Showing posts with label ETV. Show all posts
Showing posts with label ETV. Show all posts

జబర్దస్త్ చలాకి చంటికి పెళ్లి కాబోతుంది



ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు చలాకీ చంటి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ షో అద్భుతమైన విజయం సాధించడంలో చంటిది కూడా కీలక పాత్ర. తనదైన టిపికల్ వాయిస్.. డిఫరెంట్ మాడ్యులేషన్.. కామెడీ టైమింగ్ తో ఆ షోలో భలే కామెడీ పండించాడు చంటి. ఈ షోలో తన పేరు వెనుక తగిలించుకున్న ‘చలాకీ’ అనే పదం ఇప్పుడతడి ఇంటిపేరుగా మారిపోయింది. ‘జబర్దస్త్’ షోలో చంటి చేసే స్కిట్లతో పాటు అతడి పెళ్లి టాపిక్ కూడా జనాల్ని బాగా నవ్విస్తూ ఉంటుంది. జడ్జీలు రోజా నాగబాబులతో పాటు యాంకర్.. మిగతా పోటీదారులు.. అతడి పెళ్లి గురించి కామెంట్లు చేస్తుంటారు. ఈ షోలో చంటి ఓ పెళ్లికాని ప్రసాద్ అయిపోయాడు. ఐతే ఇకపై చంటి పెళ్లి గురించి కామెడీ చేయడానికి కుదరదు మరి.

ఎందుకంటే చలాకీ చంటి త్వరలోనే పెళ్లి కొడుకవుతున్నాడు. ఆల్రెడీ అతడికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈ విషయాన్ని చంటి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన నిశ్చితార్థ వేడుక ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. నిశ్చితార్ధం స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని చంటి తెలిపాడు. అమ్మాయి ఎవరు.. పెళ్లి ఎప్పుడు అన్న వివరాలు చంటి వెల్లడించలేదు. మొత్తానికి చంటి పెళ్లి మాత్రం అయిపోతోంది. కాబట్టి ఇకపై అతడిపై జోకులు పేల్చే వీల్లేదు. ‘జబర్దస్త్’ కంటే ముందు నుంచే చంటి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. ఈ సినిమాతో అతడికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అతననే కాదు.. ధన్ రాజ్ - షకలక శంకర్ - సుడిగాలి సుధీర్ - చమ్మక్ చంద్ర లాంటి కుర్రాళ్ల జీవితం ఈ షోతో పూర్తిగా మారిపోయింది.

Pawan Kalyan Starts TV Show Soon




పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మాత్రమే కాదు.. పవర్ ఫుల్ పొలిటీషియన్ కూడా. ప్రస్తుతం తన కాన్సన్ ట్రేషన్ మొత్తాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ పై పెట్టిన పవన్ కళ్యాణ్.. త్వరలో కొత్త పాత్రలోకి ఎంటర్ కానున్నాడని తెలుస్తోంది. బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న సర్దార్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యక్షం కానున్నాడట పవన్. 

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంత స్పందన వచ్చిందో చూశాం. దీన్ని డబ్బింగ్ చేసి దాదాపు దేశంలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ చేశారంటే.. ఈ ప్రోగ్రాంకి వచ్చిన రెస్పాన్స్ అర్ధమవుతుంది. ఇప్పుడు పవన్ కూడా ఇలాంటి ఒక సామాజిక కోణానికి చెందిన ప్రోగ్రాంనే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలా టీవీ ద్వారా ప్రజలకు నిత్యం టచ్ లో ఉండడం ద్వారా.. తన రాజకీయ ఇమేజ్ ను కూడా పెంచుకోవచ్చనే ఆలోచిస్తున్నాడట పవన్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ గ్రూప్ ప్రసారం చేయనుందని సమాచారం. ఇప్పటికీ ఈనాడు గ్రూప్ కి పవన్ కి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి. 

అసలు పవన్ చంద్రబాబుల కలయికలో కూడా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు నడిపిన మంత్రాంగమే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత.. పవన్ టీవీ ఎంట్రీ కూడా ఈనాడు గ్రూప్ ద్వారానే జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రస్తుతం టీవీలో యాంకర్ గా సందడి చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఒక్కడే. గతంలో రాజమౌళి కూడా సత్యమేవజయతే కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత కొనసాగించలేదు. ఇప్పుడు పవన్ కూడా బుల్లితెర క్లబ్ లో జాయిన్ కానున్నాడు.