Showing posts with label Smart Phone. Show all posts
Showing posts with label Smart Phone. Show all posts

జియో 4జీ సిమ్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ల లిస్టు

Reliance JIO 4g Sim Supported Smart Phones List



4జీ మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపిన Reliance Jio మరింత అగ్రెసివ్‌గా జనంలోకి దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది.
4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ నేపథ్యంలో క్లారిటీ కోసం రిలయన్స్ జియో 4జీ సిమ్ కార్డ్‌లను సపోర్ట్ చేస్తున్నస్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీముందు ఉంచుతున్నాం...
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న LYF స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
లైఫ్ ఎర్త్ 1, లైఫ్ ఎర్త్ 2, లైఫ్ ఫ్లేమ్ 1, లైఫ్ ఫ్లేమ్ 2, లైఫ్ ఫ్లేమ్ 3, లైఫ్ ఫ్లేమ్ 4, లైఫ్ ఫ్లేమ్ 6, లైఫ్ వాటర్ 1, లైఫ్ వాటర్ 2, లైఫ్ వాటర్ 3, లైఫ్ వాటర్ 4, లైఫ్ వాటర్ 5, లైఫ్ వాటర్ 6, లైఫ్ వాటర్ 7, లైఫ్ వాటర్ 8, లైఫ్ విండ్ 1 (16జీబి వర్షన్), లైఫ్ విండ్ 2 (8జీబి వర్షన్), లైఫ్ విండ్ 3, లైఫ్ విండ్ 4, లైఫ్ విండ్ 5, లైఫ్ విండ్ 6.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Samsung స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ , సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 (SM-A800F), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్, సామ్‌సంగ్ నోట్ 5 డ్యుయోస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2, సామ్‌సంగ్ గెలాక్సీ జే7, సామ్‌సంగ్ గెలాక్సీ జే5, సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే6 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న apple స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
యాపిల్ ఐఫోన్ 6, యాపిల్ ఐఫోన్ 6 ప్లస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న blackberry స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
బ్లాక్ బెర్రీ ప్రివ్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న కూల్‌ప్యాడ్ (coolpad) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
కూల్‌ప్యాడ్ నోట్ 3
కూల్‌ప్యాడ్ మాక్స్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జియోనీ (gionee) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
జియోనీ ఎస్ ప్లస్
జియోనీ ఎఫ్103
జియోనీ ఇలైఫ్ ఎస్6
జియోనీ ఎం5 ప్లస్ జియోనీ పీ5ఎల్
జీయోనీ ఎఫ్103 ప్రో

* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఇన్‌ఫోకస్ (infocus) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
ఇన్‌ఫోకస్ ఎమ్370, ఇన్‌ఫోకస్ ఎమ్535, ఇన్‌ఫోకస్ ఎమ్680, ఇన్‌ఫోకస్ ఎమ్370I, ఇన్‌ఫోకస్ ఎమ్M535+
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
ఇంటెక్స్ ఆక్వా 4జీ, ఇంటెక్స్ ఆక్వా ఏస్ 2, ఇంటెక్స్ ఆక్వా క్రేజ్, ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్, ఇంటెక్స్ ఆక్వా ఏస్ మినీ, ఇంటెక్స్ ఆక్వా రేజ్, ఇంటెక్స్ ఆక్వా 4జీ స్ట్రాంగ్, ఇంటెక్స్ ఆక్వా షైన్ 4జీ, ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్, ఇంటెక్స్ ఆక్వా వ్యూ.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న karbonn స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
కార్బన్ క్వాట్రో ఎల్45 ఐపీఎస్ కార్బన్ క్వాట్లో ఎల్55 హైడెఫినిషన్, కార్బన్ Aura పవర్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న లావా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
లావా ఎక్స్50, లావా ఏ71, లావా ఏ72, లావా ఏ88, లావా ఏ76, లావా ఏ89, లావా ఎక్స్46, లావా ఎక్స్38, లావా ఎక్స్17, లావా ఎక్స్11. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న lenovo స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
లెనోవో వైబ్ షాట్, లెనోవో ఏ6000 ప్లస్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఎల్‌జీ (lg) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
ఎల్‌జీ ఎక్స్ స్ర్కీన్, ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్, ఎల్‌జీ స్పిరిట్, ఎల్‌జీ కే7, ఎల్‌జీ కే10, ఎల్‌జీ స్టైలస్ 2 ప్లస్, ఎల్‌జీ స్టైలస్ 2
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
YU Yunique YU4711, మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5 ,మైక్రోమాక్స్ కాన్వాస్ అమేజ్ యు యుపోరియా యు నోట్ (యు6000), మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 2 క్యూ426
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న మోటరోలా (Motorola) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
మోటరోలా మోటో ఇ (మూడవ జనరేషన్), న్యూ వర్షన్ మోటో ఇ (సెకండ్ జనరేషన్), న్యూ వర్షన్ మోటో ఎక్స్ (మోటో ఎక్స్ ప్లే), మోటరోలా మోటో జీ టర్బో, మోటరోలా మోటీ జీ4, మోటరోలా మోటో జీ4 ప్లస్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
వన్‌ప్లస్ 3, ఒప్పో ఎఫ్1, ఒప్పో ఏ37, ఒప్పో ఎఫ్1 ప్లస్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న panasonic స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
పానాసోనిక్ Eluga 12 (2జీబి), పానాసోనిక్ Eluga 12 (3జీబి), పానాసోనిక్ Eluga ఆర్క్, పానాసోనిక్ Eluga ఐకాన్ 2,పానాసోనిక్ Eluga ఐ3, పానాసోనిక్ Eluga ఏ2, పానాసోనిక్ Eluga నోట్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న సోనీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్ (ఈ6883), సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ (ఎఫ్5122)
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న టీసీఎల్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
టీసీఎల్ 560
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న వీడియోకాన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
వీడియోకాన్ వీ45ఈడి,
వీడియోకాన్ జెడ్55 క్రిప్టాన్ (V50FA3)
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న వివో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
వివో వీ3, వివో వీ3 మాక్స్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
షియోమీ రెడ్మీ 2 ప్రైమ్ (హెచ్2ఎక్స్), షియోమీ రెడ్మీ నోట్ 3, షియోమీ ఎంఐ5, షియోమీ ఎంఐ మాక్స్
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జోలో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
జోలో ఎరా 4 జి
* రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జోపో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:
జోపో స్పీడ్ 8

