అందులోని పాటలు ఆన్ లైన్ ద్వారా ఎంతో ప్రాచుర్యం సంపాదించాయి. వాటిని చూసుకొంటూ ఆ ట్యూన్స్ కి తగ్గట్టుగా ఔత్సాహిక అభిమానులు తెలుగు లిరిక్స్ ని సిద్ధం చేశారు. వాటిని రికార్డ్ చేసి మరీ ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. అవి ప్రైవేట్ ప్రేమమ్ పాటలుగా జనాల నోళ్లల్లో నానుతూ ఉన్నాయి. మలయాళంలో విజయవంతమైన... మలరే - అలువా పుజయుదే పాటలకి తెలుగు వెర్షన్ రెడీ చేసి ఆన్ లైన్ లో పెట్టేశారు ఔత్సాహిక అభిమానులు. అవి మలయాళం సినిమాలోని పాటలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ప్రైవేట్ పాటలే ఇలా ఉంటే సినిమాలోని పాటలు ఇంకెంతగా అలరిస్తాయో చూడాలి. మ్యూజికల్ హిట్టుగా నిలిచిన ప్రేమమ్ కి సంబంధించి తెలుగు వెర్షన్ పాటల విషయంలోనూ దర్శకుడు చందు మొండేటి చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడని తెలిసింది. ఆ పాటల్ని సిద్ధం చేయించడంలోనూ వాటిని తెరకెక్కించడంలోనూ చందు మొండేటి తన మార్క్ ని చూపించినట్టు సమాచారం. కార్తికేయ సినిమాలోనూ చందు మొండేటి పాటల్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. అందుకు రెట్టింపు స్థాయిలో ప్రేమమ్ పాటలు ఉంటాయని ఆ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
Showing posts with label Love. Show all posts
Showing posts with label Love. Show all posts
ప్రేమమ్ మలయాళ మలరే సాంగ్ తెలుగు రీమేక్
అందులోని పాటలు ఆన్ లైన్ ద్వారా ఎంతో ప్రాచుర్యం సంపాదించాయి. వాటిని చూసుకొంటూ ఆ ట్యూన్స్ కి తగ్గట్టుగా ఔత్సాహిక అభిమానులు తెలుగు లిరిక్స్ ని సిద్ధం చేశారు. వాటిని రికార్డ్ చేసి మరీ ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. అవి ప్రైవేట్ ప్రేమమ్ పాటలుగా జనాల నోళ్లల్లో నానుతూ ఉన్నాయి. మలయాళంలో విజయవంతమైన... మలరే - అలువా పుజయుదే పాటలకి తెలుగు వెర్షన్ రెడీ చేసి ఆన్ లైన్ లో పెట్టేశారు ఔత్సాహిక అభిమానులు. అవి మలయాళం సినిమాలోని పాటలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ప్రైవేట్ పాటలే ఇలా ఉంటే సినిమాలోని పాటలు ఇంకెంతగా అలరిస్తాయో చూడాలి. మ్యూజికల్ హిట్టుగా నిలిచిన ప్రేమమ్ కి సంబంధించి తెలుగు వెర్షన్ పాటల విషయంలోనూ దర్శకుడు చందు మొండేటి చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడని తెలిసింది. ఆ పాటల్ని సిద్ధం చేయించడంలోనూ వాటిని తెరకెక్కించడంలోనూ చందు మొండేటి తన మార్క్ ని చూపించినట్టు సమాచారం. కార్తికేయ సినిమాలోనూ చందు మొండేటి పాటల్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. అందుకు రెట్టింపు స్థాయిలో ప్రేమమ్ పాటలు ఉంటాయని ఆ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
సమంత పెళ్ళి చైతుతోనేనా !!
