ఆనందో బ్రహ్మ: రివ్యూ Anando Brahma Review



చిత్రం : ‘ఆనందో బ్రహ్మ’

నటీనటులు: తాప్సి - శ్రీనివాసరెడ్డి - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ - తాగుబోతు రమేష్ - రాజీవ్ కనకాల - రాజా రవీంద్ర - విజయ్ చందర్ - సుప్రీత్ - తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: కృష్ణకుమార్
ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి
రచన - దర్శకత్వం: మహి కె.రాఘవ్

తెలుగులోనే కథానాయికగా పరిచయమై.. ఇక్కడ వరుసగా గ్లామర్ పాత్రలు చేసిన తాప్సి.. కొన్నేళ్ల కిందట బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ ‘పింక్’ లాంటి సినిమాలతో గొప్ప పేరు సంపాదించింది తాప్సి. చాన్నాళ్లుగా తెలుగు తెరపై కనిపించని తాప్సి.. మళ్లీ ఇప్పుడు ‘ఆనందో బ్రహ్మ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పాఠశాల’ అనే ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన మహి కె.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. డిఫరెంట్ ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ హార్రర్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
హారర్ సినిమాలు అంటే కేవలం ప్రేక్ష‌కుల‌ను భ‌యానికి గురి చేసే కాన్సెప్ట్‌తోనే సాగుతాయి. దీనికి కాస్తా కామెడీని జోడించి హార‌ర్ కామెడీ జోన‌ర్ సినిమాలు టాలీవుడ్‌లో చాలానే వ‌చ్చాయి. చాలా వ‌ర‌కు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అలాంటి హారర్ కామెడీ జోన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో చిత్ర‌మే `ఆనందో బ్ర‌హ్మ‌`. సాధార‌ణంగా హార‌ర్ చిత్రాలైనా, హార‌ర్ కామెడి చిత్రాలైన దెయ్యాలే మ‌నుషుల‌ను భ‌య‌పెడుతూ ఉంటాయి. మ‌రి మ‌నుషులు దెయ్యాల‌ను భ‌య‌పెడితే అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. రివ‌ర్స ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడి చిత్రాల‌కు భిన్నంగా రివర్స్ ఫార్ములాలో వ‌చ్చిన సినిమా కావ‌డంతో పాటు, సినిమాలో తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్ వంటి మంచి క‌మెడియ‌న్స్ న‌టించ‌డం సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. మ‌రి సినిమా అంచ‌నాల‌ను ఏ మేర చేరుకుందో చూద్దాం.
క‌థః
రాజు(రాజీవ్ క‌న‌కాల‌) మ‌లేషియాలోని ఎన్నారై. అత‌ని త‌ల్లిదండ్రులు ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోకి తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ‌తారు. కానీ వ‌ర‌ద‌ల కార‌ణంగా వారి జాడ తెలియ‌కుండా పోతుంది. దాంతో త‌ల్లిదండ్రుల‌ను వెత‌క‌డానికి రాజు ఇండియా వ‌స్తాడు. ఎంత వెతికినా, త‌ల్లిదండ్రుల ఆచూకీ దొర‌క‌దు. దాంతో ఇండియా నుండి వెళ్లిపోవ‌డానికే నిర్ణ‌యించుకుంటాడు. అందుక‌ని హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిని ఎవ‌రికైనా అమ్మేయాల‌నుకుంటాడు. అయితే రాజు స్నేహితుడు(రాజా రవీంద‌ర్‌), యాద‌వ్‌(టార్జాన్‌)లు ఆ ఇంటిపై క‌న్నేసి, ఆ ప్లేస్‌లో ఓ కాంప్లెక్స్ కట్టాల‌నుకుంటారు. అందుకోసం ఆ స్థ‌లాన్ని త‌క్కువ ధ‌ర‌కే కొట్టేయాల‌నుకుంటారు. అందుకోసం ఆ ఇంటిలో దెయ్యాలున్న‌ట్లు ప్ర‌చారం చేస్తారు. రాజు అవ‌స్థ‌ను అర్థం చేసుకున్న ఓ యువ‌కుడు సిద్ధు(శ్రీనివాస‌రెడ్డి) ఆ ఇంట్లో నాలుగు రోజులు ఉండి వ‌స్తే, ఆ న‌మ్మ‌కాలు పోతాయ‌ని, త‌న‌కొక అవ‌కాశం ఇమ్మ‌ని అడుగుతాడు. రాజు కూడా స‌రేనంటాడు. సిద్ధుకు గుండె స‌మ‌స్య ఉంటుంది. ఆప‌రేష‌న్‌కు పాతిక ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని అన‌డంతో రిస్క్ అయినా దెయ్యాలున్న ఇంట్లో ఉండాల‌నుకుంటాడు. సిద్ధుతో పాటు డ‌బ్బు అవ‌స‌ర‌మైన సెక్యూరిటీ గార్డు(వెన్నెల‌కిషోర్‌), కొడుకు గుండె ఆప‌రేష‌న్ కోసం తంటాలు ప‌డే తాగుబోతు తుల‌సి(తాగుబోతు ర‌మేష్‌), న‌టుడు కావాల‌నుకుని మోస‌పోయిన బార్బ‌ర్(ష‌క‌ల‌క శంక‌ర్‌)లు కూడా జ‌త క‌లుస్తారు. అంద‌రూ ఇంట్లోకి వెళతారు? అప్పుడేం జ‌రుగుతుంది? అస‌లు స‌మ‌స్యేంటి? ఇంట్లో నిజంగానే దెయ్యాలుంటాయా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణః
హార‌ర్ కామెడి చిత్రాల‌కు భిన్నంగా ప్లాట్ పాయింట్‌ను ఎంచుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడు కాస్తా భిన్నంగా ఆలోచించాడు. అదే దెయ్యాల‌కు న‌వ్వంటే భ‌యం. దీంతో పాటు మ‌నుషుల్ని చూసి భ‌య‌ప‌డే దెయ్యాలు. ఈ రెండు పాయింట్స్‌ను బేస్ చేసుకుని స‌న్నివేశాల‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి. సీన్‌ను దెయ్యాల కోణంలో ఓపెన్ చేస్తాడు. కానీ ఎక్క‌డా దెయ్యాల‌ని చూపించ‌కుండా అవి దెయ్యాల‌ని చెప్పే తొలి సీన్ చాలా బావుంది. అక్క‌డ నుండి క‌థ ప్రారంభం అవుతుంది. ఓ న‌లుగురు ఎందుకు చ‌నిపోయాం, ఎవ‌రు చంపార‌నే విష‌యాలు తెలియ‌కుండా చనిపోయి ఆత్మ‌లుగా మారుతారు. దెయ్యాల‌ను సెకండ్ సీన్ నుండే చూపిచేస్తారు. అలాగే ఎక్క‌డా దెయ్యాలంటే జుగుప్స క‌లిగించేలా చూపించ‌లేదు. ఇక సినిమాలో కీల‌క పాత్ర‌ధారులు విష‌యానికి వ‌స్తే, గంగ త‌ర్వాత తాప్సీ చేసిన హార‌ర్ కామెడీ ఇది. గంగ చిత్రంతో పోల్చితే తాప్సీ పెర్ఫామెన్స్‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. గుండె స‌మ‌స్య ఉన్న వ్య‌క్తిగా స్వీయ‌ కామెడీ థెర‌ఫీ చేసుకునే వ్య‌క్తిగా శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న ఆక‌ట్టుకుంది. అలాగే తాగుబోతు ర‌మేష్ ష‌క‌ల‌క శంక‌ర్ పాత్రల కామెడి సెకండాఫ్‌లో ప్ర‌థ‌మార్థంలో అల్టిమేట్‌గా ఉంది. రేచీక‌టి, చెవిటివాడుగా ఉంటూ వెన్నెల‌కిషోర్ చేసే కామెడీ ఆక‌ట్టుకుంది. ష‌క‌ల‌క శంక‌ర్ హీరోల‌ను ఇమిటేట్ చేస్తూ చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్విస్తుంది.

