యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జనత గ్యారేజ్’. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను కొరటాల శివ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా టీజర్‌ను ఈనెల చివర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల తేదీ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను ఈనెల 25న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 12న సినిమా విడుదల ఉండగా అందుకు దాదాపు రెండు వారాల ముందుగా ఈ సినిమా ఆడియోను విడుదల చేయడం బాగుంటుందని ఎన్టీఆర్ నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరియు హీరోయిన్ నిత్యామీనన్ నటించడంతో మలయాళంలో సైతం ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు మరియు తమిళంలో ఒకే సమయంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
NTR Janatha Garage MP3 Songs Download Janatha Garage Songs Download NTR Songs Download
