Showing posts with label Weather. Show all posts
Showing posts with label Weather. Show all posts

ఈ సంవత్సరం ఎండలు , వానలు అధికమే



ఈ యేడాది కుంభవృష్టే... జూన్ నెల నుంచే ఆరంభం.. వేసవి ఎండలూ అంతే స్థాయి
దేశ ప్రజలకు ప్రత్యేకించి రైతులకు ఓ శుభవార్త. ఈ యేడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖతో పాటు.. అనేక వాతావరణ కేంద్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గత యేడాది కంటే ఈ యేడాది మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణ ఎల్‌నినో ప్రభావం తొలిగిపోనుండటమేనట.
అదేసమయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ యేడాది ఈ వేసవి మంటలు పుట్టించనుంది. ఎల్‌నినో ప్రభావం బలహీనపడినట్టేనని భారత వాతావరణ విభాగం సహా పలు వాతావరణ సంస్థలు స్పష్టంచేస్తున్నాయి. దాని ఫలితంగా ఈ వర్షాకాలం పుష్కలంగా వానలు పడతాయని వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది 1.2 శాతంగా ఉన్న వ్యవసాయరంగ వృద్ధి ఏకంగా ఆరు శాతానికి పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా వచ్చే జూన్ నెలలోనే మంచి వర్షపాతం నమోదవుతుందని తెలిపాయి. ఇది సాధారణ స్థాయికంటే సుమారు 25 శాతం అధికంగా ఉంటుందని వెదర్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ (క్లైమేట్ సైన్సెస్) క్రాంతిప్రసాద్ వెల్లడించారు. జూన్‌ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ సాధారణస్థాయి కొనసాగుతుందని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే గరిష్టస్థాయికి చేరుకుందని, బలహీనపడటం మొదలవుతుందని అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావం పూర్తిగా అంతరించిపోతుందని స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ జీపీ శర్మ చెప్పారు. వర్షాలు సాధారణంకంటే ఎక్కువున్నా, తక్కువున్నా, సెప్టెంబర్ తర్వాత లా నినా ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. లా నినా అనేది ఎల్ నినో పరిస్థితికి భిన్నమైనది. ఈ పరిస్థితి భారత్‌ సహా ఆసియా దేశాల్లో చక్కటి వర్షాలకు కారణమవుతుందని తెలిపారు.
రాబోయే వర్షాకాలం ఆశాజనకంగా ఉండనున్నప్పటికీ.. ఇప్పటికే ప్రవేశించిన వేసవి.. రానున్న రోజుల్లో చండ్రనిప్పులు కురిపించే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్-జూన్ నెలల మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. వాయవ్య, మధ్యభారత రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు

Heavy rain to continue over Andhra Pradesh for another 24 hours


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని బారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండో రోజుల పాలు కోస్తోంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో చిత్తూరు, కడపతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల జలశయాలు నిండు కుండల్లా మారాయి. అనేక ప్రాంతాల్లో చెరువుకు గండ్లు పడ్డాయి. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. 125 పశువులు మృతి చెందగా, 80 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయ. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. వర్ష భీభత్స ప్రాంతాల్లో యుద్దప్రాతిపదిక సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.