మీ ఫోన్ కు +92 +90 +09 వచ్చే కాల్స్ తో జాగ్రత్త




వ్యాప్తంగా ఏ రంగంలో చూసినా టెక్నాల‌జీ పరంగా విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. విద్య‌, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం ఇలా ఏ రంగాన్ని చూసినా దాంట్లో టెక్నాల‌జీ చేస్తున్న అద్భుతాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న‌ట్టుగా ఉంటున్నాయి. ప్ర‌ధానంగా బ్యాంకింగ్ రంగ‌మైతే ఒక‌ప్ప‌టిలా లేదు. స్మార్ట్‌ఫోన్ల చ‌లామ‌ణీతో చేతి వేళ్ల ట‌చ్‌తోనే ఎన్నో బ్యాంకింగ్ ప‌నులు చేసుకుంటున్నారు. ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం, రిసీవ్ చేసుకోవ‌డం, చెక్‌ల‌కు సంబంధించిన ఎంక్వ‌యిరీలు, స్టేట్‌మెంట్స్‌… ఇలా ఒక‌టా, రెండా.. ఎన్నో ప‌నులు ఇప్పుడు ఫోన్ల ద్వారానే పూర్త‌వుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్‌నైతే ఇప్పుడు దాదాపు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లంద‌రూ వాడుతున్నారు. అయితే నాణేనికి రెండు వైపులు ఉన్న‌ట్టుగానే టెక్నాల‌జీతో మ‌నం ఎన్ని లాభాలు పొందుతున్నా అన్నే న‌ష్టాలు కూడా మ‌న‌కు క‌లుగుతున్నాయి. ముఖ్యంగా హ్యాక‌ర్ల వంటి సైబ‌ర్ నేర‌గాళ్లు ఏదో ఒక విధమైన కొత్త ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తూ మ‌న డ‌బ్బును ఆన్‌లైన్‌లో దొంగిలిస్తూనే ఉన్నారు. కొంత అవ‌గాహ‌న ఉన్న‌వారైతే జాగ్ర‌త్త ప‌డుతున్నారు కానీ, నేర‌గాళ్ల ట్రిక్‌ల‌కు మాత్రం రోజూ ఎవ‌రో ఒక‌రు, ఎక్క‌డో ఒక చోట మోస‌పోతూనే ఉన్నారు. ముంబైలో ఇటీవ‌ల చోటు చేసుకున్న సంఘ‌ట‌న కూడా దాదాపుగా ఇలాంటి కోవ‌కే చెందుతుంది. ఓ వృద్ధ మ‌హిళ‌కు చెందిన డ‌బ్బుల‌ను నేరగాళ్లు దొంగిలించిన విధానం చూస్తే మీరే షాక్ అవుతారు.
ముంబైలో నివాసం ఉండే 72 ఏళ్ల ఓ వృద్ధ మ‌హిళ ఇటీవ‌ల త‌న ఫోన్‌కు వ‌చ్చిన ఓ ఎస్ఎంఎస్‌ను చూసి ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. అందులో ఏముందంటే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.11 ల‌క్ష‌లు డ్రా చేసిన‌ట్టు ఉంది. కానీ తాను అస‌లు ఏ విధంగా కూడా డ‌బ్బులు డ్రా చేయ‌లేదు. ఎవ‌రికీ పేమెంట్ కోసం ఎలాంటి చెక్‌లు ఇవ్వ‌లేదు. దీంతో అస‌లు డ‌బ్బులు ఎలా డ్రా అయ్యాయో తెలియ‌క ఆ మ‌హిళ త‌ల ప‌ట్టుకుంది. ఓ క్ర‌మంలో ఏం చేయాలో ఆమెకు తెలియ‌లేదు. కానీ జ‌రిగిన సంఘ‌ట‌న నుంచి తేరుకుని అస‌లు డ‌బ్బులు ఎలా డ్రా అయ్యాయో తెలుసుకోవాల‌ని బ్యాంక్‌కు వెళ్లింది. అక్క‌డ తెలిసిన విష‌యంతో ఆమె మ‌రోసారి అవాక్క‌యింది. ఎవ‌రో త‌న ఫోన్ నంబ‌ర్ (బ్యాంక్‌లో రిజిస్ట‌ర్ అయింది)తో మొబైల్ బ్యాంకింగ్ ద్వారా విమాన టిక్కెట్లు బుక్ చేశార‌ట‌.
