Heavy rain to continue over Andhra Pradesh for another 24 hours
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని బారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండో రోజుల పాలు కోస్తోంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో చిత్తూరు, కడపతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల జలశయాలు నిండు కుండల్లా మారాయి. అనేక ప్రాంతాల్లో చెరువుకు గండ్లు పడ్డాయి. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. 125 పశువులు మృతి చెందగా, 80 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయ. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. వర్ష భీభత్స ప్రాంతాల్లో యుద్దప్రాతిపదిక సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.