Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

నిజమైన బాహుబలి ఎవరు ?

Who is Baahubali ! History of Bahubali



గూగుల్ లోకి వెళ్ళండి బాహుబలి అని సెర్చ్ చేయండి. వస్తే గిస్తే ప్రభాస్ గురించో, రాజమౌళి గురించో లేక రానా గురించో, అంతకు మించితే  ట్రైలర్ల హడావుడి గురించో కనబడుతోంది. కానీ సహనానికి ఐకాన్ లాంటి బాహుబలి మన గడ్డపై నిజంగా  నివసించిన అసలు సిసలు బాహుబలి గురించి ఎక్కడా కనబడదు,వినబడదు.
అవును బాహుబలి సహనానికి కెరాఫ్ అడ్రస్ లాంటి వాడు, యుద్దాన్ని వద్దన్న శాంతిదూత,రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే  రాజ్యాన్నే గడ్డిపోచగా భావించిన వ్యక్తి అతను.  సుఖాల కోసం, భోగాల కోసం పరితపిస్తుంటే రాజుగా ఉండి కూడా సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అతను.

కాస్త చరిత్రలోకి తొగి చూద్దాం!

ఋషబుని కుమారుడు బాహుబలి. ఇతనికే గోమఠేశ్వరుడనే పేరు .ఇతడికి ఇద్దరు భార్యలు.రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు.పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు.భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది.తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు.బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు.భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి,అంతలోనే పునరాలోచనలో పడతాడు.

బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి,రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు.జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు.కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు.శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.వీరు సంసార జీవితం కొనసాగిస్తారు.దిగంబరులు సన్యాసులు.వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

బాహుబలి  విగ్రహం కర్నాటక లోని శ్రావనబెళగొళ లో ఉంది.   58 అడుగులున్న ఈ విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ.శ.983వ సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై  ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు చారిత్రక కథనం.

Sachin Movie Trailer | Master Blaster | Tendulkar History




సా..చిన్ సా...చిన్.... ఈ నినాదం వినిపిస్తే చాలు.. ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండె పులకిస్తుంది. రిటైరై అయిన రెండేళ్లు దాటిపోయినా సరే సచిన్ క్రేజ్ జనాల్లో ఏమాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతణ్ని ఇప్పటికీ దేవుడిలాగే కొలుస్తారు అభిమానులు. సచిన్ జీవిత చరిత్ర నేపథ్యంలో ‘సచిన్- ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొందనడానికి.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్.. రిలీజ్ చేసినపుడు సోషల్ మీడియాలో దాని గురించి జరిగిన చర్చే నిదర్శనం. నిన్న టీజర్ రిలీజైతే.. ట్విట్టర్ - ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

‘ఫ్రమ్ ఎ వైల్డ్ ఛైల్డ్ టు ఎ వర్చువస్ హీరో’ అంటూ సచిన్ జీవిత గాథ మొత్తాన్ని ప్రేక్షకుల ముందు పెట్టాలని ‘సచిన్’ ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. ఐతే ఇది డాక్యుమెంటరీనా.. సినిమానా.. అసలు ఇందులో సచిన్ స్వయంగా నటిస్తున్నాడా.. లేక అతడి పాత్రను వేరెవరైనా పోషిస్తున్నారా.. అన్నదే అర్థం కావడం లేదు. అజహర్ - ధోనిల జీవిత చరిత్రతోనూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఐతే వాళ్ల పాత్రల్ని ఇమ్రాన్ హష్మి - సుశాంత్ రాజ్ పుత్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఎలాంటి దాపరికం లేదు. ఐతే ‘సచిన్’ సినిమా సంగతి ఏంటన్నదే తేలడం లేదు. టీజర్ చూస్తే సచిన్ ఈ సినిమాను నరేట్ చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది. అంటే చిన్ననాటి విశేషాలకు సంబంధించి మాత్రం నటీనటులతో చేయించి.. ఆ తర్వాత వాస్తవ మ్యాచ్ లకు సంబంధించిన దృశ్యాల్ని జోడించి.. దీన్ని సినిమాకు డాక్యుమెంటరీకి మధ్యలో ఉండేలా తయారు చేస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ‘సచిన్’ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.


Sachin Movie Official Trailer