Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

KCR Starts English Daily News Paper "Telangana Today "





రాజకీయ నేతలు దూరదృష్టితో వ్యవహరిస్తుంటారు. ఇది వారికి చాలా అవసరం. అయితే.. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన వారి కంటే వంద రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు. కాలం కలిసి రాని సమయంలో కామ్ గా ఉంటూ.. తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశంపై కసరత్తు చేసే ఆయన.. ఒక్కసారి పట్టు చిక్కితే ఎంతలా చెలరేగిపోతారన్నది గత రెండేళ్లుగా చూస్తున్నదే.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన.. రాజకీయం అంటే పార్టీ నడపటం.. మరింత బలోపేతం చేయటం లాంటి అంశాల మీదనే కాక.. తన బలాన్ని మిగిలిన రంగాల్లోకి విస్తరించే విషయం మీద ఆయన ప్రత్యేక ఫోకస్ చేస్తుంటారు. ఉద్యమ సమయంలో తన వాణిని వినిపించేందుకు సొంతంగా మీడియా సంస్థను షురూ చేసిన ఆయన..అనుకున్నట్లే తన వాదనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. మొదట టీవీ ఛానల్ తో షురూ అయిన ఆయనకు చెందిన మీడియా సంస్థ తర్వాతి కాలంలో దినపత్రికను స్టార్ట్ చేయటం తెలిసిందే.

తన టీవీ ఛానల్ ను ప్రమోట్ చేసే విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెబుతారు. తన టీవీ ఛానల్ ను ప్రారంభించిన తర్వాత.. మీడియా సంస్థలకు ప్రాణాధారమైన యాడ్ రెవెన్యూ కోసం వారు లేవనెత్తిన వాదన మిగిలిన వారి నోరు తెరవకుండా చేసిందని వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. తన ఛానల్ షురూ చేసిన వెంటనే.. సీమాంధ్ర మీడియా సంస్థలకు ఇచ్చే ప్రకటనల వాటా ఎంత? తెలంగాణ మీడియా సంస్థలకు ఇస్తున్న ప్రకటనల వాటా ఎంత? అంటూ సంబంధం లేని అంశాల్ని లింకు పెడుతూ తెర మీదకు తీసుకొచ్చిన వాదన పుణ్యమా అని.. ఆర్థికంగా చాలా త్వరగా కుదురుకుందని చెబుతుంటారు.

ఈ కారణంతోనే.. ఇప్పటి రోజుల్లో చాలా కష్టమని చెప్పే దినపత్రికను స్టార్ట్ చేయటమే కాదు.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ.. సంస్థ ఆర్థికంగా నిలదొక్కునేలా చేయగలిగినట్లుగా చెబుతున్నారు. తమకు సంబంధించిన అంశాల్ని.. తమ వాదనను మిగిలిన మీడియా సంస్థలు చెప్పినా.. చెప్పకున్నా తమ గొంతు బలంగా వినిపించేందుకు వీలుగా టీవీ ఛానల్.. తెలుగు న్యూస్ పేపర్ పెట్టిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఇప్పుడు ఇంగ్లిషు దినపత్రికను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణను అభివృద్ధి చేస్తున్న తీరు.. కేసీఆర్ కమిట్ మెంట్ ను జాతీయ స్థాయిలో అందరి నోట నానేలా చేయటంతో పాటు.. తమకు చెందిన మీడియా సంస్థల్ని మరింత బలోపేతం చేయటంలో భాగంగా ఇంగ్లిషులో దినపత్రికను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి అయ్యిందని.. అధికారికంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఇంగ్లిషు దినపత్రికను.. ‘‘తెలంగాణ టుడే’’ అన్న పేరుతో వస్తుందన్న మాట చెబుతున్నారు. ఈ పేరును ఇప్పటికే రిజిష్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ పేరుతో రిజిష్టర్ అయిన దినపత్రిక కేసీఆర్ ఫ్యామిలీదా? కాదా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కేసీఆర్ ఫ్యామిలీదేనని చెబుతున్నారు. తమకు చెందిన మీడియా సంస్థల్లో ఇంగ్లిషులో లేదన్న కొరత కేసీఆర్ త్వరలో తీర్చుకోనున్నట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది.


