Showing posts with label Allu Arjun. Show all posts
Showing posts with label Allu Arjun. Show all posts

బొంబాయిలో మకాం పెట్టిన బన్నీ




ఏదో నాలుగు రోజులు పనిమీద వెళ్ళాడని అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా ఓ రెండు వారాల నుండి అక్కడే మకాం ఉంటున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. మనోడు చాలా రోజుల నుండి ముంబాయ్ లోనే ఉంటున్నాడు. తనొక్కడే కాదు.. ఏకంగా వైఫ్ స్నేహా రెడ్డి కూడా అక్కడే ఉంటోంది. ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నట్లంటే.. తన సినిమా పనే కాకుండా వేరే ఏదో కూడా చేస్తున్నాడట.

త్వరలోనే షూటింగ్ కు వెళ్ళనున్న ''నా పేరు సూర్య'' సినిమా కోసం సంగీత దర్శకుడు విశాల్ అండ్ శేఖర్ తో కూర్చుని మనోడు దగ్గరుండి ట్యూన్లు కంపోజ్ చేయించుకుంటున్నాడట. వక్కంతం వంశీ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్మీ మ్యాన్ గా కనిపించనున్న బన్నీ.. సంగీతంపై స్పెషల్ శద్ర పెట్టాడు. అయితే ముంబాయ్ లో ఉంటూ.. అక్కడ రొహిత్ శెట్టి తీస్తున్న గోల్ మాల్ రిటర్న్స్ షూటింగ్ స్పాటులో కూడా మెరిశాడు. అంతేకాదు.. ఒక పోష్ బార్ అండ్ రెస్టారెంటుకు తన భార్యతో కలసి డిన్నర్ కు కూడా వెళ్యాడు. చూస్తుంటే ఇదేదో మ్యూజిక్ సెట్టింగులకు మాత్రమే వెళ్ళినట్లు అనిపించట్లేదు కదూ. మరేముందో మర్మం?

ప్రస్తుతం బన్నీ అక్కడ కొన్ని యాడ్ ఏజన్సీలు మరియు బ్రాండింగ్ ఏజన్సీలతో డిస్కషన్లు జరుపుతున్నాడట. మొన్నటివరకు రామ్ చరణ్ ప్రొఫైల్ ను హ్యాండిల్ చేసిన పిఆర్ ఏజెన్సీతో మంతనాలు సాగిస్తున్నాడట. ఇక నుండి కొత్త కొత్త బ్రాండులకు ఎండార్సర్ గా సంతకాలు పెట్టేస్తూ.. సంవత్సరానికి ఒక సినిమా పది యాడ్లు అన్న చందాన కెరియర్ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. అందేకే అల్లూ వారి క్యాంప్ బొంబాయిలో వేయడం జరిగిందని సన్నిహితులు చెబుతున్నారు.


అల్లు అర్జున్ మూవీ టైటిల్ DJ దువ్వాడ జగన్నాథమ్

Allu-Arjun Movie Title " DJ " Duvvada Jagannadham



మిరపకాయ్.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. లాంటి వెరైటీ టైటిళ్లతో సినిమాలు తీసి మెప్పించాడు హరీష్ శంకర్. అల్లు అర్జున్ తో తన కొత్త సినిమా టైటిల్ విషయంలోనూ తన చమత్కారం మరోసారి చూపించాడు హరీష్. ఈ చిత్రానికి 'దువ్వాడ జగన్నాథమ్' అనే టైటిల్ పెట్టడం విశేషం. దీన్నే 'డీజే' అని షార్ట్ చేసి ఆకర్షణీయమైన లోగో డిజైన్ చేసి వదిలింది హరీష్ శంకర్ అండ్ టీమ్. టైటిల్ లోగో చూడగానే సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా ఆయనకిది 25వ సినిమా కావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

'దువ్వాడ జగన్నాథమ్' షూటింగ్ సోమవారమే ఆరంభం కాబోతోంది. తనతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్న హరీష్ శంకర్ కు 'రామయ్యా వస్తావయ్యా' టైంలోనే కమిట్మెంట్ ఇచ్చాడు బన్నీ. ఐతే ఆ సినిమా తేడా కొట్టడంతో సీన్ మారిపోయింది. బన్నీ కోసం రాసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్'ను సాయిధరమ్ తో తీయాల్సి వచ్చింది. ఐతే ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాక హరీష్ కు బన్నీతో చేసే అవకాశం లభించింది. నాలుగు నెలల కిందటే వీళ్లిద్దరి కాంబినేషన్ ఓకే అయింది. తన కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం కావడంతో బాగా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేశాడు హరీష్. టైటిల్ తో జనాల్ని బాగానే ఆకర్షించిన హరీష్.. సినిమాతోనూ అలాగే మెప్పిస్తాడేమో చూద్దాం. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలాఖర్లో విడుదలవుతుంది.

నాల్గో సారి 50 కోట్ల వసూళ్ళు చేసిన బన్నీ - సరైనోడు




పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. లాంటి సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని ఘనతల్ని సొంతం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే నైజాం ఏరియాలో వరుసగా ఆరు సినిమాలతో రూ.10 కోట్ల షేర్ సాధించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు బన్నీ. ఇప్పుడిక ఇంకో రికార్డు అతడి సొంతమైంది. వరుసగా నాలుగో సినిమాతో అతను రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు. తెలుగులో ఇంకే హీరో కూడా కనీసం మూడుసార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదు. ‘రేసుగుర్రం’ సినిమాతో తొలిసారి రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేశాడు బన్నీ. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.60 కోట్ల దాకా వసూలు చేసింది. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డివైడ్ టాక్ తట్టుకుని మరీ రూ.55 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది.

