Showing posts with label Jabhardasth. Show all posts
Showing posts with label Jabhardasth. Show all posts

జబర్దస్త్ చలాకి చంటికి పెళ్లి కాబోతుంది



ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు చలాకీ చంటి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ షో అద్భుతమైన విజయం సాధించడంలో చంటిది కూడా కీలక పాత్ర. తనదైన టిపికల్ వాయిస్.. డిఫరెంట్ మాడ్యులేషన్.. కామెడీ టైమింగ్ తో ఆ షోలో భలే కామెడీ పండించాడు చంటి. ఈ షోలో తన పేరు వెనుక తగిలించుకున్న ‘చలాకీ’ అనే పదం ఇప్పుడతడి ఇంటిపేరుగా మారిపోయింది. ‘జబర్దస్త్’ షోలో చంటి చేసే స్కిట్లతో పాటు అతడి పెళ్లి టాపిక్ కూడా జనాల్ని బాగా నవ్విస్తూ ఉంటుంది. జడ్జీలు రోజా నాగబాబులతో పాటు యాంకర్.. మిగతా పోటీదారులు.. అతడి పెళ్లి గురించి కామెంట్లు చేస్తుంటారు. ఈ షోలో చంటి ఓ పెళ్లికాని ప్రసాద్ అయిపోయాడు. ఐతే ఇకపై చంటి పెళ్లి గురించి కామెడీ చేయడానికి కుదరదు మరి.

ఎందుకంటే చలాకీ చంటి త్వరలోనే పెళ్లి కొడుకవుతున్నాడు. ఆల్రెడీ అతడికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈ విషయాన్ని చంటి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన నిశ్చితార్థ వేడుక ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. నిశ్చితార్ధం స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని చంటి తెలిపాడు. అమ్మాయి ఎవరు.. పెళ్లి ఎప్పుడు అన్న వివరాలు చంటి వెల్లడించలేదు. మొత్తానికి చంటి పెళ్లి మాత్రం అయిపోతోంది. కాబట్టి ఇకపై అతడిపై జోకులు పేల్చే వీల్లేదు. ‘జబర్దస్త్’ కంటే ముందు నుంచే చంటి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. ఈ సినిమాతో అతడికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అతననే కాదు.. ధన్ రాజ్ - షకలక శంకర్ - సుడిగాలి సుధీర్ - చమ్మక్ చంద్ర లాంటి కుర్రాళ్ల జీవితం ఈ షోతో పూర్తిగా మారిపోయింది.