ఆంధ్రకు 25 కొత్త ఐఏఎస్ లు



రాష్ట్రానికి కొత్త ఐఏఎస్ పోస్టులు రాబోతున్నాయి. ఉన్న పోస్టులకు అదనంగా మరో 50 పోస్టుల వరకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అది నిజమైతే రాష్ట్రానికి ఉన్న అధికారుల కొరత రానున్న కాలంలో తీరిపోనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 50 మంది ఐఏఎస్ లను అదనంగా కేటాయించడానికి కేంద్రం ఓకే చెప్పింది. మరో పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆశలు కూడా తీరుతాయని సమాచారం. నేరుగా నియమితులైన ఐఏఎస్ అధికారుల తోపాటు పదోన్నతిపై ఐఏఎస్ గా నియమితులయ్యే వారు కూడా వీరిలో ఉండే అవకాశాలున్నాయి. 

వాస్తవంగా ప్రతి రాష్ట్రానికి కావాల్సిన ఐఏఎస్ కాడర్ సంఖ్యపై ఐదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది.  దాని ఆధారంగా పెంచాలా తగ్గించాలా అన్నది నిర్ణయిస్తుంది. అయితే 2014లో ఏపీ విభజన నేపథ్యంలో అయిదేళ్లకు ముందుగానే ఈ సమీక్ష జరపాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఇదే సమయంలో తమకు ఐఏఎస్ ల కొరత తీవ్రంగా ఉందని.. కొత్తవారిని కేటాయించాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ముందుగా తెలంగాణ అవసరాలను గుర్తించిన కేంద్రం వారి విషయంలో ఇప్పటికే కేటాయింపు నిర్ణయం తీసుకుంది.  ఏపీ కంటే తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ముందుగా వెళ్లడంతో వారికి సంబందించిన నిర్ణయం తొందరగా వెలువడిందని చెబుతున్నారు.  ఏపీ నుంచి ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి అందలేదని...  ఈలోగానే ఐఏఎస్ ల కేటాయింపుపై డిఓపిటి నిర్వహించిన ఒక సమావేశం ముగియడంతో తొలి విడతలో ఏపీకి అవకాశం దక్కలేదు. త్వరలో రెండో సమావేశం ఉండడంతో అది పూర్తయిన తరువాత కేటాయిస్తారని తెలుస్తోంది.

విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి 374 ఐఏఎస్ పోస్టులు ఉండగా..  అందులో 294 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆ పోస్టులను - వ్యక్తులను రెండు రాష్ట్రాలకు పంపకాలు చేశారు. ఉన్న 374 పోస్టుల్లో ఏపీకి 211 పోస్టులు - తెలంగాణకు 163 పోస్టులను కేటాయించారు. అలాగే పనిచేస్తున్న 294 మందిలో ఏపీకి 164 మందిని తెలంగాణకు 128 మందిని పంపకాలు చేశారు. ఉన్న పోస్టులే చాలని నేపథ్యంలో పనిచేస్తున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు కూడా ఐఏఎస్ లు కావాలని కేంద్రాన్ని కోరాయి.

కాగా తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడుతుండడంతో అదనపు ఐఏఎస్ లు ఆ దిశగానూ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీకి కూడా కొత్త అధికారులు వస్తే ఏపీలోనూ జిల్లాల విభజన చేపట్టే అవకాశాలుంటాయి. చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకంటారో చూడాలి.



Pawan Kalyan Starts TV Show Soon




పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మాత్రమే కాదు.. పవర్ ఫుల్ పొలిటీషియన్ కూడా. ప్రస్తుతం తన కాన్సన్ ట్రేషన్ మొత్తాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ పై పెట్టిన పవన్ కళ్యాణ్.. త్వరలో కొత్త పాత్రలోకి ఎంటర్ కానున్నాడని తెలుస్తోంది. బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న సర్దార్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యక్షం కానున్నాడట పవన్. 

