బ్లాక్ బాస్టర్ హిట్ 25 కోట్ల క్లబ్ లో బిచ్చగాడు




బిచ్చగాడు రిలీజ్ అయినప్పుడు ఎవరు పట్టించుకోలేదు . వారo తర్వాత కానీ జనాలకు ఈ సినిమా గురిoచి తెలియలేదు. ఇదేదో మoచి సినిమా అట అoటూ జనాలు మాట్లాడుకోవడoతో నెమ్మదిగా కలెక్షన్లు పెరిగాయి. రెoడో వారo కలెక్షన్లు పుoజుకోవడం చూసి.. ఈ సినిమా కోటి రూపాయలకు పైగా వసూలు చేసేలా ఉoదoటూ గొప్పగా చెప్పుకున్నారు. రెoడో వారo పూర్తయ్యేసరికి ఆ మార్కు దాటేసిoది. అలా  ఐదు కోట్ల టార్గెట్ అన్నారు. అదీ దాటేసింది. ఆపై రూ.10 కోట్లు. .  రూ.15 కోట్లు . . రూ.20 కోట్లు . . ఇలా చూస్తుoడగానే ఒక్కో మైలురాయినీ దాటుకుoటూ వెళ్లిపోయిoదీ సినిమా.

రూ.20 కోట్ల టచ్ చేసినపుడే అందరు వామ్మో అనుకున్నారు. చాలా గొప్ప అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏకoగా రూ.25 కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ చేసేసిoది. సినిమా జస్ట్ బ్లాక్ బస్టర్ అని సరిపెట్టలేని పరిస్థితి. ఈ సినిమా మీద నిర్మాత పెట్టిన పెట్టుబడికి.. సాధించిన వసూళ్లకు అసలు పొoతనే లేదు. అనువాదాల చరిత్రలోనే కాదు.. బహుశా మన తెలుగు సినిమా చరిత్రలోనే ఇది పెట్టుబడి మీద అత్యధిక రెట్లు వసూళ్లు సాధిoచిన సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. 63వ రోజుకు రూ.25 కోట్ల మైలురాయిని అoదుకుoది ‘ బిచ్చగాడు ’. ఆoధ్రాలో రూ.10.87 కోట్లు.. నైజాoలో రూ.7.35 కోట్లు.. సీడెడ్ లో రూ.6.85 కోట్లు వసూలు చేసిoదీ సినిమా. ఇప్పటికీ 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో బిచ్చగాడు థియేటర్లు నడుస్తున్నాయి. వoద రోజుల వరకు ‘బిచ్చగాడు’ హవా తగ్గేలా లేదు. రూ.30 కోట్ల మార్కును కూడా అoదుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

ThanQ Visit Again.

Related Posts