ఇక గత ఏడాది అల్లు అర్జున్ ప్రత్యేక పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ సైతం 50 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇప్పుడు ‘సరైనోడు’ కూడా ఈ క్లబ్బులో చేరింది. మిగతా మూడు సినిమాల కంటే చాలా వేగంగా ‘సరైనోడు’ ఈ ఘనతను అందుకుంది. పదో రోజుకే ‘సరైనోడు’ వరల్డ్ వైడ్ షేర్ రూ.50 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. రెండో వీకెండ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బన్నీ సినిమానే బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. ఈ మూవీ ఫుల్ రన్లో రూ.60 కోట్ల దాకా షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. డివైడ్ టాక్ తో మొదలైన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే. బన్నీ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఇది సరైన రుజువు.

Sarrainodu Movie 4th Day Collections




వీకెండ్ కలెక్షన్లు ఓ ఎత్తు అయితే... ఆ తరువాత నుంచి వచ్చే కలెక్షన్లు ఓ ఎత్తు. అయితే సమ్మర్ కాబట్టి... స్కూళ్లు.. కాలేజీలకు సెలవులు. పైగా మండే ఎండలు. అన్నీ సరైనోడుకి కలిసొస్తున్నాయి. ఈ చిత్రం నాలుగో రోజు కూడా మంచి వసూళ్లనే సాధించింది. ఓవర్సీస్ లో అయితే నాలుగో రోజుకి ఏడు లక్షల డాలర్లను(రూ.4.5కోట్లు) ఇప్పటికే వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్లోకి వెళ్లినట్టే. గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకంటే.. ఇది చాలా ఎక్కువ. మునుముందు కూడా ఇంకా వచ్చే అవకాశాలున్నాయి. ఇక లోకల్ కలెక్షన్లు కూడా బాగానే వున్నాయి. 

సరైనోడు సీడెడ్ లో బాగానే వసూలు చేస్తున్నాడు. నాలుగో రోజు రూ.98 లక్షల గ్రాస్ వసూలు చేశాడు. ఇందులో షేర్ రూ.76 లక్షలు. ఇప్పటి వరకు సీడెడ్ షేర్ సుమారు.5.11 కోట్లు వచ్చింది. అలాగే నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు షేర్ రూ.14.25లక్షలు.. మొత్తం నాలుగు రోజుల షేర్ రూ.1.05 కోట్లు. వెస్ట్ గోదావరి నాలుగో రోజు షేర్ రూ.27.14లక్షలు. మొత్తం నాలుగు రోజులకు కలిపి రూ.1.95 కోట్లు వసూలు అయింది. గుంటూరు జిల్లాలో నాలుగో రోజు వచ్చిన షేర్ రూ.30.31లక్షలు.. మొత్తం రూ.2.50కోట్లు. నైజాంలోనైతే సరైనోడు దూసుకు పోతున్నాడు. ఇక్కడ నాలుగో రోజు మాత్రమే రూ.1.35కోట్లు వసూలు కాగా... నాలుగు రోజులకు కలిపి మొత్తం రూ.8.45 కోట్ల షేర్ వచ్చింది. సో.. ఇలా సరైనోడు వీక్ డేస్ లో కూడా తన కలెక్షన్లను స్టాండర్డ్ గా వుంచుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాడు.

Sarrainodu Movie Telugu Review




చిత్రం : ‘సరైనోడు’

నటీనటులు: అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసా - ఆది పినిశెట్టి - శ్రీకాంత్ - జయప్రకాష్ - బ్రహ్మానందం - సుమన్ - ప్రదీప్ రావత్ - సురేఖా వాణి - విద్య - అన్నపూర్ణ - ఎల్బీ శ్రీరామ్ - ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
సంగీతం: తమన్
మాటలు: రత్నం
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
నిర్మాత: అల్లు అరవింద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను

అల్లు అర్జున్ కొంచెం క్లాస్. బోయపాటి శ్రీను ఊర మాస్. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే కొంచెం ఆశ్చర్యపోయారు జనాలు. మాస్.. ఊర మాస్.. అంటూ టీజర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు బన్నీ-బోయపాటి. మాస్ ప్రేక్షకులకు ట్రీట్ లాగా కనిపించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గణ (అల్లు అర్జున్) ఎప్పుడూ గొడవలతో సావాసం చేసే రకం. ఆర్మీ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి వచ్చేసిన గణ.. తనను కొడుకులాగా చూసుకునే లాయర్ బాబాయి (శ్రీకాంత్)కి సంబంధించిన కేసుల్ని తనదైన శైలిలో డీల్ చేసి పరిష్కరిస్తుంటాడు. మరోవైపు సీఎం కొడుకైన వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) మాఫియా తరహాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు. అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఐతే తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిల కారణంగా అనుకోని విధంగా గణ.. ధనుష్ ను ఢీకొట్టాల్సి వస్తుంది. గణ కారణంగా ధనుష్ అహం దెబ్బ తిని.. అతను పగతో రగిలిపోతాడు. పగ తీర్చుకోవడానికి ధనుష్ ఏం చేశాడు.. గణ అతడిని ఎలా ఎదుర్కొని విజయం సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

బోయపాటి సినిమాలన్నింటినీ పరిశీలిస్తే అతడి కథలన్నీ దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. అత్యంత దుర్మార్గుడైన ఓ విలన్.. అడ్డు అదుపు లేకుండా అరాచకాలకు పాల్పడుతుంటాడు. అతడి ధాటికి జనం అల్లాడిపోతుంటారు.. తమను రక్షించేవాడి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. అప్పుడు వీరత్వానికి మరోపేరైన హీరో రంగంలోకి దిగుతాడు. విలన్ని గట్టి దెబ్బ తీస్తాడు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతుంది. చివరికి విలన్ మీద హీరో పైచేయి సాధిస్తాడు. ఈ సన్నటి లైన్ చుట్టూనే అతడి కథలన్నీ సాగుతుంటాయి.