రాత్రంతా మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచితే ఏమవుతుందో తెలుసా !




స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేధించే ప్రధాన సమస్య ఛార్జింగ్. బ్యాటరీ ఫుల్ అయినా.. ఒక్కోసారి గంటలోపే ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోతుంది. మళ్లీ ఆన్ చేస్తే బ్యాటరీ ఫుల్ ఉన్నట్లు చూపిస్తుంది కానీ.. సరిగ్గా పనిచేయదు. అది కంపెనీ బ్యాటరీ అయినా సరే, లోకల్ బ్యాటరీ అయినా సరే.. ఒక్కోసారి ఈ సమస్య వస్తుంటుంది. బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవడానికి దాని క్వాలిటీయే కాదు... మనం ఛార్జింగ్ పెట్టే విధానం కూడా కారణమే.

సాధారణంగా చాలామంది పగలంతా మొబైల్ ఫోన్ వాడేసి.. రాత్రి పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెడతారు. పొద్దున్నే లేచేంతవరకు అలానే బ్యాటరీ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. ఇలా చేసినప్పుడు బ్యాటరీలోని లిథియం అయాన్స్ ప్రవాహశక్తిని కోల్పోతాయట. రుణావేశం గల ఎలక్ట్రోడ్ నుంచి ధనావేశం గల ఎలక్ట్రోడ్‌కు లిథియం అయాన్స్ ప్రవహించే స్థాయిని బట్టి బ్యాటరీ పని విధానం ఉంటుందట. రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల లిథియం అయాన్స్ బలహీనమై బ్యాటరీ మన్నిక దెబ్బతింటుంది.

ఒక్కోసారి బ్యాటరీ ఫుల్ అయ్యే వరకు (100%) ఛార్జింగ్ పెడుతుంటాం. ఈ పద్ధతి కూడా మంచింది కాదు. 90 నుంచి 95 శాతం మధ్యలో ఛార్జింగ్ ఉన్నప్పుడు తీసేస్తే సరిపోతుందట. ఒకేసారి బ్యాటరీ ఫుల్ చేసే బదులు రోజులో మీ వీలునిబట్టి అప్పుడప్పుడు ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ సమార్థ్యం మెరుగుపడుతుందట. మీ బ్యాటరీ కెపాసిటీని బట్టి, మీ ఛార్జర్ వోల్టేజీని బట్టి ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలనేది ఈ కింది టేబుల్‌లో గమనించగలరు.




దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలూ లిథియం- అయాన్‌తోనే తాయారవుతాయి. లిథియం-అయాన్‌ను వేడి ప్రదేశంలో ఉంచితే దాని నుంచి అగ్గి పుట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంచెం కూల్ ఉన్న ప్రదేశంలో ఉంచితే.. మీ బ్యాటరీకీ మంచిది, మీకూ మంచిది.

స్మార్ట్ ఫోన్లు శఖం ముగియనుందా !!




నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ నిద్ర పోయే వరకూ మనిషి చుట్టూ స్మార్ట్ ప్రపంచమే. చేతిలో స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి అన్నింటిలోనూ స్మార్ట్ కనిపించక మానదు. మరి.. ఇప్పుడు చేతిలో దర్శనమిస్తున్న స్మార్ట్ ఫోన్ తర్వాతి దశ ఏమిటి? ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్.. ల్యాప్ టాప్ తర్వాతి వెర్షన్ ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఏ విధంగా ఉండనుంది? లాంటి ప్రశ్నలు సర్వసాధారణం. కానీ.. వీటికి చాలామంది చాలా సమాధానాలు చెప్పినా.. గూగుల్ సీఈవో చెప్పే భవిష్యత్ దర్శనం ఆసక్తికరంగానే కాదు.. నమ్మొచ్చు సుమా అనిపించటం ఖాయం.

తాజాగా అలాంటి ప్రయత్నాన్నే చేశారు గూగుల్ సీఈవో.. ప్రవాస భారతీయుడు సుందర్ పిచాయ్. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ల అయుష్షు తీరిపోయే రోజు దగ్గర్లోనే ఉందట. కంప్యూటర్ ను భౌతికంగా కాకుండా.. మరో రూపంలో ఉంటుందన్న భావనను వ్యక్తం చేశారు. రోజువారీ కార్యకలపాల్లోసాయం చేసే కంప్యూటర్ కంటికి కనిపించకుండా ఉండే వీలుందని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశారు సుందర్ పిచాయ్.

స్మార్ట్ ఫోన్.. టచ్ స్ర్కీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఉత్పత్తులు పెరుగుతాయని.. అవేవీ కంటికి కనిపించవని చెప్పుకొచ్చారు. మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. మరి.. అలాంటి చిత్రమైన రోజులు ఎప్పుడొస్తాయో..?