అర్దం కాలేదు. అసలు పవన్ చిరంజీవి కే అర్దం అయ్యేవాడుకాదని చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూ లలో చెప్పాడు. ఇంట్లోవాళ్ళందరం నవ్వుకుంటున్న సమయంలో కళ్యాణ్ సీరియస్ గా మెడమీదికి వెళ్ళిపోతాడని.మేము సీరియస్ గా ఎదైన విషయంపై సీరియస్ గా చర్చి స్తు నప్పుడు.నవ్వుకుండేవాడని చిరంజీవి అన్నాడు.అంటే చిన్నప్పటినుండి తండ్రిలా పెంచిన చిరంజీవి కే అతను అర్దం కాకపోతే ఇక ప్రజల కు ఏమిటి అర్థం ఔతాడు?. ఈ విషయం ప్రక్కన పెడితే ఇంతకు పవన్ తిరుపతి లో ఇచ్చిన స్పీచ్ ఏమిటి? అసలు అతను ఏమిటి మట్లాడాడు?అతని స్పీచ్ లో క్లారిటీ వున్న దా? అసలు పవన్ లో లీడర్ షిప్ లక్షణాలు వున్నాయా? మొత్తం గా విశ్లేషణ చేద్దాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్తినప్పుడు పవన్ యువరాజ్యం అద్ద్యక్షుడిగా వున్నాడు ఆ సమయంలో చిరంజీవి పార్టీ టికెట్స్ అమ్ముకున్నాడని చాలా విమర్శలు వచ్చిన ఏ రోజు ఆ విషయం మీద పవన్ నోరు మెదపలేదు. సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఎంతోమంది వున్నారు. అలాంటి వాళ్లెవరికి పార్టీ టికెట్ ఇవ్వలేదు.అంతవరకెందుకు చిరు అభిమానులు లోనే చాలామంది సమాజసేవ చేసేవారున్నారు. అలాంటి వారెవ్వరికి పార్టీ టికెట్ రాలేదు.ఆ విషయం లో ఈ పవర్ స్టార్ నోరు మెదపలేదు.వ్యాపారస్తులు.పెద్దపెద్ద డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇచ్చారు. ఈ విషయం పవన్ కు తెలీదా? తెలిసినా అప్పటికి ఆయనకు ఇప్పటి లా ప్రశ్నించడం అలవాటు కాలేదా? అంతవరకెందుకు అన్న గుత్తగుత్తెంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనమ్ చేసేస్తే ప్రజారాజ్యం పార్టీ లొ యువ రాజ్యం అద్యక్షుడిగా వున్న పవన్ అదెంటి అన్నయ్యా! కొద్ది నెలల క్రితమే కదా కాంగ్రెస్ నాయుకుల్ని పంచెలు వూడదీసి కొట్టండి అన్నాను కదా నువ్వు మన పార్టీ ని ఆ కాంగ్రెస్ పార్టీలొ కలిపేస్తావేమిటని ప్రశ్నించాలని పవర్ స్టార్ కు ఎందుకు అనిపించలేదో? స్త్రీల ను గౌరివించవలసిన ఒక నాయకుడిగా వుండవలసిన పవన్ రోజా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసి విమర్శలు పాలవ్వడం మనందరికి తెలిసిన విషయమే.ప్రజలందరికి ఆదర్శంగా వుండవలసిన నువ్వు నడిరోడ్ మీద కళ్ళు త్రాగటమ్ ఏ లీడర్ షిప్ క్వాలిటీ? సినిమా నటుడు చిరంజీవి గారికి అనుభవం లేదు అందుకే నేను రాజశేఖరరెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను. అన్న ఒక్క మాటకు రాజశేఖర్. జీవితాళ్ళను చిరు అభిమానులు వెంటబెట్టి రాళ్ళతో కొట్టినప్పుడు ఆ విషయాన్ని ఖండించాల్సింది పోయి.రాజశేఖర్ నత్తి నత్తిగా మట్లాదుతుంటాడు అంటూ వేళాకోళం చేయడంలో నీ నాయకత్వ లక్షణాలు ఎంత ఎక్కువుగా వున్నాయో అర్దం అవుతున్నది.
ఇదంతా గతానికి సంబందించినది.
ఇక తిరుపతి సభ విషయానికి వస్తే.....
పవన్ చెప్పిన కొన్నింటిని తీసుకుందాం.అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని పదవులు శాశ్వతం కావని. రాజీనామా చెస్తే అంత కంటే పెద్ద పదవులు ప్రజల గుండెల్లో ఇస్తారని చెప్పాడు.పవన్ కు తెలియని విషయమేమిటంటే అశోక్ గారు రాజీనామా చేసేస్తానని అరుణ్ జైట్లీ పార్లమెంటు లో ప్రసంగించిన మరుసటి రోజే సిద్దపడ్డారు.కాని.. చంద్రబాబు నాయుడు రాజీనామా చెయొద్దని. రాజీనామా చెస్తే రాస్ట్రానికి నష్టం జరుగుతుందని వారించారు.రాజీనామా కు సిద్దపడ్ద అశోక్ ను విమర్శించిన పవన్ రాజీనామా చెయ్యొద్దని వారించిన చంద్రబాబు ను మాత్రం ఆ స్థాయిలో విమర్శించలేదు.ఎందుకనీ? ఆ మాటకొస్తే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ను విడగొట్తినప్పుడు మీ అన్నగారు అశోక్ వలే కేంద్ర మంత్రిగా వున్నారు కదా! మరి ఆరోజు మీ అన్నగార్ని రాజీనామా చేయమని యెందుకు అడగలేదు? ఆ రోజు మీ అన్నకు ఈ రోజు చెప్పిన అలెగ్జాండర్ కధ చెప్పి రాజీనామా చేయించాల్సింది. మీ అన్నగారి పదవి పోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా వుండి పొయేవారు కదా!
అంతవరకు ఎందుకు ఆయన మాటల్లో ఎంత వైరుద్ద్యం వుందో గమనించవచ్చు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఏ విషయం మీద ప్రశ్నించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారని అనుమానం వచ్చినప్పుడు. ఇలా ప్రజలుదగ్గరకు వచ్చి మాటలాడుతుంటాడని ప్రజలు ఇప్పుడు అనుమానిస్తున్నారు.. ఐతే ఇక నుండి వరుసగా కార్యక్రమాలు చేస్తానంటున్నాడు కాబట్తి ఈ అనుమానం నిజం కాదు. మరి ఇంత షడన్ గా ఎందుకు మీటింగ్ పెట్తి మూడంచల విధానాన్ని ప్రకటించాడు. అంటే ఇక రాజకీయాల్లో వుంటానని చెప్పినట్టే
నిజానికి అతను అకస్మాత్తుగా ఈ మీటింగ్ పెట్టలేదని ముందువ్యూహమ్ వుందని. దీన్ని వెనుకనుండి నడిపిస్తున్నావారున్నారని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు.ఇంతకి పవన్ వెనుక ఎవరున్నారు ?
మిగతా వివరణ రేపు...
Posted By మన్యాల శ్రీనివాసరావు
Iam Your Real Friend
