Showing posts with label Technology. Show all posts
Showing posts with label Technology. Show all posts

Top 10 Mobiles in India - 2017 Best Mobile Phones



 ఆన్‌లైన్‌లో ఎక్కువమంది ఆసక్తిగా వెతికిన టాప్‌ 10 స్మార్ట్‌ఫోన్లు తెలుసుకోవాలని ఉందా… ఎక్కువమంది ఈ వారం సెర్చ్‌ చేసిన డాటా ఆధారంగా టాప్‌ ట్రెండింగ్‌ జాబితా మీకోసం….

సామ్‌సంగ్‌ గెలాక్సీ 8 మొదటి స్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: వెనుక 12ఎంపీ, ముందు 8ఎంపీ బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

షియోమి రెడ్‌మి 4ఏ రెండో స్థానంలో నిలిచింది. ర్యామ్‌: 2జీబీ, కెమెరా: వెనుక 13ఎంపీ, ముందు 5ఎంపీ బ్యాటరీ: 3120ఎంఏహెచ్‌

సామ్‌సంగ్‌ గెలాక్సీ జే7ప్రైమ్‌ మూడోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 3జీబీ, కెమెరా: 13ఎంపీ (వెనుక), 8ఎంపీ (ముందు), బ్యాటరీ: 3300ఎంఏహెచ్‌

షియోమి రెడ్‌మి నోట్‌ 4 (ఎంఐ 4) నాలుగోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: వెనుక 13ఎంపీ (వెనుక), 5ఎంపీ (ముందు), బ్యాటరీ: 4100ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ 8ప్లస్‌ది ఐదో స్థానం. ర్యామ్‌: 4జీబీ, కెమెరా:12ఎంపీ (వెనుక), 8ఎంపీ (ముందు) బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ5 (2017)ది ఆరోస్థానం. ర్యామ్‌: 3జీబీ, కెమెరా:16ఎంపీ (వెనుక), 16ఎంపీ(ముందు), బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌7ది ఎడ్జ్‌ ఏడో స్థానం. ర్యామ్‌: 4జీబీ, కెమెరా:12ఎంపీ(వెనుక), 5ఎంపీ(ముందు) బ్యాటరీ: 3600ఎంఏహెచ్‌

శామ్‌సంగ్‌ సీ9 ప్రో ఎనిమిదోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 6జీబీ, కెమెరా:16ఎంపీ(వెనుక), 16ఎంపీ(ముందు), బ్యాటరీ: 4000ఎంఏహెచ్‌

మోటోరోలా మోటో జీ5ప్లస్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: 12ఎంపీ (వెనుక) , 5ఎంపీ (ముందు) బ్యాటరీ: 3000ఎంఏహెచ్‌

ఎల్‌జీ జీ6 పదోస్థానంలో నిలిచింది. ర్యామ్‌: 4జీబీ, కెమెరా: 13ఎంపీ (వెనుక), 5ఎంపీ (ముందు) బ్యాటరీ: 3300ఎంఏహెచ్‌.

5G మొబైల్ తో జియోకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న నోకియా Nokia is Back



ఒకప్పుడు సెల్‌ఫోన్ అంటే నోకియా అన్నంతగా ఆ బ్రాండ్ జనాల్లోకి వెళ్లగలిగింది. కానీ కాల క్రమంలో పుట్టుకొచ్చిన స్మార్ట్ ఫోన్ల ధాటికి నోకియా కనుమరుగవక తప్పలేదు. తిరిగి ఇన్నాళ్లకు నోకియా మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ దఫా 5జీ కనెక్టివిటీతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించేందుకు నోకియా కసరత్తులు మొదలుపెట్టింది. మళ్లీ చాలాకాలం తర్వాత మోడ‌ల్ 3310తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ ఫిన్‌లాండ్ సంస్థ నోకియా. త్వ‌ర‌లోనే 5జీ టెక్నాల‌జీపై నోకియా దృష్టిసారించ‌నుంది. ఇందుకోసం టెలికాం రంగంలో ప్ర‌ముఖ సంస్థ ఎయిర్‌టెల్‌, ప్ర‌భుత్వ‌రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో క‌లిసి భార‌త్‌లో 5జీ నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. ఇదే విష‌య‌మై ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌,బీఎస్ఎన్ఎల్ సంస్థ‌ల‌తో నోకియా అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. 2019-2020క‌ల్లా భార‌త్‌లో 5జీ టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టేందుకు ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని నోకియా హెడ్ ఇండియా మార్కెట్ సంజ‌య్ మాలిక్ తెలిపారు.

