Showing posts with label Lenovo. Show all posts
Showing posts with label Lenovo. Show all posts

ఒక్క సెకన్లో 10,000 మొబైల్ ఫోన్లు సేల్!



ఆన్ లైన్ సేల్స్ లో లెనోవా ఫోన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమెజాన్ ఆన్ లైన్ మార్కెంటింగ్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన లెనోవా కె4 నోట్ మోడల్ ఒక్క సెకన్లో పదివేల ఫోన్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఇదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసింది లెనోవా. కొంత కాలంగా ఈ మోడల్ మొబైల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అవకాశం కల్పించిన లెనోవా సంస్థ 4,80,566 రిజిస్ట్రేషన్లను స్వీకరించింది.3 జీబీ రామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అధునాతన ఫీచర్స్ తో హై ఎండ్ మొబైల్ గా రూపొందిన లెనోవా కె4 ధర రూ.12,499. ప్రస్తుతానికి అమెజాన్ ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ మొబైల్ జనవరి 5న ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేయగా, జనవరి 19 నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది.
తొలి సెకన్లోనే 10,000 ఫోన్లు అమ్ముడయినట్టుగా సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ లో వెల్లడించింది.