Showing posts with label Painting. Show all posts
Showing posts with label Painting. Show all posts

రూ.29కోట్లు పలికిన ఆయిల్ పెయింటింగ్

ఆయిల్ పెయింటింగే అని అస్సలు పట్టించుకోని వారికి సైతం షాక్ తగిలే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. భారతదేశ ఆయిల్ పెయింటింగ్ చరిత్రలో ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేలా ఒక పెయింటింగ్ ని గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నాడు. సంచలనం సృష్టిస్తున్న ఈ పెయింటింగ్ అమ్మకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేరు లేని ఈ పెయింటింగ్ ఎంతకు అమ్ముడైందో తెలుసా? అక్షరాల రూ.29.3కోట్లు. ముంబయిలో జరిగిన వేలంలో ఈ రికార్డు చోటు చేసుకుంది.

భారతదేశ ఆర్ట్ వర్క్ విభాగంలో ఇంత భారీ మొత్తంలో అమ్ముడు కావటం విశేషంగా చెబుతున్నారు. వాసుదేవ్ గైటుండే అనే చిత్రకారుడు వేసిన ఈ కళాఖండాన్ని వేలంలో పెట్టారు. దీనికి ఇంత భారీ మొత్తం పలకటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది.

ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో జరిగిన వేలం పాటలో దీన్ని వివరాలు వెల్లడి కాని వ్యక్తి ఒకరు సొంతం చేసుకున్నారు. గతంలో అత్యధిక ధరకు అమ్ముడైన రూ.26కోట్ల పెయింటింగ్ రికార్డును తాజా వేలం బ్రేక్ చేసింది. రికార్డు స్థాయిలో ధర పలికిన ఈ చిత్రాన్ని గీసిన వాసుదేవ్ 2001లో మరణించారు. 1979లో ఆయన వేసిన ఒక పెయింటింగ్ కు 2013లో వేసిన వేలంలో రూ.23 కోట్ల ధరకు అమ్ముడు కావటం గమనార్హం. ఇంత భారీ ధర ఇప్పటివరకూ మరే భారతీయ కళాఖండానికి లభించలేదని వేలం నిర్వహించిన క్రిస్టీ ఇంటర్నేషన్ సంస్థ చెబుతోంది.