Showing posts with label Narendra Modi. Show all posts
Showing posts with label Narendra Modi. Show all posts

మీకు ఫ్రిడ్జి, బైక్, వాషింగ్ మెషీన్ ఉంటే మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులు !

Welfare Schemes are Eligible only for the People who does not have Luxury Items.


ప్రభుత్వం యొక్క విధి ప్రజలందరికి అవసరమైన అవసరాలను ,సౌకర్యాలను అందచేయడం.దాని కోసం ప్రభుత్వం సబ్సిడిలని సంక్షేమ పదకాలని రూపొందించి ప్రజలకు వరాల జల్లు కురిపిస్తుంది.అయితే కొన్ని సంక్షేమ పధకాలు సబ్సిడీలు కొంతమందికే వర్తిస్తాయికొంతమందికి వర్తించవు.ఇందులో ఏది ఎంతవరుకు సమంజసం అనే విషయం పక్కన పెడితే
ముఖ్యంగా నాలుగు గదుల సొంతిల్లు, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషీన్, టూ వీలర్స్ వంటివి ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులు కాదని సామాజిక ఆర్థిక సర్వే చేసిన వివేక్ దేబ్రాయ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. తాజాగా జరపనున్న సాంఘిక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు ఈ వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు.. సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. ఇక 2012లో హషీమ్ కమిటీ అయితే పట్టణాల్లో ఉండే 41శాత మంది మాత్రమే సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని ప్రస్తావించగా, ఈసారి దేబ్రాయ్ కమిటీ మాత్రం 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని ప్రస్తావించడం గమనార్హం.
ఫ్రిడ్జి, బైక్, వాషింగ్ మెషీన్ ఈ మూడు ఉంటే సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించాలని చెప్పిన వివేక్ దేబ్రాయ్ కమిటీ.. నాలుగు గదుల ఇల్లు, కారు, ఏసీ ఉన్న కుటుంబాలను వెంటనే సంక్షేమ పథకాల నుంచి తొలగించాలని వెల్లడించింది. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించటం వల్ల.. నగర, పట్టణాల్లో ఇల్లు లేని వారికి ప్రయోజనం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పింది. తక్కువ ఆదాయం ఉన్నవారు.. కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న వారికి ఈ ప్రయోజనాలు కచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలని కోరింది. ఈ వస్తువులన్నీ మీ సొంత డబ్బుతో కొనుక్కున్నవే. ఎవరూ కాదనరు. కానీ.. ఇవన్నీ ఉంటే.. ఇక నుంచి మీరు ప్రభుత్వ సబ్సిడీ, ప్రభుత్వ పథకాలకు అనర్హులు కాబోతున్నారన్న మాట.ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ మోయలేని ప్రభుత్వం ఆ సబ్సిడీ కి ఎలా గండి కొట్టాలా అని ఆలోచించి సబ్సిడీ ఎత్తివేయాలి అనుకుంటున్నట్టు ప్రకటన చేసింది. ఇక తాజాగా దేబ్రాయ్ కమిటి ఆధారం గా మరిన్ని సంక్షేమ పధకాలు,సబ్సిడీలకు గండి కొట్టె తాజా ప్రణాళికను రూపొందించి అమలు పరచడాని కి సిద్ధం గా ఉంది.
పట్టణాలలో వాహనము కూడా లేని వారు ఉండడం అరుదు. ఇహ ఇలా ప్రభుత్వం ఆలోచిస్తూ పొతే ఎవరికీ సంక్షేమ పధకాలు అందుబాటులోకి రావు. సో మ్వారికి ఉన్న వస్తువులను ఆధారం చేసుకోవడమే కాకుండా వారి ఆర్ధిక పర్స్తితులను అంచనా వేయడం ద్వారా సబ్సిడీ సంక్షేమ పధకాలను వర్తింప చేసే విధానాన్ని ప్రభుత్వం చేపడితే బాగుంటుంది...