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంత స్పందన వచ్చిందో చూశాం. దీన్ని డబ్బింగ్ చేసి దాదాపు దేశంలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ చేశారంటే.. ఈ ప్రోగ్రాంకి వచ్చిన రెస్పాన్స్ అర్ధమవుతుంది. ఇప్పుడు పవన్ కూడా ఇలాంటి ఒక సామాజిక కోణానికి చెందిన ప్రోగ్రాంనే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలా టీవీ ద్వారా ప్రజలకు నిత్యం టచ్ లో ఉండడం ద్వారా.. తన రాజకీయ ఇమేజ్ ను కూడా పెంచుకోవచ్చనే ఆలోచిస్తున్నాడట పవన్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ గ్రూప్ ప్రసారం చేయనుందని సమాచారం. ఇప్పటికీ ఈనాడు గ్రూప్ కి పవన్ కి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి. 

అసలు పవన్ చంద్రబాబుల కలయికలో కూడా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు నడిపిన మంత్రాంగమే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత.. పవన్ టీవీ ఎంట్రీ కూడా ఈనాడు గ్రూప్ ద్వారానే జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రస్తుతం టీవీలో యాంకర్ గా సందడి చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఒక్కడే. గతంలో రాజమౌళి కూడా సత్యమేవజయతే కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత కొనసాగించలేదు. ఇప్పుడు పవన్ కూడా బుల్లితెర క్లబ్ లో జాయిన్ కానున్నాడు. 

KCR 8000 Crores For Hyderabad Projects

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాజకీయాల్లో అసలు మజాను రుచి చూపిస్తున్నాయి. బల్దియా పోరులో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ ఎస్ పార్టీ రెండు రకాల వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఒకవైపు పార్టీపరంగా నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే మరోవైపు ప్రభుత్వ పరంగా వరాలు కురిపిస్తున్నారు. హామీల అమలుకు అవసరం అయిన జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వపరంగా ప్రజలను ఆకట్టుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీ ఒకేరోజు వేలకోట్ల రూపాయలను కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల చేయడం గమనార్హం.

ఒకటి రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉండే రాజ్యాంగపరమైన చిక్కులను ఎదుర్కునేందుకు గాను...వరాల అమలుకు జీవోలు విడుదల చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్తర్వులు ఒకే రోజు జారీ అయ్యాయి. ఇంటి పన్ను మాఫీ - నగరంలో రియల్ ఎస్టేట్ కు అభివృద్ధి - భవనాల నిర్మాణానికి అనుమతుల్లో రాయితీల వంటి పలు అంశాలపై జీవోలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ దాహాన్ని తీర్చే కీలక ప్రాజెక్టుల కోసం 7600 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రధానంగా నీటి సమస్యను తీర్చే ఉస్మాన్ సాగర్ - హిమాయత్ సాగర్ - మంజీరాలపై ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి ఏర్పడడంతో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. శామీర్ పేట మండలంలో 20 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద మరో రిజర్వాయర్ నిర్మిస్తారు.



మరోవైపు 1200 రూపాయల వరకు ఉన్న ఇంటి పన్నును 101 రూపాయలకు పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఉత్తర్వులు జారీ చేశారు. అపార్ట్ మెంట్స్ - ఇళ్లకు పన్నెండు వందల రూపాయల వరకు పన్ను చెల్లిస్తున్న వారు ఇకపై 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆదేశాల వల్ల రూ.70 కోట్ల వరకు భారం పడుతుందని సమాచారం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 151 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ కు ఊతం ఇచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు కమిటీ వేశారు. ఇందులో పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా ఎన్నికల పుణ్యామా అని  గ్రేటర్ ఒకేరోజు వేల కోట్లు కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల అవుతూ వరాల జల్లు కురుస్తోందని గ్రేటర్ ప్రజలు ఖుషీ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవిపై చంద్రబాబు కన్ను