ఇక ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్ కామెడి పార్ట్ ఉన్నంతలో బాగానే ఉంది. సినిమా కామెడి పరంగా బాగాఉంది. అయితే సినిమా ఫ‌స్టాఫ్‌లో కామెడి పెద్ద‌గా లేదు. సినిమా చాలా స్లోగా సాగుతుంది. ప్ర‌థమార్థం 58 నిమిషాలే అయినా గంట‌న్న‌ర పైగా కూర్చున్న‌ట్లు అనిపించింది. సినిమాలో మంచి ఎమోష‌న‌ల్ పాయింట్ ఉన్న దాన్ని క‌నెక్ట్ చేయించ‌డంతో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కాలేక‌పోయాడు. ద్వితీయార్థంలో కూడా కామెడి పార్ట్ మిన‌హా మ‌రే అంశాలు మెప్పించ‌వు. అనిష్ సినిమాటోగ్ర‌ఫీ బావున్నా, కె సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. సినిమాలో లాజిక్స్ చాలానే మిస్ అయ్యాయి. సినిమా ఫ‌స్టాఫ్‌లో దెయ్యాలుండే ఇంట్లోవెళ్లే జీవా, సుప్రీత్‌లో సుప్రీత్ ఏమ‌వుతాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే విజ‌య్ చంద్ర్ భార్య శ్రీనివాస‌రెడ్డి ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌స్తుందో, ఎందుకు వ‌స్తుందో తెలియ‌లేదు. సినిమా పార్టులుగా బాగానే ఉన్నా మొత్తంగా చూస్తే సినిమాలో సోల్ మిస్ అయ్యింది.
బోట‌మ్ లైన్ః ఆనందో బ్ర‌హ్మ‌…కాస‌న్ని న‌వ్వులు ఓకే కానీ..మిగ‌తా పార్ట్ బోరింగ్‌

రేటింగ్- 2.75/5

కొత్తగా యాబై రూపాయల నోటు New 50 Rupees Note



నోట్ల రద్దు తర్వాత మరిన్ని సెక్యూరిటీ ఫ్యూచర్స్, మరింత భద్రతతో కొత్త 100, 50 నోట్లు కూడా రాబోతున్నట్లు చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఇన్నాళ్లు వాటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అధికారులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. RBI విడుదల చేయనున్న కొత్త రూ.50 నోటు ఇదే అంటూ వాట్సాప్ లో ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

కొత్త 50 రూపాయల నోటు నీలం రంగులో ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. ముద్రణ సంవత్సరం 2016గా ఉందని దరిపోర్టర్ టైమ్స్ డాట్ కాం అనే వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఏడాది క్రితమే ఈ నోట్ల ముద్రణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. విడుదల చేయటంలో ఆలస్యం అయ్యిందని వివరించింది. మొదటి సారి నీలం రంగులో భారతీయ నోటు రావటం కూడా ఇదే అని స్పష్టం చేసింది.

నీలం రంగులో ఉన్న కొత్త రూ.50 నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ ఉంది. వెనక భాగంలో పార్లమెంట్ చిహ్నం ఉందని చెప్పింది. కట్టల రూపంలో ఈ నోట్లు ఇంకా మార్కెట్ లోకి రాలేదు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇది అసలా.. నకిలీనా అనే డౌట్ సామాన్యుల్లో ఉంది. పెద్ద ఎత్తున ఈ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

బాలయ్య పైసా వసూల్ సాంగ్స్ Paisa Vasool MP3 Songs Download



Movie Name : Paisa Vasool (2017)
Cast & Crew: Nandamuri Balakrishna, Shriya Saran, Muskan Sethi, Kyra Dutt
Music: Anup Rubens
Label: –
.:: Track-list ‘n’ Download Links ::.
Click below to Download Songs in Zip File (128 Kbps)
All SongsSingle File Download
01 – Paisa Vasool
Artist’s: Daler Mehendi, Uma Neha, Anurag Kulkarni
[Direct] or [ZidduShare]
02 – Kannu Kannu Kalisai..
Artist’s: Anup Rubens, Jithin, Sree Kavya Chandana
[Direct] or [ZidduShare]
03 – Mama Ek Peg La…
Artist’s: Balakrishna Nandamuri, Divya Divakar
[Direct] or [ZidduShare]
04 – Padhamari
Artist’s: Mano, Geetha Madhuri
[Direct] or [ZidduShare]
05 – Theda Singh (Theme Song)…
Music: Anup Rubens
[Direct] or [ZidduShare]

ప్రపంచ వ్యాప్తంగా నాగార్జున ర్యాంక్ 260!



సోషల్ మీడియా అంటే దాదాపు తెలియని వారు లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్‌లోనో.. వాట్సాప్‌లోనో.. ట్విట్టర్ ఇలా ఏదో ఒక మాద్యమంలో అకౌంట్ ఉంది. సరే సామాన్యుడి సంగతి వదిలేస్తే.. సెలబ్రిటీస్ మాత్రం అభిమానులకు అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియా ఒక వారధిలా పనిచేస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్‌లో సినీ ప్రముఖులంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు.

ట్విట్టర్ ద్వారానే తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లాంటి వన్నీ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. అలాగే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా నాగ్‌ది 260వ ర్యాంకట. ట్విట్టర్ కౌంటర్ అనే అకౌంట్ ద్వారా ఆయన అభిమాని ఒకరు నాగ్ ట్విట్టర్ వాల్‌పై పోస్ట్ చేశారు. దీనికి నాగ్ కూడా తనపై చూపిస్తున్న అభిమానానికి థాంక్స్ చెప్పారు.

ఇకపై వాహనదారులు టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు



టోల్ గోస తీరింది. వాహనదారులు ఇకపై ప్రతీ టోల్  గేట్ దగ్గర గంటల తరబడి ఆగడం…  టాక్స్ లు చల్లించుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. టాక్స్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రహదారుల ప్రాదికార సంస్థ(NHAI) రెండు యాప్స్ ను ప్రారంభించింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని 371 టోల్ ప్లాజాల దగ్గర దీన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి NHAI గురువారం (ఆగస్టు 17) మైఫాస్ట్‌ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్ పార్ట్నర్‌ పేరుతో ఈ మొబైల్ యాప్ లను ఆవిష్కరించింది.

ఫాస్ట్ ట్యాగ్ లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు టోల్‌గేట్ల దగ్గర కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) ద్వారా వాటిని అమ్మేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. శుక్రవారం (ఆగస్టు18) నుంచి ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. బ్యాంకులు, NHAI, IHMCL వెబ్‌సైట్‌ల ద్వారా ఈ ఫాస్టాగ్‌లను వాహనదారులు కొనుగోలు చేయవచ్చు.

మైఫాస్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చని..లేదంటే రీచార్జి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఫాస్టాగ్‌ పార్ట్నర్‌ యాప్‌ ద్వారా వాహనాలడీలర్లు, బ్యాంకులు,CSC వంటి సంస్థలు ఫాస్టాగ్‌లను అమ్మవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6 లక్షల ఫాస్ట్ ట్యాగ్ ల అమ్మకాలు జరిగాయని… తాజా చర్యలతో ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది ఎన్‌హెచ్‌ఏఐ. ఫాస్ట్ ట్యాగ్ ఎలక్రాటినిక్  టోల్‌ వసూలు కోసం వినియోగించే పరికరం. వాహనదారుడికి సంబంధించిన అకౌంట్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత ఈ పరికరాన్ని వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. వాహనం టోల్‌గేట్‌ దగ్గరకుచేరుకోగానే, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌  టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్‌ అకౌంట్‌ నుంచి టోల్‌ టాక్స్ సంబంధిత సంస్థకు జమ అవుతుంది. దీంతో..వాహనదారుడు టోల్‌గేట్‌ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.

అర్జున్ రెడ్డి కి " ఎ " సర్టిఫికేట్ ఇచ్చారు !



కొన్ని సినిమాలు అంతే.. వచ్చీ రావడంతో రచ్చ చేస్తుంటాయి. ఆ సినిమాల్లో వాడే డైలాగ్స్ నుండి చూపించే కంటెంట్ వరకు చాలా కొత్తగా ఉంటూనే.. చాలా బోల్డ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ గురించి మనకు తెలియదు కాని.. ''అర్జున్ రెడ్డి'' సినిమా తొలి టీజర్ లోని ఆ బూతుల ప్రకంపనలు మాత్రం ఇంకా టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ బూతుల ఇంటెన్సిటీ అలా ఉంది మరి.