బెంగ‌ళూరు కేంద్రంగా 5జీ టెక్నాల‌జీపై మ‌రింత ప‌రిశోధ‌న‌లు చేసేందుకు నోకియా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఒక‌ప్పుడు విరివిగా సేవ‌లందించిన నోకియా ఆ త‌ర్వాత స్మార్ట్ ఫోన్ విప్ల‌వంతో మార్కెట్లో క‌నుమరుగైంది. మ‌ళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు నోకియా సిద్ధ‌మ‌వ‌డ‌మేగాక ఏకంగా 5జీ టెక్నాల‌జీతో వ‌స్తుండ‌టంతో మొబైల్ ప్రియులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

జియో ఫోన్ కొనాలనుకునేవారు ఈ విషయాలను తెలుసుకోండి



టెలికాం రంగంలో ప్రకంపనాలు సృష్టించిన జియో తాజాగా 4 జి ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టి ప్రత్యర్దుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాలా చేస్తోంది..ఈ ఫీచర్ ఫోన్ పై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..రూ.1500 డిపాజిట్ తో లభించనున్న ఈ ఫోన్ ఆగస్టు 24 నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్ లో కేవలం ఒక్క సిమ్ కే అవకాశం ఉందట. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ ఫీచర్ తో రావడం లేదని తెలిసింది. అది కూడా వీవోఎల్ టీఈ ఫీచర్ ఉన్న సిమ్ మాత్రమే ఈ ఫోన్ లో పని చేస్తుంది.

అంటే.. ప్రస్తుతం వీవోఎల్ టీఈని అందిస్తున్నది దేశంలో జియో మాత్రమే కనుక, కేవలం ఆ సంస్థకు చెందిన సిమ్ లు మాత్రమే జియో 4జీ ఫీచర్ ఫోన్ లో పనిచేస్తాయన్నమాట. ఇతర నెట్ వర్క్ లకు చెందిన సిమ్ లను వేసుకోలేం. అయితే భవిష్యత్తులో ఈ ఫోన్ కు చెందిన డ్యుయల్ సిమ్ వేరియెంట్ ను తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు జియో ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఫోన్ పై అనేక సందేహాలు కూడా ఉన్నాయి.

జియో 4జీ ఫీచర్ ఫోన్ నడిచేది పూర్తిగా విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్ తో. ఆ ఫోన్ కోసం ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. కనుక అందులో వాట్సప్ రాదు. కానీ యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ ను అందించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక వాట్సప్ కు ప్రత్యామ్నాయంగా అందులో ఇచ్చే జియో చాట్ యాప్ ను వాడుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు ఈ ఫోన్ కు చెందిన పూర్తి స్పెసిఫికేషన్లను జియో వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన స్ప్రెడ్ ట్రమ్ కమ్యూనికేషన్ తోపాటు మరో ప్రాసెసర్ తయారీ సంస్థ అయిన క్వాల్ కామ్ కూడా జియోతో కలసి పనిచేస్తున్నట్టు గతంలో చెప్పాయి. కనుక స్ప్రెడ్ ట్రమ్ ప్రాసెసర్, క్వాల్ కామ్ ప్రాసెసర్ తో ఉండే జియో 4జీ ఫోన్ రెండు మోడల్స్ లో విడుదలయ్యేందుకు అవకాశం ఉంది.

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి రీచార్జి చేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ ఫోన్ కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు.

జియో 4జీ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఆర్డర్ కన్ ఫాం అయి డెలివరీ అవుతుంది.

జియో ఫోన్ కు అనుసంధానించుకునే కేబుల్ ను రూ.500 వరకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందట. దాంతోపాటు నెలకు రూ.309 ప్లాన్ ను కచ్చితంగా తీసుకుంటేనే ఆ కేబుల్ ను వాడుకునే వీలుంటుందని తెలిసింది.

జియో 4జీ ఫీచర్ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ లేదు. దీంతో ఈ ఫోన్ లో ఉన్న ఇంటర్నెట్ ను ఇతర డివైస్ లకు షేరింగ్ ద్వారా పొందలేము.

జియో 4జీ ఫీచర్ ఫోన్ ను కొని అందులో వాడే సిమ్ ను రీచార్జి చేసుకున్నాక రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుందని చెప్పారు. అదండీ జియో ఫోన్ సంగతి...