Showing posts with label Nannaku Prematho. Show all posts
Showing posts with label Nannaku Prematho. Show all posts

ఎన్టీఆర్‌ సినిమాని విడిచిపెట్టని పైరసీ




యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ధైర్యం చేసి తన లేటెస్ట్ మూవీని సంక్రాంతి బరిలో నిలిపాడు. పొంగల్ పోటీ చాలా ఉన్నా నందమూరి అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా రిలీజ్ డేట్ ని అందుకోవడం కష్టసాధ్యమైనా.. అన్నిటినీ అధిగమించి నాన్నకు ప్రేమతో మూవీని చెప్పిన డేట్ కి రిలీజ్ చేశాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు బ్లాక్ బస్టర్ టాక్ ని కూడా అందుకోగలిగాడు. 

తొలిరోజు ఇండస్ట్రీ టాప్ 3 లోకి వసూళ్లు రాబట్టిన నాన్నకు ప్రేమతో తర్వాత కూడా అదే జోరు చూపించి ఇప్పటికే 20 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను క్రాస్ చేసేసింది. త్వరలోనే 50 కోట్ల మైలు రాయిని అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా అవతరించనుందనే అంచనాలు ఉన్నాయి. అయితే యూనిట్ పడ్డ ఇంత కష్టాన్ని బూడిదపాలు చేసేందుకు ఆస్ట్రేలియన్ పైరసీ ముఠా రంగంలోకి దిగింది. ఇప్పటికే నాన్నకు ప్రేమతో చిత్రం పైరసీ కాపీని విచ్చలివిడిగా అమ్మేస్తున్నారు. 

ఎన్టీఆర్ గత చిత్రాలతో కలిపి కొత్త మూవీ నాన్నకు ప్రేమతోను కలిపి డీవీడీలుగా చేసి అమ్మేస్తున్నారు. ఇది కలెక్షన్లపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో వారం రోజులైనా నిలకడగా వసూళ్లు రాబడితే మాత్రమే.. ఎన్టీఆర్ మూవీ అధికారికంగా హిట్ జాబితాలోకి చేరుతుంది. ఆస్ట్రేలియా నుంచి మొదలైన పైరసీ ప్రింటింగ్ ఇప్పుడు అనేక దేశాలతోపాటు మన దేశంలో కూడా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తుండడంతో.. ఎన్టీఆర్ మూవీ రికార్డులపై అభిమానులు బెంగ పెట్టుకున్నారు. 

టాలీవుడ్ మోస్ట్ లక్కీయెస్ట్ డాళ్ రకుల్ ప్రీత్ సింగ్




ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ మోస్ట్ లక్కీయెస్ట్ డాళ్ అనాల్సిందే. వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేయడమే పెద్ద విషయం అయితే.. ఈ భామ ఒకేసారి టాప్ స్టార్లతో ఛాన్సులు పట్టేసింది. రవితేజ పక్కన కిక్2 - రామ్ చరణ్ పక్కన బ్రూస్ లీ - ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో - అల్లు అర్జున్ తో సరైనోడు.. ఈమె రీసెంట్ రిలీజ్ లతో పాటు.. క్యూలో ఉన్న సినిమాల లిస్ట్ ఇది.

నాన్నకు ప్రేమతో మూవీలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని కొత్త ప్రయోగం చేసింది. ఇందు కోసం తెలుగు మాడ్యులేషన్ తోపాటు అన్ని పదాలకు అర్ధం తెలుసుకుని మాట్లాడ్డం నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. ఒక మూవీ కోసం ఇంతగా కష్టపడ్డంతో ఈమె అప్ గమింగ్ స్టార్ హీరోయిన్ కు అభినందనలు బాగానే వచ్చాయి. ఇదే ఓ ప్రయోగం అంటే.. ఇప్పుడు మేకప్ లేకుండా యాక్టింగ్ చేసేస్తూ మరో ఎటెంప్ట్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 