బిజెపి రూ.1.50 లక్షల కోట్ల ప్యాకేజీతో లాభనష్టాలు !

BJP-Special-Package-for-Andhra


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశంపై దాదాపు 27 నెలల తర్జనభర్జనల తర్వాత ‘హోదా’ లేదని.. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం తేల్చి చెప్పేసింది. ఓపక్క హోదా మీద నిరసనలు పెరుగుతున్న వేళ.. జనసేన అధినేత మూడు అంచెల్లో ఉద్యమం చేస్తానని డిక్లేర్ చేసిన తర్వాత కూడా హోదాకు నై అంటూ ప్రత్యేక ప్యాకేజీనే సాధ్యమన్న విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయటం సీమాంధ్రులకు షాకింగ్ గా మారింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై అందరి మాట ఒక్కటే అయిన నేపథ్యంలో కేంద్రం తన మనసు మార్చుకుంటుందా? అన్న సందేహం కలిగినా.. ఒత్తిళ్లకు తలొగ్గితే భవిష్యతులో కష్టమన్న ఉద్దేశంతోనే ప్యాకేజీకి మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. హోదా ఇవ్వకపోతే పోయారు. కనీసం.. ఇచ్చే ప్యాకేజీ అయినా సంతృప్తికరంగా ఉంటుందా? అంటే అలాంటిదేమీ లేదన్న విషయం తాజా ప్రకటనతో తేలిపోయింది.

తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో లాభమా? నష్టమా?అన్నది ఒక చర్చ. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ ఎంతన్నది కూడా ఇప్పుడో ప్రశ్నగా మారింది. జైట్లీ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే.. తాజా ప్యాకేజీ రూ.1.50లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఈ ప్యాకేజీ పట్ల ఏపీ అధికారపక్ష నేతలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయకున్నా.. అసంతృప్తి కూడా ప్రదర్శించని పరిస్థితి. రావాల్సిన హోదా రాని వేళ.. వచ్చింది కాస్త అయినా ఇప్పటికైతే సరిపెట్టుకుందామన్నట్లుగా ఏపీ అధికారపక్ష నేతల మాటలు ఉన్నాయి.

ఇక.. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలోని అంకెల్ని పరిగణలోకి తీసుకుంటే ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల లబ్థి ఏ విధంగా అన్నది విశ్లేషిస్తే.. విదేశీ రుణసాయంగా ఏడాదికి రూ.4వేల కోట్ల చొప్పున రూ.20వేల కోట్లు.. పోలవరం తాజా అంచనాల ప్రకారం రూ.32వేల కోట్లు.. పారిశ్రామిక కారిడార్  నిర్మాణానికి రూ.12వేల కోట్లు.. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్రీయ విద్యా సంస్థల కోసం రూ.25వేల కోట్లు.. రాజధాని ఇన్నర్.. అవుటర్ రింగు రోడ్ల కోసం రూ.25వేల కోట్లు కేంద్రం సాయంగా అందించనుంది. ఇవి కాక.. పోర్టులు. ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి ఇచ్చే సాయం కలిపితే రూ.1.5లక్షల కోట్లు కానుంది.

మొత్తంగా చూసినప్పుడు భారీ ప్యాకేజీగా అనిపించినా.. దేనికదే విడివిడిగా చూసినప్పుడు.. ఏపీకి కలిగే ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఘనంగా చెబుతున్న మోడీ సర్కారు.. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హోదా మాటను పరిగణలోకి తీసుకోవటం ద్వారా ఏపీకి తీరని అన్యాయం చేసినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. విభజన సందర్భంగా ఇచ్చిన అన్ని హామీల్లోకి హోదానే పెద్దది. మిగిలినవన్నీ కూడా హోదా ముందు చిన్నవే. ఈ నేపథ్యంలో అసలైన హోదాను వదిలేసి.. మిగిలిన వాటిని అమలు చేస్తామన్న మాటను చూస్తే.. కేంద్రం ఇచ్చేది మహా ప్రసాదం అన్నట్లు ఫీల్ అవ్వాలనే చందంగా ఉండటం గమనార్హం. మన్మోహన్ నోటి నుంచి వచ్చిన హోదాను యథాతదంగా అమలు చేసిన పక్షంలో.. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ఒక లెక్కలోకి రాదని చెప్పక తప్పదు.

ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెల్చిచేప్పేసిన కేంద్రం

Arun Jaitley Midnight Press Meet About Special Package


ఎంతో కాలంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికపై కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ ద్వారా నీళ్లు చల్లింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇవ్వలేమని దానికి సాంకేతిక కారణాలు చూపిస్తూ.. హోదా ఇవ్వలేమని తేల్చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేస్తూ.. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ ప్రకటన అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాలపై స్పందించారు.

అర్ధరాత్రి 12:15 నిమిషాలకు మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు ముందుగా అరుణ్ జైట్లీ ప్రకటనను మరోసారి తనదైన శైలిలో వివరించారు. అనంతరం ఆ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను అభినందిస్తున్నామని మొదలుపెట్టిన చంద్రబాబు.. కేంద్రం ప్రకటించినవన్నీ వీలైనంత త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ లో ప్రకటించినవి కాకుండానే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో పోలవరానికి ఇస్తామన్న 100% నిధులను ఏ విధంగా ఇస్తారో ఎప్పటిలోగా ఇస్తారో కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

అమరావతి నిర్మాణానికి సంబందించి అరుణ్ జైట్లీ చెప్పినట్లు ఇప్పటివరకూ ఇచ్చిన రూ.2500 కోట్లు భవిష్యత్తులో ఇస్తామని ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల నిధులు రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సరిపోవని చంద్రబాబు ప్రకటించారు. నిర్ధిష్ట గడువులోగా జైట్లీ చేసిన ప్రకటనలోని హామీలన్నీ నెరవేర్చాలని ఈ ప్రకటనలకు చట్టబద్దత కల్పించాలని బాబు కోరారు. సురేష్ ప్రభు ప్రకటిస్తారని చెబుతున్న రైల్వే జోన్ విషయంలో.. విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

"ఇప్పటికీ ప్రత్యేక హోదా కావాలనే అడుగుదాం.. టెక్నికల్ అంశాలను చూపిస్తూ హోదా ఇవ్వకపోయినా కూడా ఆస్థాయిలో ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబుతుంది.. ఎంత ఇస్తే అంత తీసుకుందాం అలా కాకుండా మరేమి చేస్తాం" అని ఎదురు ప్రశ్నించిన చంద్రబాబు.. ఈ విషయంలో "కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని మాట్లాడితే వచ్చేవి కూడా రావు" అని క్లారిటీగా చెప్పారు బాబు. దీంతో... ప్రత్యేక హోదాపై బాబు ఏమాత్రం పోరాటం చేయలేరని రాజీ పడి సర్ధుకుపోవడమే మేలని చెప్పకనే చెప్పారనే అనుకోవాలి!!

జీఎస్టీ బిల్లు వాళ్ళ ఉపయోగం ఏమిటి GST Bill

చరిత్రాత్మక బిల్లు పాస్… ఇంతకీ అసలేమిటీ ఆ జీఎస్టీ !!



జీఎస్టీ… గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్… ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదించింది… ఇది నిజంగానే ఇండియా పన్నులకు సంబంధించి ఓ కీలకమైన చట్టం… దీంతో దేశంలో వాణిజ్య పన్నుల వ్యవస్థే మారిపోనుంది… మోడీకి ఇదొక గర్వకారణమే… తన హయాంలో తీసుకొచ్చిన చట్టం కాబట్టి… అయితే ఏమిటీ చట్టం? చాలామందికి సందేహాలు… దాంతో వచ్చే ప్రయోజనమేంటీ, దాని అవసరమేంటీ అనే అనుమానాలే…