పక్కింటమ్మాయికి పెళ్లి చూపులైతే కంగారు పడే కుర్రాడిలా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. మిత్రపక్షం బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో చంద్రబాబు చాలా టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఇప్పటికే ఏపీ బీజేపీలో ఒక వర్గం చంద్రబాబును టార్గెట్ చేసి కొన్నాళ్లపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు ఇప్పుడు కామ్ అయినా మళ్లీ టైం వస్తే తనపై దాడికి దిగుతారని చంద్రబాబుకూ తెలుసు. అందుకే ఆ వర్గానికి ఏపీ బీజేపీ పగ్గాలు రాకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు ఏపీ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేకులతో ఆ పగ్గాలు అందే సూచనలు కనిపించినా ఇప్పుడు సీను మారింది. చంద్రబాబు అనుకూలురకే బీజేపీ పగ్గాలు చిక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే... చంద్రబాబు మనసులో ఏ మూలో ఇంకా అనుమానం ఉంది. ఒకవేళ తన వైరి వర్గం కానీ పగ్గాలు చేపడితే భవిష్యత్తులో తనకు ఇబ్బందేనని భావిస్తున్న ఆయన ఎలాగైనా సరే బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించి తన మనుషులకు నాయకత్వం వచ్చేలా చేసుకోవాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో బీజేపీలో ఎంత ఆసక్తి ఉందో చంద్రబాబుకు అంతకుమించి ఆసక్తి ఉంది. చంద్రబాబును టీడీపీని చెడామడా తిట్టే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ చీఫ్ చేస్తారనే ఊహాగానాలు రావడంతో చంద్రబాబు ఆ ప్రమాదాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న హరిబాబునే కొనసాగించాలంటూ ఇప్పటికే ఆయన బీజేపీ అధిష్ఠానాన్ని వెంకయ్యనాయుడు ద్వారా ప్రభావితం చేస్తున్నట్లుగా సమాచారం.

కాపు సామాజికవర్గాన్ని చేరదీయాలనే లక్ష్యంతో బీజేపీ వీర్రాజు వైపు మొగ్గు చూపే ప్రమాదముందని గుర్తించిన చంద్రబాబు.. ఆ పరిస్థితే వస్తే నేరుగా అమిత్ షా మోడీలతోనే మాట్లాడి వీర్రాజుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి రాకుండా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి కూడా బీజేపీ చీఫ్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వచ్చినా తనకు ఇబ్బందే కాబట్టి చంద్రబాబు ఆ ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి పదవి ఇచ్చినా టీడీపీ బీజేపీల స్నేహానికి ముప్పు తప్పదని ఆ పార్టీ అధిష్ఠానానికి నేరుగా చెప్పాలనే చంద్రబాబు అనుకుంటున్నారట. మరి చంద్రబాబుకు నచ్చినట్లు బీజేపీ చేస్తుందో లేదో చూడాలి. పక్క పార్టీ వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్న చంద్రబాబు చూడబోతే బీజేపీ అధ్యక్ష పదవీ తనకే ఇవ్వాలని అడిగేటట్లుగా ఉన్నారు.

మిస్టర్ వరల్డ్ కూడా భారతీయుడే

అందాల పోటీల్లో భారతీయుల హవా కొద్దికాలం నడిచింది. మిస్ వరల్డ్.. మిస్ యూనివర్స్ లాంటి టైటిళ్లను పలుమార్లు గెలుచుకున్న ఘన చరిత్ర భారత్ సొంతం. భారత్ అన్న వెంటనే అందాల భామలు చాలామందే గుర్తుకు వస్తుంటారు. ఐశ్వర్యారాయ్.. సుస్మితా సేన్.. ప్రియాంకా చోప్రా.. దియా మీర్జా.. డయానా హెడన్ లాంటి ఎందరో సౌందర్యరాసులు తమ అందంతో.. తమ తెలివితేటలతో మిస్ యూనివర్స్.. మిస్ వరల్డ్ టైటిళ్లను గెలుచుకొని ప్రపంచ వేదికల మీద భారత సత్తా చాటారు.