పై సంఘ‌ట‌న గురించి తెలిసిన ప‌లువురు టెక్ నిపుణులు అస‌లు ఆ ఫ్రాడ్ ఎలా జ‌రిగిందో తెలుసుకుని అంద‌రికీ వివ‌రించారు. దుండగులు ఆ మ‌హిళ‌కు అంత‌కు ముందే కాల్స్, ఎస్ఎంఎస్ చేసి సిమ్ కార్డ్ రీడ‌ర్ అనే ఓ ప్ర‌త్యేకమైన‌ డివైస్‌, సాఫ్ట్‌వేర్ స‌హాయంతో ఆ సిమ్ స‌మాచారాన్నంతా దొంగిలించార‌ట‌. అనంత‌రం క్లోనింగ్ రూపంలో ఓ కొత్త సిమ్ కార్డ్‌లోకి ఆ వివ‌రాల‌న్నింటినీ ఎంట‌ర్ చేశారు. దీంతో ఆ సిమ్ కార్డ్ కూడా ఆమె వాడే ఫోన్ నంబ‌ర్‌నే క‌లిగి ఉండేలా మారింది. ఈ క్ర‌మంలో ఆ ఫోన్ నంబ‌ర్‌తోపాటు ఆ మ‌హిళ బ్యాంక్ వివ‌రాల‌ను కూడా వారు సేక‌రించి అనంత‌రం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జ‌రిపి రూ.11 ల‌క్ష‌లు కాజేశారు. అస‌లు జ‌రిగిన విష‌యం అది. చూశారుగా టెక్నాల‌జీని అడ్డం పెట్టుకుని నేర‌గాళ్లు ఎంత‌టి మోసాలు చేస్తున్నారో. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌! మీకు కూడా ఇలాంటి కాల్స్, ఎస్ఎంఎస్‌లు వ‌స్తే స్పందించ‌కండి. వెంట‌నే ఈ విష‌యాన్ని బ్యాంక్ అధికారుల‌కు, మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న పోలీసుల‌కు తెలియ‌జేయండి. బ్యాంక్‌లో రిజిస్ట‌ర్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌ను, ఏటీఎం పిన్ నంబ‌ర్ల‌ను వెంట‌నే మార్చేయండి. అంతేకాదు ఫోన్ రిపేరింగ్ కోసం ఒక‌వేళ ఎక్క‌డైనా ఇస్తే ఆ ఫోన్‌ను త‌యారు చేసిన కంపెనీ ఆథ‌రైజ్డ్ స‌ర్వీస్ సెంట‌ర్‌లోనే ఇవ్వండి. అలా ఇచ్చే సంద‌ర్భంలో సిమ్ కార్డ్‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోండి. అలా తీయ‌కున్నా, బ‌య‌ట ఎక్క‌డైనా వేరే షాపులో ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చినా సిమ్ కార్డు స‌మాచారాన్నంతా క్లోనింగ్ చేసి పైన చెప్పిన విధంగా డ‌బ్బులు కొట్టేస్తారు జాగ్ర‌త్త‌! చివ‌రిగా ఇంకో విష‌యం, పైన చెప్పిన సంఘ‌ట‌న దృష్ట్యా పోలీసు అధికారులు మ‌రో ముఖ్య‌మైన జాగ్ర‌త్త కూడా చెబుతున్నారు. అదేమిటంటే +92, +90, +09 నంబ‌ర్ల‌తో వ‌చ్చే ఫోన్ కాల్స్‌ను అస్స‌లు రిసీవ్ చేసుకోకూడ‌ద‌ట‌. ఆ నంబ‌ర్స్ నుంచి వచ్చేవ‌న్నీ ఫ్రాడ్ కాల్సేన‌ట‌. ఏది ఏమైనా మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండ‌డం బెట‌ర్‌. అంతే క‌దా!
ThanQ Visit Again.

Related Posts