మీకు ఫ్రిడ్జి, బైక్, వాషింగ్ మెషీన్ ఉంటే మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులు !

Welfare Schemes are Eligible only for the People who does not have Luxury Items.


ప్రభుత్వం యొక్క విధి ప్రజలందరికి అవసరమైన అవసరాలను ,సౌకర్యాలను అందచేయడం.దాని కోసం ప్రభుత్వం సబ్సిడిలని సంక్షేమ పదకాలని రూపొందించి ప్రజలకు వరాల జల్లు కురిపిస్తుంది.అయితే కొన్ని సంక్షేమ పధకాలు సబ్సిడీలు కొంతమందికే వర్తిస్తాయికొంతమందికి వర్తించవు.ఇందులో ఏది ఎంతవరుకు సమంజసం అనే విషయం పక్కన పెడితే
ముఖ్యంగా నాలుగు గదుల సొంతిల్లు, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషీన్, టూ వీలర్స్ వంటివి ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులు కాదని సామాజిక ఆర్థిక సర్వే చేసిన వివేక్ దేబ్రాయ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. తాజాగా జరపనున్న సాంఘిక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు ఈ వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు.. సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. ఇక 2012లో హషీమ్ కమిటీ అయితే పట్టణాల్లో ఉండే 41శాత మంది మాత్రమే సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని ప్రస్తావించగా, ఈసారి దేబ్రాయ్ కమిటీ మాత్రం 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని ప్రస్తావించడం గమనార్హం.
ఫ్రిడ్జి, బైక్, వాషింగ్ మెషీన్ ఈ మూడు ఉంటే సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించాలని చెప్పిన వివేక్ దేబ్రాయ్ కమిటీ.. నాలుగు గదుల ఇల్లు, కారు, ఏసీ ఉన్న కుటుంబాలను వెంటనే సంక్షేమ పథకాల నుంచి తొలగించాలని వెల్లడించింది. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించటం వల్ల.. నగర, పట్టణాల్లో ఇల్లు లేని వారికి ప్రయోజనం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పింది. తక్కువ ఆదాయం ఉన్నవారు.. కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న వారికి ఈ ప్రయోజనాలు కచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలని కోరింది. ఈ వస్తువులన్నీ మీ సొంత డబ్బుతో కొనుక్కున్నవే. ఎవరూ కాదనరు. కానీ.. ఇవన్నీ ఉంటే.. ఇక నుంచి మీరు ప్రభుత్వ సబ్సిడీ, ప్రభుత్వ పథకాలకు అనర్హులు కాబోతున్నారన్న మాట.ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ మోయలేని ప్రభుత్వం ఆ సబ్సిడీ కి ఎలా గండి కొట్టాలా అని ఆలోచించి సబ్సిడీ ఎత్తివేయాలి అనుకుంటున్నట్టు ప్రకటన చేసింది. ఇక తాజాగా దేబ్రాయ్ కమిటి ఆధారం గా మరిన్ని సంక్షేమ పధకాలు,సబ్సిడీలకు గండి కొట్టె తాజా ప్రణాళికను రూపొందించి అమలు పరచడాని కి సిద్ధం గా ఉంది.
పట్టణాలలో వాహనము కూడా లేని వారు ఉండడం అరుదు. ఇహ ఇలా ప్రభుత్వం ఆలోచిస్తూ పొతే ఎవరికీ సంక్షేమ పధకాలు అందుబాటులోకి రావు. సో మ్వారికి ఉన్న వస్తువులను ఆధారం చేసుకోవడమే కాకుండా వారి ఆర్ధిక పర్స్తితులను అంచనా వేయడం ద్వారా సబ్సిడీ సంక్షేమ పధకాలను వర్తింప చేసే విధానాన్ని ప్రభుత్వం చేపడితే బాగుంటుంది...
ThanQ Visit Again.

Related Posts