Showing posts with label Salary. Show all posts
Showing posts with label Salary. Show all posts

Top 5 Highest Paid CEOs


పదేళ్ల నుంచి జీతాల గురించిమాట్లాడుకోవటం ఎక్కువైంది. ఎప్పుడైతే ఐటీ బూమ్ పెరిగిందో.. అప్పటి నుంచి భారీ జీతాల గురించి గొప్పలు చెప్పుకోవటం మొదలైంది. ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన విద్యార్థికి లక్షల్లో జీతాలంటూ వార్తలు రావటం లాంటివి చూసినప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని కంపెనీల్ని నిర్వహించే నిర్వాహకుల జీతాల ఏస్థాయిలోఉంటాయా? అన్న సందేహం కలగక మానదు. ప్రపంచ ఐటీ రంగానికి దశ..దిశను నిర్దేశించే మైక్రోసాప్ట్ కావొచ్చు.. సోషల్ నెట్ వర్క్ లో కింగ్ లాంటి ఫేస్ బుక్.. సెర్చింజన్ లో ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సీఈవోలకు జీతాలు ఎంతేసి ఉంటాయి? అన్న డౌట్ వచ్చిందా? అలాంటి డౌట్ కు తీర్చుకునేందుకు వెతకటం మొదలు పెడితే ఆసక్తికర సమాచారం లభించింది. సోషల్ మీడియాలో సుపరిచితమైన ఫేస్ బుక్.. ట్విట్టర్ విషయాలకు వస్తే.. ట్విట్టర్ సీఈవో  జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోడట.కాకుంటే తన వ్యక్తిగత.. ఇంటి భద్రత కోసం మాత్రం నెలకు రూ.46 లక్షలు తీసుకుంటాడట. ఇక ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ జీతం కూడా అంతే. అతగాడి వార్షిక జీతం కేవలం రూ.68 మాత్రమే. అంతపెద్ద పొజిషన్లో ఉండి కూడా అస్సలు జీతం అన్నది తీసుకోకుండా ఉండటం కాస్త చిత్రమే కదూ.

ఇక.. భారీగా జీతాలు తీసుకునే ప్రముఖల్ని చూస్తే.. (ఏడాదికి)
=  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు.. సలహాదారు  బిల్ గేట్స్ వార్షిక జీతం రూ.78వేల296కోట్ల 83లక్షల33వేల333
= గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీతం రూ.669కోట్ల 84 లక్షల 20 వేల 475
=  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం రూ.573కోట్ల 94లక్షల 25వేలు
= యాహు సీఈవో మరిస్సా మేయిర్ రూ.289కోట్ల 95లక్షలు
= యాపిల్ సీఈవో టీమ్ కుక్ జీతం రూ.62కోట్ల 77లక్షల 28 వేల 333

ఆంధ్ర ఎమ్మెల్యేల జీతం రూ.2లక్షలు





ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకునే నేతలు.. తమ జీతాలు పెంచుకునే విషయం వచ్చినప్పుడు తాము చెప్పిన మాటల్ని అస్సలు గుర్తు పెట్టుకోనట్లుగా కనిపిస్తోంది. ప్రజాసేవ కోసం వచ్చినప్పటికీ ఒక్కసారిగా తమ జీతాన్ని రూ.90వేల నుంచి ఏకంగా రూ.2లక్షలకు పెంచుకోవటానికి సిద్ధం కావటం ఆసక్తికరంగా చెప్పాలి.

ధనికరాష్ట్రమైన తెలంగాణలో ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుల కుప్ప అయిన ఏపీలో.. జీతాలు ఇవ్వటానికి సైతం అప్పులు చేసుకునే దుస్థిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారం భారీగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. తెలంగాణలో ఎమ్మెల్యేలకు పెరిగే జీతాలు.. సదుపాయాలకు అనుగుణంగా ఏపీ ఎమ్మెల్యేలు  కూడా  తమ జీతాల పెరగాలనుకోవటం కనిపిస్తోంది.

తాజాగా ఏపీ అసెంబ్లీ ఎమెనిటీస్ కమిటీ సమావేశమై సభకు స్పష్టమైన సిఫార్సులు చేసింది. తాజాగా చేసిన సిఫార్సుల ప్రకారం ఇప్పటివరకూ ఉన్న ఎమ్మెల్యేల జీతాలు రూ.90వేల నుంచి రూ.2లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో రూ1.5లక్షలు వేతనం కాగా.. రూ.50వేలు అలవెన్సులుగా అందజేయాలని సూచించారు.

ఇక.. ఎమ్మెల్యేలకు ఇచ్చే వాహన రుణాన్ని సైతం రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలన్న సిఫార్పు చేసింది. కమిటీ చేసిన సిఫార్సుల్ని సభ ఆమోదించిన మరుక్షణం ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ సభ్యుల జీతాలు పెరగనున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. తమ శ్రేయస్సు చూసుకునే విషయంలో ఏపీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదన్నది అర్థమవుతుంది.