అల్లు అర్జున్ సరసన చేస్తున్న సరైనోడు మూవీలో రకుల్ చేస్తున్నది ఈ మారుమూల గ్రామానికి చెందిన యువతి పాత్ర. చాలా తక్కువగా మాట్లాడుతూ.. భావోద్వేగాల ఆధారంగా నడిచే రోల్ ఇది. ఈ కేరక్టర్ కోసం మేకప్ లేకుండా నటిస్తోంది రకుల్. గ్లామరస్ రోల్స్ తర్వాత.. వెంటనే వితౌట్ మేకప్ నటించడమంటే రకుల్ ధైర్యాన్ని పొగడాల్సిందే. ఇక నెక్ట్స్ నితిన్ తో ఓ సినిమా చేస్తున్నానంటూ చెప్పి.. తన స్టార్ లీగ్ ని కంటిన్యూ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 

Nannaku Prematho NTR Telugu Movie Review


సమీక్ష : నాన్నకు ప్రేమతో – ఎమోషనల్ రివెంజ్ డ్రామా.!

విడుదల తేదీ : 13 జనవరి 2016



రేటింగ్ : 3.5/5


దర్శకత్వం : సుకుమార్  
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్  
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్  
నటీనటులు : ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్..

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకోవడమే కాకుండా, 25 సినిమాలు చేసిన మెయిలు రాయిని కూడా చేరుకున్నాడు. ఎన్.టి.ఆర్ చేసిన 25వ సినిమానే ‘నాన్నకు ప్రేమతో’. వైవిధ్యభరిత కథలని, మోస్ట్ ఇంటెలిజెంట్ వేలో ప్రెజంట్ చేయడానికి ఇష్టపడే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్ని ఒక రివెంజ్ స్టొరీగా మార్చి చేసిన ఈ ‘నాన్నకు ప్రేమతో’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
మన హీరో అభిరామ్ (ఎన్.టి.ఆర్) ఒక లండన్ బేస్డ్ ఎన్ఆర్ఐ. తన ఇద్దరు అన్నయ్యలు, తండ్రి అయిన రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) లండన్ లో ఉంటారు. ఓసారి తను ఆఫీసు పనిమీద స్పెయిన్ లో ఉండగా అభిరామ్ తండ్రి రమేష్ చంద్ర ప్రసాద్ కి ఆరోగ్యం బాలేదని తెలియగానే ఉన్నపళంగా బయలుదేరి వస్తాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాజేంద్ర ప్రసాద్ ద్వారా తను ఆ పరిస్థితికి రావడానికి కారణమైన కృష్ణమూర్తి (జగపతిబాబు) గురించి తెలుసుకుంటాడు. అప్పుడే రమేష్ చంద్ర ప్రసాద్ తన పిల్లలని ఓ కోరిక కోరతాడు.
అలా తండ్రి కోరికను నెరవేర్చడానికి తిరిగి లండన్ బయలుదేరుతాడు అభిరామ్. అక్కడ కృష్ణమూర్తి గురించి తెలుసుకొని, తన కూతురు దివ్యాంక (రకుల్)ను ప్రేమలో పడేస్తాడు. దివ్యాంక ద్వారా ఎలా అభిరామ్ కృష్ణమూర్తిని రీచ్ అయ్యాడు. అలాగే కృష్ణమూర్తికి – అభిరామ్ కి మధ్య జరిగిన డిష్కషన్ ఏంటి.? వీరిద్దరూ ఒకరితో ఒకరు మొదలు పెట్టిన గేమ్ ఏంటి? ఆ గేమ్ లో గెలవడానికి ఎవరెవరు ఏం చేసారు? ఫైనల్ గా ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? ఈ గేమ్ గెలిచే ప్రక్రియలో అభిరామ్ ఏం కోల్పోయాడు? కృష్ణమూర్తి రమేష్ చంద్ర ప్రసాద్ కు చేసిన ద్రోహం ఏమిటి? తండ్రి కోరిన కోరికను అభిరామ్ తీర్చాడా లేదా? అన్నది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
