తెలుగు చలన చిత్ర రంగంలో రారాజుగా వెలిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఏడేళ్ల క్రితం రాజకీయ రంగంలో అడుగు పెట్టి సొంతగా 'ప్రజారాజ్యం' అనే పార్టీని స్థాపించి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు. తర్వాత మళ్లీ సినిమా రంగానికి రావాలని నిశ్చయించుకున్నారు. చిరంజీవి త్వరలో మొదలెట్టనున్న 150చిత్రానికి రాహుల్ గాంధీ రెడ్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అందుకే ఆయన 150 సినిమా అనుకున్న ప్రకారం బర్త్ డే రోజు మొదలు కాలేదని చెప్తున్నారు. రాహుల్ సూచనతో చిరంజీవి నోచ్చుకున్నారని అయన సన్నిహితులు అంటున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చిరంజీవి కోపంగా ఉన్నారని వార్తలొస్తున్నాయని, పార్టీ కార్యకలాపాల్లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తనను పక్కన పెడుతున్నారని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ బాగా గ్రహించినట్లు తెలుస్తోంది. దిలా ఉండగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల నుంచి బెజేపీకి మద్దతు కొనసాగిస్తున్నారు. చిరంజీవి స్టెప్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది అలాంటి వ్యక్తి ని తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు . శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరంజీవి పేరున్న నటుడని, అతనికున్న ఇమేజ్ పార్టీకి సహకరిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన బిజెపిలోకి వస్తానంటే, ఆనందంగా స్వాగతం పలుకుతామని వివరించారు.ఈ నేపథ్యంలోనే, ఇకపై ఆ పార్టీలో కొనసాగరాదని చిరంజీవి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడితే, బిజెపిలో చేరుతారా? లేక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా? అనేది వేచి చూడాలి.
Previous Page