Showing posts with label Mega Family. Show all posts
Showing posts with label Mega Family. Show all posts

మెగా హీరోల సందడి 3 రోజుల్లో 5 సినిమాల ప్రారంబోత్సవం



మా ఫ్యామిలీ హీరోలందరినీ కలిపితే క్రికెట్ టీమ్ తయారైపోతుందని జోక్ చేశాడు వరుణ్ తేజ్. అవును.. టాలీవుడ్లో ప్రస్తుతం ఏ ఫ్యామిలీలో లేనంత మంది హీరోలున్నారు మెగా కుటుంబంలో. నాగబాబును మినహాయిస్తే ప్రతి ఒక్కరూ యాక్టివ్ గా ఉన్నవాళ్లే. చిరంజీవి కూడా పునరాగమనానికి రెడీ అయిపోతున్నాడు. ఏడాదికి అరడజనుకు తక్కువ కాకుండా మెగా ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి. అలాగే ఆ హీరో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు.. ఆడియో వేడుకలు.. తరచుగా జరిగిపోతుంటాయి. మరీ ఇప్పుడైతే వారం రోజుల వ్యవధిలో ఐదు మెగా సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటుండటం విశేషం.

ఇవాళ ముందుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఏ హడావుడి లేకుండా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీని తర్వాత గురువారం వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమాను ఆరంభించబోతున్నారు. ఇదే రోజు అల్లు శిరీష్ హీరోగా.. కొత్త దర్శకుడు మల్లిడి వేణు రూపొందించబోయే సినిమాను కూడా మొదలుపెట్టబోతన్నారు. ఇక శుక్రవారం కూడా రెండు సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాయి. 

అందులో మోస్ట్ అవైటెడ్ చిరంజీవి 150వ సినిమా ఉండటం విశేషం. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా మొదలవుతోంది. అదే రోజు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఈ నెల 29 తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈ మూడు రోజుల్లోనే చకచకా ప్రారంభోత్సవాలు జరిపించేస్తున్నారు మెగా హీరోలు.

మెగాస్టార్ ఇంట్లో పెళ్లి సందడి చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం








మెగాస్టార్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం కోసం మెగా లెవెల్లోనే ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక- రిసెప్షన్ కనీవినీ ఎరుగని స్థాయిలో జరపబోతున్నారు.  హైదరాబాద్ - బెంగుళూరుల్లోని చిరంజీవి నివాసాలు కొత్త శోభని సంతరించుకున్నాయి.  కూతురు పెళ్లిని దృష్టిలో ఉంచుకొని రెండు చోట్లా తన ఇళ్లని  ఈమధ్యే రెనొవేషన్ చేయించాడు చిరు. ఇప్పుడు  ఆ ఇళ్లకి పెళ్లి హంగులు కూడా జోడవడంతో మరింత కళ సంతరించుకున్నాయి. వివాహం బెంగుళూరులోని ఇంట్లో 28న జరగబోతోంది. అక్కడికి పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రుల్ని ఆహ్వానించారట. 31న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. అక్కడికి మాత్రం సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఆహ్వానించారు. 

శ్రీజ ఇప్పటికే పెళ్లి కూతురైంది.  పెళ్లి కళ ఉట్టిపడుతున్న ఆమెతో కలిసి తమ్ముడు వరుణ్ తేజ్ ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు. శ్రీజ నిజంగానే కుందనపు బొమ్మలా ఉంది. మా ఇంట్లో సెలబ్రేషన్స్ షురూ అయ్యాయంటే వరుణ్ తేజ్ ట్వీటాడు. వారం రోజులపాటు జరిగే ఈ సంబరాల్లో చిరంజీవి కుటుంబం మొత్తం పాల్గొంటుంది. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా పనుల్ని పక్కనపెట్టి మరీ ఈ వేడుకల్లో పాలు పంచుకొంటాడట. ఇటీవలే చిరు - పవన్ లు కలిసి ఆడియో వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య ఎంత సఖ్యత ఉందో ఆ వేడుకతో నిరూపించారు. ఇప్పుడొచ్చిన ఫ్యామిలీ ఫంక్షన్ తో మళ్లీ  మెగా హీరోలంతా కలిసి ఒకచోట సందడి చేయబోతున్నారన్నమాట.

అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోకి ఫేస్ బుక్ లో లైక్ ల వర్షం






ఫేస్ బుక్ లో సంచలనాలు సృష్టించాలంటే అది స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాతే. ఇప్పటికే 1 కోటి మంది అభిమానులను సంపాదించిన బన్నీ.. అసలు ఇక్కడ ఏదైనా పోస్టు చేస్తే చాలు.. వెంటనే అందరూ లైకులతో ముంచేస్తున్నారు.

తను.. తన భార్య స్నేహ.. కొడుకు అయాన్ కు ఒకేసారి ముద్దిస్తున్న ఫోటోను ఒకటి బుధవారం రాత్రి అప్ లోడ్ చేశాడు. ఇలా సదరు ఫోటోను పోస్టు చేశాడో లేదో.. అరగంటలో 50 వేల మంది.. గంట పూర్తయ్యే లోపే లక్షన్నర మంది లైక్ చేశారు. అసలు బన్నీ ఒక ఫోటో పెట్టగానే ఇంత ఫాస్టుగా లైకులు పడుతున్నాయి అంటే మనం అర్ధంచేసుకోవచ్చు.. బన్నీ క్రేజు ఏ రేంజులో ఉందో. ఇంతకీ ఆ ఫోటో ఎక్కడ దిగారనే డౌటుందా మీకు? శ్రీజ పెళ్ళి కదండీ.. పెళ్ళికి ముందు అనేక ఫంక్షన్లు చేస్తున్నారు. గత రాత్రి జరిగిన అలాంటి ఒక ఫంక్షన్ లో ఈ ఫోటో దిగారు మనోళ్ళు.

అయితే అన్ని ఫోటోలకూ ఇలా వస్తాయని అనుకోవడానికి లేదు. కేవలం బన్నీ కొడుకు అండ్ వైఫ్ ఉన్న కిస్సింగ్ ఫోటోకు మాత్రమే ఇంత క్రేజీగా లైకులు వచ్చాయని చెప్పొచ్చు. ఓ మూడు రోజుల ముందు తమన్ తో కలసి బ్యాగ్రౌండ్ స్కోర్ సెషన్ లో కూర్చున్న బన్నీ.. ఆ ఫోటోను షేర్ చేశాడు. షేర్ చేసి మూడు రోజులైనా కూడా కేవలం 77 వేల లైకులు మాత్రమే వచ్చాయి. అది సంగతి.