చరిత్రాత్మక బిల్లు పాస్… ఇంతకీ అసలేమిటీ ఆ జీఎస్టీ !!
జీఎస్టీ… గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్… ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదించింది… ఇది నిజంగానే ఇండియా పన్నులకు సంబంధించి ఓ కీలకమైన చట్టం… దీంతో దేశంలో వాణిజ్య పన్నుల వ్యవస్థే మారిపోనుంది… మోడీకి ఇదొక గర్వకారణమే… తన హయాంలో తీసుకొచ్చిన చట్టం కాబట్టి… అయితే ఏమిటీ చట్టం? చాలామందికి సందేహాలు… దాంతో వచ్చే ప్రయోజనమేంటీ, దాని అవసరమేంటీ అనే అనుమానాలే…
ఇప్పుడు ఒకే వస్తువుపై రకరకాల పన్నులు బాదేస్తున్నారు… ఉదాహరణకు కేంద్ర అమ్మకపు పన్ను, రాష్ట్రాలు విధించే వ్యాట్, ప్రవేశపన్నులు, సర్ ఛార్జీలు, శిస్తులు, రుసుములు, ఎక్సయిజు సుంకాలు, సేవాపన్నులు… ఇలా రకరకాల పన్నులేసి వినియోగదారుడి జేబుకు చిల్లు పొడుస్తున్నారు… పన్నుపై పన్ను పద్ధతితో అడ్డగోలు భారం పడటమే గాకుండా వ్యాపారులు ఎడాపెడా జీరో దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెడుతున్నారు… ఇదే అదునుగా అధికారులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు… వీటన్నింటికీ చెక్ పెట్టడంతోపాటు జీఎస్ డీపీ పెరగటానికి ఉపయోగపడేదే జీఎస్టీ…
అంటే దేశవ్యాప్తంగా ఒకేరకమైన పన్ను విధానం ఉంటుందన్నమాట… ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు పన్నులు బాదేయడం ఉండదు… మంచి బిల్లే… అయితే దీనితో వచ్చే లాభనష్టాలపై భిన్నాభిప్రాయాలున్నాయి… కానీ ఎప్పుడో ఓసారి ఈ పద్ధతికి మన దేశం అలవాటు కావాల్సిందే… దానికి ఈరోజు శ్రీకారం చుట్టినట్టయింది…
అయితే దీనితో తీవ్రంగా నష్టపోతామని రాష్ట్రాలు ఇన్నాళ్లూ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి… అయితే మొదటి మూడు సంవత్సరాలు ఆ నష్టాన్ని భరించటానికి కేంద్రం ముందుకొచ్చింది… నాలుగో ఏడాదిలో 75 శాతం, ఐదో ఏడాది 50 శాతం నష్టాన్ని భరిస్తుంది… నిజానికి అంత నష్టాలేమీ ఉండవనేది ఆర్థిక నిపుణుల వాదన… అయితే అప్పుడే అయిపోలేదు… కనీసం మూడోవంతు రాష్ట్రాలు దీన్ని తమ రాష్ట్రాల్లో ఆమోదిస్తూ చట్టాలు చేయాల్సి ఉంటుంది… ఓ కౌన్సిల్ ఏర్పాటు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులను నియమించాల్సి ఉంటుంది… ఏకీకృత పన్ను రేటును తరువాత ఖరారు చేస్తారు… ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నమాట… పన్నెండేళ్లుగా ప్రతిపాదనల్లోనే ఉన్న బిల్లుకు ఈరోజు మోక్షం దొరికింది…
సంక్లిష్టమైన వాణిజ్య పన్నుల విధానాన్ని సరళీకృతం చేయటానికి ఇది ఉపయోగపడుతుంది.