Showing posts with label Bcci. Show all posts
Showing posts with label Bcci. Show all posts

Live Cricket Score

Live Score



Full Score Board




Stats Corner Widget

Display the most important cricketing statistics and records such as the Highest Run Scorer, Highest Wicket Taker etc.


దాల్మియాకు గుండెపోటు: ఆస్పత్రిలో చేరిక

కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయనను గురువారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. 75 ఏళ్ల వయస్సు గల దాల్మియా కోల్‌కతాలోని కెఎం బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .
బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై పెద్ద యెత్తునే చర్చ సాగుతోంది. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్న దాల్మియాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారని, వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షస్తున్నారని వైద్యులు చెప్పినట్లు ఐఎఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.



వార్తాకథనాల ప్రకారం - అల్జిమీర్స్‌తో పాటు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న దాల్మియా కొద్ది నెలలుగా కార్యాలయానికి కూడా వెళ్లడం లేదు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఆయన 2015 మార్చిలో ఎన్నికయ్యారు. ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి దాల్మియా ఆరోగ్యం గురించి చెప్పి, బిసిసిఐ అధ్యక్షుడిగా ఆయనను తప్పిస్తే మంచిదని చెప్పినట్లు సమాచారం అరుణ్ జైట్లీకి కూడా పరిస్థితి తెలుసునని అంటున్నారు. దాల్మియా స్థానంలో బిసిసిఐ పగ్గాలను శరద్ పవార్ చేపట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, శరద్ పవార్ అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు.