తెచ్చిన బ్రాండ్ ఈ మధ్య కాలంలో మోటోరోలా నే. అయితే దీనిని అపగ్రేడ్ చేసుకుందాం అనే ఆలోచన తప్పు అనలేము. ఎందుకంటే ఇది 2014 లో వచ్చినప్పటికీ ఇప్పుడు అదే కంపెనీలో చాలా అప్ గ్రేడేడ్ మోడల్స్ వచ్చేసాయి.


***

మోటో G కు మొదటి అప్ గ్రేడ్ ఆప్షన్

Xiaomi మి 4i
ధర: 12,999 రూ.
మి 4i ప్రస్తుత బడ్జెట్ఫోన్ సెగ్మెంట్ లో దొరుకుతున్న ఫాస్ట్ ఫోన్. ఇది తీసుకోవటానికి కారణాలు.. కాంపాక్ట్ డిజైన్, మంచి కెమేరా. లేటెస్ట్ స్పెసిఫికేషన్స్.


***

మోటో G రెండవ అప్ గ్రేడ్ ఆప్షన్

ఆసుస్ జెన్ ఫోన్ 2
ధర: 12,999 రూ
మి 4i అంతగా ఇది చాలా మందికి పరిచయం లేదు, కారణం ఆసుస్ మోడల్స్ అన్నీ ఒకే పేరుతో ఉంటాయి, అలాగే Xiaomi కు ఉన్నంత పబ్లిసిటి మార్కెట్ దీనికి లేదు. అయితే మోటో G కు ఇది కూడా మంచి అప్ గ్రేడ్ మోడల్.


***

నోకియా లుమియా 1020

నోకియా డిస్ప్లే మరియు బిల్డ్ క్వాలిటీ లో చాలా మంచి స్టాండర్డ్స్ ను మెయిన్టెయిన్ చేస్తుంది అని అందరికీ తెలుసు. అయితే ఈ ఫోన్ తో అద్భుతమైన కెమేరా లను కూడా అందిస్తాది అని రుజువు అయ్యింది. లుమియా సిరిస్ లో ఈ మోడల్ బాగా పాపులర్. 40MP ప్యూర్ వ్యూ కెమేరా టెక్నాలజీ ఉంటుంది ఇందులో. అయితే ఇది కూడా అవుట్ డేటేడ్ అయ్యింది. 


***

1020 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

లుమియా 930
ధర: 29,000 రూ.
ఫాస్ట్ ప్రోసెసర్, ఫాస్టర్ 20MP ప్యూర్ వ్యూ కెమేరా, డిటేల్డ ఫోటోస్, గ్రేట్ లుక్స్ దీనీ ప్రత్యేకతలు.


***

1020 కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గెలాక్సీ S6
ధర: 39,000 రూ
 మీరు మొదవ సారి S6 ను అపగ్రేడ్ డివైజ్ గా చూపించటం గమనించి ఉంటారు. అయితే 1020 లాంటి మొబైల్ ను కొన్న వాళ్లు అదే బడ్జెట్ స్టాండర్డ్స్ లో ఫోన్ కొనాలని అనుకుంటారు అనే కారణం ఒకటి అయితే, ఇది నిజంగా హై ఎండ్ ఫోనుల్లో ది బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది రెండవ కారణం. ఈ రెండు కారణాల వలన ఇది రిపీటెడ్ గా రికమెండ్ చేయబడుతుంది.


***

సోనీ ఎక్స్పిరియా Z

సోనీ ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో మొదటిగా వచ్చి సక్సెస్ఫుల్ గా రన్ అయిన డివైజ్ సోనీ ఎక్స్పిరియా డివైజ్. మంచి డిజైనింగ్ తో పాటు వాటర్ రెసిస్టెంట్ గా హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది Z.


***

సోనీ ఎక్స్పిరియా Z కు కుడా సామ్సంగ్ గేలక్సీ S6 ది only బెస్ట్ అప్ గ్రేడ్ మోడల్. సోనీ తరువాత దింపిన Z సిరిస్ మోడల్స్ కన్నా S6 టాప్ రికమెండెడ్.

***

సామ్సంగ్ గేలక్సీ నోట్

సామ్సంగ్ ఫోన్ లలో నోట్ మరో క్లాసిక్ కాన్సెప్ట్. ఒక పక్క పెద్ద సైజు మొబైల్స్ పై కొంత మంది అయిష్టత చూపిస్తుంటే, సామ్సంగ్ నోట్ మాత్రం అందరికి నచ్చే విధంగా తయారీ అయ్యి విడుదల అయ్యింది.


