Showing posts with label Record. Show all posts
Showing posts with label Record. Show all posts

రికార్డుల మోత మోగిస్తున్న కబాలి




సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా.. కబాలి లెక్క అంటే లెక్కే. తుప్పు రేగ్గొట్టేశాడు. హైప్ అనేది ఉంటే రజనీకాంత్ సినిమా ఏ రేంజులో ఉంటుందో అందరికీ చూపించాడు. ఇండియాలోనే ఏ హీరోకు కూడా రానంత ఓపెనింగ్ ''కబాలి'' సినిమాకు వచ్చింది. ఎన్ని బాహుబలులు వచ్చినా.. ఎన్ని సుల్తాన్ లు వచ్చినా.. కబాలి తుఫాన్ ముందు అన్నీ దిగదుడుపే అని ప్రూవ్ చేశాడు రజనీకాంత్. 

జూలై 22న (నిన్న) విడుదలైన ''కబాలి'' సినిమా.. ఇండియా లెక్కల వరకు చూస్తే.. విడుదలైన అన్ని బాషల్లోనూ కలుపుకుని.. 47.2 కోట్లు 'నెట్' వసూలు చేసింది. ఇప్పటివరకు మన దగ్గర హైయెస్ట్ అంటే బాహుబలి వసూలు చేసిన 42.1 కోట్లు అనే చెప్పాలి. ఇప్పటివరకు రెండో పొజిషన్లో ఉన్న ప్రేమ్ రతన్ ధన్ పాయో ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయింది. ఈ సినిమా తొలిరోజు షుమారు బాహుబలికి దగ్గరగా 41 కోట్లు నెట్ వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే ఎవరు బ్రేక్ చేయలేనంత రేంజులో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది కబాలి. మొన్న వచ్చిన సుల్తాన్ సినిమా కేవలం 36 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక ఇండియా టాప్ 10 లిస్టులో.. కబాలి అండ్ బాహుబలి తప్పించి మరో సౌత్ సినిమా ఏదీ లేదులే. 

కబాలి తొలిరోజు కలక్షన్ల విషయానికొస్తే.. తెలుగులో 9.26 కోట్లు షేర్ సాధించిన ఈ సినిమా.. తమిళనాడులో 14 కోట్లు.. కర్ణాటకలో 4.03 కోట్లు.. కేరళలో 2 కోట్లు.. అమెరికా-కెనడాల్లో కలుపుకుని 11.5 కోట్లు.. ఇతరత్రా మరో 12 కోట్లు షేర్ వసూలు చేసి.. మొత్తంగా తొలిరోజున 53.59 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ లెక్కల్లో చూస్తే.. 87.5 కోట్లు వచ్చినట్లు. 

ఇక ప్రపంచ వ్యాప్త కలక్షన్లతో చూసుకున్నా కూడా.. ''కబాలి'' ఆల్ టైమ్ నెం.1 మొదటి రోజు వసూళ్లు సాధించింది. That is Rajinikanth. Salam Super Star 


రూ.29కోట్లు పలికిన ఆయిల్ పెయింటింగ్

ఆయిల్ పెయింటింగే అని అస్సలు పట్టించుకోని వారికి సైతం షాక్ తగిలే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. భారతదేశ ఆయిల్ పెయింటింగ్ చరిత్రలో ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేలా ఒక పెయింటింగ్ ని గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నాడు. సంచలనం సృష్టిస్తున్న ఈ పెయింటింగ్ అమ్మకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేరు లేని ఈ పెయింటింగ్ ఎంతకు అమ్ముడైందో తెలుసా? అక్షరాల రూ.29.3కోట్లు. ముంబయిలో జరిగిన వేలంలో ఈ రికార్డు చోటు చేసుకుంది.

భారతదేశ ఆర్ట్ వర్క్ విభాగంలో ఇంత భారీ మొత్తంలో అమ్ముడు కావటం విశేషంగా చెబుతున్నారు. వాసుదేవ్ గైటుండే అనే చిత్రకారుడు వేసిన ఈ కళాఖండాన్ని వేలంలో పెట్టారు. దీనికి ఇంత భారీ మొత్తం పలకటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది.

ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో జరిగిన వేలం పాటలో దీన్ని వివరాలు వెల్లడి కాని వ్యక్తి ఒకరు సొంతం చేసుకున్నారు. గతంలో అత్యధిక ధరకు అమ్ముడైన రూ.26కోట్ల పెయింటింగ్ రికార్డును తాజా వేలం బ్రేక్ చేసింది. రికార్డు స్థాయిలో ధర పలికిన ఈ చిత్రాన్ని గీసిన వాసుదేవ్ 2001లో మరణించారు. 1979లో ఆయన వేసిన ఒక పెయింటింగ్ కు 2013లో వేసిన వేలంలో రూ.23 కోట్ల ధరకు అమ్ముడు కావటం గమనార్హం. ఇంత భారీ ధర ఇప్పటివరకూ మరే భారతీయ కళాఖండానికి లభించలేదని వేలం నిర్వహించిన క్రిస్టీ ఇంటర్నేషన్ సంస్థ చెబుతోంది.