Showing posts with label DJ. Show all posts
Showing posts with label DJ. Show all posts

అల్లు అర్జున్ మూవీ టైటిల్ DJ దువ్వాడ జగన్నాథమ్

Allu-Arjun Movie Title " DJ " Duvvada Jagannadham



మిరపకాయ్.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. లాంటి వెరైటీ టైటిళ్లతో సినిమాలు తీసి మెప్పించాడు హరీష్ శంకర్. అల్లు అర్జున్ తో తన కొత్త సినిమా టైటిల్ విషయంలోనూ తన చమత్కారం మరోసారి చూపించాడు హరీష్. ఈ చిత్రానికి 'దువ్వాడ జగన్నాథమ్' అనే టైటిల్ పెట్టడం విశేషం. దీన్నే 'డీజే' అని షార్ట్ చేసి ఆకర్షణీయమైన లోగో డిజైన్ చేసి వదిలింది హరీష్ శంకర్ అండ్ టీమ్. టైటిల్ లోగో చూడగానే సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా ఆయనకిది 25వ సినిమా కావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

'దువ్వాడ జగన్నాథమ్' షూటింగ్ సోమవారమే ఆరంభం కాబోతోంది. తనతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్న హరీష్ శంకర్ కు 'రామయ్యా వస్తావయ్యా' టైంలోనే కమిట్మెంట్ ఇచ్చాడు బన్నీ. ఐతే ఆ సినిమా తేడా కొట్టడంతో సీన్ మారిపోయింది. బన్నీ కోసం రాసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్'ను సాయిధరమ్ తో తీయాల్సి వచ్చింది. ఐతే ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాక హరీష్ కు బన్నీతో చేసే అవకాశం లభించింది. నాలుగు నెలల కిందటే వీళ్లిద్దరి కాంబినేషన్ ఓకే అయింది. తన కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం కావడంతో బాగా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేశాడు హరీష్. టైటిల్ తో జనాల్ని బాగానే ఆకర్షించిన హరీష్.. సినిమాతోనూ అలాగే మెప్పిస్తాడేమో చూద్దాం. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలాఖర్లో విడుదలవుతుంది.

Telangana Bonalu 2015 Exclusive Dj Songs Download

Telugu DJ Songs Download

[caption id="attachment_330" align="aligncenter" width="670"]DJ Durga MaTelugu.Com DJ Durga MaTelugu.Com[/caption]