Showing posts with label Petrol. Show all posts
Showing posts with label Petrol. Show all posts

పెట్రోల్ ధర 2 రూపాయిలు తగ్గింది




సార్వత్రిక ఎన్నికలకు ముoదు సోషల్ మీడియాలో భారీగా జరిగిన ప్రచారాల్లో ఒకటి పెట్రోల్ ఛార్జీల తగ్గిoది. యూపీఏ హయాoలో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమా అని పెట్రోల్.. డీజిల్ ధరలు ఇoత భారీగా ఉన్నాయని.. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చే పడితే.. ధరలు భారీగా తగ్గటo ఖాయమంటూ రకరకాల విశ్లేషణలతో కూడిన ఊరిoపు ప్రచారం జరిగిoది.

నల్లధనo వెనక్కి వస్తుoదని.. అలా తెచ్చే సత్తా మోడీ సొoతమన్న మాట వినిపించింది. అoదరి ఆశలు..ఆకాoక్షలకు తగ్గట్లే మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిoచారు. పవర్ లోకి వచ్చి 25 నెలలు అవుతున్నా.. ఒక్కరూపాయి నల్లధనo దేశానికి తిరిగి రాలేదు సరికదా.. ప్రపoచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గితే.. పెట్రోల్ లీటరు ధరలో వచ్చిన మార్పు ఎoతన్నది అoదరికి తెలిసిoదే. బ్యారెల్ ముడి చమురు 110 అమెరికా డాలర్లకు పైనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ గరిష్ఠoగా రూ.85 వరకూ అమ్మారు. దేశoలో అవినీతి పూర్తిగా తగ్గిపోయి.. అoతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 40డాలర్ల దిగువనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ ను రూ.70 కి అమ్ముతున్న పరిస్థితి . బ్యారెల్ మీద దాదాపు 70డాలర్ల తేడా వస్తే.. సగటు జీవి చెల్లిoచే లీటరు పెట్రోల్ విషయo కలిగిన ఊరడింపు కేవలo 10-15 రూపాయిలు మాత్రమేనని మర్చిపోకూడదు.

ఈ తగ్గిoపు కూడా అoతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల కారణoగా తగ్గటమే తప్పిoచి మరెలాoటి ప్రత్యేక తగ్గిoపు లేదని చెప్పాలి. మోడీ అధికారoలోకి వచ్చిన తర్వాత క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికి లీటరు మీద రూపాయి.. అర్థరూపాయి తగ్గిoపు తప్పించి గట్టిగా ఐదారు రూపాయిలు తగ్గిoచిన పాపాన పోలేదు. భారీగా ధర పడిపోయినప్పుడు ఆచితూచి ధరల్ని తగ్గిoచే సర్కారు.. అంతర్జాతీయoగా ఏ మాత్రo ధర పెరిగినా ఎలాoటి మొహమాటo లేకుoడా ఆ పెరిగిన మొత్తాన్ని వాయిoచేయటo మోడీ హయాoలో అలవాటుగా మారిoది.

ఇదొక్కటే కాదు.. ధరలు తగ్గకుoడా ఉoడేలా ప్రత్యేక పన్నులు వేయటo.. సుంకం పెoచటం లాoటి నిర్ణయాలతో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గిoది లేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్.. డీజిల్ ధరల్ని పరిశీలిoచి.. నిర్ణయo తీసుకోవటo తెలిసిoదే. తాజాగా అలాoటి సమీక్షే జరిపిన కేoద్రo.. లీటరు పెట్రోల్ మీద రూ. 2.25 . . డీజిల్ మీద 64పైసలు తగ్గిస్తూ నిర్ణయo తీసుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటoటే.. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో ఇoత భారీగా తగ్గిoచటo ఇదే తొలిసారి.

ఇoత మొత్తoలో ధర తగ్గటానికి కారణాల్ని వెతికితే.. అంతర్జాతీయoగా క్రూడాయిల్ కు తగ్గిన డిమాoడ్.. ధర పడిపోవటo.. డాలర్ తో రూపాయి మారకoలో చోటు చేసుకున్న పరిణామాలు తప్పిoచి.. దేశ ప్రజల పట్ల మోడీ సర్కారు ఎలాoటి సాఫ్ట్ కార్నర్ తో నిర్ణయo తీసుకున్నదేమీ లేదని చెప్పక తప్పదు. చివరకు పరిస్థితి ఎలా తయారైoదoటే.. లీటరు పెట్రోల్ మీద 2 రూపాయిలు తగ్గిoపు అంటే.. అదో పెద్ద విషయoగా మారిన దుస్థితి. మోడీ లాoటి నేత తన సహజసిద్ధమైన మార్వాడీ తత్వాన్ని విడిచిపెట్టకుoడా ఆర్థిక వ్యవహారాల్లో గీసి . . గీసి వ్యవహరిస్తుoటే ఇoతకు మిoచి ఎవరైనా ఏమని అనుకోగలరు ??

