ఔను నేను నక్సలైట్ నే.
నేను నక్సలైట్ ఎలా అయ్యానో తరువాత చెబుతాను నేను ఈ నవల రాసిన నాటినుండి ఈనాటి వరకూ ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. విల్ ఫోన్ లు ,సెల్ ఫోన్ లు ల్యాప్ ట్యాప్ లు ఎన్నో...ఎన్నో మార్పులు వచ్చే సాయి ఆఖరికి నక్సలైట్ అన్న పదము కూడా మారిపొయి మావోయిస్ట్ అయ్యింది. కాని మారంది మాత్రం పీదవాడు పేదవాడుగానే వుండి పోవటం. ప్రభుత్వాలు పేదరికాన్ని పారద్రోలకుండా పేదవార్ని పారద్రోలడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

విప్లవం ఒక్క మనుషులు లొనే కాదు ఈ ప్రక్రుతిలో వున్న అన్ని జీవ రాసుల్లో వస్తుంది. మనిషి అబివ్రుద్ది పేరుతో అడవుల్ని నాశనం చేస్తున్నాడు..అందుకే అడవుల్లో వుండాల్సిన ఏనుగులు వూర్ల మీద పడి పంటలు ను నాశనం చేస్తున్నాయి. ఇది ఏనుగుల్లో వచ్చిన విప్లవం. పుట్టల్లో వుండాల్సిన పాములు ఇల్లల్లోకి వచ్చే స్తున్నాయి.ఇది పాముల్లో వచ్చిన విప్లవం. ఏనిమల్ ప్లానెట్ వంటి చానల్స్ లో గేదలు సింహాల్ని వెంటపెడుతున్న సీన్లు మనం చూస్తున్నాము ఇది గేదల్లో వచ్చి న విప్లవం.ఇన్నింట్లో విప్లవం వచ్చిన ప్పుడు మనిషిలో విప్లవం రాదా?
వస్తుంది .విప్లవం 1967లొనే పశ్చిమ బెంగాల్ లొ నక్సల్ బరి ఉద్యమం వచ్చింది. అది శ్రీకాకుళం చేరింది. అలా...అలా అంద్రా అంతా చొచ్చుకుని పోయింది.
నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది అమరులయ్యారు.అలాగే పోలీసులు కూడా హతమయ్యరు.ఎన్నో కుటుంబాలు బాదల కౌగిళ్లల్లో నలిగిపొయాయి.