Showing posts with label Jakanna. Show all posts
Showing posts with label Jakanna. Show all posts

500 మంది కార్మికులతో బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని నిర్మిస్తున్న జకన్న



దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న బాహుబలి 2  షూటింగ్ శరవేగంగా రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న సంగతి తెలిసినదే. నిర్విరామంగా చాలా రోజులనుండి సాగుతున్న ఈ క్లైమాక్స్ ఫైట్ భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అద్భుతంగా నిలవనుందని సమాచారం. 

అయితే ఈ ఫైట్ లో భాగంగా మాహిష్మతి కోటను విస్తరించనున్నట్టు సమాచారం. మొదటి భాగంలో చూసిన సెట్ లే కాకుండా రెండో భాగానికి సంబంధించి మరికొన్ని కొత్త సెట్స్ మాహిష్మతి రాజ్యంలో నిర్మిస్తున్నారు. 

ఇందులో భాగంగా ఒక భారీ సెట్ కోసం దాదాపు 500మంది కార్మికులు రోజూ కష్టపడుతున్నట్టు సమాచారం. బాహుబలిలో ఇండియా లెవెల్లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న రెండో భాగంతో ఏకంగా ప్రపంచ స్థాయిలో ఖ్యాతి కీర్తి కోరుకుంటున్నట్టు తెలుస్తుంది.