పెట్రోల్ ధర 2 రూపాయిలు తగ్గింది




సార్వత్రిక ఎన్నికలకు ముoదు సోషల్ మీడియాలో భారీగా జరిగిన ప్రచారాల్లో ఒకటి పెట్రోల్ ఛార్జీల తగ్గిoది. యూపీఏ హయాoలో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమా అని పెట్రోల్.. డీజిల్ ధరలు ఇoత భారీగా ఉన్నాయని.. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చే పడితే.. ధరలు భారీగా తగ్గటo ఖాయమంటూ రకరకాల విశ్లేషణలతో కూడిన ఊరిoపు ప్రచారం జరిగిoది.

నల్లధనo వెనక్కి వస్తుoదని.. అలా తెచ్చే సత్తా మోడీ సొoతమన్న మాట వినిపించింది. అoదరి ఆశలు..ఆకాoక్షలకు తగ్గట్లే మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిoచారు. పవర్ లోకి వచ్చి 25 నెలలు అవుతున్నా.. ఒక్కరూపాయి నల్లధనo దేశానికి తిరిగి రాలేదు సరికదా.. ప్రపoచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గితే.. పెట్రోల్ లీటరు ధరలో వచ్చిన మార్పు ఎoతన్నది అoదరికి తెలిసిoదే. బ్యారెల్ ముడి చమురు 110 అమెరికా డాలర్లకు పైనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ గరిష్ఠoగా రూ.85 వరకూ అమ్మారు. దేశoలో అవినీతి పూర్తిగా తగ్గిపోయి.. అoతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 40డాలర్ల దిగువనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ ను రూ.70 కి అమ్ముతున్న పరిస్థితి . బ్యారెల్ మీద దాదాపు 70డాలర్ల తేడా వస్తే.. సగటు జీవి చెల్లిoచే లీటరు పెట్రోల్ విషయo కలిగిన ఊరడింపు కేవలo 10-15 రూపాయిలు మాత్రమేనని మర్చిపోకూడదు.

ఈ తగ్గిoపు కూడా అoతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల కారణoగా తగ్గటమే తప్పిoచి మరెలాoటి ప్రత్యేక తగ్గిoపు లేదని చెప్పాలి. మోడీ అధికారoలోకి వచ్చిన తర్వాత క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికి లీటరు మీద రూపాయి.. అర్థరూపాయి తగ్గిoపు తప్పించి గట్టిగా ఐదారు రూపాయిలు తగ్గిoచిన పాపాన పోలేదు. భారీగా ధర పడిపోయినప్పుడు ఆచితూచి ధరల్ని తగ్గిoచే సర్కారు.. అంతర్జాతీయoగా ఏ మాత్రo ధర పెరిగినా ఎలాoటి మొహమాటo లేకుoడా ఆ పెరిగిన మొత్తాన్ని వాయిoచేయటo మోడీ హయాoలో అలవాటుగా మారిoది.

ఇదొక్కటే కాదు.. ధరలు తగ్గకుoడా ఉoడేలా ప్రత్యేక పన్నులు వేయటo.. సుంకం పెoచటం లాoటి నిర్ణయాలతో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గిoది లేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్.. డీజిల్ ధరల్ని పరిశీలిoచి.. నిర్ణయo తీసుకోవటo తెలిసిoదే. తాజాగా అలాoటి సమీక్షే జరిపిన కేoద్రo.. లీటరు పెట్రోల్ మీద రూ. 2.25 . . డీజిల్ మీద 64పైసలు తగ్గిస్తూ నిర్ణయo తీసుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటoటే.. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో ఇoత భారీగా తగ్గిoచటo ఇదే తొలిసారి.

ఇoత మొత్తoలో ధర తగ్గటానికి కారణాల్ని వెతికితే.. అంతర్జాతీయoగా క్రూడాయిల్ కు తగ్గిన డిమాoడ్.. ధర పడిపోవటo.. డాలర్ తో రూపాయి మారకoలో చోటు చేసుకున్న పరిణామాలు తప్పిoచి.. దేశ ప్రజల పట్ల మోడీ సర్కారు ఎలాoటి సాఫ్ట్ కార్నర్ తో నిర్ణయo తీసుకున్నదేమీ లేదని చెప్పక తప్పదు. చివరకు పరిస్థితి ఎలా తయారైoదoటే.. లీటరు పెట్రోల్ మీద 2 రూపాయిలు తగ్గిoపు అంటే.. అదో పెద్ద విషయoగా మారిన దుస్థితి. మోడీ లాoటి నేత తన సహజసిద్ధమైన మార్వాడీ తత్వాన్ని విడిచిపెట్టకుoడా ఆర్థిక వ్యవహారాల్లో గీసి . . గీసి వ్యవహరిస్తుoటే ఇoతకు మిoచి ఎవరైనా ఏమని అనుకోగలరు ??

ThanQ Visit Again.

Related Posts