ఇప్పుడు ఒకే వస్తువుపై రకరకాల పన్నులు బాదేస్తున్నారు… ఉదాహరణకు కేంద్ర అమ్మకపు పన్ను, రాష్ట్రాలు విధించే వ్యాట్, ప్రవేశపన్నులు, సర్ ఛార్జీలు, శిస్తులు, రుసుములు, ఎక్సయిజు సుంకాలు, సేవాపన్నులు… ఇలా రకరకాల పన్నులేసి వినియోగదారుడి జేబుకు చిల్లు పొడుస్తున్నారు… పన్నుపై పన్ను పద్ధతితో అడ్డగోలు భారం పడటమే గాకుండా వ్యాపారులు ఎడాపెడా జీరో దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెడుతున్నారు… ఇదే అదునుగా అధికారులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు… వీటన్నింటికీ చెక్ పెట్టడంతోపాటు జీఎస్ డీపీ పెరగటానికి ఉపయోగపడేదే జీఎస్టీ…

అంటే దేశవ్యాప్తంగా ఒకేరకమైన పన్ను విధానం ఉంటుందన్నమాట… ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు పన్నులు బాదేయడం ఉండదు… మంచి బిల్లే… అయితే దీనితో వచ్చే లాభనష్టాలపై భిన్నాభిప్రాయాలున్నాయి… కానీ ఎప్పుడో ఓసారి ఈ పద్ధతికి మన దేశం అలవాటు కావాల్సిందే… దానికి ఈరోజు శ్రీకారం చుట్టినట్టయింది…

అయితే దీనితో తీవ్రంగా నష్టపోతామని రాష్ట్రాలు ఇన్నాళ్లూ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి… అయితే మొదటి మూడు సంవత్సరాలు ఆ నష్టాన్ని భరించటానికి కేంద్రం ముందుకొచ్చింది… నాలుగో ఏడాదిలో 75 శాతం, ఐదో ఏడాది 50 శాతం నష్టాన్ని భరిస్తుంది… నిజానికి అంత నష్టాలేమీ ఉండవనేది ఆర్థిక నిపుణుల వాదన… అయితే అప్పుడే అయిపోలేదు… కనీసం మూడోవంతు రాష్ట్రాలు దీన్ని తమ రాష్ట్రాల్లో ఆమోదిస్తూ చట్టాలు చేయాల్సి ఉంటుంది… ఓ కౌన్సిల్ ఏర్పాటు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులను నియమించాల్సి ఉంటుంది… ఏకీకృత పన్ను రేటును తరువాత ఖరారు చేస్తారు… ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నమాట… పన్నెండేళ్లుగా ప్రతిపాదనల్లోనే ఉన్న బిల్లుకు ఈరోజు మోక్షం దొరికింది…

సంక్లిష్టమైన వాణిజ్య పన్నుల విధానాన్ని సరళీకృతం చేయటానికి ఇది ఉపయోగపడుతుంది.

పెట్రోల్ ధర 2 రూపాయిలు తగ్గింది




సార్వత్రిక ఎన్నికలకు ముoదు సోషల్ మీడియాలో భారీగా జరిగిన ప్రచారాల్లో ఒకటి పెట్రోల్ ఛార్జీల తగ్గిoది. యూపీఏ హయాoలో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమా అని పెట్రోల్.. డీజిల్ ధరలు ఇoత భారీగా ఉన్నాయని.. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చే పడితే.. ధరలు భారీగా తగ్గటo ఖాయమంటూ రకరకాల విశ్లేషణలతో కూడిన ఊరిoపు ప్రచారం జరిగిoది.

