Showing posts with label Remuneration. Show all posts
Showing posts with label Remuneration. Show all posts

150 వ సినిమాకు చిరు రెమ్యునరేషన్ ?




సాధారణంగా సొంత బ్యానర్ లో సినిమాలు తీసే హీరోలు రెమ్యునరేషన్ గురించి పట్టించుకోరు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి నటించిన ఏ సినిమాలోనూ నాగార్జున రెమ్యునరేషన్ తీసుకున్న వార్తలు లేవు. 

అలానే దగ్గుబాటి వారి ఫ్యామిలీ కుడా. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ తో అల్లు అర్జున్ చేసిన ఏ సినిమాకు బన్నీ పారితోషికం పట్టించుకోడని టాక్. చరణ్ కూడా తన మూడవ సినిమా ఆరెంజ్ నాగబాబు బ్యానర్ లో తీసిన నేపధ్యంలో పేమెంట్ అడగలేదని వార్తలు వినిపించాయి. 

అయితే ఇప్పుడు సొంత తనయుడి బ్యానర్ లో చిరు నటించనున్న 150వ సినిమాకు మాత్రం చిరు ఏకంగా 30కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిగర్ ఇప్పుడున్న బడాహీరోలకంటే ఒక 15శాతం పెద్దదే. అయితే ఈ వార్తపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించడం విశేషం. రీ ఎంట్రీ విషయంలో డేట్ లనుండీ మనీ మ్యాటర్స్ వరకూ అన్నీ పక్కాగా వుండాలని చరణ్ భావిస్తున్నాడని ఒకరు అంటుంటే నేటి హీరోలకంటే తానెప్పుడూ ఎక్కువే అని నిరువుపించుకోవాలని చిరు కోరిక అన్నది మరొకరి వాదన. 

రాబిన్ హుడ్ కోసం రేట్ పెంచేసిన మాస్ మహా రాజ్





ఇంకా 10 రోజుల్లో షూటింగ్ మొదలవ్వాల్సిందిగా.. ఇప్పటికే రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో పేచీ పెడుతున్నాడని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా నిర్మాతే మారిపోయాడు. అందుకే ఇప్పుడు ''రాబిన్ హుడ్'' సినిమాకు కొత్తగా డివివి దానయ్య లైన్ లోకి వచ్చాడు. 

సన్నిహితుల ద్వారా తెలుస్తున్న విషయాల ప్రకారం.. 5 కోట్ల రెమ్యూనరేషన్ కు ముందుగా ఒప్పుకున్న మాస్ రాజా.. చివరకు బెంగాళ్ టైగర్ రిలీజయ్యి హిట్టయ్యేసరికి.. నాకు 9 కోట్లు ఇస్తేనే సినిమాను చేస్తా అంటూ మారాం స్టార్ట్ చేశాడట. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో అలామొదలైంది ఫేం కె.ఎల్.దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మాతగా ఈ సినిమా మొదలవ్వాలి. అయితే రవితేజ చివరగా పేచీ పెట్టడంతో ఇప్పుడు ఈ మొత్తం ప్రాజెక్టును డివివి దానయ్య ఒవర్ టేక్ చేసుకున్నాడు. స్వయంగా దాము పిలిచి మరీ ఈ ప్రాజెక్టును ఇచ్చేశాడట. 

''రాబిన్ హుడ్'' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే డివివి దానయ్య త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇస్తారట. లెటజ్ సి.