‘సరైనోడు’ కూడా దాదాపుగా అదే ఫార్మాట్లో సాగేదే. ఏమాత్రం కొత్తదనం లేని.. విషయం లేని కథ ‘సరైనోడు’కు పెద్ద మైనస్. కాకపోతే ఎప్పట్లాగే హీరో-విలన్ పాత్రల్ని బలంగా తీర్చిదిద్దుకోవడం.. ఇద్దరి మధ్య పోరును ఆసక్తికరంగా నడిపించడం.. తన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలకు లోటు లేకుండా చూసుకోడం.. అల్లు అర్జున్-ఆదిల స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలాంటి సానుకూలతలు సినిమాను చాలా వరకు నిలబెట్టాయి. మాస్ ను ఉర్రూతలూగించే సినిమా అవుతుందన్న అంచనాల్ని అందుకోవడంలో ‘సరైనోడు’ సక్సెస్ అయింది. ఇది పక్కా బోయపాటి మార్కు సినిమా. అతను ఇప్పటిదాకా బాలయ్యతో తీసిన కథల్లోనే బన్నీని రీప్లేస్ చేశాడంతే. అల్లు అర్జున్ అందులో బాగానే ఒదిగిపోయినప్పటికీ.. బన్నీ సినిమాల నుంచి సహజంగా ఆశించే రొమాన్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. ఎంటర్టైన్మెంట్.. డోస్ సరిగా పడకపోవడంతో ‘సరైనోడు’ వీక్ గా అనిపిస్తుంది.

విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా పండుతుందంటూ ఆది క్యారెక్టర్ గురించి బోయపాటి చాలా చెప్పాడు కానీ.. నిజంగా ఆ పాత్ర ఆ మాటలకు తగ్గట్లుగా లేదు. ఆది ఆ పాత్రకు సూటయ్యాడు.. బాగానే పెర్ఫామ్ చేశాడు కానీ.. ఆ క్యారెక్టర్ని బోయపాటి బలంగా తీర్చిదిద్దలేకపోయాడు. హీరోయిజం ఏకపక్షంగా సాగిపోవడం.. హీరో-విలన్ ఎదురుపడ్డానికి చాలా సమయం పట్టడంతో ప్రేక్షకులు నీరసించి పోతారు. ముందు నుంచి ఇద్దరికీ నేరుగా వైరం పెట్టి.. ఎత్తులు పై ఎత్తులతో కథనాన్ని నడిపించి ఉంటే వ్యవహారం వేరుగా ఉండేది. వీళ్లిద్దరూ తొలిసారి ఎదురు పడ్డ కాసేపటికే నేరుగా క్లైమాక్స్ వచ్చేస్తుంది. 2 గంటల 40 నిమిషాల నిడివిలో హీరో-విలన్ మధ్య డైరెక్ట్ వార్ చూడ్డానికి ప్రేక్షకులు 2 గంటలు ఎదురు చూడాల్సి రావడం చిత్రం.

హీరోయిజం పండించే విషయంలో బోయపాటి తన ముద్రను మరోసారి చూపించినప్పటికీ.. బన్నీ సినిమా నుంచి ఆశించే రొమాన్స్.. ఎంటర్టైన్మెంట్ కోసం అతను చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కేథరిన్ థ్రెసాను కొంచెం వెరైటీగా ఎమ్మెల్యే పాత్రలో చూపించి.. తనకు బన్నీకి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఒకటి నడిపించాడు కానీ.. అది అంతగా ఆకట్టుకోదు. తమిళ అమ్మాయి విద్యతో చేయించిన సాంబార్ కామెడీ పర్వాలేదు. బ్రహ్మానందం రెండు మూడు సన్నివేశాల్లో కొన్ని పంచ్ లు పేల్చాడు.

పాత్రల పరిచయం.. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్.. కాస్త కామెడీ కలగలిపి అలా అలా ప్రథమార్ధాన్ని నడిపించేసిన బోయపాటి.. ఎప్పట్లాగే భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం ‘లెజెండ్’ సినిమాను తలపిస్తుంది. బోయపాటిలోని అసలైన దర్శకుడు నిద్ర లేచేది అక్కడే. ద్వితీయార్ధంలో  హీరో- విలన్ తొలిసారి ఎదురుపడే సీన్ పేలింది. కానీ అంతకుముందు వచ్చే సన్నివేశాలు మాత్రం సాగతీతలా అనిపిస్తాయి. సినిమాలో కనీసం 20 నిమిషాలైనా కోత పెట్టాల్సింది. విషయం లేని కథతో ఇంత పెద్ద సినిమా తీయడం సాహసమే. క్లైమాక్స్ అనుకున్న స్థాయిలో లేదు. ‘రేసుగుర్రం’ స్టయిల్లో సినిమాను ముగించాలని పెట్టిన సీన్ సిల్లీగా అనిపిస్తుంది.