***

సామ్సంగ్ నోట్ కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గేలక్సీ నోట్ 4
ధర: 40,000 రూ.
అవును నాలుగు జెనరేషన్స్ తరువాతి మోడల్ ఇది. 5.7 in స్క్రీన్ తో బ్లేజింగ్ స్పీడ్ మరియు సరికొత్త ఫీచర్స్ తో నోట్ కు నోట్ 4 సరైన అపగ్రేడ్ ఆప్షన్.


***

నోట్ కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

ఐ ఫోన్ 6 ప్లస్
ధర: 50,000 రూ.
నోట్ కాన్సెప్ట్ వలె, అంత పెద్ద సైజ్ లో అంటే స్టాండర్డ్స్ లో ఉండేది ఆపిల్ ఐ ఫోన్ 6 ప్లస్ మోడల్. దీని స్క్రీన్ సైజ్ 5.5 in అవటం వలన దీనిని సిఫార్సు చేస్తున్నాం నోట్ కు ఆల్టర్నేటివ్ అపగ్రేడ్ మోడల్ గా.


***

లుమియా 520

ఇది విండోస్ ఫోనుల్లో సక్సెస్ అయిన వాటిలో ఒకటి. అందుకు ప్రధాన కారణం అందుబాటులోని ధర అని చెప్పవచ్చు. అయితే దీనికి కొన్ని అపగ్రేడ్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో


***

520 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్ మోడల్

లుమియా 535
ధర: 7,000 రూ.
విండోస్ ఫోన్ అంటే మీకు ఇష్టం అయితే, అన్ని విధాలుగా 520 కన్నా బెటర్ గా ఇంప్రూవ్ అయిన డివైజ్, లుమియా 535.


***

520 కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

మైక్రోమ్యాక్స్ యు యురేకా
ధర: 8,999 రూ.
విండోస్ ఏకో సిస్టం వాడి బోర్ ఫిల్ అయినవాళ్ళకి, ఆండ్రాయిడ్ పై నడుస్తున్న యు యురేకా మంచి స్పెసిఫికేషన్స్ తో కరెక్ట్ అప్ గ్రేడ్ మోడల్.



Get Android Mobile Just 251 Rupees Only Below 500rs Phone

India Lowest Price Android Mobile


Ringing bells Pvt. LTD. Launches FREEDOM251 feature packed android
mobile phone at just Rs.251 only.
4" WVGA IPS Display
1.3Ghz Quadcore Processor
1GB / 8GB memory
3.2 / 0.3 Camera
1450 mAh Battery
Dual Sim
3G
Android 5.1 Lollpop
1yr warranty
650+ Service centres.

Bookings open at 6.00 AM on 18Feb 2016
Bookinge Ends at 8.00 PM on 21 Feb 2016
delivery 30June 2016

Click Here to Buy


1. The highlight of the phone is
its jaw-dropping price tag. The company, which had intially teased the
phone saying that it would be priced under Rs 500, revealed that the
Freedom 251 smartphone will carry a price tag of Rs 251. Only.
2. Talking about the specs, the Freedom 251 handset will have a 4-inch
qHD IPS display, 3.2 megapixel auto-focus rear camera, 0.3 megapixel
front camera, 1.3 GHz quad-core processor, 1GB RAM, 8GB of internal
storage with SD card support, 1450 mAh battery, and Android 5.1
Lollipop OS.
3. The phone will come with a standard warranty of 1 year. According
to the company's website, "This warranty of the product extends for a
period of 12 months for the host unit, 6 months for battery and
charger, and 3 months for earphone commencing from the date of
purchase."
4. Bookings for the phone open on February 18 at 6AM and close on
February 21 at 8PM.
5. Defence Minister Manohar Parrikkar will launch the smartphone
'Freedom 251' on February 17. The launch is in line with Prime
Minister Narendra Modi's vision for "empowering India to the last
person, transforming India's growth story", the Noida-based company
said.

ఒక్క సెకన్లో 10,000 మొబైల్ ఫోన్లు సేల్!



ఆన్ లైన్ సేల్స్ లో లెనోవా ఫోన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమెజాన్ ఆన్ లైన్ మార్కెంటింగ్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన లెనోవా కె4 నోట్ మోడల్ ఒక్క సెకన్లో పదివేల ఫోన్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఇదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసింది లెనోవా. కొంత కాలంగా ఈ మోడల్ మొబైల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అవకాశం కల్పించిన లెనోవా సంస్థ 4,80,566 రిజిస్ట్రేషన్లను స్వీకరించింది.3 జీబీ రామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అధునాతన ఫీచర్స్ తో హై ఎండ్ మొబైల్ గా రూపొందిన లెనోవా కె4 ధర రూ.12,499. ప్రస్తుతానికి అమెజాన్ ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ మొబైల్ జనవరి 5న ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేయగా, జనవరి 19 నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది.
తొలి సెకన్లోనే 10,000 ఫోన్లు అమ్ముడయినట్టుగా సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ లో వెల్లడించింది.