బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని బుధవారంనాడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం స్టార్ట్ చేసిన షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ఓ చేజింగ్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. బన్నీ మొదటి రోజు షూటింగ్ విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
[caption id="attachment_485" align="aligncenter" width="960"]
Sarainodu Allu Arjun first look
తాత్కాలికంగా ఈ సినిమాకు " సరైనోడు " టైటిల్ ను అనుకుంటున్నారు. సీడెడ్ ప్రాంతానికి చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను NV ప్రసాద్ Rs.8.10 కోట్ల వరకు విక్రయించారు.గతంలో అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' కొనుగోలుదార్లు ఈ ప్రాంతంలో Rs.8.30 కోట్ల సేకరించారు.శ్రీకాంత్, ఆది 'Sarainodu' లో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ ఈ మాస్ ఎంటర్టైనర్ లో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.