మొదటి నుంచీ ఈ చిత్ర టీం గంటాపదంగా చెప్పిన ఒకే ఒక మాట ‘తండ్రి కోరికను తీర్చడం కోసం ఓ కొడుకు ఏం చేసాడు అనే ఎమోషనల్ జర్నీనే నాన్నకు ప్రేమతో’ అని అన్నారు. చెప్పినట్టుగానే సుకుమార్ ఇందులో చూపిన ఎమోషనల్ జర్నీనే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక గేమ్ ఎపిసోడ్ సూపర్బ్ గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ సీన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ప్రధానంగా ఆ సీన్స్ లో ఎన్.టి.ఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ మీ చేత కంటతడి పెట్టిస్తుంది. సుకుమార్ తను అనుకున్న తండ్రి – కొడుకుల ఎమోషన్ ని ఆన్ స్క్రీన్ ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
నటన పరంగా ప్రతి ఒక్కరూ అదిరిపోయే నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. అందులో ప్రధమంగా ఎన్.టి.ఆర్ – రాజేంద్ర ప్రసాద్ – జగపతి బాబుల అద్భుత నటన గురించే చెప్పుకోవాలి.. మొదటగా ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయ్యుంది ఇలాంటి ఓ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా అయ్యాక ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. మొదటగా ఎన్.టి.ఆర్ లుక్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఆన్ స్క్రీన్ ఎన్నారై పాత్రకి తగ్గట్టుగా లుక్ అండ్ స్టైలింగ్ మార్చేశాడు. ఎన్.టి.ఆర్ ఇంతకముందు అలా కనిపించలేదు, ఇక మీద కనిపిస్తాడని చెప్పలేం. ఇక నటన పరంగా ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టొరీతో ఆకట్టుకుంటే, విలన్ ని ఢీ కొట్టే సీన్స్ లో మెచ్యూరిటీ చూపడంలో, ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన హావ భావాలను పలికించాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ సినిమాకి కీలకమైన తండ్రి పాత్రలో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక పైకి కనిపించని నెగటివ్ షేడ్స్ ని చూపించడంలో, కళ్ళతోనే క్రూరత్వాన్ని ప్రకటించడంలో జగ్గుభాయ్ వావ్, ఏం చేసాడురా అనిపించుకున్నాడు. విలనిజంని చాలా క్లాస్ గా చూపినా, ఆడియన్స్ కి కావాల్సిన విలనిజంని చూపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
రకుల్ ప్రీత్ సింగ్ జస్ట్ గ్లామర్ అని కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పించింది. ఎన్నారై పాత్ర కావడంతో మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా, చాలా కష్టపడి తన పాత్రకి తను డబ్బింగ్ చెప్పుకొని తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక ఎన్.టి.ఆర్ కి సపోర్ట్ గా రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల తమ పాత్రలకి న్యాయం చేసారు. తాగుబోతు రమేష్, నవీన్ లు ఓకే అనిపించారు. నటుల విషయం పక్కన పెడితే సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆ ఆ తర్వాత కథలో వచ్చే లవ్ ట్రాక్, పాటలతో చాలా జాయ్ఫుల్ ఫీల్ ని కలిగిస్తూ, సడన్ గా మొదలయ్యే హీరో-విలన్ మైండ్ గేమ్ ని స్టార్ చేసే ఇంటర్వల్ బాంగ్ జబర్దస్త్ అనిపిస్తుంది. నాన్నకు ప్రేమతోకి మేజర్ హైలైట్స్ అని చెప్పాల్సి వస్తే.. హీరో – విలన్ మైండ్ గేమ్ మరియు తండ్రి – కొడుకుల ఎమోషనల్ జర్నీ.