ఇకపోతే ఈ బూతుల సినిమాకు ఇప్పుడు సెన్సారోళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు తెలుసా. సినిమాలో బూతులను తొలగించకుండా.. కంటెంట్ సరిగ్గా కన్వే అవ్వాలంటే అలాంటి పదజాలం ఉండాలని దర్శకుడు పట్టుబట్టడంతో.. కొన్ని చోట్ల బీప్ లు వేసి.. సినిమాకు ''ఎ'' సర్టిఫికేట్ చేతిలో పెట్టారట. అసలు ఈ సినిమాకు సర్టిఫికేటే రాదని చాలామంది అనుకుంటున్నవేళ.. ఈ ఎడల్ట్ సర్టిఫికేట్ రావడం కూడా పెద్ద కొసమెరుపే తెలుసా. సినిమాలో లాంగ్వేజ్ ఒక్కటే కాదు.. కొన్ని సీన్లలో డీప్ గా సాగిన పెదాల ముద్దులూ.. అలాగే కొన్ని పడకగది సీన్లు కూడా ఉన్నట్లు టీజర్లో హింట్లు ఇచ్చారు. అందుకే సర్టిఫికేట్ గురించి అందరికీ అన్ని సందేహాలు వచ్చింది.

సందీప్ రెడ్డి డైరక్షన్లో రూపొందిన ''అర్జున్ రెడ్డి'' సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ గా షాలిని నటిస్తున్నారు. ఈ సినిమాను ఒక కొత్తరకం ప్రయోగాత్మక సినిమా అంటున్న డైరక్టర్.. ఇందులో చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే శుక్రవారం సినిమా రిలీజ్ అవుతోంది.

అఖిల్ రెండవ సినిమా పోస్టర్ లీకైంది !



'అఖిల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని.. ఆ సినిమాతో భారీ ఫ్లాపును చవిచూశాడు. కట్ చేస్తే కోలుకోవడానికి ఏకంగా ఒక ఏడాది పట్టింది. ఇప్పుడు సెన్సిబుల్ గా సినిమాలను తీసే దర్శకుడు విక్రమ్.కె.కుమార్ డైరక్షన్ లో మనోడు తన రెండో సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేసింది. అది లీకైన పోస్టరట. అయితే లీకైతే ఏముందిలే అంటూ ఇప్పుడు నాగార్జునే స్వయంగా ఒరిజినల్ సైజ్ పోస్టర్ ను ట్వీట్ చేశారు.

నిజానికి ఆగస్టు 21న పేరుతో సహా రావాల్సిన ఈ పోస్టర్ ను ఇప్పుడు సినిమా పేరు లేకుండా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో తన గాళ్ ఫ్రెండ్ (కొత్తమ్మాయ్ కళ్యాణి ప్రియదర్శన్) కోసం అఖిల్ మాఫియా దుండగులను కొడుతున్నట్లు కాస్త డిఫరెంట్ గానే ప్రయత్నం చేశాడు. కాకపోతే పోస్టర్ చూస్తుంటే ఈ మధ్యన రిలీజైన హిందీ 'ఏ జెంటిల్మన్' సినిమా పోస్టర్ థీమ్ కు దగ్గరగా ఉంది. ఒక క్లాస్ లుక్కింగ్ బాయ్.. తన గాళ్ ఫ్రెండ్ కోసం దుండగులతో ఫైటింగ్.. ఆపై పెద్ద పెద్ద చేజులూ.. ఫైట్లు.. బిల్డింగులూ.. హెలికాప్టర్లూ.. ఇప్పుడు విక్రమ్ కె కుమార్ తీస్తున్న సినిమా కూడా ఆ రేంజులోనే ఉన్నట్లుంది.

ఈ రెండో సినిమాతో టాలీవుడ్ లో తన సత్తా గట్టిగా చాటి బాక్సాఫీస్ దగ్గర స్థిరపడాలని చూస్తున్నాడు అఖిల్. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర పటిష్టంగా ఒక ఫిగర్ రాబడితేనే స్టార్ స్టేటస్ ఇంకా పెరిగేది. చూద్దాం మరి ఆగస్టు 21న ఈ సినిమా గురించి ఏం చెబుతారో. అయితే ఈ సినిమాకు ''రంగుల రాట్నం'' అనే టైటిల్ పెడుతున్నట్లు ఆల్రెడీ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.