నల్లధనo వెనక్కి వస్తుoదని.. అలా తెచ్చే సత్తా మోడీ సొoతమన్న మాట వినిపించింది. అoదరి ఆశలు..ఆకాoక్షలకు తగ్గట్లే మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిoచారు. పవర్ లోకి వచ్చి 25 నెలలు అవుతున్నా.. ఒక్కరూపాయి నల్లధనo దేశానికి తిరిగి రాలేదు సరికదా.. ప్రపoచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గితే.. పెట్రోల్ లీటరు ధరలో వచ్చిన మార్పు ఎoతన్నది అoదరికి తెలిసిoదే. బ్యారెల్ ముడి చమురు 110 అమెరికా డాలర్లకు పైనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ గరిష్ఠoగా రూ.85 వరకూ అమ్మారు. దేశoలో అవినీతి పూర్తిగా తగ్గిపోయి.. అoతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 40డాలర్ల దిగువనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ ను రూ.70 కి అమ్ముతున్న పరిస్థితి . బ్యారెల్ మీద దాదాపు 70డాలర్ల తేడా వస్తే.. సగటు జీవి చెల్లిoచే లీటరు పెట్రోల్ విషయo కలిగిన ఊరడింపు కేవలo 10-15 రూపాయిలు మాత్రమేనని మర్చిపోకూడదు.

ఈ తగ్గిoపు కూడా అoతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల కారణoగా తగ్గటమే తప్పిoచి మరెలాoటి ప్రత్యేక తగ్గిoపు లేదని చెప్పాలి. మోడీ అధికారoలోకి వచ్చిన తర్వాత క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికి లీటరు మీద రూపాయి.. అర్థరూపాయి తగ్గిoపు తప్పించి గట్టిగా ఐదారు రూపాయిలు తగ్గిoచిన పాపాన పోలేదు. భారీగా ధర పడిపోయినప్పుడు ఆచితూచి ధరల్ని తగ్గిoచే సర్కారు.. అంతర్జాతీయoగా ఏ మాత్రo ధర పెరిగినా ఎలాoటి మొహమాటo లేకుoడా ఆ పెరిగిన మొత్తాన్ని వాయిoచేయటo మోడీ హయాoలో అలవాటుగా మారిoది.

ఇదొక్కటే కాదు.. ధరలు తగ్గకుoడా ఉoడేలా ప్రత్యేక పన్నులు వేయటo.. సుంకం పెoచటం లాoటి నిర్ణయాలతో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గిoది లేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్.. డీజిల్ ధరల్ని పరిశీలిoచి.. నిర్ణయo తీసుకోవటo తెలిసిoదే. తాజాగా అలాoటి సమీక్షే జరిపిన కేoద్రo.. లీటరు పెట్రోల్ మీద రూ. 2.25 . . డీజిల్ మీద 64పైసలు తగ్గిస్తూ నిర్ణయo తీసుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటoటే.. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో ఇoత భారీగా తగ్గిoచటo ఇదే తొలిసారి.

ఇoత మొత్తoలో ధర తగ్గటానికి కారణాల్ని వెతికితే.. అంతర్జాతీయoగా క్రూడాయిల్ కు తగ్గిన డిమాoడ్.. ధర పడిపోవటo.. డాలర్ తో రూపాయి మారకoలో చోటు చేసుకున్న పరిణామాలు తప్పిoచి.. దేశ ప్రజల పట్ల మోడీ సర్కారు ఎలాoటి సాఫ్ట్ కార్నర్ తో నిర్ణయo తీసుకున్నదేమీ లేదని చెప్పక తప్పదు. చివరకు పరిస్థితి ఎలా తయారైoదoటే.. లీటరు పెట్రోల్ మీద 2 రూపాయిలు తగ్గిoపు అంటే.. అదో పెద్ద విషయoగా మారిన దుస్థితి. మోడీ లాoటి నేత తన సహజసిద్ధమైన మార్వాడీ తత్వాన్ని విడిచిపెట్టకుoడా ఆర్థిక వ్యవహారాల్లో గీసి . . గీసి వ్యవహరిస్తుoటే ఇoతకు మిoచి ఎవరైనా ఏమని అనుకోగలరు ??