చైతూ మరియు సమంతలు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి ఏకాంతంగా పలు సార్లు కలుస్తున్నారని, పబ్బులకు క్లబులకు కలిసి తిరుగుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చైతూ మరియు సమంతలు కలిసి సినిమా చూస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. అప్పటి నుండి కూడా సమంత, చైతూల ప్రేమ వ్యవహారంపై తారా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా వీరిద్దరి ప్రేమ మరో మెట్టు ఎక్కినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే నాగచైతన్య తల్లితో సమంత మీటింగ్ జరిగిందట. అమెరికాలో ఉండే నాగచైతన్య తల్లి ఇటీవలే అమెరికా నుండి ఇండియా వచ్చిందని, ఆ సమయంలోనే సమంతో ఆమె కూర్చొని మాట్లాడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో సమంత పెళ్లి చైతూతో అనే విషయంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ విషయంపై ఇప్పటి వరకు సమంత కాని, చైతూ కాని ఎలాంటి ప్రకటన చేసింది లేదు. మరి వీరి పెళ్లి విషయం ఎక్కడకు దారి తీస్తుందో, ఎప్పుడు వీరి పెళ్లి అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తురు.
ఎగ్జామ్స్ రాసిన వెంటనే జంప్ అయిన 100 మంది అమ్మయిలు !!
ప్రేమ పెళ్లిలను తప్పుపట్టడం అనేది వారి వారి ఆలోచన పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే తెలిసీ తెలియని తనం - మానసిక - శారీరక పరిపక్వత లేకపోవడం వల్ల చేసే పనులను చూస్తే బాధకలగడమే కాదు ఒకింత కోపం రావడం సహజం. ఇంతకీ అంత కోపం జరిగే విషయం ఏంటంటే.... ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు "వెళ్లిపోయారు". అదికూడా ఏకంగా వందమంది! పైగా పరీక్ష రాసిన వెంటనే జంప్!!
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ షాకింగ్ ఎపిసోడ్ జరిగింది. ఇంటర్ పరీక్షల చివరి రోజున పరీక్షలు రాసేందుకు వెళ్లిన అమ్మాయిల్లో ఒకేరోజు వంద మంది మిస్ అయ్యారు. గత శుక్రవారం జరిగిన ప్లస్ టూ ఎగ్జామ్స్ చివరి పరీక్ష రోజు వంద మంది అమ్మాయిలు తప్పిపోయారని తేలింది. అయితే వీళ్లు తప్పిపోలేదని 'వెళ్లిపోయారని' తెలుస్తోంది. అలా ఎలా చెప్పేస్తారంటే...గత ఏడాది కూడా సేమ్ సీన్ రిపీటయింది కాబట్టి. ఇలాగే ఇంటర్ సెకండియర్ పూర్తయిన అమ్మాయిలు పరీక్ష చివరి రోజ 125 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు వెతుకులాట మొదలెట్టగా అందులో మెజార్టీ బాలికలు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నారని తేలింది. దీంతో ఇపుడు కూడా అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇంటర్ సెకండియర్ పూర్తయిన అమ్మాయిలు చేసిన ఈ ఘనకార్యంతో పేరెంట్స్ షాక్ కు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు చేసి తమ పిల్లల కోసం వెతకాలని వాపోతున్నారు. ఈ బాలికల జంపింగ్ ఎపిసోడ్ జంటలుగా రావడంతో ఫుల్ స్టాప్ పడుతుందా? లేక కొత్త ట్విస్ట్ ఏమైనా తెరమీదకు వస్తుందా? వేచి చూడాల్సిందే!

ఆత్మహత్య చేసుకున్న తెలుగు టీవీ యాంకర్
టీవీ రంగానికి చెందిన నటులు ఆత్మహత్యలు చేసుకోవటం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువైంది. ఈ మధ్యనే తమిళ సినీ.. టీవీ నటుడు ప్రశాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జెమినీ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న నిరోషా అనే యాంకర్ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది.
సికింద్రాబాద్ లోని సింధి కాలనీలో ఉన్న లేడీస్ హాస్టల్ లో ఆమె సూసైడ్ చేసుకుంది. ఏపీలోని చిత్తూరు జిల్లా మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన నిరోషా సూసైడ్ వెనుక.. ప్రేమ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. 23 ఏళ్ల నిరోషా ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
మరో నెల రోజుల్లో ఆమె వివాహం జరగాల్సి ఉందని.. ఇప్పటికే ఆమెకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని తెలుస్తోంది. నెల రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో.. ఇలాంటి ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆమెకు ఎంగేజ్ మెంట్ కాలేదని.. త్వరలో జరగనుందన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది.
సూసైడ్ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందించారు.