మిస్సుల విషయంలో తామేంటో భారత్ ఇప్పటికే నిరూపించుకుంటే. తాజాగా మిస్టర్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకున్ారు ఠాకూర్ అనూప్ సింగ్. థాయ్ లాండ్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో 43 దేశాల నుంచి 70 మందితో పోటీపడి చివరకు ప్రతిష్ఠాత్మక మిస్టర్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకొని భారత్ కు సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టారు.

పైలెట్ గా కెరీర్ షురూ చేసినా.. మహాభారత్ సీరియల్ లో దృతరాష్ట్రుడిగా సుపరిచితుడైన అనూప్.. తాజా టైటిల్ తో మరో ఘనత సాధించాడు. 1952 తర్వాత మిస్టర్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకున్న వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఫైనల్ లో పోటీల్లో కండల తిరిగిన ఇద్దరు థాయ్ బాడీబిల్డర్ తో ఢీ కొని.. తన సత్తా చాటి..భారత కీర్తి పతాకాన్ని ఘనంగా ఎగురవేశాడు. కంగ్రాట్స్ మిస్టర్ వరల్డ్.

ఒక్క ట్యూన్ కూడా కాపీ కొట్ట లేదు- దేవిశ్రీ ప్రసాద్

తన కెరీర్ లో ఇప్పటిదాకా ఒక్క ట్యూన్ కూడా కాపీ కొట్టలేదని అంటున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య తెలుగులో కాపీ ట్యూన్స్ ఎక్కువైపోతున్నాయన్న విమర్శలపై దేవి స్పందిస్తూ.. ‘‘నేనైతే నా కెరీర్ లో ఇప్పటివరకూ కాపీ కొట్టలేదు. ఒక సినిమా విషయంలో దర్శకుడు ఒక వెస్ట్రన్ ట్యూన్ వినిపించి కాపీ కొట్టమంటే నో అనేశా. మనం సంగీతం నేర్చుకొని కాపీ కొడుతున్నామంటే అసలు చేస్తున్న పనికి అర్థమే లేదు. ఎక్కడైనా ఒక స్వరం కలిస్తే చెప్పలేం కానీ.. తెలిసి మాత్రం నేనెప్పుడూ వేరే ట్యూన్ తీసుకోలేదు. ఒకరి ట్యూన్ కాపీ కొట్టడమంటే అది పెద్ద నేరం కిందే లెక్క’’ అన్నాడు దేవి.

తన దృష్టిలో చిన్న పెద్ద సినిమాలు అస్సలు చూపించనని.. నిజానికి కొన్ని చిన్న సినిమాలకు తానిచ్చిన పాటలు పెద్ద సినిమాల్లో కంటే బాగా పాపులర్ అయ్యాయని దేవి చెప్పాడు. చిన్నదైనా - పెద్దదైనా సినిమా నచ్చితేనే చేస్తా కాబట్టి ఔట్ పుట్ విషయంలో అస్సలు రాజీ పడే ప్రసక్తే ఉండదని.. పని విషయంలో తేడా చూపించనని దేవి అన్నాడు. కుమారి 21 ఎఫ్ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోందన్న దేవి... త్వరలో తన నుంచి రాబోయే నాన్నకు ప్రేమతో - సర్దార్ గబ్బ్ సింగ్ ఆల్బమ్స్ కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటాయన్నాడు. ‘‘నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆడియో చాలా బాగా వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ పాటల విషయంలో పవన్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఒక మెలోడీ విని పెద్ద మెసేజ్ పెట్టారు’’ అన్నాడు దేవి.