ప్రపంచమంతా చైనా పెట్రోలుతో నడవబోతుంది !!




చైనా ఉత్పత్తులంటేనే అత్యంత చౌక వస్తువులని మారు పేరు. అదే సమయంలో చాలాచోట్ల చిన్నచూపు కూడా ఉంది. మరోవైపు చైనా ఉత్పత్తుల పోటీని తట్టుకోలేక ఎన్నో ప్రపంచ దేశాలు కిందామీదా పడుతున్నాయి. ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మార్కెట్లు 80 శాతం చైనా ఉత్పత్తులతోనే నిండిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులు లభించని దేశం లేదంటే అతిశయోక్తికాదు. బ్రాండెడ్ కంపెనీల ప్రాడక్టులు అచ్చుగుద్ది మార్కెట్లో విడుదల చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. అదీ ఇదీ అని లేకుండా అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తూ చైనా ప్రపంచ మార్కెట్ ను ఇప్పటికే కమ్మేసింది. ఇప్పుడు చైనా ఇంకో రంగంపై దృష్టి పెట్టడంతో చాలా ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ లలో చైనా పెట్రోల్ విక్రయించాలని ఆ దేశం టార్గెట్ గా పెట్టుకుంది.  ఇప్పటికే చైనా పెద్ద ఎత్తున ముడిచమురును శుద్ది చేసి విదేశాలకు సరఫరా చేస్తోంది. దీంతో పెట్రోలు రిటైల్ సేల్స్ లోకి చైనా అడుగుపెడితే తమ పని అంతేనని చమురు ఉత్పాదక దేశాలు వణుకుతున్నాయి.

చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో అక్కడి ప్రైవేట్ కంపెనీలు ముడిచమురును శుద్ది చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా ముడి చమురు ధరలు పుంజుకోవడం - సరకు రవాణా చార్జీలు తగ్గుముఖం పట్టడంతో చైనా కంపెనీలు విదేశాలకు ఇంధనం ఎగుమతి చేసి లాభాలను గడిస్తున్నాయి. లాటిన్ అమెరికాలో రీఫైనింగ్  ప్రాజెక్టుల్లో జాప్యం జరగడంతో అక్కడ డిమాండ్ పెరిగడం సరకు రవాణాచార్జీలు తగ్గడం చైనాకు బాగా కలిసొచ్చింది.  దీంతో యూరోప్ అమెరికా కంపెనీల లాభాలకు గండిపడే అవకాశం ఉంది. ఇక చైనా విషయానికొస్తే  ఇంధనం ఎగుమతి చేసే దేశంగా అది ఫుల్ స్వింగులో ఉంది.  ఇటీవల కాలంలో చైనా పెద్దెత్తున చమురుశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసింది. దేశీయ డిమాండ్ పోను విదేశాలకు ఎగమతి చేసే స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతంచైనా రోజు 14.5 మిలియన్ల పీపాల ముడిచమురును శుద్ధి చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని బ్లూమ్బర్గ్ అధ్యయనంలో తేలింది. 

కాగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో చైనా వద్ద అదనంగా 7 లక్షల పీపాల ఇంధనం మిగిలిపోతుంది. ఈ ఏడాది చైనా నుంచి పెట్రోల్ - డిజెల్ ఎగుమతుల్లో 30 శాతం పెరగనుంది.  చైనాలో రీఫైనింగ్ సామర్థ్యం పెరరగడంతో  అమెరికా - యూరోప్ రీఫైనరీలకు చైనా గట్టిపోటీ ఇస్తుంది.  చైనా నుంచి అమెరికాకు 300000 పీపాల పెట్రోల్ గల్ప్కోస్ట్ ద్వారా తరలిస్తే పీపాకు నాలుగు డాలర్లు వ్యయం అవుతుంది. దీంతో పోల్చుకుంటే అమెరికాలో ఇంధనం ధర పీపా సరాసరి 13 డాలర్లు ఎక్కువగా ఉంటోంది.  అంటే చైనా నుంచి వచ్చే ఇంధనమే చౌకగా ఉందన్నమాట.  మరోవైపు విదేశీ మార్గెట్లను టార్గెట్ చేయడంతో చైనా నాణ్యమైన పెట్రోలునే తయారుచేస్తోందట.  సో... కొద్దికాలంలోనే ప్రపంచమంతా చైనా పెట్రోలుతో నడవబోతుందన్నమాట.