సినిమాలో చాలా సన్నివేశాలు.. చివరికి క్లైమాక్స్ కూడా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. అంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించే విలన్.. తనను దెబ్బ కొట్టిన వాడు ఎవడో తెలుసుకోకపోవడం.. హీరోయిన్ అతడి నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ వచ్చేయడం.. లాజికల్ గా అనిపించవు. డీజీపీని అతడి ఆఫీస్ లోనే కాల్చేయడం.. విలన్ తన అరాచకాల్ని సాగించే తీరు కూడా అతిగా అనిపిస్తాయి. ఐతే బోయపాటి సినిమాల్లో ఇలాంటి ‘అతి’ సహజం అని సరిపెట్టుకోవాలి. యాక్షన్ ప్రియులకు.. మాస్ ప్రేక్షకులకు ‘సరైనోడు’ సరైన సినిమాగా అనిపించినా.. కథలో కొత్తదనం లేకపోవడం.. బన్నీ నుంచి ఆశించే క్లాస్ ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ లు.

నటీనటులు:

‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అల్లు అర్జున్ ను చూసి.. ‘సరైనోడు’లో అతణ్ని చూస్తే షాకవడం ఖాయం. అతను మాస్ పాత్రలోకి ఈజీగానే ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. పాత్రకు తగ్గట్లే బలంగా తయారై.. తన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని.. తొలిసారి తనను తాను పూర్తి స్థాయి మాస్ హీరోగా ఆవిష్కరించుకున్నాడు బన్నీ. యాటిట్యూడ్ చూపించే సన్నివేశాల్లో అతడి నటన బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చాలా బాగా చేశాడు. ఇక డ్యాన్సులు.. ఫైట్లలోనూ ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. బన్నీకి దీటుగా విలన్ పాత్రలో అదరగొట్టాడు ఆది పినిశెట్టి. సినిమా చూశాక బన్నీ కంటే కూడా ఆది పాత్రే ఎక్కువ గుర్తుంటుందంటే అతిశయోక్తి కాదు. అంత బాగా వైరం ధనుష్ పాత్రలో ఒదిగిపోయాడతను. హీరోయిన్లు రకుల్.. కేథరిన్.. పాటలకు ఉపయోగపడ్డారు. వారి పాత్రల్ని సరిగా తీర్చిదిద్దలేదు. శ్రీకాంత్ పాత్ర పర్వాలేదు. అతడి నటనా బాగుంది కానీ.. ఇది అతను చేయాల్సినంత ప్రత్యేకమైన పాత్రయితే కాదు. హీరో తండ్రిగా తమిళ నటుడు జయప్రకాష్ బాగా చేశాడు. బ్రహ్మానందం ఓ మోస్తరుగా నవ్వించాడు. కమెడియన్ విద్య అరవ కామెడీతో బాగానే ఎంటర్టైన్ చేసింది. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘సరైనోడు’కు సాంకేతిక విభాగాలన్నీ దన్నుగా నిలిచాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మాస్ సీన్స్ ఎలివేట్ కావడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటల్లో ‘తెలుసా.. తెలుసా’ వినసొంపుగా ఉంది. మిగతావి మాస్ ప్రేక్షకుల్ని అలరించే మామూలు పాటలే. బ్లాక్ బస్టర్ పాట రాంగ్ టైమింగ్ లో రావడంతో అనుకున్న స్థాయిలో పేలలేదు. రిషి పంజాబి ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్లస్ అయింది. యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా యాక్షన్ సీన్స్ తీర్చిదిద్దారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలైట్.

బోయపాటి శ్రీను ఆస్థాన రచయిత రత్నం.. దర్శకుడి టేస్టుకు తగ్గట్లే మాటలు రాశాడు. ‘‘న్యాయం నాలుగు కాళ్ల మీద నడవాలి.. అన్యాయానికి అసలు కాళ్లే ఉండకూడదు’’ లాంటి డైలాగులు బాగా పేలాయి. ఐతే ఒక మూసలో సాగే కొన్ని డైలాగులు బోరింగ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువల విషయంలో అల్లు అరవింద్ ఎక్కడా రాజీ పడలేదు. ఆయన పెట్టిన ఖర్చు తెరమీద కనిపిస్తుంది. ఇక దర్శకుడు బోయపాటి తన నుంచి జనాలు ఆశించే సినిమానే అందించాడు. తనకు అలవాటైన ఫార్మాట్లోనే.. తన పరిమితుల్లోనే సినిమా తీశాడు. హీరో-విలన్ క్యారెక్టరైజేషన్లు.. వీళ్ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో బోయపాటి ముద్ర కనిపిస్తుంది. మాస్ జనాలు విజిల్స్ కొట్టేలా సన్నివేశాలు తీర్చిదిద్దాడు. ఐతే కథ పరంగా బోయపాటి నిరాశ పరిచాడు. సింహా దగ్గర్నుంచి వరుసగా మూడో సినిమాలోనూ ఒకే కథను చూపించాడు.