మైనస్ పాయింట్స్ :
నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఎంచుకున్న సింపుల్ స్టొరీ లైన్ మొదటి మైనస్ గా చెప్పుకోవాలి. హుస్సేన్ షా కిరణ్ – సుకుమార్ లు కథలో చెప్పిన పాయింట్ ‘మోసపోయిన తండ్రి చివరి కోరిక తీర్చడమే కొడుకు లక్ష్యం’. దానివలన సినిమా అంతా అయిపోయి బాగున్నప్పటికీ స్టొరీ లైన్ మాత్రం చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా అనిపిస్తుంది. కథ ఇదే అని తెలిసిపోవడం వలన సినిమా ఇలానే ఉంటుంది అని ఆడియన్స్ ఆశిస్తారు. ప్రేక్షకులు అనుకున్న ఊహాల మాదిరిగానే కథనం జరగడం కూసింత బోర్ కొడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని ఎక్కువ సేపు నడపడం వలన, కథనంలో కొత్తగా చెప్పేది ఏమీ లేక, హీరోయిన్ ట్రాక్ ని ఎక్కువ పెట్టడం వలన బాగా సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి ఎక్కువ కలుగుతుంది. ఇలా కథ – కథనం – నెరేషన్ విషయాల్లో సుకుమార్ ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది.
సుకుమార్ ఎప్పటిలానే లాంగ్ రన్ టైం పెట్టి ప్రేక్షకులకు కాసేపు బోర్ కొట్టించాడు. చెప్పాలంటే ఈ సినిమాని 150 నిమిషాల్లో చెప్పాలి, కానీ సెకండాఫ్ ని ఎక్కువ డ్రాగ్ చేయడం వలన అది కాస్తా 168 నిమిషాలయ్యింది. దాని వలన ప్రీ క్లైమాక్స్ వరకూ సినిమా పెద్ద ఆసక్తికరంగా నడిపించలేదు. సూపర్ అనిపించే ఇంటర్వల్ బ్లాక్ తర్వాత సెకండాఫ్ చాలా బెటర్ గా ఆడియన్స్ ఆశిస్తారు. కానీ అంతలా సినిమా మాత్రం లేదు. ఇకపోతే సెకండాఫ్ లో పాటలు సినిమా వేగాన్ని మరింత చెడగొడతాయి. అలాగే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కోరుకునే కామెడీ, సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం మైనస్.
సాంకేతిక విభాగం :
నాన్నకు ప్రేమతో టీంకి నటీనటులు ఎంతలా కష్టపడి బెస్ట్ వర్క్ ఇచ్చారో అంతకు మించిన బెస్ట్ వర్క్ టెక్నికల్ టీం నుంచి కూడా లభించింది. దర్శకుడి ఊహాల్లోని విజువల్స్ ని తెరపైన ఒక ఫీల్ గుడ్ పెయింటింగ్ లా ఆవిష్కరించడంలో విజయ్ కె చక్రవర్తి పనితనం అదరహో అనేలా ఉంది. ఇక నటీనటులను ప్రెజంట్ చేసిన విధానం, లొకేషన్స్ ని చూపిన విధానం, ఎమోషనల్ సీన్స్ లో మూడ్ ఇన్వాల్వ్ మెంట్ ని కాప్చ్యూర్ చేసిన విధానం నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఇక అలాంటి విజువల్స్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ శ్రవణానందాన్ని అందించిది. దేవీశ్రీ పాటలు మంచి హిట్ అయ్యాయి కానీ ఆన్ స్క్రీన్ అన్ని పాటలు అంతలా బెటర్ గా పిక్చరైజ్ చేయలేదు. ఇక ఎమోషనల్ మరియు ఎలివేషన్ సీన్స్ లో తను అందించిన మ్యూజిక్ అదుర్స్. ఎస్. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. లండన్ లో వేసిన స్పెషల్ ఆఫీస్ సెట్ సందర్భాలకు సింక్ అయ్యేలా ఉంది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా భలే ఉంది అనిపిస్తే, సెకండాఫ్ ని మాత్రం బాగా సాగదీసాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చివరి ప్రీ క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ ని మాత్రం బాగా ఎడిట్ చేసి కనెక్ట్ చేసాడు.
