సమంత పెళ్ళి చైతుతోనేనా !!




చైతూ మరియు సమంతలు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి ఏకాంతంగా పలు సార్లు కలుస్తున్నారని, పబ్బులకు క్లబులకు కలిసి తిరుగుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చైతూ మరియు సమంతలు కలిసి సినిమా చూస్తున్న ఒక ఫొటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేసింది. అప్పటి నుండి కూడా సమంత, చైతూల ప్రేమ వ్యవహారంపై తారా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా వీరిద్దరి ప్రేమ మరో మెట్టు ఎక్కినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే నాగచైతన్య తల్లితో సమంత మీటింగ్‌ జరిగిందట. అమెరికాలో ఉండే నాగచైతన్య తల్లి ఇటీవలే అమెరికా నుండి ఇండియా వచ్చిందని, ఆ సమయంలోనే సమంతో ఆమె కూర్చొని మాట్లాడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో సమంత పెళ్లి చైతూతో అనే విషయంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ విషయంపై ఇప్పటి వరకు సమంత కాని, చైతూ కాని ఎలాంటి ప్రకటన చేసింది లేదు. మరి వీరి పెళ్లి విషయం ఎక్కడకు దారి తీస్తుందో, ఎప్పుడు వీరి పెళ్లి అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తురు.
ThanQ Visit Again.

Related Posts