Showing posts with label TV. Show all posts
Showing posts with label TV. Show all posts

ఆత్మహత్య చేసుకున్న తెలుగు టీవీ యాంకర్




టీవీ రంగానికి చెందిన నటులు ఆత్మహత్యలు చేసుకోవటం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువైంది. ఈ మధ్యనే తమిళ సినీ.. టీవీ నటుడు ప్రశాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జెమినీ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న నిరోషా అనే యాంకర్ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది.

సికింద్రాబాద్ లోని సింధి కాలనీలో ఉన్న లేడీస్ హాస్టల్ లో ఆమె సూసైడ్ చేసుకుంది. ఏపీలోని చిత్తూరు జిల్లా మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన నిరోషా సూసైడ్ వెనుక.. ప్రేమ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. 23 ఏళ్ల నిరోషా ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

మరో నెల రోజుల్లో ఆమె వివాహం జరగాల్సి ఉందని.. ఇప్పటికే ఆమెకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని తెలుస్తోంది. నెల రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో.. ఇలాంటి ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆమెకు ఎంగేజ్ మెంట్ కాలేదని.. త్వరలో జరగనుందన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది.

సూసైడ్ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందించారు.

2nd Day Report

ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిజానికి ఈ సూసైడ్ కు లవ్ ఫెయిల్యూర్ లాంటిదేదైనా రీజన్ కావచ్చనే అనమానాలు వినిపించాయి. రిత్విక్ అనే కెనడాలో నివసించే కుర్రాడితో వీడియా కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి కాల్ డిస్కనెక్ట్ చేసేసింది. ఇతనితో కాల్ మాట్లాడే సమయంలో గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.

తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం.. నిరోష ఆరోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిరోష తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందని.. నిరోష పేరెంట్స్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇలా హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఓ తెలుగు మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ఈమె.. సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్టల్ లో నివసిస్తూ.. అక్కడే ఉరి వేసుకుంది.

రిత్విక్ తో వివాదానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజానికి నిరోషకు గత నెలలోనే ఎంగేజ్ మెంట్ కాగా.. త్వరలో పెళ్లి కావాల్సి ఉంది. ప్రవర్తన పరంగాను వ్యక్తిగతంగాను ఎంతో మంచి నడవడిక ఉన్న అమ్మాయిగా నిరోషకు మంచి గుర్తింపు ఉంది.
 

నేపాల్ లో భారత్ టీవీ ఛానల్ లు బంద్

ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉండి కొద్దికాలం క్రితం లౌకికదేశంగా మారిన నేపాల్ లో పరిస్థితుల ఇంకా కుదుటపడటం లేదు. నేపాల్ను హిందూ దేశంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై స్థానిక మాదేశీ తెగ వాసులు చేపట్టిన ఆందోళన హింస రూపంలోకి మారి ఆ దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులకు కారణమైంది. కొద్దికాలంగా ఈ పరిస్థితులు కుదుటపడుతుంటే తాజాగా మరో సమస్య ఎదురైంది. అయితే ఈ సమస్య వల్ల భారత దేశం చిక్కులపాలవడం గమనార్హం.

ఉప్పు - చక్కెర - వంట గ్యాస్ సిలిండర్లు వంటి నిత్యావసరాల్లో మెజార్టీ వాటాను మనదేశం నుంచి నేపాల్ సమీకరించుకుంటుంది. అయితే ఇటీవల ఆ దేశంలో ఇబ్బందికర పరిస్థితుల నెలకొన్న రీత్యా అవి చక్కబడే వరకు సరుకులు రవాణా చేయవద్దని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఆయా సరుకులు అక్రమ రవాణా అవుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత జవాన్లు భద్రతను కట్టుదిట్టడం చేశారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి నేపాల్ కు అక్రమ రవాణా అవుతున్న ఆయిల్ ట్యాంకర్ ను పట్టుకునేందుకు నేపాల్ భూభాగంలోకి కిషన్ గంజ్ లోకి మనదేశ సైన్యం అయిన సశస్త్ర సీమా బల్ కు చెందిన జవాన్లు ప్రవేశించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాలీ ప్రజలు.. భారత జవాన్లపై తిరగబడ్డారు. 13 మంది జవాన్లను బంధించి నేపాల్ పోలీసులకు అప్పగించారు.

మరోవైపు ఈ పరిణామాల కంటే ముందే నేపాల్ కు చెందిన మాజీ మావోయిస్ట్ స్ప్లింటర్ పార్టీ భారతీయ చానెళ్ల ప్రసారాలకు వ్యతిరేకిస్తూ ప్రచారాన్ని లేవనెత్తింది. మన దేశానికి సరుకులు ఇవ్వని భారత్ ప్రసారాల అవసరం ఏముందని ఆ పార్టీ ప్రచారం చేపట్టింది. దీంతో భారత్ కు చెందిన 42 న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా....నేపాల్ జాతీయ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంలో భారత్ కలుగజేసుకున్నట్లయితే శాశ్వతంగా భారత్ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని నిశ్చయించుకున్నట్లు ఆ దేశ కేబుల్ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇదిలాఉండగా... నేపాల్ రాజధాని ఖాట్మండుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మన దేశ సినిమాల ప్రదర్శనను కూడా నిలిపివేసినట్లు సమాచారం.

పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల రాయబారులు సమావేశమై సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. నిత్యావసర సరుకులను అందజేసేందుకు తమకు ఇబ్బందేమీ లేదని భారత రాయబారి హామీ ఇచ్చారు. అయితే నేపాల్లోని పరిస్థితులు కుదుటపడేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.