చివరగా: మాస్ కు మాత్రమే ‘సరైనోడు’

రేటింగ్- 2.75/5

Shreya Ghosal Sung Silakaloori Sinthaamani Block Buster Sarrainodu MP3 Song Download




Sarrainodu (2016) Telugu Mp3 Songs Free Download on MaTelugu.Com
Cast & Crew : Allu Arjun,Rakul Preet Singh,Catherine Tresa
Director : Boyapati Srinu
Music Director : SS Thaman
CD’s & Cassettes On : Lahari Music

Sarrainodu Songs Download link http://matelugu.com/site_alluarjun_sarainodu_mp3_songs_download.xhtml


watch video song Click Here 

 

 Lahari Music presents Blockbuster Lyrical video song from latest Telugu movie Sarrainodu starring Allu Arjun, Rakul Preet, Srikanth, Aadhi Pinisetti. Music by SS Thaman Directed By Boyapati Sreenu & Produced By Allu Aravind.

Allu Arjun Dialogues in Sarrainodu Movie Theatrical Trailer


ఇప్పటివరకు అల్లు అర్జున్  సరైనోడు టిజర్ లో ఒకే ఒక్క డైలాగ్
మాస్ ... ఊర మాస్ అంటూ అభిమానులను అలరించిన బన్నీ

ఏప్రిల్ 8న రాబోయే ధియేటర్ ట్రైలర్ లో ఫుల్ మాస్ డైలాగ్స్ తో ఒక ఊపు ఊపబోతున్నాడు.

ట్రైలర్లో డైలాగ్స్ మీకోసం మీ రియల్ ఫ్రెండ్ ప్రత్యేకంగా ...

Yerratholu Kada Style Ga Vuntadu Anukuntunnavemo Maassss Vura Massss... Teaser Dialogue

Bunny Sarrainodu Theatrical Trailer Dialogues :

* All india Butula Compitation pedite 1st rank naade

* Nenu cheruvulo musali lanti vadini okkasari nadi anukunte yenugu vachina vidichi pettanu aa devudu vachina vadili pettanu

* Any time any where any body nen Ready..

Download Theatrical Trailer & MP3 Songs on MaTelugu.Com


అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోకి ఫేస్ బుక్ లో లైక్ ల వర్షం






ఫేస్ బుక్ లో సంచలనాలు సృష్టించాలంటే అది స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాతే. ఇప్పటికే 1 కోటి మంది అభిమానులను సంపాదించిన బన్నీ.. అసలు ఇక్కడ ఏదైనా పోస్టు చేస్తే చాలు.. వెంటనే అందరూ లైకులతో ముంచేస్తున్నారు.

తను.. తన భార్య స్నేహ.. కొడుకు అయాన్ కు ఒకేసారి ముద్దిస్తున్న ఫోటోను ఒకటి బుధవారం రాత్రి అప్ లోడ్ చేశాడు. ఇలా సదరు ఫోటోను పోస్టు చేశాడో లేదో.. అరగంటలో 50 వేల మంది.. గంట పూర్తయ్యే లోపే లక్షన్నర మంది లైక్ చేశారు. అసలు బన్నీ ఒక ఫోటో పెట్టగానే ఇంత ఫాస్టుగా లైకులు పడుతున్నాయి అంటే మనం అర్ధంచేసుకోవచ్చు.. బన్నీ క్రేజు ఏ రేంజులో ఉందో. ఇంతకీ ఆ ఫోటో ఎక్కడ దిగారనే డౌటుందా మీకు? శ్రీజ పెళ్ళి కదండీ.. పెళ్ళికి ముందు అనేక ఫంక్షన్లు చేస్తున్నారు. గత రాత్రి జరిగిన అలాంటి ఒక ఫంక్షన్ లో ఈ ఫోటో దిగారు మనోళ్ళు.

అయితే అన్ని ఫోటోలకూ ఇలా వస్తాయని అనుకోవడానికి లేదు. కేవలం బన్నీ కొడుకు అండ్ వైఫ్ ఉన్న కిస్సింగ్ ఫోటోకు మాత్రమే ఇంత క్రేజీగా లైకులు వచ్చాయని చెప్పొచ్చు. ఓ మూడు రోజుల ముందు తమన్ తో కలసి బ్యాగ్రౌండ్ స్కోర్ సెషన్ లో కూర్చున్న బన్నీ.. ఆ ఫోటోను షేర్ చేశాడు. షేర్ చేసి మూడు రోజులైనా కూడా కేవలం 77 వేల లైకులు మాత్రమే వచ్చాయి. అది సంగతి.


సరైనోడు ఆడియో ఫంక్షన్ లేదంట



అవును. మీరు విన్నది కరక్టే. అస్సలు ఆడియో ఫంక్షనే వద్దనుకుంటున్నాడు సర్రయినోడు. మరి మొన్నటివరకు ఇప్పుడూ అప్పుడూ అంటూ తెగ ఊరించేశారు కాని.. ఇప్పుడు మాత్రం ఆడియో వద్దని అనుకుంటున్నారట. రీజన్ ఏంటో తెలియదు కాని.. డైరెక్టుగా మార్కెట్టులో సిడి కొనుక్కొని తమన్ సాంగ్స్ వినుకోమని సర్రైనోడు టీమ్ చెబుతోంది.

ఏప్రియల్ 1 నుండి సరైనోడు పాటలను డైరెక్టుగా మార్కెట్టులోకి రిలీజ్ చేస్తున్నారట. ఒక ప్రక్కన సినిమా టీమ్ అంతా ప్యాచ్ వర్క్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్లుగా బిజీగా ఉన్నందునేమో.. మనోళ్ళు ఇప్పుడు ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసేశారు. ఈ ఫంక్షన్ జరుపకుండా.. ఏప్రియల్ 22న సినిమా రిలీజవ్వడానికి ఒక వారం ముందు మాత్రం వైజాగ్ లో అభిమానుల సమక్షంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారట. అది సంగతి.