మోడీ కన్నా సోనియా బెస్టా ?





కత్తితో ఒక పోటు పొడిచినోడు మంచోడా? నమ్మకంతో భుజం మీద చేతులు వేసి.. రక్షకుడిగా ఉంటానని నమ్మబలికి.. తియ్యటి మాటలు చెబుతూ.. ఆ పరవశంతో ఉన్న వేళ వెనుక నుంచి పోటు పొడిచినోడు మంచోడా? ఇద్దరిలో ఎవరు బెటర్ అని అనుకోవాలి..? ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే చాలామంది ఆంధ్రోళ్ల మనసుల్లోకి వస్తున్నాయి.

ఏపీ రాష్ట్ర విభజన మీద 2004లో తమ ఎన్నిక హామీ పత్రం మీద హామీ ఇవ్వటమే కాదు.. ఆ మాటకు కట్టుబడి ఉండే ప్రయత్నంలో భాగంగా ఏపీని దారుణంగా దెబ్బ తీసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దుర్మార్గురాలా? లేక.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టం మీద మొసలి కన్నీరు కారుస్తూ.. తాను సాయం చేస్తానని మాటలు చెప్పి తీరా ఇప్పుడు తూచ్ అనేయటం తెలిసిందే.

నమ్మినోడిని నట్టేట ముంచేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. ఎలాంటి ప్రత్యేక సాయం లేదని తేల్చేయటం చూసినప్పుడు ఒక్క మాట అనిపించక మానదు. ఆంధ్రోళ్లు సోనియమ్మను తిట్టుకున్నారే కానీ.. ఇచ్చిన మాట కోసం సోనియమ్మ నిలబడితే.. కేవలం తన అవసరం తీర్చటం కోసమే మోడీ మాటలు చెప్పినట్లుగా కనిపించక మానదు.
  
2004లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటానికి వీలుగా.. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. తెలంగాణ ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోని హామీని నెరవేరుస్తానని చెప్పి.. వారి చేత ఓట్లు వేయించుకున్న సోనియమ్మ.. తానిచ్చిన మాటను నెరవేర్చుకోవటం కోసం ఏపీలో తమ పార్టీని పణంగా పెట్టేందుకు కూడా సిద్ధం కావటం గమనార్హం. కేవలం ఇచ్చిన మాట మీద నిలబడాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆంధ్రోళ్లు వ్యతిరేకిస్తున్నా.. తెలంగాణ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చిన సోనియా గాంధీనే సో బెటర్ అని ఆంధ్రోళ్లు అనుకునే పరిస్థితి. తప్పుకావొచ్చు.. ఒప్పు కావొచ్చు.. ఇచ్చిన మాట మీద నిలబడటానికి మించింది మరింకేమీ ఉంటుంది..?

బడ్జెట్ : గ్రామాలు పట్టణాల అభివృద్ధికి మోడీ సర్కారు పెద్ద పీట



పంచాయితీలు మున్సిపాలిటీలకు శుభవార్త. ఇకపై కేంద్ర పభుత్వం వీటికి అందించే నిధులు భారీగా పెరగబోతున్నాయి. సోమవారం బడ్జెట్ ప్రకటించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లో మొత్తంగా మున్సిపాలిటీలు పంచాయితీలకు రూ.2.87 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. ఇది గత ఐదేళ్లలో ఉన్న కేటాయింపు కన్న 228 శాతం ఎక్కువని జైట్లీ ప్రకటించారు. పంచాయితీలకు రూ.80 లక్షలు మున్సిపాలిటీలకు రూ.21 కోట్ల వరకు నిధులు ఇవ్వబోతున్నట్లు జైట్లీ వెల్లడించారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ దీనికి సంబందించిన మార్గదర్శకాలను రాష్ట్రాలతో సంప్రదించి తయారు చేస్తుందని ఆయన తెలిపారు. 14న ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఇలా పంచాయితీలు మున్సిపాలిటీలకు నిధులు పెంచినట్లు ఆయన చెప్పారు.

దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు ఉండరాదని ప్రదాని కోరుతున్నారని.. ఆ ప్రకారం నిదులు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. 18 వేల గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని.. వెయ్యి రోజుల్లో ఈ గ్రామాలన్నింటికీ కరెంటు ఇస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. గ్రామాల విద్యుద్దీకరణకు రూ.8500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే గ్రామీణ అభివృద్ధికి రూ.87 వేల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ కనెక్షన్లకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ విద్యను అందిస్తామన్నారు. మొత్తంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధికి మోడీ సర్కారు పెద్ద పీట వేసినట్లు బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది.

Six Indians Placed Most Twitter Followers in Top 100



As many as 6 Indians (namely Amitabh Bachchan, Salman Khan, Deepika Padukone, Narendra Modi, Shahrukh Khan and Aamir Khan) made it to the list of Top 100 Most Followed twitter handles in the World. The stats were based on the Follower counts on 31st December, 2015.  

In the country-wise stats, US topped the list with a massive 66 Twitter handles in Top 100. UK and India have 11 and 6 respectively. While Brazil & Canada share 4 each, Spain settles with 3. Other Nations such as France, Portugal, Colombia, Indonesia, Puerto Rico and Saudi Arabia.

In Top 100 Twitter handles, There are 45 Men, 33 Women and 22 Brands. 

One among Katy Perry, Justin Bieber and Taylor Swift will be the first to achieve 100 Million followers.

Narendra Modi gets standing ovation after speech in British Parliament

Prime Minister Narendra Modi addressed the British Parliament on Thursday as a part of the three-day visit to UK focused on trade deals and connecting with the diaspora. Following is the full text of PM Modi’s address to British parliament:

I am delighted to be in London. Even in this globalised world, London is still the standard for our times. The city has embraced the world’s diversity and represents the finest in human achievements. And, I am truly honoured to speak in the British Parliament.

Mr. Speaker, thank you for opening the doors to us, here in this magnificent setting of the Royal Court. I know that the Parliament is not in Session. Prime Minister Cameron looks relaxed and relieved.

But, I want to remind you, Mr. Prime Minister, that you owe me royalty for an election slogan. I know that you are hosting me at the Chequers this evening. But, I also know that you will understand if I am fair to both sides of the floor. Especially since British MPs of Indian Origin are evenly balanced between the Treasury and the Opposition benches. So, I also extend my good wishes to the Labour. Indeed, since these are still early days after the election, my warm congratulations to the Members of the House. And, greetings to the eminent leaders of Britain and great friends of India present here today.

So much of the modern history of India is linked to this building. So much history looms across our relationship. There are others who have spoken forcefully on the debts and dues of history. I will only say that many freedom fighters of India found their calling in the institutions of Britain. And, many makers of modern India, including several of my distinguished predecessors, from Jawaharlal Nehru to Dr. Manmohan Singh, passed through their doors.

There are many things on which it is hard to tell anymore if they are British or Indian: The Jaguar or the Scotland Yard, for example. The Brooke Bond tea or my friend late Lord Ghulam Nun’s curry. And, our strongest debates are whether the Lord’s pitch swings unfairly or the wicket at Eden Gardens cracks too early. And, we love the Bhangra rap from London just as you like the English novel from India.

On the way to this event, Prime Minister Cameron and I paid homage to Mahatma Gandhi outside the Parliament. I was reminded of a question I was asked on a tour abroad. How is it that the statue of Gandhi stands outside the British Parliament? To that question, my answer is: The British are wise enough to recognise his greatness; Indians are generous enough to share him; we are both fortunate enough to have been touched by his life and mission; and, we are both smart enough to use the strengths of our connected histories to power the future of our relationship.

So, I stand here today, not as a visiting Head of Government, given the honour to speak in this temple of democracy. I am here as a representative of a fellow institution and a shared tradition.