ఇక కథలో సుకుమార్ తో పాటు హుస్సేన్ షా కిరణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. కథ పరంగా ఓకే ఎమోషనల్ కంటెంట్ తప్ప మిగతా అంతా రెగ్యులర్ రివెంజ్ డ్రామా లైన్ అవ్వడంతో ఉన్న ఎమోషనల్ సీన్స్ ని సూపర్బ్ గా రాసుకున్నారు. సుకుమార్ ఆ సీన్స్ తో కథనంలో మేజిక్ చేయాలని అనుకున్నాడు. కానీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కొంతభాగం సక్సెస్ అయినా కొంతభాగం సక్సెస్ కాలేదు. దానికి ప్రధాన కారణం నెరేషన్ ఊహాజనిత ఫార్మాట్ లో ఉండడం, అలాగే సెకండాఫ్ లో సాగదీయడం ఎక్కువ కావడం. సో కథ కథనంలో ఇంకాస్త బెటర్ మెంట్ ఉండాల్సింది. ఇక డైరెక్టర్ గా సుకుమార్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. తను రాసుకున్న కథలో ఉన్న పవర్ఫుల్ సీన్స్ ని చాలా బాగా తీసాడు. నటీనటుల నటన నుంచి తను అనుకున్న ఎమోషన్ ని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేసేంత వరకూ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం అద్భుతః అనేలా ఉన్నాయి. గ్రాండ్ విజువల్స్ అనేది సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్.
తీర్పు :
అందరూ ఊహించినట్టుగానే ఎన్.టి.ఆర్ నుంచి వచ్చిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల హృదయాలను హత్తుకొనే సినిమా. నాన్నకు ప్రేమతో సినిమాలో ఆకట్టుకునే లవ్ ట్రాక్ తో పాటు అందరూ వావ్ అనేలా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఒక ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ కి మిక్స్ చేసి చెప్పడం సినిమాకి హైలైట్. అలాగే వీటన్నిటికీ బోనస్ గా అల్ట్రా స్టైలిష్ ఎన్.టి.ఆర్ ని మీరు ఈ సినిమాలో చూడచ్చు. నాన్నకు ప్రేమతో సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించే సినిమా. ఎన్.టి.ఆర్, జగపతి బాబుల సూపర్బ్ పెర్ఫార్మన్స్, సుకుమార్ టేకింగ్, హీరో-విలన్ మైండ్ గేమ్, కంటతడి పెట్టించే ఎమోషన్స్ నాన్నకు ప్రేమతోలో ఆడియన్స్ ని కట్టి పడేసే అంశాలైతే.. సింపుల్ రివెంజ్ డ్రామాగా అనిపించే స్టొరీ లైన్, ఊహాజనితంగా కథనం చెప్పడం, సెకండాఫ్ సాగదీసినట్టు ఉండడం ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే అంశాలు. ఎన్.టి.అర్ అభిమానులు ఆశించే కొన్ని రెగ్యులర్ అంశాలు లేకపోయినా ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. తెలుగులో సెంటిమెంట్ ని మిక్స్ చేస్తూ వచ్చిన టాప్ క్లాస్ థ్రిల్లర్ ‘నాన్నకు ప్రేమతో’. చివరి మాటగా ‘నాన్నకు ప్రేమతో’ కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్స్ ఆడియన్స్ కి బాగా నచ్చే ఈ సినిమా బి, సి సెంటర్స్ వారికి అనుకున్న స్థాయిలో నచ్చకపోవచ్చు.
 రేటింగ్ : 3.5/5