అయితే ఆడియో ఫంక్షన్ లేదు ఓకె.. మరి ధియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? మిగిలిన వీడియో టీజర్లు ఎప్పుడు చూపిస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి బాస్.

Allu Arjun Sarrainodu Team on South Africa For 2 Songs Shooting



పాటల కోసం ఫారిన్ వెళ్లడం అన్నది చాలా చిన్న విషయం అయిపోయింది ఈ రోజుల్లో. ఆ ఫారిన్ లోనూ ఇంతకుముందెన్నడూ చూడని ఎగ్జోటిక్ లొకేషన్లు చూపించి థ్రిల్ చేస్తే తప్ప జనాలకు ఆనట్లేదు. అందుకే నిర్మాతలు సైతం ఎంత ఖర్చయినా పర్లేదని.. ప్రేక్షకులకు ఆ అనుభూతి పంచడానికి రెడీ అవుతున్నారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సైతం తన కొత్త సినిమా ‘సరైనోడు’ కోసం దక్షిణాఫ్రికాలోని నెవర్ బిఫోర్ సీన్ లొకేషన్లకు యూనిట్ సభ్యుల్ని పంపించాడు. స్టన్నింగ్ లొకేషన్లు ఉన్న బొలీవియాలో ‘సరైనోడు’లోని రెండు పాటలు చిత్రీకరించాలని నిర్ణయించుకున్న బోయపాటి శ్రీను.. హీరో హీరోయిన్లు అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు ఓ పదిహేను మంది యూనిట్ సభ్యుల్ని తీసుకుని బొలివియా వెళ్లాడు.

హైదరాబాద్ నుంచి బొలీవియా చేరుకోవడానికి 50 గంటల పాటు ఫ్లైట్ లో ప్రయాణించాల్సి రావడం విశేషం. అక్కడికి చేరాక మళ్లీ అనుకున్న లొకేషన్ చేరడానికి బస్సు వెహికల్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో భాగంగా కెమెరాకు దొరికిపోయింది ‘సరైనోడు’ టీమ్. బన్నీ ఒక్కడు తల వంచుకుని ఏదో పనిలో బిజీగా ఉంటే.. మిగతా వాళ్లందరూ ఈ ఫొటోకు పోజిచ్చారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు లొకేషన్ కు వెళ్లాక మరిన్ని ఫొటోలు షేర్ చేస్తానని చెప్పింది రకుల్. కాబట్టి మరిన్ని పిక్స్ చూడ్డానికి అభిమానులు రెడీగా ఉండాలన్న మాట.

Sarainodu Movie Teaser బన్నీ సరైనోడు టీజార్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు టీజర్ వచ్చేసింది. తొలిసారిగా ఆన్ లైన్ లోనే కాకుండా.. వెయ్యికి పైగా థియేటర్లలోనూ టీజర్ రిలీజ్ చేస్తూ కొత్త  సంప్రదాయానికి తెర తీసిన అల్లు అర్జున్... తాను పక్కా మాస్ అంటున్నాడు. టీజర్ ప్రారంభం నుంచి చివరివరకూ ఎక్కడా మాస్ మార్క్ తగ్గకుండా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. 

తన మార్క్ కు ఏ మాత్రం తగ్గకుండా.. అల్లు అర్జున్ స్టైల్ ని కొంచెం కూడా మిస్ చేయకుండా రూపొందించిన సరైనోడు టీజర్ లో ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటోంది. ఒక్క సీన్ లో పాట లుక్ తప్ప.. మిగత అంతా ఫైట్ సీన్స్ ని అందులో హై ఎండ్ యాక్షన్ సీన్స్ మాత్రమే మిక్స్ చేసి టీజర్ ని రూపొందించారు. టీజర్ మొత్తానికి 'ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడని అనుకుంటున్నావే.. మాస్ ఊర మాస్' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ హైలైట్. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరీ ఫుల్లుగా ఆకట్టుకుంటుంది. చాలాకాలంగా సరైన మాస్ సినిమా లేక ఆకలి మీద ఉన్న మెగా ఫ్యాన్స్ ని సరైనోడు టీజర్ ఉర్రూతలుగించడం ఖాయం. 

బన్నీతో రొమాంటిక్ మూవీ తీస్తున్నానని చెప్పిన బోయపాటి.. టేకింగ్ లో మాత్రం యాక్షన్ ని ఏ మాత్రం మిస్ చేయలేదనే విషయం టీజర్ ని చూస్తే అర్ధమైపోతోంది. ఇక టీజర్ లోనే ఈ రేంజ్ యాక్షన్ ఉంటే.. ట్రైలర్ లో ఎంత ఉండాలి... సినిమాలో ఇంకెంత ఉండాలి అనిపించడం ఖాయం. 



Bunny Sarainodu First Look Posters and Teaser Download – Allu Arjun

Allu Arjun new movie titled as Sarainodu. This film first look released just now and this poster looks very mass we can see bunny in mass role. This  is an upcoming Telugu film which is  written and directed by director Boyapati Srinu and this movie was  produced by Bunny father Allu Aravind under the banner Geetha Arts. This movie cast are Allu Arjun, Rakul Preet Singh, Rahul Verma and Catherine Tresa in the main  leading roles while Actor Srikanth appears in crucial supporting role in this movie as well as actress Anjali is doing an item number. Music director S.s.Thaman composes music for this film. Rishi Punjabi is the cinematographer of this movie.This movie  is planned for a worldwide release on 08 April 2016. And this movie another poster were planning to release on 26th January on the occasion of republic day.



అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 26న ఫస్ట్ లుక్ వదలటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ..ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. ఆ పోసట్ర్ ఇప్పుడు అభిమానులను విపరీతంగ ఆకట్టుకుంటోంది. మీరు ఓ ప్రీలుక్ పై ఓ లుక్కేయండి మరి.
My Second film with our stylish star dear brother 's here we go guys
- Thaman Shivakumar (@MusicThaman) January 22, 2016
అల్లు అర్జున్ తో తమన్ చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇంతకుముందు రేసుగుర్రం చిత్రానికి ఇద్దరూ పనిచేసారు. అలాగే ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016 న విడుదల చేయటానికి తేదీ ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ లేదు.
ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికి... కార్యరూపం దాల్చటానికి టైమ్ పట్టింది.. తొలిసారి బన్నీ, బోయపాటి కాంబినేషన్ ఫ్యాన్స్ కి కిక్కివ్వబోతోంది... ఫస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో వస్తున్నఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.... ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైమ్ జతకట్టింది... గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.
అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.
అలాగే ఈ చిత్రంలో చబ్బీ బ్యూటీ అంజలి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సరైనోడు చిత్రంలో ఆమె నటించనుందని సమాచారం. ఈ సినిమాలో ఆమెది ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ కాకపోయినా ఆమె స్పెషల్ అప్పీరియన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే పాత్ర అని చెప్తున్నారు. ఓ సీన్, స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు.

టాలీవుడ్ మోస్ట్ లక్కీయెస్ట్ డాళ్ రకుల్ ప్రీత్ సింగ్




ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ మోస్ట్ లక్కీయెస్ట్ డాళ్ అనాల్సిందే. వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేయడమే పెద్ద విషయం అయితే.. ఈ భామ ఒకేసారి టాప్ స్టార్లతో ఛాన్సులు పట్టేసింది. రవితేజ పక్కన కిక్2 - రామ్ చరణ్ పక్కన బ్రూస్ లీ - ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో - అల్లు అర్జున్ తో సరైనోడు.. ఈమె రీసెంట్ రిలీజ్ లతో పాటు.. క్యూలో ఉన్న సినిమాల లిస్ట్ ఇది.

నాన్నకు ప్రేమతో మూవీలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని కొత్త ప్రయోగం చేసింది. ఇందు కోసం తెలుగు మాడ్యులేషన్ తోపాటు అన్ని పదాలకు అర్ధం తెలుసుకుని మాట్లాడ్డం నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. ఒక మూవీ కోసం ఇంతగా కష్టపడ్డంతో ఈమె అప్ గమింగ్ స్టార్ హీరోయిన్ కు అభినందనలు బాగానే వచ్చాయి. ఇదే ఓ ప్రయోగం అంటే.. ఇప్పుడు మేకప్ లేకుండా యాక్టింగ్ చేసేస్తూ మరో ఎటెంప్ట్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 

అల్లు అర్జున్ సరసన చేస్తున్న సరైనోడు మూవీలో రకుల్ చేస్తున్నది ఈ మారుమూల గ్రామానికి చెందిన యువతి పాత్ర. చాలా తక్కువగా మాట్లాడుతూ.. భావోద్వేగాల ఆధారంగా నడిచే రోల్ ఇది. ఈ కేరక్టర్ కోసం మేకప్ లేకుండా నటిస్తోంది రకుల్. గ్లామరస్ రోల్స్ తర్వాత.. వెంటనే వితౌట్ మేకప్ నటించడమంటే రకుల్ ధైర్యాన్ని పొగడాల్సిందే. ఇక నెక్ట్స్ నితిన్ తో ఓ సినిమా చేస్తున్నానంటూ చెప్పి.. తన స్టార్ లీగ్ ని కంటిన్యూ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 

Chennai Live Updates : Chennai declared disaster zone, airport to remain shut till December 6

LATEST Chennai NEWS :

Private companies to remain shut for next 2 days
Train Services Cancelled from Chennai Egmore/Chennai Central
Schools & colleges remain closed tomorrow
Chennai rains - BSNL offers free service for next one week
Chennai reservoirs storage level as on 2.12.2015
Gold rate decreased Rs.24 per sovereign
Chennai floods: Hindu Chennai edition not published today
Chennai floods: Airtel announces free calls

Chennai Helpline Numbers

chennai_help_m

కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడుకు జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే.. ఒక్క చెన్నై మహానగరానికి జరిగిన నస్టం మరో ఎత్తు. భారీగా కురిసిన వర్షాలతో వరద నీరు రోడ్ల మీదకు పోటెత్తటంతో వీధులన్నీ వాగులుగా మారిపోయాయి. అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేని ప్రాంతాలెన్నో.

టీవీ ఛానళ్లలో చూపించే ప్రాంతాలన్నీ అందరూ వెళ్లగలిగిన ప్రాంతాలు మాత్రమే. ఎవరూ వెళ్లలేకపోతున్న ప్రాంతాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. భారీగా నీళ్లు నిలిచిపోవటంతో.. వరద పోటెత్తిన ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలీక మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అసలు నష్టం ప్రపంచానికి ఇంకా తెలీని పరిస్థితి. దీనికి తోడు.. రెండు రోజులుగా చెన్నై మహానగరంలోని 60 శాతం విద్యుత్తు సౌకర్యం లేదు. గత 24 గంటలుగా దాదాపుగా 90 శాతానికి పైనే విద్యుత్తు సరఫరా కాని పరిస్థితి.