2nd Day Report
ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిజానికి ఈ సూసైడ్ కు లవ్ ఫెయిల్యూర్ లాంటిదేదైనా రీజన్ కావచ్చనే అనమానాలు వినిపించాయి. రిత్విక్ అనే కెనడాలో నివసించే కుర్రాడితో వీడియా కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి కాల్ డిస్కనెక్ట్ చేసేసింది. ఇతనితో కాల్ మాట్లాడే సమయంలో గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం.. నిరోష ఆరోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిరోష తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందని.. నిరోష పేరెంట్స్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇలా హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఓ తెలుగు మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ఈమె.. సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్టల్ లో నివసిస్తూ.. అక్కడే ఉరి వేసుకుంది.
రిత్విక్ తో వివాదానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజానికి నిరోషకు గత నెలలోనే ఎంగేజ్ మెంట్ కాగా.. త్వరలో పెళ్లి కావాల్సి ఉంది. ప్రవర్తన పరంగాను వ్యక్తిగతంగాను ఎంతో మంచి నడవడిక ఉన్న అమ్మాయిగా నిరోషకు మంచి గుర్తింపు ఉంది.
సింగర్ మధుప్రియ శ్రీకాంత్ ల ప్రేమ.. పెళ్ళి .. లొల్లి
సింగర్ మధుప్రియ వ్యవహారం ఇప్పుడు అందరికి తెలిసిందే. ఆర్నెల్ల క్రితం తల్లిదండ్రుల్ని కాదని.. వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న ఆమె.. తన భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం.. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను మోసపోయినట్లుగా ఆరోపిస్తూ.. ప్రేమించినా.. పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలంటూ చెబుతూ స్పృహ తప్పిపోవటం.. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ ఉదంతానికి సంబంధించి పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం మధుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె భర్త శ్రీకాంత్ కు.. మధుప్రియ తల్లిదండ్రుల మధ్య పలు పరిణామాలు చోటు చేసుకోగా.. వీటికి సంబంధించి ఇరు వర్గాల వాదన భిన్నంగా ఉండటం గమనార్హం. తొలుత మధుప్రియ తల్లిదండ్రులు.. బంధువర్గం వాదన చూస్తే..
1. మధుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆమె భర్త శ్రీకాంత్ తన స్నేహితుల్ని వెంట పెట్టుకొని వచ్చి దాడి చేశారు. దారుణంగా వ్యవహరించారు. నానా హంగామా సృష్టించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తుందా? అంటూ దాడికి పాల్పడ్డారు.
2. అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టే ప్రయత్నం చేశారంటూ మధుప్రియ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త శ్రీకాంత్ చేస్తున్న వాదన
1. తనపై శనివారం అర్థరాత్రి దాడి జరిగిందని పేర్కొన్నారు. తలకు.. ముక్కుకు.. చేతి వేళ్లకు గాయాలు కావటం.. అనంతరం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందటం జరిగింది.
2. తనను మదుప్రియ బంధువులు దాడి చేశారు. మధుప్రియతో మాట్లాడి ఇంటికి తీసుకొద్దామని.. ఆమె బావకు ఫోన్ చేశాను. ఇంటికి వస్తే మాట్లాడదామని చెప్పారు.
3. సరేనని చెప్పి బైక్ మీద ఇంటికి వెళ్లాను. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే కర్రతో దాడి చేశారు. తలపై గాయాలయ్యాయి.
4. దీన్ని చూసిన ఫ్రెండ్ బైక్ తీసుకొని వస్తే.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. మధుప్రియే నన్ను శారీరకంగా.. మానసికంగా వేధించింది.
ఇదిలా ఉంటే.. ఆసుపత్రికి వెళ్లిన శ్రీకాంత్ చికిత్స చేయించుకున్నాడు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యలోనే వెళ్లిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కొన్ని ఛానల్ కార్యాలయానికి వెళ్లిన శ్రీకాంత్ తనకు ప్రాణహాని ఉందని.. తనను రక్షించాలని.. మధుప్రియ తరఫు వారు భౌతికదాడికి పాల్పడ్డారని ఆరోపించి.. తనకు సాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ప్రేమ.. పెళ్లి లాంటి విషయాల్లో తొందరపాటు ఒకటైతే.. మనస్పర్థలు వచ్చిన తర్వాత శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సింది పోయి..దాడులకు దిగటం ఏమిటో..?