Jr NTR in Nagarjuna Meelo Evaru Koteeswarudu Show

Nagarjuna invites Junior NTR to promote his film on MEK 3


Actor-turned-host Akkineni Nagarjuna has invited Junior NTR to promote his upcoming movie "Nannaku Prematho" on his hit reality TV show "Meelo Evaru Koteeswarudu 3" (MEK3).
Nagarjuna's "Soggade Chinni Nayana" (SCN) is set to release as a Sankranthi treat on 15 January, two days after "Nannaku Prematho" hits the screens. Many in the industry are speculating about the clash between the two movies and their collection at the box office. The actor-turned-TV host surprised everyone by inviting Junior NTR to promote his film on his reality TV show.Junior NTR recently visited the sets of "Meelo Evaru Koteeswarudu 3" and completed shooting for a special episode for the promotion of "Nannaku Prematho". This episode is expected to air on MAA TV's hit reality TV show over this weekend. The young Tiger will be seen in the hot seat opposite Nagarjuna, answering his questions.
The bosses of MAA TV have confirmed the news of Junior NTR's special episode on "Meelo Evaru Koteeswarudu 3". But they are yet to reveal the date of its telecast. On the official Twitter handle, they posted the promo of the episode and wrote: "#MeeloEvaruKoteeswarudu : #NTR on hotseat #NannakuPrematho Special ..Coming Very Soon .. Fri, Sat & Sun at 9 PM (sic)"
The promo of the special episode shows the trailer of "Nannaku Prematho" aired on the show. Host Nagarjuna is seen asking some questions about Junior NTR's stylish looks and other aspects featured in the theatrical trailer. The young Tiger is seen enjoying the quiz show with the host.
Social media is witnessing a huge fight and debate among fans of the Nandamuri and Akkineni families over the performances of "Nannaku Prematho", "Soggade Chinni Nayana" and "Dictator". Nagarjuna's courtesy has come as a surprise to all of them. Experts think his move will definitely put an end to the fans' fights and make them watch and encourage both films.
Here is the promo of Junior NTR's special episode, to be aired on Nagarjuna's reality TV show "Meelo Evaru Koteeswarudu 3".
Youtube Link Click Here To Watch

Nannaku Prematho Audio Release Date Confirmed – Jr NTR DSP Sukumar

Nannaku Prematho Audio Release Date Conformed. This movie is Coming from the Combination of Young Tiger NTR and Director Sukumar. This is the First Time Sukumar and NTR is joining hands for the movie. Naanaku Prematho Movie script is written by Sukumar himself and this is a family Love Drama which exactly Matches Young Tiger NTR Attitude. Tollywood top producer BVSN Prasad is Producing this movie from his own production house Sri Venkateshwara Cine Chitra. While the Shooting it is Conformed that this movie will be releasing in Pongal Race Along with Bala Krishna “Dictator” and Nagarjuna “S.C.N” movies in January Month 2016.

nannaku prematho songs

Recently The Teaser of Nanaku Prematho Movie released and Gone Viral in Tollywood and created a new record in Youtube as a Much-watched teaser in Telugu with less time period. In the teaser, Ntr was in Complete new Look and the Back Ground Score dance Steps were amazing now Fans of NTR are waiting for Audio Album of this movie. It’s Conformed that the Audio launch of this movie will be done in end of December month of 25th, and the songs in this movie are Composed by Devi Sri Prasad.

Movie Teaser

ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో...' టీజర్ విడుదల టైమ్

Nannaku Prematho Teaser

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో...'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వినాయిక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం టీజర్ ని దసరా సందర్భంగా రేపు అంటే అక్టోబర్ 21 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రేపు సాయింత్రం 6 గంటల 30 ని ముషాలకు ఈ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్ లో చిత్రం కథ గురించి పెద్దగా సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'ఆంధ్రావాలా'లో తొలిసారి రెండు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్‌. ఆ తరవాత 'అదుర్స్‌'లోనూ ఇద్దరిగా వినోదం పంచాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ప్రస్తుతం స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఓ పాత్ర కోసం గడ్డంతో,స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

JR-Ntr-new-pics-in-Nannaku-Prematho
Nannaku Prematho Teaser release date was announced. This Dussehra is going to give joy to all Nandamuri fans. The much awaited first look teaser of Jr NTR’S upcoming film Nannaku Prematho will be releasing on the eve of festival.

Tomarrow Nannaku Prematho teaser will be released, Makers are planning to release the teaser on 21 st exactly at 6.30 Pm. The movie’s first look was revealed on Ganesh Chaturdhi and it had received fans thumbs up. NTR appeared with stylish beard in blue outfit. As per reports the teaser will be less than a minute and JR NTR going to appear in most stylish avatar. Some said that Sukumar cuts the teaser in very innovative way to appeal all section of audience.

Nannaku Prematho Teaser is expected to take internet by storm once released as fans are eagerly waiting for it. The film is directed by Sukumar and Rajendra Prasad is doing Jr NTR’s dad’s role in the movie. Nannaku Prematho is NTR’S 25th film and Rakul Preet is playing female lead in the film.

We are the first to update the teaser of Nannaku Prematho once it released and stary glued to this space for having glimpse of NTR’S Nannaku Prematho First Look teaser.