Showing posts with label Chris Gayle. Show all posts
Showing posts with label Chris Gayle. Show all posts

క్రిస్ గేల్ తో ఉల్లాలా . .!






క్రిస్ గేల్ ఆట ఎంత విధ్వంసకరంగా ఉంటుందో బుధవారం జరిగిన మ్యచ్ మరోసారి చెప్పకనే చెప్పేసింది. అతగాడు క్రీజ్ లో ఉంటే.. ప్రత్యర్థులకు పగలే చుక్కలు కనిపించే పరిస్థితి. బంతిని నిలవనీయకుండా కసిదీరా కొడుతూ.. బంతిని గాల్లో చక్కర్లు కొట్టేలా చేసే అతగాడి వీరవిహారం చేసే వైనాన్ని చూసిన వారు ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. క్రీజ్ లో గేల్ ఎంతగా చెలరేగిపోతాడో.. క్రికెట్ మైదానం బయట అమ్మాయిలతో అంతేలా చెలరేగిపోతాడు.

ఆ మధ్యన ఒక యాంకర్ ను ఉద్దేశించి క్రికెట్ గ్రౌండ్ లో అతగాడు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అందుకే గేల్ ను విపరీతంగా అభిమానించేవారు.. అతగాడి అమ్మాయిల యవ్వారం చూసి.. చిలిపి చచ్చినోడుంటూ తమ కోపాన్ని ముద్దుగా ప్రదర్శిస్తుంటారు. గేల్ అమ్మాయిల భాగోతం ఓపెన్. మరి.. అలాంటోడి మీద ఎందుకంత అభిమానమో కానీ.. బాలీవుడ్.. టాలీవుడ్ లో తళుక్కున మెరిసి.. అనంతరం మాయమైన స్నేహాఉల్లాల్.. తాజాగా గేల్ తో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించని ఈ జూనియర్ ఐశ్వర్యారాయ్.. తాజాగా గేల్ తో చెట్టాపట్టాలేసుకున్నట్లుగా కనిపిస్తున్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్ కు ముందు గేల్ తో కలిసి చాంపియన్ పాటకు డ్యాన్స్ చేసిన స్నేహా ఉల్లాల్ చాలా సోషల్ గా మూవ్ అయ్యిందని చెబుతున్నారు. ఇద్దరూ చిలిపిగా తీసుకున్న ఫోటోలు చూసినప్పుడు చెప్పాలనిపించేది ఒక్కటే.. గేల్ తో కాస్త జాగ్రత్త ఉల్లాల్ అని మాత్రమే.