మరి అంధకారంలో నగరం ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే.. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలంటే.. కనీసం వరద నీరు తగ్గుముఖం పట్టాలి. ఇదంతా జరగాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుందని చెబుతున్నారు. రాత్రిళ్లు సైతం పట్టపగలు మాదిరి వెలిగిపోయే చెన్నపురి నిండా ఇప్పుడు చీకట్లు నిండుకున్నాయి. ఇక.. బహుళ అంతస్తుల్లో నివసించే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. లిఫ్ట్ లు ఆగిపోవటం.. మోటార్లు పని చేయకపోటంతో గుక్కెడు నీటి కోసం వారు తపించి పోతున్నారు. కంటి ముందు నీరు కనిపిస్తున్నా.. కనీస అవసరాలకు కావాల్సిన నీటి కోసం కటకటలాడుతున్న దౌన్యం చెన్నైవాసులది.

Here are the live updates:

1. Chennai has been declared disaster zone. Army has been deployed. Army Helpline 9840295100 is now open.

2. National Disaster Response Force to rush about 600 personnel. DMK had earlier urged Centre to declare Chennai flood national disaster.

3. The Army, Navy and Air Force have launched a massive rescue and relief operation in what is being described the securitymen as a war-like situation. Three C-130s of the Indian Air Force (IAF) have flown from the Hindon air base in Ghaziabd to Tirupati along with NDRF personnel and relief material.

4. MeT department says heavy downpour to continue for next 7 days.

5. Air Force and Army choppers have also been pressed into the relief and rescue mission. Several people stranded in waterlogged areas have been rescued during regular sorties conducted by the Air Force and Army helicopters. Food packets, ration and other items of daily needs have been air dropped the worst-hit areas.

6. INS Airawat has sailed out from Vizag with HADR assistance teams and equipment to Chennai. It is expected to reach Chennai coast tonight or tomorrow early morning. Gemini boats, specialised teams and fry ration have been sent from Vizag to Chennai.

7. Also, next 24 hours are very crucial.Prime Minister Narendra Modi meets senior ministers to take stock of the situation. The Centre has released an immediate relief fund of Rs 509 crore for Tamil Nadu. Home Minister Rajnath Singh has also called a separate high level meeting to discuss and monitor the situation.

8. Despite suffering from consequences of flood situation themselves, army mobilized four columns equipped with assault boats and out board motors in response to communication from the civil authorities about the crisis situation. These columns are presently carrying out relief work in Mudichur, Guduvancherry, Tambaram and Manipakkam areas.

9. NDRF has sent 12 more teams to Chennai and other affected areas taking the total number of rescue teams to 24.

10. The weather office in Chennai has predicted more rains in Tamil Nadu over the next 24 hours due to presence of a low pressure in Bay of Bengal. Cuddalore, Coimbatore, Nilgiris districts may witness very heavy rainfall.

11. Heavy showers continued to lash Puducherry today leaving localities under water and hitting normal life. People in low-lying areas are being moved to safety even lakes and other water bodies over flow.

12. Assocham says financial loss due to Tamil Nadu Rains could be around Rs 15,000 crore.

13. The Navy has deployed three flood relief teams so far. Navy has also launched a helpline: 044-25394240

14. Telugu actor Allu Arjuna donates Rs 25 lakhs as relief funds to Chennai flood.

మొత్తం ఇప్పటివరకు డొనేషన్లు అందజేసిన మన సెలబ్రిటీల వివరాలు చూస్తే:

అల్లు అర్జున్ - 25 లక్షలు
మహేష్ బాబు - 10 లక్షలు
ఎన్టీఆర్ - 10 లక్షలు
కళ్యాణ్ రామ్ - 5 లక్షలు
రవితేజ - 5 లక్షలు
వరుణ్ తేజ్ - 3 లక్షలు
సాయిధరమ్ తేజ్ - 3 లక్షలు
సంపూర్ణేష్ బాబు - 50 వేలు
సందీప్ కిషన్ - 5 వేల ఫుడ్ ప్యాకెట్లు

Allu Arjun New Movie " Sarainodu " Shooting Started

బన్నీ కొత్త సినిమా షూటింగ్ మొదలు

బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని బుధవారంనాడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం స్టార్ట్ చేసిన షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ఓ చేజింగ్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. బన్నీ మొదటి రోజు షూటింగ్ విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.

[caption id="attachment_485" align="aligncenter" width="960"]Sarainodu Allu Arjun first look sarainodu-allu-arjun-first-look[/caption]

Sarainodu Allu Arjun first look

తాత్కాలికంగా ఈ సినిమాకు " సరైనోడు " టైటిల్ ను అనుకుంటున్నారు. సీడెడ్ ప్రాంతానికి చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను NV ప్రసాద్ Rs.8.10 కోట్ల వరకు విక్రయించారు.గతంలో అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' కొనుగోలుదార్లు ఈ ప్రాంతంలో Rs.8.30 కోట్ల సేకరించారు.శ్రీకాంత్, ఆది 'Sarainodu' లో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ ఈ మాస్ ఎంటర్టైనర్ లో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.